Home » Mucherla rajani sakuntala » Priya Priyathama


    'అవునే ప్రియా... పెళ్ళంటే.... ఇద్దరు వ్యక్తులు కాసేపు చూసుకొని, వెంటనే ఒప్పేసుకుని, ఒక్కటయ్యే ప్రక్రియ అనుకుంటారు. అది నాకిష్టముండదు. హాయిగా కొన్నాళ్ళు ఒకరి నొకరు చూసుకోవాలి. ఒకరి మనసు మరొకరు చదువుకోవాలి. ఒకరి అభిప్రాయభావాలు మరొకరు గౌరవించుకోవాలి. పెళ్ళికి ముందు ప్రేమ పరీక్షలకు ముందు ప్రిపరేషన్ హాలిడేస్ లాంటివి అంది ప్రనూష. 'అంటే డేటింగా?" అడిగింది ప్రియ అల్లరిగా.
    'దానికే పేరైనా పెట్టు.... పెళ్ళికి ముందు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మనసు విప్పి మాట్లాడుకోవాలి. ప్రేవు సరిహద్దుల వరకూ ఒకరి చేతిలో మరొకరు చేయి చేసి నడవాలి"
    "వినడానికి బావుందికాని ప్రాక్టికల్ గా వర్కవుటవ్వదేమో ప్రనూ! అంది పావని. "ఎందుకవ్వదూ.." ఎదురు ప్రశ్నేసింది ప్రనూష.
    "నాన్న సంగతి నీకు తెలుసుగా....అసలే సాంప్రదాయమూ, కట్టు బొట్టు అంటాడు' అంది ప్రియ.
    'అవునే.... అదీ నిజమే" అంది కాసంత నిస్పృహగా ప్రనూష సరిగ్గా అప్పుడే సత్యవతి వచ్చి...
    "అయిపోయిందర్రా గోరింటాకు ముచ్చట.... నీకు రేపు మరో ముచ్చట ముందుందే ప్రనూ"... నిన్ను చూడ్డానికి ఓ అబ్బాయి వాళ్ళ బామ్మతో సహా వస్తున్నాడట." ప్రనూషతో,
    'పె....ళ్ళి...చూ....పు....లా...."నాకా..." అంది పిడుగు మీద పడ్డ ఎక్స్ ప్రశ్నిస్తూ.
    "నీక్కాకనాకటే..." అంది సత్యవతి. కూతురితో చనువుగా వుంటుంది. ఓ స్నేహితురాలిలా కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో సత్యవతి.
    "అదేంటమ్మా..నాకప్పుడే పెళ్ళేమిటి? అయినా నాకు ఇలా పెళ్ళి చూపుల్లో కూచోవడం నచ్చదు".
    కూతురి తలమీద చేయేసి నిమురుతూ 'నాకు తెలుసు ప్రనూ..కానీ ఏం చేస్తాం? పెళ్ళి చూపులరోజే "బూందీ"లో ఉప్పు తక్కువవిని మీ నాన్న గొడవచేస్తే, ఈ కోపిష్టి మొగుడు నాకొద్దు. అని అంటే మా అమ్మా నాన్న బలవంతంగా ఒప్పించారు. నేను మీ నాన్నను చేసుకోలా.... తర్వాత అంతా సర్దుకుంటుంది. గమ్మత్తేమిటంటే ఇప్పటివరకూ నేను 'బూందీ లో ఉప్పు సరిగ్గా వేయడం నేర్చుకోలేదు" అంది నవ్వుతూ సత్యవతి.
    "అది కాదమ్మా" ఏదో చెప్పబోయింది ప్రనూష.
    అప్పటికే శర్మ అక్కడికి వచ్చాడు.
    "ఏంటీ ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు తొందరగా తెలపండి రేపటికి కావలసిన పిండివంటలు తయారుచేయండి" అంటూ తొందర చేశాడు.
    'ఏమండీ...... దానికీ పెళ్ళిచూపులు ఇష్టంలేదట! ధైర్యం చేసి అంది సత్యవతి. కోపంగా చూశాడు శర్మ.
    'పెళ్ళిచూపులే ఇష్టంలేదా? లేక ఏకంగా పెళ్ళే ఇష్టం లేదా? లేకపోతే ఈ ముదనష్టపు తండ్రి చూసే సంబంధం ఇష్టం లేదా?" కోపంగా అన్నాడు శర్మ.
    "అదేమిటండి....అన్ని మాటలంటారు. అదేమన్నదని." సత్యవతి మాటలు పూర్తవ్వకుండానే...
    'నోర్ముయ్....పిల్లలకు నామీద తిరగబడమని నేర్పుతున్నావా? నేను మీ కళ్ళకు పూచిక పుల్లలా కనిపిస్తున్నానా" అంటూ గుండెని చేత్తో పట్టుకున్నాడు.
    "ఏమండీ...." కంగారుగా భర్త దగ్గరకు పరుగెత్తింది.
    "నా దగ్గరికి ఎవరూ రావద్దు. అసలు నేనంటే గౌరవం లేని వాళ్ళు నన్ను పలకరించొద్దు" అన్నాడు.
    సత్యవతి కంగారుపడిపోయి, లోపలికెళ్ళి ఓ మాత్ర తెచ్చిచ్చి నీళ్ళు ఇచ్చింది. ఆ గ్లాసును చేత్తో తీసేశాడు.
    'నాకేం అక్కర్లేదు" అన్నాడు.
    "అదేంటి నాన్నా...అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది" అంది నీళ్ళు నిండిన కళ్ళతో ప్రనూష.
    అప్పుడు శాంతించాడు శర్మ, టాబ్లెట్ వేసుకుని నీళ్ళు తాగాడు.
    శర్మకు బి.పి. ఉంది.
    ఆయన ఎక్కువగా ఆవేశపడకూడదని డాక్టర్ చెప్పాడు.
    రాత్రి ఎనిమిది దాటింది.
    ప్రనూష హాలులో కూచుని ఏదో ఆలోచిస్తూ వుంది. కూతురి దగ్గరకు వచ్చి పక్కనే కూచుని తలమీద చేయివేసి "ఏంట్రా....ఆలోచిస్తున్నావు. అబ్బాయి గుణవంతుడు, అందగాడు. అతన్ని చూస్తే నువ్వు కాదనవు. ఆస్తి వుంది మంచి ఉద్యోగం వుంది. అత్త, ఆడపడుచుల పోరులేదు. ఒక్కటే బామ్మ. పెళ్ళవగానే సిటీలో కాపురం పెట్టొచ్చు" అనునయంగా అన్నాడు శర్మ.
    "అదికాదు నాన్నా నేను అతనికి నచ్చకపోవచ్చు" అంది అప్పటికే ఓ ఆలోచనకు వచ్చిన ప్రనూష.
    "అదేంటమ్మ అతనింకా నిన్ను చూడనే లేదు నీకెలా తెలుసు. అతనికి నువ్వు నచ్చవని"
    "ఒకవేళ అతనికి నేను నచ్చకపోతే..."
    "పిచ్చికన్నా, అతనికి నువ్వు నచ్చకపోవడమేమిట్రా...ఆ మాట వాడంటే తుపాకీతో కాల్చిపారేస్తా అతడ్ని అయినా అతడికి నచ్చకపోతే నీకిచ్చి ఎందుకు చేస్తా బంగారంలాంటి మరో కుర్రాడ్ని తెస్తాను" అన్నాడు.
    'హమ్మయ్య' అనుకుని నిట్టూర్చింది ప్రనూష.
    అతన్ని తికమకపెట్టి, అతని చేతే 'నో అనిపిస్తే పోలా....అనుకుంది.
    మర్నాడు.
    శ్రీచరణ్, బామ్మ వచ్చారు.
    అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలన్నాడు.
    రోగి కోరుకుందీ, డాక్టరు చెప్పిందీ ఒక్కటే అయింది.
    పెరట్లోకి వచ్చాక తన పేరు చెప్పాడు.
    మీకు సత్తా అని అడిగింది.
    అతను ఉక్రోషపడిపోయేడు.
    అతను తనమీద వీ ఒపీనియన్ ఏమిటని అడిగాడు. కావాలనే అతడి ఇగోని దెబ్బతీయడానికే...."నాట్ బ్యాడ్" అంది.
    అతను తనకు సిగరెట్ తాగే అలవాటు వుందని చెప్పాడు.
    తను సంతోషపడింది. అలాంటి అలవాట్లే తనను రక్షిస్తాయి.
    తన అసహ్యాన్ని  మొహం మీదే కక్కేస్తే ఇలాంటి భార్య వద్దు మొర్రో అంటాడు.
    అందుకే "థూ.... యాక్..." అంది. అతనూ ఈ సంఘటన వూహించలేదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra