Home » Merlapaka murali » Nee Meeda Manasaayaraa


    జగదీష్ తో కూర్చుని ఈ అనుభూతినంతా పంచుకోవాలనిపించింది లేచి లోపలికెళ్ళింది.
    
    అతను ఏదో రాసుకుంటున్నాడు.
    
    "ఏమిటి సార్! అంత దీర్ఘంగా రాస్తున్నారు?" అంటూ సుతారంగా వెనుకనుంచి చేతులువేసి, ముఖాన్ని అతని తలపై వాల్చింది.
    
    "కొత్త టెండర్ కి ఎస్టిమేట్సు ప్రిపేర్ చేస్తున్నాను" అన్నాడతను కుడిచేత్తో ఆమె బుగ్గమీద తడుతూ.
    
    "వెన్నెల ఎంతో అద్భుతంగా వుందో రండి! అలా బాల్కనీలో కూర్చుని మాట్లాడుకుందాం."
    
    అతను కంగారుపడిపోయాడు. "ఇప్పుడా! బయట చల్లగాలి వీస్తోంది. ఇప్పుడలా కూర్చున్నామంటే రేపొద్దునకల్లా జలుబు చేస్తుంది. ఆ మరుసటిరోజుకల్లా జ్వరము వస్తుంది. నువ్వు కూడా అక్కడ కూర్చోవద్దు. లోపలికొచ్చేయ్" అన్నాడు.
    
    "ఎండాకాలం వేడి అంటారు. చలికాలం చలి అంటారు. మరి ఆయా కాలాల్లో ఆయా వాతావరణం వుండదూ ఇంతకీ మీరు వస్తారా? రాధా?" అంది చిరుకోపాన్ని పెదవులపై తెచ్చుకుంటూ.
    
    "అమ్మో! నేను రాను నువ్వు కావాలంటే వెళ్ళి కూర్చో" అన్నాడు జగదీష్.
    
    ఆమె విసురుగా అక్కడినుంచి వచ్చేసింది.
    
    అతను రాడని తెలిసి పిలవడం బుద్ది తక్కువ పనిగా అనిపించింది. ఒంటరితనం అలవాటై పోవడం వల్ల మరుక్షణంలోనే సర్దుకుంది.
    
    యూనివర్సిటీలో ఇలాంటి వెన్నెలరోజుల్లో వార్డెన్ కి మస్కాకొట్టి సెకండ్ షోల కెళ్ళేవాళ్ళు. ఓరోజు మాత్రం పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయారు గానీ చివరి క్షణంలో సురక్షితంగా బయటపడ్డారు.
    
    ఊర్లో ప్రేమనగర్ సినిమా సెకండ్ రిలీజ్ అయిందని తెలిసింది. సెకండ్ షోకి వెళ్ళాలని సూర్యాదేవి బ్యాచ్ నిర్ణయించుకుంది. రెండురోజుల క్రితం వార్డెన్ పర్మిషన్ తో సినిమాకెళ్ళి రావడంతో ఇక ఆరోజు పర్మిషన్ ఇవ్వదని తెలుసు.
    
    "మొన్న ఫారిన్ సెంట్ లంచం యిస్తే పర్మిషన్ యిచ్చింది. ఇక ఈ రోజు ఫారిన్ సెంట్ కాదు కదా ఫారిన్ మొగుడ్ని ఇచ్చినా ఒప్పుకోదు" అంది సువర్చల.
    
    "మరెలాగా?"
    
    "దొంగదారి నుంచి బయటపడడమే"
    
    అలా దొంగదారిగుండా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. తొమ్మిది గంటల ప్రాంతాన ప్రహరీ గోడకింద నుంచి దూరి రోడ్డుమీద కొచ్చారు. వెన్నెల్లో నడుచుకుంటూ థియేటర్ దగ్గరకి వెళ్ళారు. ఆ థియేటర్ యూనివర్శిటీకి దూరం కావడంతో అక్కడికి వెళ్ళేసరికి అందరికీ కాళ్ళు పట్టేశాయి.
    
    సినిమా వదిలారు.
    
    "అమ్మో! నడవడము ఇక నావల్ల కాదు. వెంటనే ఆటో ఎక్కేద్దాం" అంది సువర్చల.
    
    ఆటో ఏదయినా వస్తుందేమోనని చూస్తూ నిలుచున్నారు. జనం అంతా వెళ్ళిపోతున్నారు.
    
    "ఆటోలు రావడం లేదు. మనం మాత్రమే మిగిలిపోయాం. ఎక్కువ టైమ్ అయితే కష్టం. దిష్టిబొమ్మల్లాగా మనమే కనిపిస్తాం. ఎవరయినా రౌడీ వెధవలు చూస్తే డేంజర్ లో పడిపోతాం" ఆందోళనతో అంది శృతి.
    
