Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 19


    "ఓ.కే. ఓ.కే. మీ కోపం ఓవర్ ఫ్లో అవుతున్నట్లు అనుమానంగా ఉంది కనుక సబ్జెక్టులో కొచ్చేద్దాం. ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఓ అద్భుతమయిన సంఘటన గురించి చేప్తాను వినండి - ' అంటూ కెమెరా, దాని లోపల పాయిజన్ పిన్స్ అన్నీ చెప్పాడతను.
    అతని మాటలు వినేసరికి ఆమె ముఖంలో భయం స్పష్టంగా కనిపించసాగింది. కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయింది.
    "ఇప్పటికయినా నా మాటలు నమ్ముతారా స్మితాజీ" అడిగాడు భవానీశంకర్.
    "ఇదంతా మీరు కల్పించి చెప్పటం లేదు కదా!" అనుమానంగా అడిగిందామె.
    "నేను ఫోటోగ్రాపర్ని మిస్! రచయితను కాదు. ఆఫ్ కోర్స్!క్ అవటం కష్టమేమీ కాదనుకోండి. మీరు ఆసక్తి ఉందంటే రేపే రచయిత నవుతాను."
    స్మీతారాణి మళ్ళీ ఆలోచనలో పడింది. అతని మాటలు నమ్మాలో లేదో ఇంకా తెలీటంలేదు.
    "మీరు అర్జెంట్ గా మీ ఫ్లాష్ బాక్ కొంచెం వివరించాలి. స్మీతాజీ. మీరెప్పుడయినా ఏమయినా కాంప్లికేషన్స్ లో ఇరుకున్నారా, లేక మీకున్న కోట్ల ఆస్తి కోసం ఎవరయినా మిమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నారా?"
    "కంప్లీకేషన్సు లేవు, నా పేర ఆస్తీ లేదు."
    "మరి ఎవరయినా మీ మీద ఇంత పగబట్టి ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఒకవేళ మీరు హైదరాబాద్ టి.వి. లో ప్రొడ్యూసర్ గా గాని, ఏనౌన్సర్ గ గాని చేశారా?"
    "నేనసలు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టిందే ఇప్పుడు! అమ్మా నాన్నా పోయిన దగ్గర్నుంచీ కాలేజీ హాస్టల్లోనే ఉండి గడుపుతున్నాను డిగ్రీ ఎగ్జామిన్స్ అయ్యేసరికి అక్కా, బావా సింగపూర్ వెళ్ళాల్సివచ్చింది అందుకని వాళ్ళ పాప చదువుకోసం ఇక్కడుండటానికని వచ్చాను." అమాయకంగా చెప్పిందామె.
    భవానీశంకర్ మళ్ళీ కొద్ది క్షణాలు ఆలోచనలో పడ్డాడు.
    "ఓ.కే. స్మీతా జీ! ఇందాకే నేనూ కామ్రేడ్ శ్యామ్ మీ గురించి మాట్లాడుకున్నాము. మిమ్మల్ని రేపు ఉదయమే వాళ్ళింటికి తీసుకెళ్ళి కొద్ది రోజులు మా హైపవర్ కమిటీ అక్కడే వుంచాలని నిర్ణయించింది. ఆఫ్ కోర్స్ ఆ కమిటీలో మీ ఫ్రెండ్ అఖిలభాను కూడా వుంది."
    స్మీతారాణి ఆశ్చర్యపోయింది.
    "అదేమిటి? వాళ్ళింట్లో ఎందుకు?"
    "మీ సెక్యురిటీ కోసం డియర్! అనుక్షణం మీ రక్షణే నా ఊపిరిగా జీవితం గడపాలనే కోరిక నన్ను సైక్లోన్ గాలిలా ఊపేస్తోంది. అసలు దాని మీద ఓ పాట కూడా రాశాను -"
    "నో - నేనెక్కడికి రాను! ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటె నన్నెవరూ ఏమీ చేయలేరు -"
    భవానీశంకర్ పగలబడి నవ్వాడు.
    "మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను స్మీతాజీ! నేనేప్పటికయినా సినిమా తీస్తే "హంటర్ వాలీ కరాటే గ్రీన్ బెల్టు" అనే సినిమా తీసి మిమ్మల్నే హీరియిన్ గా వేసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. కానీ ప్రస్తుతం మాత్రం మీరు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండటం మంచిది కాదు."
    స్మితా రాణికి కోపం, పట్టుదల పెరిగిపోయినాయ్ . అతని అవహేళనకు రోషం పొడుచుకొచ్చింది.
    "నేనిక్కడే ఉంటాను - మీరింకా వెళ్ళవచ్చు - " అంది మొండిగా.
    భవానీ శంకర్ లేచి నిలబడ్డాడు.
    "ఓ.కే. స్మీతా జీ జెనీవాలో సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ కి రేపు ఉదయం కలుసుకుందాం. మళ్ళీ అంతవరకూ శెలవ్ - జైహింద్." అనేసి బయటకు నడవబోయాడు . సరిగ్గా అప్పుడే బయట ఓ కారు వేగంగా వచ్చిన ఆగిన శబ్దం వినిపించేసరికి అతను కిటికీ లోనుంచి బయటకు చూశాడు అనుమానంగా.
    ఇద్దరు వ్యక్తులు కారు దిగి స్మీతారాణి ఇంటివేపే రావటం కనిపించిందతనికి. చకచక ఆలోచించడతను.
    "స్మితాజీ !" మీ ఇంటి కెవరో అతిధులు వస్తున్నట్లున్నారు - ఇంత రాత్రి సమయంలో మనిద్దరం ఇంట్లో కనిపించడం మీ పరువు ప్రతిష్టలకు అంత మంచిది కాదనుకుంటాను. నేను ఇంటికి వెనుక తలుపు తీసుకుని వెళ్ళిపోతాను- కొంచెం దారి చూపిస్తే -"
    స్మీతారాణి మోహంలో కలవరపాటు స్పష్టంగా కనిపించింది.
    "ప్లీజ్ - మీరు వెళ్ళకండి - వాళ్ళెవరో , ఎందుకోస్తున్నారో తెలీటం లేదు - భయపదిపోతూ అందామె.
    "ఓ.కే. డియర్! నో ప్రాబ్లం -  నేను లోపల గదిలో వుంటాను. మీరు తలుపు తెరిచి వాళ్ళెవరో చూడండి- "అంటూ లోపలి గదిలోకి పరుగెత్తాడు.

 Previous Page Next Page