డోర్ బెల్ మోగింది.
స్మీతారాణి తడబడుతున్న అడుగులతో వెళ్లి తలుపు దగ్గర నిలబడి "ఎవరు?" అడిగింది కంపిస్తోన్న స్వరంతో.
"మేము పోలీసు దిపార్టుమెంట్ వాళ్ళం! ఇవాళ సాయంత్రం మీకు దాష్ ఇవ్వబోయిన కారు విషయంలో అర్జెంటుగా కొన్ని ప్రశ్నలడగటానికి వచ్చాము."
స్మీతారాణి తలుపు తెరిచింది.
ఇద్దరు వ్యక్తులూ లోపలి కొచ్చేశారు. వాళ్ళ ముఖాలు చూస్తూనే స్మీతారాణి బెదిరిపోఆయింది. పెద్ద రౌడీ గాంగ్ లో మెంబర్స్ ల ఉన్నారు. పోలీస్ కళలేమాత్రం కనిపించడంలేదు/ వాళ్ళని చీకటి గదిలో నుంచి గమనిస్తోన్న భవానీశంకర్ కలవరపడ్డాడు. అందులో ఒకడు ఉదయం కారు ప్రమాదం చేసిన రౌడీ. స్మీతారాణి కేదో ఆపద కలుగబోతోందనిపించసాగిందతనికి.
"ఏం కావాలో అడగండి - " హీన స్వరంతో అడిగింది స్మీతారాణి.
ఇద్దరూ జవాబు ఇవ్వలేదు. గదంతా ఓసారి కలియజూసారు.
"చాలా రోజులయింది మనం కలుసుకుని! కదూ?" నవ్వుతూ అడిగాడు సన్నటి వ్యక్తీ. అతను మాట్లాడుతుంటే బంగారు పన్ను ఒకటి మెరుస్తూ కనబడుతోంది.
"మిమ్మల్ని నేనెప్పుడూ కలుసుకోలేదు" ఆశ్చర్యంగా అంది స్మీతారాణి.
"ఓహో గుర్తులేదన్నమాట! అవునులే మతిమరుపు! ఏం చేస్తాం! ఒకోసారి అలా ఇబ్బంది పెడుతుంటుంది. బహుశా భార్గవ్ ని కూడా మర్చిపోయావనుకుంటాను ! కదూ?"
"మీరు మాట్లాడేదేమీ నాకు అర్ధం కావటంలేదు. ఆ పేరే వినలేదు నేనసలు."
ఇద్దరు వ్యక్తులూ ముఖాలు చూసుకున్నాడు.
సన్నని వ్యక్తీ మళ్ళీ నవ్వాడు.
"మేమంటే పోనీ నీకు గుర్తులేదనుకో! కానీ భార్గవ్ తో పాటు ఇంచుమించుగా పెళ్ళాంలాగా కాపురం చేసి కూడా భార్గవ్ ని మర్చిపోయావా?"
"మర్యాదగా మాట్లాడండి! భార్గవ్ అనేవాడేవడో నాకు తెలీదు. నేనేవరితోనూ కాపురం చేయలేదు."
ఇద్దరు వ్యక్తులూ మళ్ళీ మొఖాలూ చూసుకున్నారు.
"ఇలా మర్యాదగా మాట్లాడినంత సేపూ ఇది యిలాగే యాక్షన్ చేస్తూంటుంది. లేపి రెండు తగిలించు" అన్నాడు లావుపాటి వ్యక్తీ.
సన్నటి వ్యక్తీ తన జేబులోంచి ఓ కత్తి తీశాడు.
ఆమె దగ్గరకు నడిచి కత్తి మొన ఆమె చెక్కిళ్ళమీద అనించాడు.
"భార్గవ్ ఏం చెప్పాడు నీకు?"
తన మీదకు వస్తున్నా డేగ వంక చూస్తున్న పావురాయిలా అతని వేపు చూస్తోందామె.
"భార్గవ్ ఎవరో నాకు తెలీదని యిందాకే ...... చెప్పాను" వణుకుతోన్న స్వరంతో అందామె.
"చాలా అందంగా ఉన్న నీ ముఖమంతా ఈ కత్తి గాట్లు పడేవరకూ నిజం చెప్పవ్ కదూ?"
"నన్నేం చేయకండి - నాకేం తెలీదు" వెనక్కి తగ్గుతూ అందామె.
ఆమె కళ్ళల్లో విపరీతమైన భయం కనబడుతోంది.
భవానీశంకర్ ఆమెను చూస్తె జాలేస్తోంది. మరోపక్క ముసురుకుంటున్న ఆలోచనలు!
స్మీతారాణిని నిజంగానే భార్గవ్ అనే వ్యక్తీ తెలీదా? నిజంగానే ఆమెకు ఆ యిద్దరు వ్యక్తులూ ఎందుకొచ్చారో తెలీదా?"
కెవ్వున కేకేవేసింది స్మీతారాణి. అమె ముఖం మీదున్న కత్తి కిందకు జారి మెడలో కొంచెం గుచ్చుకుంది. రక్తం ఊరుతోంది అ ప్రాంతం నుంచి!
"చెప్పు - భార్గవ్ నీకేం చెప్పాడు?"
భవానీశంకర్ యింక ఉండబట్టలేకపోయాడు. నిశ్శబ్దంగా - పిల్లిలా అడుగులు వేసుకొంటూ గదిలో నుంచి బయటకొచ్చాడు.
మళ్ళీ కత్తి ఆమె చెక్కిలి మీద పెట్టబోతున్నాడతను. స్మీతారాణి వెనక్కి నడుస్తోంది నెమ్మదిగా.
"నన్నేం చేయకండి - నాకేం తీలీదు" అంటోంది భయంగా.
భవానీశంకర్ నీడలా కదిలి ఆ సన్నని వ్యక్తీ వెనుకకు చేరుకున్నాడు.