Home » Govindaraju seetadevi » Jeevana Kalasam


    "అవును కాలం బొత్తిగా బాగుండలేదు అయినా నేను మీ వెంటవస్తే ... వుహు.... రాను. "అంటూ ప్రసన్న గాజులూ, గొలుసూ చూస్తూ కోపంగా ఆ నగలు ఎందుకూ ఇలా ఒంటరిగా బయటికి వచ్చేప్పుడు" అన్నానే కాని ఒంటరిగా పంపటానికి మనస్సు ఒప్పటల్లేదు.
    "యేం చేస్తానూ.....వెడతాను లెండి... దారిలో యేదన్నా అయితే నా ఖర్మ అని అనుభవిస్తాను" అంటూ రెండడుగులు వేసింది.
    పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. క్రాపు సరిచేసు కుంటూ.
    "ఇదిగో ఒక షరతు. మీ ఇంటికి కాస్త దూరంగా వదిలేస్తాను. అందుకిష్టమైతే చెప్పండి."
    "నేను ఇంట్లోకి వెళ్ళేవరకూ మీ రక్కడ చూస్తూ నుంచుంటారుగా"దారినపోయె రిక్షాని ఆపి అన్నది.    
    "వచ్చేది కాక ఇంట్లోకి వెళ్ళేవరకూ నుంచోవాలా.. అసలు మీరు ఇంత పిరికిగా వుండి ఉద్యోగం ఎలా చేస్తున్నారు" వాసుకి ఎందుకో ప్రసన్నని యేడిపించాలన్పిస్తోంది కొత్తవదిలి మాటకిమాట జవాబిస్తూ రిక్షాయెక్కి కూర్చుంది. ప్రసన్న.
    "యేమిటీ మీ పక్కనా..... వుహూ. మరో రిక్షా పిలుస్తాను" అంటూ చుట్టూ చూశాడు. ఒక్కటి కన్పించలేదు.
    "అమ్మో తొమ్మిదీముప్పావు. నాన్నగారు... అమ్మా...." అంటూ కంగారు పెట్టేస్తుంటే గత్యంతరం లేక వాసు రిక్షా యెక్కడ తప్ప లేదు.
    ప్రసన్న యెంత వదిగికూర్చున్నా లాభం లేకపోయింది. ప్రసన్నలక్ష్మి జార్జెట్ చీరె వాసుకి తగిలి వింత సుఖాన్ని ఇస్తూంది. ఇలాంటి అనుభవం అనుభూతీ సరికొత్త అతనికి.
    రిక్షా రివ్వున వెళ్ళిపోతోంది, మలుపుల్లో ఒకరి కొకరు మరీ దగ్గరవుతున్నారు. ఆ రిక్షాలో అలా నిర్విరామంగా ప్రయాణిస్తూవుంటే యెంత బాగుండ్ను అన్పించింది ఆ ఇద్దరికీ.
    ఆ సమయంలో ప్రసన్నని దగ్గరగా లాక్కొని యెన్నెన్నో విషయాలు చెప్పాలని యేమేమో ఆలోచిస్తున్నాడు వాసు అక్కడక్కడా వెలుగుతున్న లైట్లకాంతిలో ప్రసన్నముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్టు గ్రహించాడు. చెయ్యి తనకి తెలియకుండానే వెనగ్గా వెళ్ళి ఆమెని దగ్గరగా లాక్కుంది. ప్రసన్న సిగ్గుతో మొగ్గలాగా అతని దగ్గరకి ఒదిగిపోయింది.
    "ప్రసన్నా నువ్వు అపవాదులు నమ్మలేదని చెప్పినప్పుడు అంత నీరసంలోను యెంతశక్తి వచ్చిందనుకున్నావ్.....మాటల్లో నా సంతృప్తిని చెప్పాలని యెంతో ప్రయత్నించాను. కాని చెప్పలేకపోయాను".
    నిజం.... నిజంగా నాకూ అంతే....అప్పుడే కాదు. ఇప్పుడూ అంతే"    
    నా మనస్సు నీకే అంకితం అయింది ప్రసన్నా .....కాస్త స్థిరపడ్డతర్వాత నీ దగ్గరకి రెక్కలు కట్టుకొని వాల్తాను. ఎదురుచూస్తూ వుంటావు కదూ!"
    "సంవత్సరాలైనా సరే యుగాలైనా సరే మీ కోసం యెదురు చూస్తూనే వుంటాను. మీరాక కోసం"
    "నీ అదృష్టం బాగుంటే నాకు మంచి వుద్యోగం వస్తే.....అప్పుడు.....అప్పుడు.....నిన్ను ఒక్కక్షణం కూడా.....వదలను. వదలలేను."
    "నేనెంత అదృష్టవంతురాల్ని."
    "నువ్వుకాదు, నేను."
    అతని గుండెల దగ్గర ఒక్కక్షణం వుండి పోయింది. ఆ క్షణంలో ఆ ఇద్ధరేతప్ప ప్రపంచమూ చుట్టూ మనుష్యులూ గుర్తులేరు. అసలు ఆ ఇద్దరి పెదవులూ విడివడలేదు. ఒక్కమాట బైటకి రాలేదు. కాని వారిద్దరి మనస్సులే ఇన్ని మాటలూ మాట్లాడేసు కున్నాయి.    
    ప్రసన్న తమ ఇల్లు దాటి ముందుకు కొంత దూరం పోయిం తర్వాత ఖంగారుగా "ఆపేసెయ్యి" అంటూ అరిచింది.
    రిక్షా ఆగిపోయింది. వాసు రిక్షా క్రిందకి వురికేశాడు.
    "అమ్మయ్యో నాన్నగారు ఈ డబ్బు రిక్షాకి ఇచ్చేయండి" అంటూ వాసు చేతిలో పర్సు పెట్టేసి "వెళ్ళిపొండి" అంటూ వేగంగా ఇంటి వైపు వెళ్ళిపోయింది. స్వర్గంలో నించి క్రిందకి పడ్డట్లయింది వాసుకి.
    కాస్సేపే అయినా ఆ సుఖాన్ని నెమరు వేసుకుంటూ.
    ఛా యెంతసిగ్గు లేనిపని చేశానూ అనుకుంటూ ఆయన గుర్తిస్తే యెంత అసహ్యం రిక్షాలోనే మెయిన్ రోడ్డు మీద దిగేసి వాడిని పంపేసి పర్సులో డబ్బు లెక్కచూసి నిర్ఘాంత పోయాడు. రెండు వందల రూపాయలూ ఓ చిన్న చీటీ లైటు వెల్తురులో చదువుకున్నాడు.
    "................................."
    మీకు డబ్బు  చాలా అవుసరం అని నాకు తెలుసు. అందుకే నేను సంపాదించింది ఇస్తున్నాను. నాన్నగారిధైతే మీరు తిరస్కరించగలరు. కాని ఇది మనది. పోనీ తర్వాత వడ్డీతో సహా ఇస్తే తీసుకుంటాను.
    మరోసారి కల్సినప్పుడు. వివరాలు తెలుపు తాను. సంబోధన లేకుండా రాస్తున్నందుకు మన్నించాలి. ఏమని రాయాలో తెలియకనే....
                 శలవు
                మీ ప్రసన్న
    వాసు ముఖం క్షణం ఎర్రగా కందిపోయింది. అంతలోనే ప్రశాంతపడి చిరునవ్వు చిందింది. ప్రసన్నా..... నిన్ను పిరికిదానివని పరిహసించాను. కాదు. నువ్వుకాదు నేనే పిరికివాడిని..... పోనీలే సమయం మించిపోకుండానే నిన్ను నా దాన్ని చేసుకుంటాను. యెవ్వరు అడ్డువచ్చినా మనలని వేరుచెయ్యలేరు. నీవే సంపాదించినా ఈ నీడబ్బు....నేను ఖర్చు చెయ్యలేను.
    ఇంటివైపు నడిచాడు. యెంతో ఉత్సాహంగా
    ప్రియ మిత్రమా,
    డబ్బు సంపాదించడం. ఒక "ట్రిక్". తన సంపాదనే లక్ష్యం అనుకుంటే మిగతా విషయాలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు. "అంటే" ....ఈ పాటికి అర్ధం చేసుకునే వుంటావు. మొగాడికి సత్ ప్రవర్తనా, ఆడదానికి "శీల" రక్షణా.
    ఇవి పట్టుకుకూర్చునేందుకే మన శక్తి వృధా పోతుంటే జీవితంలో వున్నతిని సాధించలేం. కనకనే నా యే కైక లక్ష్యం ధన సంపాదన. బాంబే లాంటి మహా పట్నానికి ముఖ పరిచయమైనవాడు ఒక్కడూ లేక కట్టుబట్టతో వచ్చిన నేను కొన్నికొన్ని సత్యాలు తెలుసు కున్నాను. కాల ప్రవాహానికి యెదురు యీది యీది కాస్త కూడా ప్రయోజనంలేక చివరికి చేతులు వదిలేశాను. ఆ ప్రవాహపు ఒకవడి యెటుతోస్తే అటు ప్రయాణిస్తూ కొంత ఆధారం చిక్కించుకున్నాను.
    కనుకనే ఆదర్శాలు, ఆశలూ బయటపెట్టటానికి భయపడటం లేదు. నెలకి మూడువేలు సంపాదిస్తున్నాను. మరి నువ్వు?
    విశ్వం రాసిన ఈ వుత్తరం ఎన్నోసార్లు చదివాడు వాసు. తనకి విసుగ్గా వున్నప్పుకల్లా విశ్వం వుత్తరాలు చదువుతూనే వుంటాడు. కాని మిత్రుడి అభిప్రాయాలో యేకీభవించ లేడు.
    ఇది తన బలహీనతే కావచ్చు.
    ఒకసారి విశ్వం "నువ్వు పిరికివాడిని" అన్న రోజులూ వున్నాయి.
    మంచితనం పిరికితనంగా భావించే విశ్వం లాంటి వాళ్ళ అభిప్రాయాలని మార్చగలగటం యెవరితరం? కాలం కలిసి వచ్చి కృష్ణమూర్తి గారిప్రయత్నం ఫలిస్తే ఆ రోజు విశ్వం యేమని రాస్తాడో చూడాలి.
    కాస్త విశ్రాంతి దొరికినప్పుడల్లా వాసు మెదడులో ఇలాంటి అలజడే రేగుతూ వుంటుంది.
    
                                                        *    *    *

    వీరభద్రం రిజల్ట్సు కోసం యెదురు చూస్తున్నారు ముగ్గురూ.
    "ముందు వీరభద్రం జాతకం బైటపడితే ఆ తర్వాత నాది" అనుకుని తృప్తి పడుతుంది మాల.
    మాల పరీక్షలు జరిగే రోజున    
    "ఎలా రాశావు అని అడుగుతూ రాసినదాన్ని గూర్చిగాక రాయబోయే దాన్ని గూర్చి ఆలోచించు. మరేం ఫర్వాలేదు క్విక్" బాగా రాసెయ్ అంటూ ప్రోత్సహిస్తున్న వాసుకి భక్తి పూర్వ కంగా నమస్కరించింది.
    ఓ భగవంతుడా ఈయనకి నమస్కరించటం తప్ప మరేం చెయ్యగలను. మొదటి రోజు పరీక్ష హాలులోకి వెళ్ళబోతూ వాసు కాళ్ళకి నమస్కరిస్తూంటే ఆ చుట్టుపట్ల జనం విచిత్రంగా చూస్తున్నారు.
    వాసు ఆ రోజు చికాకుపడకుండా నవ్వుతూ అన్నాడు.
    "ఇదంతా చూస్తూంటే మాష్టర్ని అయితే బాగుండును ఎంతోమంది శిష్యుల నమస్కారాలు అందుకోవచ్చు. మాలా నా చేత పూర్తి చేయించిన హోం వర్కుకి పడ్డకష్టం అంతా యెగిరి పోయింది. సరే వెళ్ళు. వెళ్ళు ఫస్టు మార్కు తెచ్చుకుంటావు. ధైర్యంగా రాయి. అంటూ ధైర్యం చెప్పాడు. న్నీ బాగానే రాసినా కాస్త ఖరాబు చేసింది లెక్కలు. ఈ సంగతి వాసుకీ తెలుసు. అయినా యే ఒక్కరోజు యేమీ అనలేదు.
    పరీక్షా ఫలితాలు అన్నప్పుడల్లా మాల గుండె గుబగుబలాడుతుంది.
    యే రోజుకారోజు వీరభద్రం పేపర్ కోసం పరుగులెత్తుతున్నాడు.
    ఇది పాసై బి.ఏ. కి కట్టి అది పాసైతే, పాసైతే" అనుకుంటూ భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నాడా యువకుడు.
    అతని ఆత్రతకి వాసుకి నవ్వు వచ్చింది. వీరభద్రం ఒక్కడేనా అలా ఆత్రత చెందేది. ఆ స్థితిలో వున్న ప్రతి విధ్యార్దీ పడే ఆవేదనే అది.
    యూనివర్శిటీలో తన ఫ్రెండ్ కి వాసు నంబరు ఇస్తూ వుత్తరం రాశాడు వాసు. "పాసైతే టెలిగ్రాం ఇమ్మని రాయండి" అంటూ వీరభద్రం వెనక నించి కవరులోకి తొంగి చూస్తూ అంటూంటే నవ్వి వూరుకున్నాడు వాసు. "రాసేశాను అలా అనే"
    ఇంక వీరభద్రం పత్రిక వదిలి పోష్టాఫీస్ మీదకి దండయాత్ర సాగించాడు. పరీక్షా ఫలితాల కోసం.

                                 *    *    *

    శ్రీ లక్ష్మికి పదిరోజులుగా జ్వరం.
    "డాక్టర్ టైఫాయిడ్" అని తేల్చేశాడు.
    రాఘవరావు ఇరవై రోజులుగా పూర్తిగా ఇంటికి రావటం మానేశాడు.
    అన్నగారి ఇంటి బాధ్యత వాసు వహించక తప్పలేదు.
    "అన్నయ్య యెక్కడికి వెడుతున్నాడో నీకు తెలియదూ! చెప్పు వదినా..." అంటూ బ్రతిమి లాడాడు ఎక్కడ వుంటాడో చెప్తే కట్టి లాక్కొచ్చి వదిన కాళ్ళదగ్గర పడెయ్యాలని వాసు వుద్దేశ్యం.
    "ఏమని చెప్పను. ఎలా చెప్పను వాసు బాబూ' అంటూ యేడుస్తుంది. వదిన చెప్పదు. వాసుకి తెలియదు ఆఫీసుకి వెళ్ళాడు లాక్కురావాలని.
    "రెండు నెలలుగా లీవుతో వున్నారు." అంటూ జవాబు వచ్చింది.
    ఇంట్లో మరో మనిషి అవుసరం చాలావుంది. మాలని వుండవచ్చు కాని జైలుకి కూడా వెళ్ళి వచ్చిన మాలని వదిన భరించలేదు. ఏం చెయ్యాలి వాసు అన్ని విధాలా నలిగిపోతున్నాడు.
    ఇరుగూ పొరుగూ యెన్ని రోజులు సహాయం చేస్తారు.
    శ్రీలక్ష్మికి మందూ బత్తాయిరసం ఇచ్చి పిల్ల లకి అన్నం తినిపించి మందుసీసా తీసుకుని పక్కయింటి పిన్నిగార్ని వాళ్ళని కాస్త చూడమని వాసు డాక్టర్ దగ్గర కెళ్ళి మందు తీసుకుని ఆయన రాసిచ్చినవి మరికొన్ని మెడికల్ షాపులో తీసుకుని కాళ్ళీడ్చుకుంటూ లాయర్ కృష్ణమూర్తి గారి ఇల్లు చేరి మామూలుగా తన వర్కు చేసుకుంటున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra