Home » Sreelatha » మనసా....ప్రేమించకే నువ్విలా

    "నాకూ కాడ్ బరీస్, మిల్క్ బార్  ఇష్టం! ఆనంద్ కూ ఇష్టం! నాకు ఐస్ క్రీం, మిరపకాయ బజ్జీ ఇష్టం! ఆనంద్కూ ఇష్టం! ఇంకా...." చెప్పేలోపు-
    "నాకూ కళ్ళద్దాలున్నాయి. రేవుకూ కళ్ళద్దాలున్నాయి. నాకూ రేచీకటి! రేవూకూ రేచీకటి!" ఆనంద్ కళ్ళద్దాలు సవరించుకుంటూ చెప్పాడు.
    "అదీ సంగతి! ఇప్పుడర్థమయింది... మీ ప్రేమ తరతరాలకూ ఆదర్శం కావాలి" జ్ఞాపిక క్లాప్స్ కొట్టింది.
    అందరూ చప్పట్లు కొడుతూ- "హ్యాపీ లవ్ డే టూ యూ రేవతీ, ఆనంద్!" అని కోరస్ గా హమ్ చేశారు.
    "థాంక్యూ! థాంక్యూ!" అని కొంచెం వంగి కృతజ్ఞతలు తెలిపారు ఇద్దరూ!
    వంగినపుడు ఆనంద్ కళ్ళద్దాలు జారి కిందపడ్డాయి.
    ప్రక్కనున్న స్పూర్తిను  తడుముతూ ఆనంద్- "రేవూ.... నాగ్లాసెస్ పడిపోయాయి!" అన్నాడు.
    "ఆనంద్... నేను ఇటువైపున్నా!" అని తనవైపు తిప్పుకుంది రేవతి.
    రేవతిని తడుముతూ "నాగ్లాసెస్!" అన్నాడు మళ్లీ వంగి. కళ్ళకు పెట్టింది రేవతి.
    "అబ్బ....ఎంత అమరప్రేమో.... ఛ ఛ- ఎంత గాఢప్రేమో!" స్పూర్తి ముచ్చట పడిపోయింది.
    "ఛ....ఊరుకోవే సిగ్గేస్తోంది!" రేవతి కసిరింది.
    "ప్రేమలో సిగ్గు పడకూడదు రేవూ!" ఆనంద్ అనునయించాడు.
    వెళ్దామా.... అనుకుంటుండగా కరెంట్ పోయింది. చీకటిగా అయిపోయిందంతే!
    "ఇంత చిమ్మచీకట్లో నేనెక్కడికీ రాను బాబూ! కరెంట్ వచ్చేస్తుంది. ఎక్కడ వాళ్ళక్కడ ఉండండి! వచ్చాక వెళ్దాం!" రేవతి అంది.
    "అవునవును" ఆనంద్ వత్తాసు పలికాడు.
    "వాళ్ళిద్దరికీ అప్పుడే వెళ్లిపోవడం ఇష్టంలేదు!" స్పూర్తి పక్కకొచ్చి  చెవిలో గుసగుసగా అన్నాడు ఈష్.
    అతని ఊపిరి తగిలి "ఉష్! పో...! అంది స్పూర్తి.
    "ఎవర్నే పొమ్మంటున్నావ్?" రేవతి అడిగింది.
    "చీకటిని! చిమ్మ చీకటిని!" కంగారుగా చెప్పింది స్పూర్తి- ఈష్ ను  దూరంగా నెట్టి!
     "అవునూఁ.... చీకటిని 'చిమ్మచీకటి' అనే  ఎందుకంటారు? 'నల్లచీకటి' 'కారు చీకటి' అనేసి  ఊరుకోవచ్చుగా!" జ్ఞాపికకు డౌటోచ్చింది.
    "చిమ్మచీకటయితే రిథమటిక్ గా ఉంటుందనేమోనే!" కామిని అంది- తన చెయ్యి పట్టుకున్న  క్రాంత్ ను చెయ్యి వదలమని గడ్డం పట్టుకుంటూ.
    "ఎందుకంటారంటే... "చిమ్- అనే చీకటి' అని అర్థం!" రేవంత్ అన్నాడు జ్ఞాపిక పక్కన చేరి.
    "బిట్టూ! చీకటి 'చిమ్' అనదనుకుంటాను!" వెక్కిరించింది జ్ఞాపిక.
    చటుక్కున జ్ఞాపిక మెడమీద పెదవులు వత్తాడు. "చి..." అని వినిపించాయి.
    "ఏంటే... 'చిమ్' అంటున్నావు?" రేవతి అడిగింది.
    "ఏంలేదు రేవతీ... 'చిమ్' అని చీకటి ఎలా అంటుందో జ్ఞాపిక అని చూపిస్తోంది! కదా జ్ఞాపీ!" జ్ఞాపికను వదిలేసి అడిగాడు.
    హైహీల్ ఎత్తి మునికాళ్ల మీద తొక్కింది జ్ఞాపిక- రేవంత్ ను.
    "అమ్మమ్మా..." రేవంత్ బాధగా మూలిగాడు.
    "మళ్లీ ఏవిటే? 'అమ్' అంటున్నాడు?" రేవతికి మరో అనుమానం!
    "చీకటి 'అమ్' అనికూడా అంటుంది. 'అమ్మ చీకటి' అనికూడా అనొచ్చు... అని రేవంత్ అంటున్నాడు! కదా...రేవంత్!" అంది జ్ఞాపిక.
    "మీ చిమ్ములు, అమ్ములు  తర్వాత! కరెంటింకా రాదేవితే...? కామిని కంగారు పడింది. అంతలోకే కరెంట్ వచ్చింది.
    "అమ్మయ్య..!" అని అందరూ బయల్దేరుతూ చూసుకుంటే- స్పూర్తి లేదక్కడ.
    "స్పూర్తి ఏదే?" జ్ఞాపిక కామినిని అడిగింది.
    "నాకేం తెలుసు! నేనూ మీతోనేగా ఉన్నాను!"
    "ఇందాక మాట్లాడింది కదే! స్పూర్తీ.... స్పూర్తీ!" పిలిచారు వెలుతుర్లో. నో రెస్ఫాన్స్!!
    ఈష్ రేవంత్  వైపు చూశాడు చురుగ్గా. రేవంత్ క్రాంత్ వైపు! చటుక్కున కదిలారు ముగ్గురూ... మూడువైపులా! ఆనంద్ నాలుగోవైపుకు.
                                           14
    "స్ఫూర్తీ! స్ఫూర్తీ! స్ఫూర్తే!స్ఫూర్తీ!" చుట్టుపక్కల మారుమోగాయి.
    కంగారు ఆతృత, భయం, ఆరాటం.... కలిగలిసి పొద పొదా వేగంగా కదులుతూ వెతికాయి.
    ఎక్కడా లేదు. ఏవయిందీ..? ఎవరెత్తుకుపోయారు? మళ్లీ ఏ మారణహొమం జరగబోతోంది? మళ్లీ ఏ నరమాంస భక్షకులకు వేటయ్యింది తమ నేస్తం?!
    దిక్కులను పిచ్చిగా చూశారు! నేలను అంగుళం అంగుళం వెతికారు. అందరూ 'ఎదుటివాళ్ళకు తప్పకుండా కనిపించివుంటుంది' అనే బలమైన ఆశను సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుని వెనుతిరిగి మళ్లీ మొదటిచోటుకు చేరుకున్నారు.
    దూరం నుండి వాళ్ళందరికీ కనిపించిందొక విస్మయదృశ్యం!
    స్ఫూర్తి చక్కగా లాన్ లో బాసింపట్టులో కూర్చుని కాడ్ బరీస్ తింటోంది! ఈష్ తప్ప అందరూ ఒక్కదుటున పరిగెత్తుకొచ్చి చుట్టూ కూలబడి రొప్పుతూ అడిగారు- ఆయాసంతోనే గబగబా....
    "నీకేం కాలేదు కదా?"
    నవ్వింది కిలకిలా! వెనక్కి వంగి మరీ!
    "నాకేం కాలా! నాకోసం మీరెంత కంగారుపడతారో చూద్దామనీ- చిన్ని అల్లరిచేశా! పూల్సయిపోయారోచ్!" చప్పట్లు కొట్టింది ఆనందంగా.
    ఆ మాటలు విన్న ఈష్ రేచుక్కులా వచ్చి స్ఫూర్తిని బలంగా పట్టిలేపి ఈడ్చి ఆ చెంపా, ఈ చెంపా బలంగా కొట్టసాగాడు పిచ్చి ఆవేశంతో!
    చేతిలోని కాడ్ బరీస్ ఎగిరిపడింది! కాడ్ బరీస్ అంటుకున్న పెదాలు విచ్చుకుని అలా ఉండిపోయాయి.
    అయినా ఈష్ ఆగలా! రేవంత్, క్రాంత్, ఆనంద్.... ఈష్ ను పట్టుకున్నారు. వాళ్ళ బిగువులో కూడా ఈష్ కోపంతో బుసకొడుతున్నాడు.
    స్ఫూర్తి బిత్తరపోయింది.
    కదలని  శిలలా నిలబడిపోయింది. చెంపలు కందిపోయాయి. పెదవి లేతగా చిట్లింది. కొద్దిగా రక్తం కిందకు జారింది. అయినా తుడుచుకోకుండా బుసకొడుతున్న ఈష్ నే చూస్తుండిపోయింది అవాక్కయి!
    జ్ఞాపికా, కామినీ, రేవతీ కూడా  అలాగే నిలబడ్డారు విగ్రహాల్లా!
    కాసేపటికి కంట్రోలయ్యాడు ఈష్!
    ఈష్ భుజం మెల్లగా తట్టారు స్నేహితులు ముగ్గురూ... అతని కోపం అర్థమయినట్టు! గర్ల్స్ క్కూడా అతని కోపం అర్థమయ్యింది. ఇంతగా ప్రేమిస్తున్నాడా ఈష్- స్ఫూర్తిని! ప్రేమ ఇంత గాఢతా! ఇది వాళ్ళకూ తెలియని ఓ నూతన అనుభవం..!
    బుస ఆపేసి ఈష్ ను వదలగానే.... మెల్లగా స్ఫూర్తి దగ్గరకు నడిచోచ్చి-
    "ఇంకెప్పుడూ ఇలాంటి ప్రాక్టికల్ జోకు లెయ్యకు!" తీఫ్రంగా హెచ్చరించాడు స్ఫూర్తిని.
    బిగుసుకుపోయిన స్ఫూర్తినీ, కందిన చెపంల్నీ, తెగిన పెదవినుండి బుడగలా వచ్చిన రక్తపు బిందువునూ చూశాక అర్థమయింది ఈష్ కు- తను ఒక లేలేత కుసుమాన్ని ఎంత దృఢంగా కొట్టాడో! రెండుచేతుల్తో ఆ ముఖాన్ని దగ్గరకు తీసుకుని ఆ రక్తపుచుక్కను, దాంతో మరింత రక్తాన్ని తనలోకి జుర్రుకున్నాడు....తమకంగా! కదలకుండా అలాగే ఉండిపోయింది స్ఫూర్తి. చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మరిచిపోయాడు.
    "ఐయాం వెరీసారీ....స్ఫూర్తీ! ఐయాం వెరీసారీ! నీకేవయినా అయిందేమోనని గుండాగిపోయేంత భయమేసింది. ఇంకెప్పుడూ నా గుండెతో ఆడుకోకు. జ్ఞాపిక మీద ఎటాక్ జరిగాక ఇంకొకడు బ్రతికున్నాడు. మిమ్మల్ని బలితీసుకోవడానికే... అనే భయం నన్ను నిద్రపొనివ్వడం లేదు. నువ్విలా ప్రాక్టికల్ జోకులేస్తే ఎలా?" మొహమంతా ముద్దులు పెట్టి గాఢంగా అలుముకున్నాడు.
    అతని కళ్ళల్లోంచి నీళ్లు జలపాతంలా జారి స్ఫూర్తే భుజాలమీంచి టీ షర్టులోంచి గుండెల పై దూకి, పొట్ట పై జారి,  బొడ్డులో ఆగాయి. చలించిపోయిందా స్పర్శకు! ఏడ్చేసిందా మమకారానికి! ఇద్దరి ఫ్రెండ్సూ ఇద్దర్నీ  అదిమిపట్టుకున్నారు. దూరంనుంచి చూస్తుంటే ఒక కట్టగా కట్టబడ్డ మనవజాతిలా ఉందా సమాగమం.
    అందరూ ఒకరిమీద ఒకరు చేతులేసి ఆ జంటను పొదివి పట్టుకున్నారు. వారి ఉద్వేగాన్ని తామూ పంచుకున్నారు! అన్ని గుండెలూ ఏకమై ఒకే గమకాన్ని, ఒకే ఆలాపనను ప్రబలంగా వచించాయి. అది విశ్వసమ్మేళనంలా ఉంది. ఎదల సమాకృతంలా ఉంది. 'అవసరం- అవసరం.... జాతి వెన్నెముకలన్నీ ఒకే కట్టను నిలవడం అవసరం! మానవజాతిని పటిష్టంగా నిలబెట్టడానికి స్తంభాలుగా నిలవడం అవసరం!!' అని దిక్కులు 'తథాస్తు!' పలికాయి. అందరి కాళ్ళూ నీటి అక్షతలు రాల్చాయి.... 'శుభమస్తు అంటూ!, మేమున్నాం అంటూ!'
    అందరి గుండెలూ బరువెక్కి ఆ బరువును రెండురోజులు మోశాయి మౌనంగా!
                                                                         *    *    *
    ఫైనలియర్ స్టూడెంట్స్ వెళ్లిపోయే నెలలు దగ్గర కొచ్చేశాయి.
    ఏ దారుల్లోంచి వచ్చి ఇన్నాళ్లూ కలిసి తిరిగి, కలిసి చదువుకుని, అభిప్రాయాలూ- ఆవేశాలూ పంచుకుని, హృదయాలు 'లాబ్ డబ్' మరిచి 'ఫ్రెండూ!' అంటూ అందర్నీ పెనవేసుకుని, 'మరే దారుల్లోకో మలిగిపోవాలి..., విడిపోవాలి' అనే భావన అందరి హృదయాల్నీ బరువెక్కించింది! జీవితంలో కొందరు అసలు కలవకపొవచ్చు కూడా ఎన్నటికీ!  కొందరు ఉన్నత స్థాయికీ, కొందరు అధమ స్థాయికీ, కొందరు మధ్య స్థాయికీ! అన్ని స్థాయిలనూ నిండిపోయే ఒకస్థాయి- భవిషత్తిక్కడి నుంచీ విడదీయబడుతుంది.
    "నీటిచుక్క ముత్యమగానే
    చిప్ప విడిచిపోవాలే...
    కాయలు తాము పండగానే
    శాఖ వీడి పోవాలే...
    సంపూర్ణత ఎంత శాపం!- గాలిబ్ అన్నట్టు మన చదువయిపోయాక వెళ్లిపోవాలంటే బాధగా ఉంది. డిగ్రీ చేతికొచ్చి జీవితాన్నింకో మెట్టెక్కిస్తుందన్న నిబ్బరం హృదయాలలో! జీవితంలోకి రానంతవరకూ అన్నీ ఆశలే, ఆదర్శాలే! ఉద్యోగాలు ఎక్కడున్నాయి. ఎక్కడ  దొరుకుతాయి? తెలియకపోయినా వస్తాయనే భావన! ఆ తరువాత ఆశలు వాస్తవంలో వాడబడితే అప్పుడర్థమవుతుంది నిజమంటే! నిజంగా నిప్పులాటిది..... కాల్చేస్తుందని! ఆశే అందమైందని! సంపూర్ణతకోసం ఎంతో కష్టపడి మనం చదువు పూర్తి చేసుకుని , అది పొందాక ఆ సంపూర్ణత ఎంత బాధాకరమో తెలుస్తుంది! అయ్యో.... స్టూడెంట్ గానే ఉంటే బావుంటుందనిపిస్తుందేమో!
    క్రాంత్ మెల్లగా ఒక ఆర్గ్యుమెంట్ లేవదీశాడు తమ భవిషత్తు గురించి!
    "నెగెటివ్ గా ఆలోచించడం సమర్థుల విధానం కాదు. మన చదువుకు తగ్గ ఉద్యోగాలే ఎందుకు చెయ్యాలి? ఏదయినా సరే.... బ్రతికి ఉండటానికి కొన్ని అవసరాలు కావాలి. వాటిని తీర్చుకునేందుకు డబ్బు సంపాదించాలి. అందుకు ఈ డిగ్రీలే అక్కర్లేదు. ఈ డిగ్రీలు మనం ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుసుకోవడానికి పనికొస్తాయని ఆలోచించాలిగానీ...మనకు డబ్బు సంపాదించి పెడతాయా- లేదా.... అని  కాదు. ఒకవేళ 'డబ్బే కావాలి.... అనుకుంటే కాస్త చదువుకుని చదువు వదిలేసి సంపాదించుకోవచ్చు. ఏ చదువూ లేకుండా ధనవంతులైన వారు లేరా? డిగ్రీలు- డబ్బులు సంపాదించడానికి కాదు, విజ్ఞానపరంగా సాంకేతికపరంగా ముందుకు సాగడానికి టికెట్ లు! ఆ టికెట్ గనుక డబ్బు సంపాదిస్తే ఆనందం! లేపోయినా  ఫర్వాలేదు" రేవంత్ తన  అభిప్రాయాన్ని చెప్పాడు- వెనక్కి వంగి రెండుచేతుల మీదా తన బలాన్ని మోపి కూర్చుని రిలాక్ డ్స్ గా!
    "అలాంటప్పుడు మనం  మార్కుల కోసం, పర్సంటేజ్  కోసం ఎందుకు ఆతృత పడాలి? సబ్జెక్ట్ ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంనే ఆరాటం ఉండాలికానీ, ఇంత టెన్షన్ పడీ- మార్క్స్ స్కోరింగ్ చాప్టర్స్ కు, వాటికి ఇంపార్టేన్స్ ఇచ్చి చదివే   చదువు అసంపూర్ణం కాదూ? స్కోరింగ్ తక్కువ  ఉన్న వాటిల్లో మాత్రం సబ్జెక్ట్  లేదూ? దానికి మనం దూరం కావట్లా?" స్ఫూర్తి డిస్కషన్ కంటిస్యూ చేసింది.
    "తప్పకుండా! అదేమనం చేసి పోరపాటు. ఈ పోరపాతుకు కారణం మనంకాదు.మార్కులపై , పర్సంటేజ్ పై ఆధారపడి దొరికే పైచదువుల సీట్లు, పైచదువుకు సీట్ కావాలంటే సబ్జెక్ట్ డెప్త్ కాదు- కావలసింది మార్కులు, పర్సంటేజ్! అందువల్లనే విద్యావిధానంలో, విద్యార్థుల విజ్ఞానంలో పెద్ద అగాధలోపం ఏర్పడుతుంది. పైగా- మనం తీసుకున్న ఈ  డిగ్రీలో ఏవుందీ? ఇంకా చదవాల్సిన పుస్తకాలెన్నుయో! ఈ ప్రపంచంలో తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతుందో! సముద్రమంత!! మనమేమో నీటి కడవంత! ఎలా  పొందగలం పూర్తి జ్ఞానాన్ని?! నాకు మటుకు రేవంత్ ను చూస్తే ఈర్ష్య! ఆంటీ వల్ల తను కొన్ని బుక్స్ చదవగలిగాడు. ఏమంటావ్ క్రాంత్?" అడిగాడు ఈష్.
    "య్యా! అసలు నేనంటాను....చదువు విజ్ఞానానికే, జీవితాలకు కాదు! ప్లేతో, అరిస్టాటిల్- 'రాజకీయశాస్త్రం చదివిణవాళ్ళు మాత్రమే రాజకీయాలలో ప్రవేశించదానికి అర్హులు కావా' లన్నారు నేటి రాజకీయనాయకులు ఏ విజ్ఞానార్హతతో రాజకీయాల్లోకి వస్తున్నారు? ఏ ప్రపంచ సిద్దాంతాలు వారికి తెలుసు? దేశాన్ని నడిపించడానికి కేవలం డబ్బు, పలుకుబడి ఆధారంగా లేదా గూండాయిజం ఆధారంగా వస్తున్నారు. వీళ్ళకున్న ఈ అర్హతలు దేశాన్ని రాజకీయంగా ముందుకెలా నడుపగలవు? కనుక నేటి సమాజాన్ని డబ్బు రాజ్యమేలినంతగా విజ్ఞానం రాజ్యమేలడం లేదు. విజ్ఞానానికీ, డబ్బుకూ మధ్య చాలా అంతరం! రెండూ రెండు దారులు. మనిషి ఒకదారిలో మాత్రమె  ప్రయాణించగలడేమో! సుఖమయమయిన జీవితానికి విజ్ఞానపు దారికంటే సంపాదన దారే ముఖ్యం! ఆ  సంపాదన దారిలో  మనం నేర్చుకున్న విజ్ఞానం అసలు పనికిరాదు" క్రాంత్ విషయాన్ని రాజకీయాల వైపు మలిపాడు.
    "సరే.... ఈ చదువూ, విజ్ఞానం- మరి, సమాజాన్ని సంస్కృతీకరణం చేయడం లేదా? ఆలోచనాధోరణి పెంచడం లేదా? మనం ఆలోచించినట్లుగా చదువులేని అమ్మాయిలు, అబ్బాయిలు ఆలోచించగలుగుతున్నారా? తమనుతాము తెలుసుకోగలుగుతున్నారా? తమనుతాము తెలుసుకోలేని వాళ్ళు ఎన్నో విజయాలకు దూరం అయి బలి అయిపోవడం లేదూ?" కామిని కంటిన్యూ చేసింది.
    "విద్య ఉండీ దైర్యంలేక బలైపోవడం లేదా చాలామంది?!" ఆనంద్ చిరుకోపం ప్రదర్శించాడు.
    "విద్య, విద్యతో తెలిసిన విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టే సమర్థత.... రెండూ ఉంటేనే సామాజిక ఉన్నతి సాధ్యం! కానీ, నిత్యావసరాలనేవి మనిషి విద్యానూ, విజ్ఞానాన్ని మసిబారుస్తున్నాయి. ఇన్ని ఆదర్శాలు  వల్లించే మనం- జీవితంలోకి వెళ్లాక మళ్లీ కొన్నాళ్లకు కలుసుకుంటే ఇవన్నీ ఆవిరయిపోయుంటాయేమో!" జ్ఞాపికకు అనుమానం వచ్చింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra