Home » Yandamuri veerendranath » Bharya Gunavathi Sathru

   

      లక్కీగా రామస్వామిని వెంటనే పట్టుకోగలిగారు వాళ్ళిద్దరూ బాలూ చెప్పిన ప్లానుని శ్రద్దగా విని, "దాన్దేముంది! చేసేద్దాం!" అన్నాడతను కూల్ గా.    
    ప్లాన్ ని తక్షణం అమలులో పెట్టాలని నిర్ణయం జరిగి పోయింది. బాలూ సత్యనారాయణ్ గ్యాంగ్ కి బాగా తెలుసు కనక అతను బయటపడకుండా తెర వెనకే ఉండిపోయాడు.    
    నలుగురు మనుషులని వెంటబెట్టుకుని, తెలిసిన వాళ్ళ దగ్గర పాత అంబాసిడర్ కారొకటి సంపాదించి, దాని బానెట్ మీద చిన్న జాతీయజెండా తగిలించి, రామస్వామి సత్యనారాయణ్ బార్ కి చేరుకున్నాడు.    
    తర్వాత మెరుపు వేగంతో జరిగిపోయింది కార్యక్రమం. నలుగురూ నాలుగు ఎంట్రెన్సులు దగ్గర నిలబడ్డారు.    
    లోపలికి దూసుకుపోయాడు రామస్వామి. మధ్యాహ్నం మూడవుతోంది. అప్పుడు బిజినెస్ పెద్దగా లేకపోవడంవల్ల మేడ మీద సోఫా కమ్ బెడ్ లో పడుకుని జోగుతున్నాడు సత్యనారాయణ్ ఆ రోజెందుకో మనసు బాగాలేదు అతనికి - కలత నిద్రపడుతోంది. ఆ కలత నిద్రలోనే పీడకల.    
    ఏదో చప్పుడు వినబడి కళ్ళు తెరిచాడు.    
    పీడకలలోని పర్సనాలిటీ ఒకటి తన ముందు ప్రత్యక్షమైనంత గాభరా కలిగింది, రామస్వామిని చూడగానే అతనికి.    
    "ఎవరూ?" అంటూ లేవబోయాడు.    
    అప్పటికే అక్కడ ఉన్న ఫోన్ అందుకున్నాడు రామస్వామి. ఒక నెంబర్ రింగ్ చేశాడు. లైన్ లో అవతలవైపు బాలూ గొంతు పలికింది.    
    "హలో! ఎంతవరకు వచ్చింది?" అతని గొంతులో నవ్వు వినబడుతోంది. "సర్! కింద నలుగురు అఫీషియల్స్ ని వుంచాను. రెయిడ్ మొదలైంది. వీళ్ళు పెద్దగా రెసిస్ట్ చేస్తారనుకోను. అయినా ఎందుకైనా మంచిది ఒక వ్యాను లోడ్ పోలీసులు... సర్ అలాగే సర్!"    
    ఫోన్ పెట్టేశాడు రామస్వామి.    
    స్పీడు!    
    రామస్వామిలో వున్న స్పీడు, చొరవ సత్యనారాయణ్ మెదడు మొద్దుబారిపోయేటట్లు చేసాయి. ఆలోచించుకునే వ్యవధిలేదు అతనికి.    
    బాలూ చెప్పిన సూత్రం కరక్టే!    
    ఎదుటి మనిషి భయాన్ని కనిపెట్టి, భయపెట్టు!    
    సత్యనారాయణ్ మనసులో ఉన్నది ఒకటే ఆలోచన!    
    రెయిడ్ చేస్తోంది ఎవరు?    
    ఇన్ కమ్ టాక్స్ వాళ్ళా? కమర్షియల్ టాక్స్ వాళ్ళా? ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ వాళ్ళా?    
    లేకపోతే...    
    అతనికి ఒక్కసారి ముచ్చెమటలు పోసాయి.    
    మొన్న సఫా చేసిన రషీద్ శవం తేలి తనని ముంచబోతోందా?    
    బ్రహ్మానందకి ఈ విషయం తెలుసా? తెలిస్తే బాగుండు.    
    "ఏ డిపార్ట్ మెంట్ సాబ్ మంది...?" అన్నాడు గొంతు పెగల్చుకుని.    
    "షటప్!" అన్నాడు రామస్వామి విసురుగా.    
    "అకౌంట్స్ బుక్స్ యాడబెట్టినవ్? తియ్యి!"    
    ఏదో మాట్లాడబోయి మనసు మార్చుకుని కప్ బోర్డు దగ్గరికెళ్ళి మళ్ళీ ఆగాడు సత్యనారాయణ్.    
    "సాబ్! తొందర పడకండ్రి మనం పుర్సత్ గా దీన్ని గురించి మాట్లాడుకోవచ్చు."    
    "ఛల్ కప్ బోర్డు తెరు!" అని కసిరాడు రామస్వామి.    
    గబగబా కాగితాలూ, ఫైళ్ళూ వెతికాడు రామస్వామి. అతనికి కావలసింది కనబడింది అందులో సంతోషాన్ని మొహంలో కనబడనివ్వకుండా జాగ్రత్తపడుతూ అవన్నీ దస్త్రంలా కట్టాడు.    
    "సాబ్...." అడ్డం రాబోయాడు సత్యనారాయణ్.    
    "నకరాలు చెయ్యకు ఏం! మంచిగుండాలని లేదా...?" అన్నాడు రామస్వామి బెదిరిస్తూ.    
    సత్యనారాయణ్ ఇంక నోరెత్తలేదు. రామస్వామికి తెలుసు. గవర్నమెంట్ పెట్టిన చట్టాలు వాటిలోని సెక్షన్ల కంటే కూడా తన ఈ దబాయింపు సెక్షన్ చాలా పవర్ ఫుల్ అని.    
    పదిహేను నిమిషాల తర్వాత బాలూని కలుసుకుని అగ్రిమెంటు కాయితాలు అందజేశాడు రామస్వామి. అవి చదివి సంతృప్తిగా తల ఊపి చింపేశాడు బాలు. సో ఇంకా తను బ్రహ్మానంద పన్నిన బ్రహ్మాండమైన ఉచ్చులో నుండి బయటపడ్డట్టే. గిటార్ ని తన చేతిలో నుంచి లాక్కుని, దూరంగా గిరవాటు వేసేసి, తన కెరీర్ ని అంతం చేద్దామనుకున్న వాళ్ళ ప్లానుకి గండిపడ్డట్టే!    
    సరిగ్గా పదిహేను నిమిషాల్లోనే సత్యనారాయణ్ కి తెలిసింది ఆ దాడి చేసింది గవర్నమెంటు మనుషులు కారనీ, బాలూ మనుషులనీ అగ్రిమెంటు కాయితాల కోసమే వాళ్ళు అంత నాటక మాడారనీనూ.    
    అప్పుడు కలిగింది అతనికి నిజమైన భయం!    
    దాడి చేసింది గవర్నమెంటు వాళ్ళయితే బిజినెస్ కి కొంచెం దెబ్బ తగిలి ఉండేది.    
    ఇది అంతకన్నా పెద్ద విషయం - ఇది బ్రహ్మానందకి తెలిస్తే చంపేస్తాడు.    
    వెన్నులోనుంచి చలి పుట్టుకు వచ్చింది.    
                                               *    *    *    
    "అగ్రిమెంటు మన చేతుల్లోకి వచ్చేసింది. ఇంకా మనం ఫ్రీ?" అన్నాడు బాలూ ఆనందంగా సౌదామినితో.    
    అతని మొహంలోకి పరీక్షగా చూసింది సౌదామిని. బాలూ తడబడి - "ఈ మధ్య వారంరోజులబతటీ సత్యనారాయణ్ రామకృష్ణ మఠంలో స్వామి రంగనాధానంద లెక్చర్లకి అటెండ్ అవుతున్నాడట.....అతనిలో పరివర్తన కలిగినట్లుంది. మన కాయితాలు మనకి పంపించేసాడు" అన్నాడు.    
    అతన్ని ఆపాదమస్తకం ఒకసారి చూసి మాట్లాడకుండా ఊరుకుంది సౌదామిని.    
    ఆమెకి కోపం వచ్చిందని గ్రహించాడు అతను.    
    "పద్ధతులేవైతేనేం సౌదామినీ! మనం వాడి ఉచ్చులో నుండి బయటపడ్డాం! అది చాలదూ!" అన్నాడు రాజీగా.    
    "లక్ష్యం ఎంతో ఉదాత్తంగా ఉండాలి. పోన్లెండి, మీరు సరయిన పద్దతిలో ఆ కాయితాలు వెనక్కి తేలేదని నాకు తెలుసు. వాటిని మీరు చింపేసానని అంటున్నారు. కనుక ఇంక ఆ విషయంలో మనం చేసేదేమీ లేదు. చెయ్యవలసిందల్లా ఒక్కటే వుంది."    
    "ఏమిటది?"    
    "మీరు స్వయంగా మ్యూజిక్ ప్రోగ్రాములు యిస్తూ తారాపధానికి చేరిపోవడం."    
    ఆమె జోకేస్తోందేమోనని నవ్వి చూసాడు బాలు. ఆమె నవ్వలేదు. సీరియస్ గా వుంది ఆమె మొహం.    
    బాలూ మొహంలో నవ్వు తగ్గింది.    
    "నిజంగానే అంటున్నావా ఏమిటి? నేనింకా ఇంకేదన్నా బార్ లో ఉద్యోగం దొరక్కపోతుందా అని ఆలోచిస్తున్నాను."    
    చప్పరించింది సౌదామిని. "ఆ! ఇంకెన్నాళ్ళు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు? ఏదన్నా ఉద్యోగం దొరికినా అది ఊడేదాకా ఊరుకోడు బ్రహ్మానంద. అందుకని మన కాళ్ళమీద మనం స్వతంత్రంగా బతకడం మంచిది. ఒకవేళ బ్రహ్మానంద ఇంకా మనకి అడ్డం రాడనుకున్నా కూడా బార్ లలో, నైట్ క్లబ్బులలో ప్లే చేస్తూ వుంటే మీకు సరయిన గుర్తింపు రదు. మనిద్దరం కలిసి ప్రోగ్రాములు ఇద్దాం. బాలమురళీకృష్ణ బార్ లలో పాడుతూ వుంటే ఎలా వుండేది? ఉస్తాద్ బడేగులాం అలీఖాన్ నైట్ క్లబ్ లో ఉద్యోగానికి కుదిరితే ఎలా వుంటుంది"? అలాగే వుంటుంది ఇదికూడా మీరు ఒకచోట జీతానికి ఇరుక్కుపోవడం జీవితాన్ని ఇరుకు చేసుకోవడమే అవుతుంది. మీకు చాలా టాలెంట్ వుంది బాలూ! నా కంటే ఎక్కువ టాలెంట్! నిజంగానే! కానీ పెద్ద డ్రాబాక్ ఏమిటంటే మీకు లక్ష్యం మీద నిర్లక్ష్యం వుంది చాలా ఈజీ గోయింగ్ స్వభావం మీది ఒక ఆలోచన మనసులోకి వచ్చాక అది సాధించి తీరాలనే తపన వుండాలి. అది లేకపోతే ఏదీ సాధించలేం!"    
    ఉత్తుత్తి కోపంతో చూశాడు బాలూ.    
    "తపన ఎందుకులేదు? నిన్ను పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన వచ్చాక ఆకలిదప్పులు మర్చిపోలేదూ నేను? నిద్రాహారాలు మానెయ్యలేదూ?" చిన్నగా నవ్వింది సౌదామిని.    
    "అవును అదే పట్టుదల కెరీర్ విషయంలో కూడా వుండాలంటున్నాను. మీ పేరు దేశదేశాల్లో మోగిపోవాలి. ఇవాళ లండన్ లో రాయల్ ఆల్బర్ట్ హాలులో కన్ సర్ట్ అయితే రేపు ముంబాయి షణ్ముకానంద హాల్ లో, ఎల్లుండి వాషింగ్టన్ డి. సీ... ఇలా బిజీగా, జెట్ విమానాల్లో తిరుగుతూ ప్రోగ్రాంలు ఇచ్చేస్తుండాలి మీరు. మీతోబాటు నేనూనూ."    
    సంతోషంగా నవ్వాడు బాలు.    
    "నువ్వు అసలు మంచి సేల్స్ ఉమెన్ ని కావల్సిన దానివి సౌదామినీ! నీ ఐడియాని చలాగ్గా ఎదుటి వాళ్ళకి అమ్మెయ్యగలవు. వినడానికి ఇదంతా మహా అట్రాక్టివ్ గా ఉందనుకో! కానీ జరిగేపనేనా అని?"    
    "మీకు మైకేల్ జాక్సన్ తెలుసు కదా! మైకేల్ జాక్సన్ మురికికూపం లాంటి లొకాలిటీలో వుండేవాడు. "థ్రిల్లర్" క్యాసెట్ సక్సెస్ అయిన తర్వాత అతని దశ ఎలా మారింది? దశదిశలా వ్యాపించింది అతని కీర్తి ఒక్కటి....ఒక్కటంటే ఒక్క సక్సెస్ చూపిస్తే చాలు బాలూ! లోకం మన గుమ్మం ముందు చేతులు కట్టుకు కూర్చుంటుంది."    
    "స్వంతంగా ప్రోగ్రాం ఇవ్వటం అంటే మాటలా సౌదామినీ! కాపిటల్ కావద్దు."    
    "మన దగ్గర వున్న నగ తాకట్టు పెడదాం" సంకోచంగా అంది.    
    "నగా? నగెక్కడుంది మన దగ్గర?"    
    మెల్లిగా అంది సౌదామిని. "నాకు చాలా బాధగానే వుంది! కానీ తప్పదను కుంటాను. మీరేమీ అనుకోకపోతే నా మంగళసూత్రం తాకట్టు పెడదాం."    
    ఆ మాట వినగానే, మనసుకి ముళ్ళు గుచ్చుకున్నట్టు అయింది బాలూకి. చాలాసేపు మాట్లాడకుండా వుండిపోయి తర్వాత నెమ్మదిగా అన్నాడు.    
    "నాకోసం కట్టుబట్టలతో వచ్చేసిన దానివి సౌదామినీ! చివరికి నీ మంగళ సూత్రం కూడా తాకట్టు పెట్టించమంటావా? వద్దు నాకు నచ్చదు అలా!"    
    "ఎందుకని?"    
    "సెంటిమెంటు సగం కారణమై వుండవచ్చు. పైగా అలాచేస్తే మొగాణ్ణనే నా అహానికి దెబ్బ తగులుతుంది సౌదామినీ! ఫ్రాంక్ గా చెబుతున్నాను. అది మన స్నేహితులు కొనిచ్చింది."    
    అతనివైపు ఇష్టంగా చూసింది సౌదామిని. "ఒకవేళ మన ప్లాను విజయవంతం అయి మీరు నాకు ఏడు వారాల నగలు కొనిచ్చారనుకోండి. అప్పుడు మీకు గొప్పగా వుండదా? అవునా కాదా? అయినా నేను మిమ్మల్ని గురించి తక్కువగా భావిస్తానని ఎప్పుడన్నా అనుకుంటారా ఏమిటి? అలా ఎప్పుడూ జరగదు నెవర్!" మళ్ళీ మౌనంగా వుండిపోయాడు బాలూ అయిష్టంగానే.    
    "థాంక్స్ ఎలాట్!" అంది సౌదామిని రిలీఫ్ గా తర్వాత లోపలికి వెళ్ళి, ఒక పసుపుకొమ్ము తాడుకి కట్టి దాన్ని మెడలో వేసుకుని తన మంగళసూత్రం తీసి బాలూ చేతిలో పెట్టింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra