Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

  

       "ఈ రోజు చాలా వర్రీస్ లో వున్నాము మాధవీ-"
   
    "చెప్పాగా, అదే సమాధానం అలా మీరు లేనిదెప్పుడు? ఎవరైనా నెలకి కనీసం ఒకరోజు భార్యని తీసుకుని అలా బయటకు వెళ్దామనుకుంటారు. ఖర్మ, ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు".
   
    "మొన్నేగా ఏదో పెళ్ళి కెళ్ళి అట్నుంచి హోటల్ కి వెళ్ళాము" తన సమస్యని మర్చిపోయి అతడు వాదనలోకి దిగాడు.
   
    "ఆ- వెళ్ళాం... మాట్లాడితే ఎప్పుడో తాతయ్య తద్దినం నాటి సంగతే చెపుతారు".
   
    "నువ్వు ఒక్కరోజు మా స్థానంలో వుంటే తెలుస్తుంది మా టెన్షన్ ఏమిటో-"
   
    "ఎవడు పడమన్నాడండీ టెన్షన్?" వెటకారంగా అంది. "అందరూ సంపాదించటంలే- అందరూ మీలాగే భార్యల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా?"
   
    'చేస్తున్నారు'- పైకి అనలేదు, మనసులో అనుకున్నాడు. రోజు రోజుకీ జీవితం ఖరీదైన వస్తువుగా మారిపోతున్న ఈ రోజుల్లో, ఒక మామూలు గృహస్తుకి తన కుటుంబానికి సామాన్య సుఖాలు కల్పించటం కూడా గగన కుసుమమైపోతున్న ఈ రోజుల్లో - ఏడేళ్ళ క్రితం కన్నా ఇప్పుడు మనిషి పదిరెట్లు ఎక్కువ కష్టపడాల్సి వస్తున్న ఈ కాలంలో - జీవితంలో, ముఖ్యంగా మొగవాడి జీవితంలో 'టెన్షన్' క్రితం కన్నా ఎక్కువభాగం ఆక్రమించుకుంటూందనీ, అతడేం చేసినా తన కుటుంబం కోసమేననీ ఈ భార్యలు ఎప్పుడు గుర్తిస్తారు? బహుశ వాళ్ళ తప్పుకూడా ఏమీ లేదేమో... తాగుడు, పేకాట, రేసులు ఇవన్నీ కలిసి మొగవాడి మీద ఆడదానికి నమ్మకం పోగొట్టినాయేమో...
   
    మొన్న మొన్నటివరకూ పక్కింటి ప్రభాకర్ అతని పాలిట విలన్! అతడికి ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. ఏదో బ్యాంకీలో సబ్- మేనేజర్, ముగ్గురు పిల్లలు. అయిదయ్యేసరికి స్కూటర్ మీద ఇంటి కొచ్చేస్తాడు. రాత్రి ఏడయ్యేసరికి, ఒక గ్రూపు ఫోటోలో కూర్చున్నట్టు కూర్చుని, అందరూ టీ.వీ. చూస్తారు. పదింటికి ఠంచనుగా లైట్లారిపోతాయి. ప్రొద్దున్న తిరిగి అదే కార్యక్రమం.

    మాధవి దృష్టిలో కుటుంబం అంటే అది! ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఆవిడకి అటువంటి భర్త లభించాడు. తనకా అదృష్టం లేదు.
   
    కానీ ప్రభాకర్ ప్రపంచంలో అతడి కుటుంబం తప్ప మరేమీలేదు. తన ప్రపంచం, రోజు రోజుకీ పెద్దదవుతూ వుంది. కొన్ని వందలమంది కార్మికులు కొన్ని వందల కొత్త డిజైన్లు- అది ఒక 'ఎంటిటీ' ప్రపంచం. విస్తీర్ణమయ్యే కొద్దీ భార్య స్థానం తక్కువ అవటం సహజమే! రాజీవ్గాంధీని సోనియాగాంధీ- మీరు నన్నెందుకు చేసుకున్నారు! రాజకీయాల్నే కట్టుకోలేకపోయారా అని అడగటం ఎంత హాస్యాస్పదమో, పని- రిస్కు-టెన్షన్ ల కలవాటు పడ్డ మనిషిని ప్రశాంతంగా జీవితం గడపమని అడగటం అంతే హాస్యాస్పాదం. పెళ్ళి చేసుకునేముందు ఇవన్నీ ఆలోచించవలసింది- అన్న ప్రశ్న అర్ధరహితం.
   
    ఎదుటివాళ్ళ లోపాల్ని మాటిమాటికీ ఎత్తిచూపకుండా, ఎదుటివాళ్ళని విమర్శించకుండా, అవతలివాళ్ళని తన ఖర్మకొద్దీ కట్టుకున్నారని జీవితంలో ఒకసారైనా అనుకోకుండా, ఒక భార్యగానీ, భర్తగానీ వుండలేరా? "మా ఆయన మంచివాడే కానీ అదిగో అక్కడే వస్తుంది నాకు వళ్ళుమంట" అని ఏదో ఒక విషయం ఎత్తిచూపకుండా, కేవలం మంచినే గ్రహించి సుఖప్రదంగా గడపలేరా? నూటికి నూరుపాళ్ళు ఒకరిమీద ఒకరు ఆధారపడటం అందువల్ల మనస్పర్ధలు రావటం- ఇలా కాకుండా మరింత స్నేహితుల్లా వుండలేరా? బహుశా మాధవికూడా తన గురించి అలాగే ఆలోచిస్తూ వుంటుందేమో ఒక మానసిక విభేదం వచ్చిన తరువాత అంతే.....ఎవరికీ వాళ్ళు తమ మార్గమే కరెక్టని అనుకుంటూ వుంటారు.
   
    అతడి ఆలోచనని మాధవి మాటలు భంగం చేశాయి. "ఇదొకటి ప్రతిదానికీ మౌనంగా వుండిపోవటం నేర్చుకున్నారు. పదండి భోజనానికి -"

    "నాకు ఆకలి లేదు".
   
    "ఎందుకు లేదు. బైట తాగి తినొచ్చారా?"
   
    అతడు మొహం చిట్లించి, "మాధవీ నన్ను విసిగించకు" అన్నాడు.
   
    "అర్దరాత్రి ఇంటికొచ్చి, పైగా నేను విసిగించానంటారా?"
   
    "నా మనసేం బాగోలేదని చెప్పాను".
   
    "ఒకప్పుడు బావుంది గనకా".
   
    అతడి కెన్నడూ లేనంత కోపం వచ్చింది. అతడికున్న టెన్షన్ కి ఈ గొడవ తోడై పిచ్చివాడిని చేస్తోంది. విసురుగా ఆమె రెక్కపట్టుకుని "మాట్లాడకు" అన్నాడు.
   
    "అవును, మీరేం చేసినా నేను మాట్లాడకపోవటం వల్లనే అవుతోంది ఇదంతా".
   
    "ఏమిటి, ఏమైంది?" గద్దించి అడిగాడు.
   
    "ఏమవ్వాలి? ఒక్క సుఖం లేదు. అది చాలదూ!"
   
    "రేపట్నుంచీ అన్నీ సుఖాలే. ఒక్కదానివీ హాయిగా వుందూగానీ"
   
    "అంటే-"
   
    "రేపు పోలీసులు నన్ను అరెస్టు చేస్తున్నారు".
   
    ఆ ఇంట్లో...సరిగ్గా రెండు నిముషాల తరువాత ఆమె బిగ్గరగా "ఎందుకొచ్చిన వ్యాపారాలు- ఎందుకొచ్చిన అరెస్టులు. నేను చెబుతే విన్నారా?" అంటూ రోదించసాగింది.
   
    "ఎక్కడో ఎవరో ఏదో చేస్తే దానికి నేనేం చెయ్యను?"
   
    "అందరూ వ్యాపారాలు చేసుకోవటం లేదా? అందరూ ఇలాగే అరెస్టులవుతూ వున్నారా? లక్షసార్లు చెప్పాను ఇవన్నీ వద్దని..."
   
    ప్రభాకర్ స్కూటర్ క్రిందపడి, ఆ చొట్టలుపడ్డ స్కూటర్ తో ఇంటికి వస్తే వెంటనే భార్య ఏమంటుంది? ...." ఎందుకంత ఫాస్ట్ గా నడపటం లక్షసార్లు చెప్పాను అలా నడపొద్దని" అంటుందా? - నాలుగు సంవత్సరాల్నించీ దానిమీదే ఫాస్ట్ లా సినిమాలకెళ్ళిన విషయం మర్చిపోయి-
   
    ప్రభాకర్ బాత్ రూంలో జారిపడితే, వెంటనే భార్యనై "ఎన్నిసార్లు చెప్పాను బాత్ రూంను బాగా కదగమని" తిడతాడా? లేక "సారీ నోయ్. సరిగ్గా చూసుకోలేదు.....ఈ రోజు టీవీ చూడటం మానేసి బాత్ రూమ్ నేనే కడుగుతాన్లే" అంటాడా?
   
    మనుష్యులు - ఏదైనా ఒకటి జరిగితే, దానిపట్ల వెంటనే నిర్ణయాలకి వచ్చేసి ఎవర్నో ఒకర్ని దానికి బాధ్యుల్ని వెంటనే చేసెయ్యటం ఎప్పుడు మానతారు? ఇక ఆలోచించటం అనవసరం అన్నట్టుగా అతడు పైకి వెళ్ళిపోయాడు. మరుసటిరోజు పది గంటలకి జరగబోయే సంఘటన అతడి మనసులో తొలుస్తూనే వుంది.
   
    అన్యమనస్కంగానే ఆ రోజు వచ్చిన పోస్టు చూడటం మొదలుపెట్టాడు. ఒక లావుపాటి కవరు అతడ్ని ఆకర్షించింది. ఎక్కడ్నుంచి వచ్చిందో అడ్రస్సులేదు. విప్పి చూశాడు. లోపల కూడా అడ్రస్సు లేదు. సంతకం చూశాడు. -మిస్ విజయవాడ అని వుంది. అతడికి అర్ధంకాలేదు.
   
    పదిహేనేళ్ళ క్రితం నాటి సంఘటన అతడు మర్చిపోయి చాలాకాలమైంది.
   
                             10
   
    రవీ,
   

    ఈ ఉత్తరం చూడటానికి ముందు నువ్వు, ఇంత పెద్ద ఉత్తరం వ్రాసిందెవరా అని, క్రింద సంతకం చూసి, అదీ గుర్తుపట్టలేక ఆశ్చర్యపోతావని నాకు తెలుసు. పదిహేను సంవత్సరాలక్రితం జరిగిన సంఘనట నీకు గుర్తుండవలసినంత అవసరంలేదు. ఒకరికి తమ జీవితంలో ఎంతో గొప్పగా గుర్తుంచుకోవలసిన సంఘటన, మరొకరికి చాలా మామూలుగా గడిచిపోయినదై వుండవచ్చు. అలాంటిదే యిదీ అని నేను భావిస్తున్నాను.
   
    ముందు నిన్ను 'రవితేజా' అని సంబోదిద్దామనుకున్నాను. కానీ నాకు ముందు నువ్వు తెలిసింది రావిగానే. నిరంతర కృషితో 'తేజ'ని బిరుదుగా తెచ్చుకున్నావు. ఇన్ని సంవత్సరాల నీ కృషిని నేను గమనిస్తూనే వున్నాను సుమా. నువ్విప్పుడు ఇంత పై అంతస్తుమీద వున్నా నాకు తెలిసింది రవిగానే కాబట్టి, ఏకవచనంలోనే ఈ ఉత్తరం వ్రాస్తున్నాను ఏమనుకోవు కదూ.
   
    ఇంకా నీ సందిగ్ధం ఏమీ లేదని తెలుస్తూనే వుంది. మరింత వివరించనా?
   
    -దాదాపు పదిహేను సంవత్సరాలక్రితం ఒకమ్మాయి వుండేది. జీవితపు ఒడుదుడుకులు, కష్టనష్టాలూ ఏమీ తెలియని ఆ అమ్మాయి జీవితంలో హుషారు అమాయకమైన అల్లరి తప్ప మరేమీ లేదు. తనలోని కొత్త అందాల్ని వెలికితెచ్చి, తనకే సంభ్రమం కలిగించేలా  తీర్చిదిద్దిన ఒక కుర్రవాడిని, తనకన్నా కాస్త చిన్నవాడిని- హఠాత్తుగా దగ్గిరకి తీఉస్కుని గట్టిగా ముద్దు పెట్టుకుంది. ప్రపంచాన్ని గెలిచిన ఆనందంలో తనేం చేస్తున్నది ఆ సమయంలో ఆ అమ్మాయికి తెలియలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ తన జీవితపు మొదటి ముద్దు ఆ అమ్మాయికి తెలియలేదు. కానీ రోజులు గడిచే కొద్దీ తన జీవితపు మొదటి ముద్దు ఆ అమ్మాయి మనసంతా ఆక్రమించుకుంది. కలవరపెట్టింది. ఒక అలజడి సృష్టించింది.
   
    తన గెడ్డం క్రింద ఆ అబ్బాయి కొత్తచోటున అమర్చిన పుట్టుమచ్చ "అప్పటికన్నా ఇప్పుడు నీలో ఏదో గమ్మత్తైన మార్పు వచ్చిందే- అప్పటిమీద మరీ అందంగా కనపడుతున్నావు" అని ఎవరు ప్రశంసించినా, ఆ ఖ్యాతి అంతా నీకే దక్కాలన్నట్టు- "నువ్వు చెక్కుకున్న శిల్పాన్ని నేను" అనే భావం నాకు కలిగేది. చాలా అపురూపమైన, సున్నితమైన భావం కదూ.
   
    -ఇదంతా నీకు అయోమయంగానూ, లేక సెంటిమెంటల్ ఫూలిష్ నెస్ గానూ కనపడుతూ వుండవచ్చు కానీ చెప్పానుగా. కొన్ని అభిప్రాయాలకీ పునాదులే ఉంటాయి. నిర్మాణాలు వాటిష్టం. నేను గోదావరిని చూడలేదు. వేదాలు చదవలేదు. కానీ "వేదంలా ఘోషించే గోదావరీ" అనే పాటంటే ఇష్టం ఎందుకిష్టం అంటే నేనేం చెప్పను. చూరుమీదనుంచి జారే వానచుక్క మెర్క్యురీలైటు వెలుగులో ఏడురంగుల్ని సంతరించుకునే సమయాన, రోడ్ మీద నిలిచిన వాననీటిలో ఒక చిన్న పాప పట్టులంగా జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని ఏదో తెలియని ఫీలింగ్ ని మొహంలో దాచుకుని నడచి వస్తూంటే ఆ అమాయక పాదాలని మరీ మరీ చూడాలని ఎందుకు అనిపిస్తుంది అంటే దానికి రేషనల్ గా సమాధానం ఏముంటుంది? నా గుండెల్లో నీ మొదటి ముద్దు ఆ విధంగా హత్తుకు పోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra