Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 19

 

    "నువ్వు చాలా కోపంగా వున్నవక్కా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు ఈనాటివేగావు యుగ యుగాలలోను తరతరాలలోను వున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్ళికన్నా ప్రేమ పెళ్లిల్లె మంచివి పెద్దవాళ్ళ గోల వుండవు, కట్నం బెదదవుండదు. ఉదాహరణకి నీ విషయమే చూడక్కా నిన్ను చుసిన ప్రతి పెళ్ళికొడుకు నీవంటే యిష్టపడ్డాడు. కట్నం తక్కువయి తప్పుకున్నారు. పిల్లలు తెగిస్తే పెద్దలు సహించారు. ఈ పెద్దవాళ్ళు సకాలంలో పెళ్ళిళ్ళు చేయలేరు, దీనికి పరిష్కారం ప్రేమ పెళ్ళి నీకు ప్రేమించటం చేతకాదక్కా! ఓ మాంచి కుర్రాడు నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు అతన్ని ప్రేమించేసేయ్యి, బస్, నాన్నకి శ్రమ నీకు నీవు భారం- ఏది వుండదు. ప్రేమించటానికి కూడా ధైర్యం తెగింపు కావాలి అవునూ నువ్వెవరినైనా ప్రేమించావా అక్కా! సారీ కోపం తెచ్చుకోకు పోనీ నిన్నేవరైనా ప్రేమించారా? తన ప్రేమ బైట పడటం రూపకి సంతోషంగా వుంది తాను చేసింది గోప్పపనన్నట్టు ఇందులో తన తప్పేంలేదని చిన్న సైజు ఉపన్యాసం యిచ్చి "ప్రేమించావా? ప్రేమింపబడ్డావా?" అని డైరెక్ట్ గా అడిగేసింది.

 

    ఏదయినాసరే ఇటునుంచి తెగకపోతే అటునుంచి నరుక్కు రమ్మన్నారు విజ్ఞులు. కోప్పడినా నీతులు భోదించినా వినేస్థితిలో లేదు రూప. వ్యవహారం చాలా దూరం పోయిందని తిరుగులేని నిశ్చయంతో ఉందని రూప మాటలు తెలియజేస్తున్నాయి. మందలించటానికి చిన్నపిల్ల కాదు. మంచి చెప్పటానికి వినేదానిలాలేదు. తనంత ఎదిగి పోయింది. తామిద్దరి మధ్య రెండేళ్ళవార, తను చెప్పిన అది వినటం కలలో మాటలా తోస్తున్నది. ఈ వ్యవహారాన్ని అటునుంచి నరుక్కురావటమే మంచిది.

 

    సీత ఓ నిశ్చయనికోచ్చింది, "రూపా!" అంది ఎంతో ప్రేమగా,

 

    "ఊ...."

 

    'నే చెప్పినట్టు విని చెప్పిందాంట్లో న్యాయంవుంటే అలా చేస్తావా?"


    
    "నువ్వేం చెపుతున్నవో నా కర్ధంకాలేదక్కా, నే అడిగింది ప్రేమ సంగతి."

 

    "అర్ధమయ్యేలానే చెపుతాను. అందమైన డబ్బున్నవారి అబ్బాయి నన్ను ప్రేమించాడు..."

 

    "రూపకి భలే సంతోషమేసింది. నిజంగా!" అంది.

 

    "అడ్డురాకు' అని కోప్పడింది సీత. వెంటనే మామూలుగా మారి 'అతన్ని నే ప్రేమించనా లేదా అని కుతూహలంగా ఉంది కదూ! ప్రేమించి విఫలమయ్యే బదులు, పెళ్ళాడి ప్రేమిస్తే జీవితానికి కొంత సౌఖ్యం లభిస్తాయని, నేనతన్ని ప్రేమించలేదు. ప్రేమించానని వెంటపడ్డాడు. నన్ను ప్రేమించామన్నాడు. పెద్దలని సంప్రదించి పెళ్ళి చేసుకో జీవితమంతా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పాను. ఆ మానవుడు ఆ అల్పజీవి ప్రేమించటం అలా ఉంచు, తిరిగి చూస్తే వత్తు' అంటూ నవ్వింది సీత.

 

    "మా ప్రేమని నా రవిని అనుమానిస్తున్నవా? కట్టుకధ చెప్పి నా నోరుముయించాలనా?' రూప కోపంగా అడిగింది.

 

    నోరు మూస్తే మూసుకుని ఊరుకునే వయసా నీది? నా అంత దానివి కట్టు కధలు పిట్టకధలు దేనికి ఉన్న విషయమే చెపుతున్నాను. నన్నూ ఓ లక్షాధికారి ఎర్రగాబుర్రగా వున్నవాడు ప్రేమించాడని వళ్ళు మరచిపోయి వుంటే అతను నన్ను షికార్లకి సినిమాలకి తిప్పేవాడు. కోరినవన్నీ కొనిచ్చేవాడు....కోరిక తీర్చమని అడిగేవాడేమో కూడా. నిన్ను నీ రవిని మీ ప్రేమని శంకించనుగాని కాస్త తెలివి మరికాస్త లోకానుభవం వుంటే జాగ్రత్తతో ఓ పని చెయ్యి ప్రేమ తర్వాత ముందు నన్ను పెళ్ళాడు అని ఆ రవిని అడుగు."

 

    "రవికి నేనంటే ప్రాణం నా మాట కాదనడు."

 

    "మరి ఆలశ్యం దేనికి?"

 

    "పెద్దదానివి నీ పెళ్ళి కాకుండా..."

 

    సీత పక్కున నవ్వింది. "నాపెళ్ళి కాకపోతే వచ్చే ప్రమాదంలేదు మీ ప్రేమ పెళ్లిదాకా రాకపోతేనే భయం. మనమేమి చిన్నపిల్లలం కాదు చూస్తున్న సినిమాలు, చదువుతున్న పుస్తకాలు, ప్రపంచం తీరుతెన్నులు తెలియజేస్తున్నాయి. ఇవన్ని కాకపోయినా ఆడపిల్లలు అన్ని విషయాల్లో జాగ్రత్తగా వుండాలి. ప్రకృతి, పురుషుడు, సమాజం అన్ని ఆడదాన్ని పొరపాటుకి శిక్షించటానికి సిద్దంగా వుంటాయి.' అంటూ కాస్త ఆగింది రూప అభిప్రాయం తెలుసుకుందామని.

 

    "అమ్మమ్మ కాలం నాటి కబుర్లు చేపుతావెం అక్కా! పురుషుడికో ధర్మం స్రీకోధర్మం! ఆ రోజులు పోయాయి పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్రీలున్నారు. కొన్ని రంగాలలో స్రీలే ముందంజ వేస్తున్నారు. స్రీకి అన్యాయం జరిగితే ఏ న్యాయస్థానము ఊరుకొదు....

 

    "చాలు చాలు...." అంటూ అడ్డుతగిలింది సీత. "ఈ మాటల వల్ల ప్రయోజనం లేదు రూప! స్రీకి అన్యాయం జరిగితే న్యాయస్థానాలు స్రీ పక్షంగా తీర్పుయిస్తుందేమోగాని ఈ సమాజం వూరుకోదే, ఓ మనిషికి మార్పు ఓ స్థానంలో మార్పువల్ల అణు మాత్రమే ప్రయోజనం సమాజం మార్పు మంచో చెడో అదే సరియిన తీర్పు. అందుకే మంచిమార్పుసమాజంలో కలగాలి. ఆ కాలమే కాదు ఈ కాలంలో కూడా పరాయి పురుషుడితో తిరిగి, పెండ్లి కాకుండా కడుపు వస్తే సమాజం ముద్దుపెట్టుకోదు. కాకుల్లా పొడుస్తుంది."   

 Previous Page Next Page