    "రిక్షాలో వెళ్ళిపోయినా బాగుండేమో" మరో అమ్మాయి బిత్తరచూపులు చూస్తూ అంది.
    
    జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది.
        
    "ఇక ఆటో రావడం కల్ల. నడుచుకుంటూ వెళదాం" అన్నారు ఒకరు.
    
    "అవును వెళుతూ వుందాం. ఏదయినా వస్తే ఆపుదాం"
    
    విధిలేక సువర్చల కూడా కదిలింది.
    
    మెయిన్ బజారు దాటారు.
    
    "ఏదో వెహికల్ వస్తోంది ఆపుదాం" అంటూ సువర్చల రోడ్డుపై కెక్కి చేతిని వూపింది.
    
    కళ్ళు తప్ప మరేమీలేని భయంకరమయిన రాక్షసుడిలా వున్న లారీ వచ్చి ఆగింది.
    
    "లారీ"
    
    "లిఫ్ట్ అడుగుదాం ఎక్కించుకుంటాడేమో"
    
    సువర్చల చేత్తో సైగ చేసింది.
    
    లారీ డోర్ తెరుచుకుంది.

    హడావుడిగా నలుగురూ ఎక్కారు.
    
    లారీ కదిలింది.
    
    "ఊరవతల బండిని ఆపేవాళ్ళు. ఇదేంటి సరాసరి టౌన్ లోకొచ్చి ఆపుతున్నారు. సినిమా కేదయినా వెళ్ళారా?" కంచులా మ్రోగిన కంఠం తాలూకు డ్రైవర్ లోనుండే లైటు వేశాడు.
    
    నలుగురూ ఒక్కసారి జడుసుకున్నారు.
    
    "సినిమాకే వెళ్ళాం" సువర్చల చెప్పింది.
    
    "ఏం సినిమా?" క్లీనర్ అడిగాడు. అతను డ్రైవర్ కి ఆపోజిట్ లా వున్నాడు. కీచుమనే హారన్ లా అతని గొంతు సన్నగా వినపడుతోంది.
    
    "ప్రేమనగర్"
    
    "భలే సినిమాకెళ్ళారే" డ్రైవర్ నవ్వాడు.
    
    "ఆఁ బాగుందనే వెళ్ళాం"
    
    "కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు లారీ తోలినవాడ్ని, ఇంతకు ముందెప్పుడూ మీలాంటి గుంటల్ని చూళ్ళేదు. అందరూ కాలేజీ స్టూడెంట్ల మనేవాళ్ళేగానీ ఒక్కరి దగ్గరా అంత అందమూ, అంత నాజూకూ వుండేది కాదు. మీరు మాత్రం అచ్చం కాలేజీ గుంటల్లా వున్నారు" అన్నాడు డ్రయివర్.
        
    "ఉండటమేమిటి- కాలేజీ స్టూడెంట్లమే యూనివర్శిటీలో చదువుకుంటున్నాం"
    
    "అందంగా వున్నామని అంత బొంకెందుకు బుల్లెమ్మా! ఇంతకీ ఎక్కడ ఆపుదాం బండిని?" డ్రయివర్ ఉత్సాహంగా అడిగేడు.
    
    "యూనివర్శిటీ దగ్గర"
    
    "అక్కడ ఏం వుంది చాటు? ముళ్ళకంపలేనా ఏరా రమణా! నువ్వూ వస్తావేమిటి?"
    
    క్లీనర్ ముసిముసిగా నవ్వాడు.
    
    అమంయిలకి ఏమీ అర్ధం కావడం లేదు. ఏదో అనుమానం భయం భయంగా లోన పాకుతోంది.
    
    "ఇదిగో డబ్బు" సువర్చల పదిరూపాయల నోటు డ్రయివర్ కి అందించింది.
    
    "ఇప్పుడే డబ్బు ఎందుకు బుల్లెమ్మా చివరన లెక్కలు తేల్చుకుందాం" డ్రయివర్ బండి స్లో చేస్తున్నాడు.
    
    "ఇక్కడ కాదు ఇంకా ముందుకెళ్ళాలి" సూర్యాదేవి చెప్పింది. డ్రయివర్ ఇలా మాట్లాడకుండా వుండుంటే లారీ ప్రయాణాన్ని ఆమె బాగా ఎంజాయ్ చేసుండేది. లారీ ఎక్కడం ఇదే మొదటిసారి ఆమెకి.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra