Home » Dr c. ananda ramam » Kanapadutaledu

తల కిందికి వాలిపోయింది అణుకి. వయసులో వున్నారు, అందంగా వున్నారు,  వొంటరిగా వున్నారు అన్న మనోహర్ మాటలు వెక్కిరిస్తున్నట్లు వినిపించాయి.
"ఎవరి దగ్గర్నించైనా ఫోన్ వచ్చినా, ఎవరైనా వచ్చినా వెంటనే నాకు ఫోన్ చెయ్యండి. యింటికైనా సరే, అఫిసుకైనా సరే" వందనతో చెప్పి వెళ్లిపోయాడు మనోహర్.
"వదినా! కొంచెం భోం చేస్తావా?" అడిగింది వందన ఏదో ఒకటి తినాలి తప్పదు. డైనింగ్ టేబిల్ దగ్గరకొచ్చి కూర్చుంది. ఎదురుగా షెల్ఫ్ లో రాగ కాన్వెంట్ కి తీసికెళ్ళే స్నాక్ బాక్స్ కనిపించింది. "మమ్మీ! ఈ రోజు నాకు పూరీ ఆలు కర్రీ కావాలి," అంటున్న రాగ గొంతు వినిపించింది.
 ప్రతిరోజూ ఉదయం లేవగానే, "ఇవాళ నీ స్నాక్స్ ఏం కావాలి?" అని అడిగి రాగ ఏది కోరితే అది తయారు చెయ్యడం అలవాటు అణుకి. ఆరోజు పూరి కూర అడిగింది రాగ. గిరీశం దగ్గర్నించి ఫోను, ఆతరువాత కలిగిన చిరాకు యీ మానసికమైన అశాంతితో పురి కూర మాట మర్చిపోయింది పూర్తిగా. తనతో పాటు డాన్సు స్కూల్ కి తీసుకెళ్ళి పోవడం వల్ల స్నాక్స్ బాక్స్ విషయమే గుర్తులేదు. రాగ తప్పిపోయి అప్పుడే ఇరవై నాలుగు గంటలు పైన గడచిపోయింది. ఎక్కడుంది? దానిక్కావలసిన బ్రేక్ ఫాస్ట్ ఎవరు చేసిస్తారు? ఏది పడితే అది తినే రకం కాదు. అసలు తినడానికి యేమైనా పెట్టె వాళ్ళున్నారా అసలు ప్రాణాలతో వుందా?
ఈ ఉహ రాగానే గుండె పట్టినట్లయింది. లేదు......లేదు రాగ బతికే వుంది. ఎక్కడో తన కోసం ఎదురు చూస్తుంది. ఎలాగో వెళ్ళి తన కూతుర్ని కాపాడుకోవాలి. తప్పకుండా కాపాడుతుంది.
"రాగ ఎక్కడో బతికే వుంది. "అనే వుహని తనకి ఆధారంగా పదే పదే మననం చేసుకుంది.
భోజనం చేయకుండా లేచిపొతే వందన వదిలి పెట్టదు. బతిమాల్తుంది నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ సీన్స్ అన్నీ భరించలేదు. మందు మింగుతున్నట్లు ఏం తింటుందో కూడా తెలియకుండా మింగేసింది. వచ్చి ఫోన్ పక్కనే కూర్చుంది. ఎవరో ఎక్కన్నుంచో రాగ జాడ ఫోన్ చేస్తారు. తప్పకుండా ఫోన్ చేస్తారు. ఫోన్ మోగలేదు.
కాలింగ్ బజార్ మోగింది. ఈసారి తలుపు తెరవడానికి వెంటనే వెళ్ళలేకపోయింది అణు. వందన తలుపుకున్న లుక్కింగ్ గ్లాస్ లోంచి బయటికి చూసి, అవతలి వైపు స్త్రీ అని నిర్ధారించుకుని తలుపు తీసింది. గతుక్కు మంది అణు. ఆ వచ్చింది జలజ. వస్తూనే సుడిగాలిలా విరుచుకు పడింది.
"ఏం చిట్టి తల్లి! నాకు టెలిగ్రాం యిప్పించావు దేనికి? మీ అయన బుజ్జిపాపాయి తప్పిపోయాడా? కొంపదీసి నేను కిడ్నాప్ చేశాననుకోటం లేదు కదా! ఒకవేళ నేను కిడ్నాప్ చేస్తే యే అమితాబ్ బచన్ నో, యే రాజ్ బబ్బర్ నో చేస్తాను కాని, నీ మొగుడి లాంటి వాన్నేం చేసుకుంటాను? ఎర్రగా బుర్రగా వుంటాడే తప్ప వొట్టి చవటాయమ్మ" అంది.
"నోటికొచ్చినట్లు మాట్లాడకు" తీక్షణంగా అడ్డుకుంది అణు. విరగబడి నవింది జలజ.
"ఓహొ! పతివ్రతా శిరోమణిగారికి పతి దేవుణ్ణి అంటే కోపం వచ్చిందా? ఈ మహిళా మణులంతా అంతే. ఆత్మాభిమానం అంటూ ఆలోచన్లు లేకుండా విడిపోయి మనస్సులో పతిదేవుణ్ణి తెగ ఆరాధిస్తుంటారు. ఇంతకీ ఏం జరిగిందో వివరంగా చెప్పు"
జలజ మాటల్లోని వాడికి సమాధానం చెప్పలేకపోయింది అణు. జలజ వ్యక్తిత్వంలో యెంత నిర్లక్ష్యం వున్నా, ఆమె మాటల్లోని చేదునిజాలని వొప్పుకొక తప్పదు. జలజ వచ్చినప్పటినుంచి వందన కుతూహలంగా చూస్తోంది. ఆమె చెప్పింది జరిగిందంతా జలజకి.
"యూ ఫూల్!" అంటూ రివున లేచింది జలజ. "మీరు మీ పెళ్ళిళ్ళు, మీ అనుబంధాలు చూస్తున్న కొద్ది తిక్కరేగుతోంది నాకు. భర్త భార్యని ప్రేమతో బంధించి వుంచుకోలెడు బెదిరించి నిర్భంధించి వంటింటికి కట్టేయాలని చూస్తాడు. ఆవిడా అంతే భర్త మీది ప్రేమతో కాదు అన్నీ భరించేది బయటపడిటే సమాజంలో పరువు నిలవదని. చదువుకొనివాళ్ళైతే బతుకుతెరువు కష్టమని యిలా దేనికో భయపడుతూ సంసారాలు ఈడ్చేస్తారు. నిబోటి మోడ్రన్ భార్యలు కాస్త ఫరవాలేదను కుంటే మీరైనా పోట్లాడి బెదిరించి మీ హక్కు నిలుపుకోవాలని తాపత్రయపడ్తారే గానీ ప్రేమతో భర్తను తమ అయస్కాంత పరిధిలో వుంచుకోవచ్చని అర్ధం చేసుకోరు.
కూతురు విషయంలోను అంతే మీ భార్యాభర్తల మధ్య శతకోటి గొడవలు ఉండొచ్చు కాని మీ కూతురికి మాత్రం అమ్మా నాన్నా యిద్దరూ ఒక్కటే. ఆ విషయం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించావా నువు? ప్రేమ....ప్రేమ అంటూ కబుర్లు చెబుతూ స్వార్ధంతో నీ దగ్గిర కట్టిపడేసుకోవాలని ప్రయత్నించావే గాని, ఎప్పుడైనా నీ కూతుర్ని పిలిచి, "డాడీని చూడాలని వుందా?" అని అడిగావా? డాడీ దగ్గర రెండు రోజులు, పోనీ రెండు గంటలు గడిపి రమ్మని పంపించావా? నీ కూతురు మరి పసిపాప కాదు. ఏడేళ్ళు నిండాయి. గిరీశం దగ్గర్నుంచి ఫోన్ వచ్చాకనైనా ఆ పాపతోనే జరిగింది స్పష్టంగా చెప్పి కొత్త వాళ్ళతో ఎక్కడికి వెళ్ళొద్దు అని హెచ్చరించి పాప కోరినట్లు కాన్వెంటులోనే వోదుల్తే ఎంత బాగుండేది- ఉహూ! ఆ మాత్రం స్వతంత్రం భర్తకి కాని, కూతురికి గాని ఎవరికి ఇవరు. మీరు అందరిమీద మీ మీ అభిప్రాయలు, మీ ఆలోచనలు రుద్దాలని ప్రయత్నిస్తారు. కారణం సరిగా చెప్పకుండా  నిర్భంధంగా కాన్వెంటు మాన్పించి నీతో తిప్పుకున్నావు. పాప కిష్టం లేకపోయినా బంధువుల యింటికి తీసికెళ్ళావు. పాపని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు. తనే పారిపోయింది. అందుకు బాధ్యత పూర్తిగా నీదే యూ.....యూ ఆర్ ది కల్ ప్రిట్?"
పిడుగుల్లా కురుస్తోన్న జలజ మాటలు చేదు నిజాలు. కాదనలేక పిచ్చి చూపులు చూసింది అణు. చిత్రంగా జలజ రాక ఆమెకు అశాంతిని కలిగించడానికి బదులుగా ఏదో ధైర్యాన్ని ఇచ్చింది. అణు ముఖం చూసి వందన జాలి పడి "జలజ గారూ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసింది ఆలోచించండి" అంది.
"మీరంతా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నట్లు?"
"అన్నీ పేపర్లలోనూ చిరునామా ఫోన్ నంబర్ ఇచ్చాము. ఏదేనా ఫోన్ వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాము"
"ఎదురుచూడ్డానికి యింత మంది దేనికి? వందన ! నువు ఫోన్ దగ్గరుండు అణు! నువు బయలుదేరు."
"ఎక్కడికి?"
"లోకల్ హాస్పిటల్ కి పాప తనంతట తను యింట్లోంచి పరుగెట్టింది. ఏక్సిడెంట్ అయినా కావచ్చు."
"అలాంటి ఏక్సిడెంట్ ఏదైనా అయితే హాస్పిటల్ వాళ్ళు యీ పాటికి మన యింటికి ఫోన్ చెయ్యరా!"
"అహహ మన దేశంలో హాస్పిటల్ మీద ఏం నమ్మకం తల్లి మీకు. డబ్బులు గుమ్మరించకుండా ప్రయివేటు హాస్పిటల్స్ లో చేర్చుకోరు. రోగి చచ్చాడో బతికాడో గవర్నమెంట్ హాస్పిటల్ లో పట్టించుకోరు. అందులోను ఏక్సిడెంట్ కేస్ అనే సరికి ఎవరి మటుకు వాళ్ళు తప్పించుకోవాలని చూస్తారు. అంచేత వెంటనే బయలుదేరు."
ఉన్నది వున్నట్లుగా బయలుదేరబోయింది అణువేద. జలజ అడ్డుకొని , నీ మనసులో అపారమైన దుఖమున్న మాట నిజమే కాని ఆ విషయం అందరికి తెలియక్కరాలేదు. లోకంలో సానుభూతి చూపించే వాళ్ళకంటే ఆ పేరిట హేళన చేసేవాళ్ళేక్కువ మనసు కుదుట పరుచుకో నీటుగా తయారై బయలుదేరు" అంది. ఏదో వెక్కిరిస్తున్నట్లు, అజ్ఞాపిస్తున్నట్లు వున్న జలజ మాట్లతో తన మనసులోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లనిపిస్తోంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra