మహతీ నిన్ను చూస్తే నాకు అసూయగా ఉందమ్మా" రవివాక్యం పూర్తి అయీ కాకుండానే అందుకొని అన్నాడు పరశురాం. "నన్ను చూస్తే అసూయా? అదీ మీకు? ఎందుకు అంకుల్?" "తాగేసి ఏదో వాగుతున్నాననుకుంటున్నావా?" "అబ్బే! అది కాదు అంకుల్----" గాభరాపడుతూ అందిమహతి. ఆమెకువాక్యం ఎలా పూర్తి చెయ్యాలోకూడా తోచలేదు. "ఆల్ రైట్ బేబీ? రవి----మార్వలెస్ పర్సనాలిటీ అతనిది... రవి వ్యక్తిత్వంతోపరిచయం ఉన్న వాళ్ళెవరూ అతన్ని వదులుకోలేరు". "అరపెగ్గు ఎక్కువైతేచాలు ఈ మనిషికి ఒకటేఅల్లరి. ఏదేదో మాట్లాడేస్తారు. ఇక చాల్లెండి. ఒకటిన్నర పెగ్ కంటే ఎక్కువ తీసుకోవద్దని హార్ట్ స్పెషలిస్టు చెప్పలేదూ?" ఖాళీ ప్లేటు తియ్యడానికివచ్చిన పరశురాం భార్య ఆయన ధోరణిచూసి అంది. "నేనెన్ని తీసుకున్నాను? రెండేకదూ! మీ ఆంటీకి చెప్పు" మహతిని సాక్ష్యం చేసుకొన్నాడు పరశురాం. "అదేనండీ నేనుచెప్తోంది? అర ఎక్కువైందనే" దబాయింపుగా అంది వసుంధర. పరశురాం "మరొక్క....." అంటూ ఉండగానే మధ్యలో అందుకుంది భార్య. "ఇక చాల్లే" విస్కీ బాటిల్ తీసికెళ్ళి షెల్ఫ్ లో పెట్టింది వసుంధర. వృద్ద దంపతుల విస్కీ సరసం చూసి, నవ్వుకుంటూ రవి లేచి బాత్ రూంకు వెళ్ళాడు. మహతి గుండెలనిండా గాలి పీల్చుకుంది. "అంకుల్, రవి చెప్పినదంతా నిజమేనా?" గొంతు తగ్గించి అడిగింది. "కిరణ్ కథ నిజమైతే రవి కథ కూడా నిజమే అవుతుంది' సాలోచనగా అన్నాడు ప్రొఫెసర్ పరశురాం. "ఆ సంఘటన జరిగినప్పుడు కిరణ్ తోపాటు నేనూ ఉన్నాను. కిరణ్ దేవయానిని కాపాడిన మాట అక్షరాలా నిజం". "అయితే రవికి సాక్ష్యం నేను" మహతి కళ్ళువెడల్పు అయ్యాయి. ప్రొఫెసర్ ముఖంలోకి అయోమయంగా చూసింది. "అవును. నేనే" "రవితో మీరెక్కడున్నారూ?" అయోమయంగా అంది మహతి. ఆంటీ అన్నట్టు అంకుల్ కు అరపెగ్గు ఎక్కువైనట్టుంది. లేకపోతే అంకుల్ ఇంత అపిరితిపిరిగా మాట్లాడటం ఏమిటీ? "మహతీ! నువ్వేమాలోచిస్తున్నావో నాకు తెలుసు" ఆమె త్రుళ్ళిపడింది. గాభరా పడింది. "నేను తాగి ఏదేదోమాట్లాడటంలేదు...." "అంకుల్! మీకు నా...." "మనసులో మాట ఎలా తెలిసింది అంటావ్? నేను సైక్రియాట్రిస్టునని మర్చిపోకు. ఈ పరిస్థితిలో, నేను అన్నమాట మీద ఎవరైనా సాధారణంగా అలాగే ఆలోచిస్తారు. అది సరే. అసలు విషయం నేను చెప్పబోయేది జాగ్రత్తగా విను".    
    "సరే అంకుల్!" కుర్చీలో కుదురుగా కూర్చుంది. "దేవయాని స్పృహతప్పిపోయే ముందుమొదటిసారిగా చూసింది ఎవర్నీ?" "కిరణ్ని" "అందుకే అతడ్ని తనభర్త అనుకుంది అర్ధమైందా బేబీ?" పరశురాం చిరునవ్వు నవ్వాడు. తల ఊపింది మహతి. "ప్రొఫెసర్ వెళ్దామా?" అంటూ బాత్ రూంకు వెళ్ళిరవి తిరిగొచ్చాడు. "ఓ.కె" అంటూ ప్రొఫెసర్ లేచాడు. "మహతీ మరినువో?" "వస్తాను" అంటూ లేచినిల్చుంది. "వస్తాను" అంటూ లేచినిల్చుంది. "బెల్ మోగుతోంది. ఎవరికీ వినిపించడంలేదా ఏమిటీ?" వంట గదిలోనుంచే భర్తను పురమాయించింది వసుంధర. పరశురాం వెళ్ళితలుపుతీశాడు. "దేవయాని ఇక్కడనుంచి వెళ్ళేప్పుడు చాలాగొడవచేసింది బాబూ! ఆ కుర్రాడెవరో? పేరు అడగడం కూడా మర్చిపోయాను. పాపం!~ చాలా సహాయం చేశాడు. అతడ్ని చూసినప్పట్నుంచీ ఆ కుర్రాడే తన భర్త అనుకుంటూవుంది. ఆయన వస్తేగాని ఇంటికి బయలుదేరలేదు. ఆయన మందిస్తేనే వేసుకుంది. ఇప్పుడు నిద్రపోతున్నది. తెల్లవారి లేచి నా భర్త ఏడీ అని అడిగితే ఏం చెప్పాలో తెలియడంలేదు సార్. ఆ కుర్రాడు ఎక్కడుంటాడో ఏమో తెలుసుకోలేదు. అతని అడ్రసు మీకు తెలుసేమోనని వచ్చాను" దీనంగా మెట్లపక్క ఒదిగి నిలబడి, ఆశగా పరశురాం ముఖంలోకి చూశాడు అతను. "ఆ కుర్రాడు ఇప్పుడిక్కడేవున్నాడు లోపలకురా" పరశురాం అతడ్ని వరండాలో కూర్చోబెట్టాడు. "ఆ కుర్రాడు ఎలాంటివాడోఏమో?" పై పంచతీసి ముఖంతుడుచుకొంటూ నసిగాడు. "ఛ! ఛ! అలాంటి అనుమానం ఏం పెట్టుకోకు. చాలా మంచివాడు" "నేనూ ఇదే అనుకున్నా!" అమాయకంగా అన్నాడు. "మీ పేరేమిటి! ఏంచేస్తుంటారు?" "సంతానం శేషావతారంగారినూనె మిల్లులో గుమాస్తాగా చేస్తున్నాను. పాపం! ఆయనకూ మతిస్థిమితం లేదు. నూనెమిల్లులో వచ్చిన లాభాలతో వడ్డీవ్యాపారం మొదలు పెట్టాడు. పెద్ద మొత్తాలు అప్పులు తీసుకొన్నవాళ్ళు ఐ.పి.లు పెట్టేశారు. ఆ మిల్లు కూడా రేపో మాపో మూసుకుపోయేట్టుంది. ఏం చెయ్యాలో తోచడంలేదు. పులిమీద పుట్రలాగా నాకిదోకటి వచ్చి పడింది బాబూ! దాన్ని మీరే కాపాడాలి" "నువు శేషావతారంగారి గుమాస్తావా?" "అవును బాబూ!" "బాధపడకు సంతానం. దేవయానికి నయమౌతుంది. దిగులుపడకు. ఆ పూచీనాది". "అరపెగ్గు ఎక్కువ తీసుకున్న ప్రభావమో ఏమో ప్రొఫెసర్ పరశురాం, గుమాస్తా గోడును ప్రశాంతంగా వింటూ ఊరడిస్తున్నాడు.    "అసలు తప్పంతా నాదేబాబూ?" "ఏం చేశావ్?" "దేవయానికి అసలే సినిమా పిచ్చి. అది అడిగినప్పుడల్లా సినిమాకు పోవడానికి డబ్బిచ్చేవాడ్ని డాషింగ్ హీరోలంటే అది పడిచస్తుంది. ఆ రోజున సూపర్ హీరో సినిమా చూసి రిక్షాలో వస్తుంటేనే ఆ రౌడీల మూక దాన్ని ఎత్తుకుపోయారు బాబూ. వంటరిగా వెళ్ళొద్దని ఎంత మొత్తుకున్నా వినేది కాదు. సినిమా రిలీజయిన మొదటిరోజే చూడాలంటుంది. ఏమో బాబూ అంతా మీమీదే వదిలేస్తున్నాను. ఆ పోలీసోళ్ళ గొడవ ఒకటి. మధ్యలో కేసు కేసంటూ నా ప్రాణాలు తీస్తున్నారు. అంతా నా ఖర్మ. లేకపోతే ఇదంతా ఏమిటి చెప్పండి బాబూ!" "ఇందాక కొన్ని వివరాలు అడగడం మర్చిపోయాను". "అడగండి బాబూ చెప్తాను". "దేవయానికి పెళ్ళయియెన్నేళ్ళయింది?" "రెండేళ్ళయిందండి" "అల్లుడేం చేస్తుంటాడు?" "నాకు పిల్లల్లేరు బాబూ" "అదికాదు నేను అడిగేది. దేవయాని భర్త ఏం చేస్తుంటాడు?" "ఏంటిబాబూ మీరంటున్నది?" "ఆమె భర్త ఏం చేస్తుంటాడని అడుగుతున్నాను" "భర్తా, ఇప్పుడు మీఇంట్లో ఉన్న కుర్రాడిసంగతేనా? అతనెవరో నాకు తెలియదనేగా మీ దగ్గరకొచ్చాను" "కాదయ్యా! దేవయాని అసలు భర్త ఎవరని అడుగుతున్నాను" సంతానం అరుదుగా లేచాడు. పైపంచ దులుపుకుని పరశురాం కేసి చూశాడు. "పెళ్ళానికీ, కూతురికీ తేడా తెలియనోడివి నువేం డాక్టరువయ్యా" అన్నట్టుందా చూపు. రెండు పెగ్గుల విస్కీ ఒక్కసారిగా దిగిపోయింది. అన్ని రకాల సైకాలజీ జ్ఞానంతోపాటు తన సైకాలజీకూడా మర్చిపోయాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra