Home » Yarram chandrasekharam » Goodu Chedirina Pakshulu

 

                                        9
    కాలం దోర్లసాగింది . ప్రకృతి నాలుగు వసంతాలను దాటింది. ఏ కొరత.... ఎటువంటి లోటూ లేకుండా మా జీవితాలు హాయిగా నడవ నారంభించాయి. అప్పటికి మా వివాహం జరిగి ఏడెనిమిది సంవత్సరాలైంది.... మాకు ఒక్కటే కోరత ..... సంతానం లేకపోవడం...లక్ష్మీ తనకు సంతానం కలగలేదని ఎంతగానో దిగులు పడుతూ ఉండేది . 'క్రితం జన్మ లో ఏ తల్లీ బిడ్డలను ఎడబాసానో , ఈ జన్మ లో నాకు బిడ్డలు కలగడం లేదని' వాపోతూ ఉండేది. ఎందరు దేవుళ్ళ కో మొక్కుకుంది. ఎన్నో వ్రతాలు , నోములు నోచింది. ఫలితం లేక పోయింది.
    అనుకోని విధంగా మా గ్రామానికి ఒక గొప్ప యతీశ్వారులు వేంచేసి మా ఊరి దేవాలయం లో బస చేశారు. కొద్ది రోజుల లోనే వారి కీర్తి ప్రతిష్టలు ఆ చుట్టూ ప్రక్కల గల గ్రామాలన్నీ ప్రాకీపోయాయి. గొప్ప మహిమ గలవారనీ, మహనీయులనీ అంతా చెప్పుకున్నారు. అటువంటి అవకాశాలను జారవిడుచుకొని లక్ష్మీ నన్ను బలవంతం పెట్టి అక్కడికి తన వెంట తీసుకు వెళ్ళింది. మేమిద్దరమూ స్వామివారికి పాద పూజ సవ్యంగా చేశాము. మాటల సందర్భంగా లక్ష్మీ సంతానభిక్ష వేడింది. అందుకువారు 'మీరు అన్ని ప్రయత్నాలూ చేసినట్లు మీ మాటల వల్ల తెలిసింది. చివరి ప్రయత్నంగా మీ దంపతులిద్దరూ తీర్ధయాత్రలు సేవించండి. ఆ భగవంతుడు దయామయుడు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. నిరాశ పడకు తల్లీ' అని ఆశీర్వదించారు.    
    సంతోషంతో వారి వద్ద శలవు తీసుకొని యింటికి చేరాము -- స్వామి వారి అదేశానుసారం తీర్ధయాత్రలకు చురుకుగా ప్రయత్నాలు చేశాము; కాశీ, గయ, ప్రయాగ, బదరీ, మరియు , తిరుపతి , మధుర, రామేశ్వరం, యిత్యాది ఉత్తర దక్షిణ యాత్రలు సేవించడానికి నిర్ణయించుకొని మంచిరోజు, మంచి శకునం తో బయలుదేరాము.
    దక్షిణయాత్రలన్నీ సేవించుకొని తిరుగు ముఖం లో తిరుపతి చేరాము. ఏడుకొండల వాడిని దర్శించి, సేవించి ఒక వారం రోజులు అక్కడే గడపడానికి నిశ్చయించుకున్నాము. అక్కడి ప్రకృతి మమ్ములను ముగ్ధులను చేసింది. చంద్ర వంక లోయలో కూర్చొని చాలాసేపు గడిపే వాళ్ళం. ప్రతిరోజూ శ్రద్దగా తలంటు స్నానం చేస్తూ, నాతొ చేయిస్తూ ఉండేది... మడి బట్టలతో శుచిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ మనసులోని కోరికను ఆ స్వామికి విన్నవిస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా తీర్ధ యాత్రలన్నీ సేవించి నిర్మలమైన మనసుతో యిల్లు చేరాం.
    ఎన్నో యాత్రల సేవించాము. ఏ యాత్రా స్థల ఫలితమో? ఏ దేవుని కరునో? లక్ష్మీ గర్భం దాల్చింది. మా సంతోషం హద్దులు దాటింటి. లక్ష్మీ ఎందరికో అన్నదానం... వస్త్ర దానం చేసింది. ఆమె సంతోషం కోసం ఆమె కోరికలు తీర్చడం కోసం ఎంతో డబ్బు వెచ్చించాను .... నవమాసాలు మోసి ఆరోగ్యంగా మగబిడ్డను ప్రసవించింది. ఆలస్యంగా సంతానం కలగడం....ఆ కలిగిన సంతానం మగబిడ్డ కావడం...మా జన్మ తరించినట్లుగా భావించాము.
    ఎంతో వైభవంగా బారసాలను జరిపించాను. ఊరు...ఊరంతా ఆరోజు వంటలు చేయలేదు. బాబును దేవుడిచ్చిన ప్రసాదంగా భావించి ప్రసాద రావని నామకరణం చేశాము.
    లక్ల్ష్మీ లో మార్పు వచ్చింది... ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి....క్రొత్త అందాలు పుణికి పుచ్చుకుంది ఆమె... ఆ విధంగా హాయిగా, ఆనందంతో రెండు సంవత్సరాలు గడిపాము. బాబు వేసే తప్పటడుగులు , మాట్లాడే ముద్దు మాటలు మమ్ములను ఆనంద పరవరశులనుగా చేసేవి. బాబును ఎంతో గారాబంగా సాకుతూ వచ్చాము. తుమ్మినా, దగ్గినా భయంతో గాబరా పడిపోయే వాళ్ళం.
    బాబుకు మూడు సంవత్సరాలు నిండాయి. ....లక్ష్మీ కి మళ్ళీ ఆరో మాసం గర్బం... ఈసారి ఆడపిల్ల కలగాలని కలలు కన్నాము...కాని లక్ష్మీ రోజు రోజుకీ లోలోపల క్షీణిస్తూ ఉన్నట్లు నాకు అనుమానం కలిగింది. ఈ విషయమే లక్ష్మీ తో పైకన్నాను.
    'మీదంతా అనుమానం....నాకేమైందండీ...? బాగానే ఉన్నాను. ఏ అనుమానాలు పెట్టుకోవద్దు.... నిశ్చింతగా ఉండండి.' అని నా మాటలను లెక్క చేయలేదు.
    లక్ష్మీ అలా అన్నప్పటి కీ నాకు మాత్రం అనుమానం బలపడిందే కాని నివృత్తి కాలేదు. రాత్రిళ్ళు దగ్గుతూ ఉండడం.... దగ్గిన తర్వాత కళ్ళే ఎక్కువ మోతాదు లో పడుతూ ఉండడం జరిగింది. ఇక ఉపేక్షించి లాభం లేదనుకొని లక్ష్మికి చెప్పకుండానే డాక్టరు ను తీసుకు వచ్చాను. మొదట పరీక్ష చేయించుకోడానికి నిరాకరించింది... తర్వాత బలవంతం మీద ఒప్పుకొని పరీక్ష చేయించుకుంది. డాక్టరు గారు చాలా జాగ్రత్త గా పరీక్ష చేశారు. ఆ తర్వాత నన్ను చాటుగా పిలిచి 'రమణయ్య గారూ! ఈమెకు టి.బి. ఎఫెక్టు అయింది. ప్రాధమికావస్త లోనే ఉంది కాబట్టి వెంటనే జాగ్రత్త పడితే తగ్గిపోతుంది. మందులు.... యింజక్షన్స్ వ్రాసిస్తాను. నేను ప్రతి రోజు వచ్చి యింజక్షన్లు యిచ్చి వెడుతుంటాను. కొంతకాలం వరకు ఈ విషయం ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడండి. మీరు కూడా అధైర్య పడవద్దు. బాబును తల్లి నుండి కొంచెం దూరంగా ఉంచడం మంచిది.' అని మందులు...యింజక్షన్లూ వ్రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టరు.

                
    'ఏమండీ డాక్టరు గారేమన్నారు....?'
    'మామూలు దగ్గెననీ, కొన్ని రోజులు జాగ్రత్తగా మందులు వాడితే తేలికగానే తగ్గిపోతుందని , ముఖ్యంగా విశ్రాంతి తీసుకో వాలనీ అన్నారు.'
    'అలాగా! అవుతే నా చెల్లెల్ని తీసుకు రండి... ఒక్కర్తి ని తేమల లేకుండా ఉన్నాను యింటి పనులతో.... నాకు కొంచెం సాయంగా ఉంటుంది.'
    వివాహం జరిగిన అంతకాలానికి ఆ మాట మొట్ట మొదటి సారిగా విన్నాను; లక్ష్మీ నోట. ఎంత పనినైనా విసుగు, బాధ లేకుండా నిర్విరామంగా చేసుకుపోయే లక్ష్మీ ఈ మాటను అనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో బాధపడ్డాను. ఆ జబ్బు లక్ష్మీ ని శారీరకంగా , మానసికంగా ఎంతగా కృంగ తీస్తూ ఉందొ నాకు అర్ధమైంది. ఆమె కోరిక పై చిన్న మరదలిని అమెకు తోడుగా ఉండేందు కై తీసుకు వచ్చాను. మాకు బాబు విషయం పెద్ద సమస్యగా తయారైంది. తల్లి నుండి వాడిని దూరంగా ఎలా ఉంచాలి ....? ఏమీ తోచక చీకాకుతో బాధపడుతూ ఉన్న సమయంలో మెరుపు లాంటి ఆలోచన తోచింది నాకు. నా చెల్లెలి దగ్గర బాబుకు కొంత చనువు ఉంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉండడం వలన బాబు ఆమెకు చనువయ్యాడు. వెళ్ళి వెంటనే చెల్లెలిని తీసుకు వచ్చాను. పది రోజుల తర్వాత బాబును ఆమెతో ఆమె యింటికి పంపించాలని ఊహించాను.
    నా చెల్లెల్ని తీసుకు వచ్చాను. నా చెల్లెలితో రహస్యంగా బాబును మచ్చిక చేసుకోవలసిందిగా చెప్పాను. అందుకు ఆమె సంతోషంతో ఒప్పుకుంది. ఆమెకూ పిల్లలు లేరు. పని వత్తిడి తగ్గడం, మందులు క్రమం తప్పకుండా వాడడంతో లక్ష్మీ ఆరోగ్యం కుదుట పడ నారంభించింది. బాబును నా చెల్లెలు తీసుకు వెళ్ళింది.
    లక్ష్మీ ఆరోగ్యం కుదుట పడినట్లే పడి ప్రసూతి రోజుల వరకు తిరగబెట్టింది. ఒళ్ళంతా నీరు, దగ్గు....ఆయాసం . మళ్ళీ మంచాన పడింది.
    ఒకరోజు నాతొ 'ఏమండీ ....బాబును చూడాలని ఉంది. వాడు ఒదిన గారి యింటికి వెళ్ళి మనసంతా మరిచి పోయినట్లున్నాడు. మీరు వెంటనే బాబును వదిన గారిని తీసుకు రండి. నేనిక బ్రతుకు తాననే ఆశ సన్నగిలుతూ ఉంది.'    
    'అదేమిటి లక్ష్మీ....? అంతగా అధైర్య పడతావెం? డాక్టరు గారు మందులు యింజక్షన్లు యిస్తూనే  ఉన్నారు. అదే నాయమౌతుంది. ఇది వరకు తగ్గలా....?'
    'ఏమోనండి....నాకు భయంగా ఉంది. బాబు వెళ్ళి చాలా కాలమైంది గూడా! బాబును వదిలి పెట్టి నేను ఎప్పుడూ యింతకాలం ఉండలేదు.'
    'సరే! నీవంటగా చెబుతున్నావు కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకు వస్తాను.' అని మరురోజే వెళ్ళి బాబును, చెల్లెలు రాజీని తీసుకు వచ్చాను.
    బాబు రాగానే వాడిని గుండెల కదుముకొని కంటనీరు పెడుతూ 'ఎరా నాన్నా.... అత్తయ్య యింటికి వెళ్ళి....మమ్ముల నందరిని మరిచి పోయావేమిటి?' ముద్దుగా ప్రశ్నించింది.
    'లేదమ్మా.... రోజూ నీ దగ్గలకు లావాలని గోల పెలుతున్నాను.'
    వచ్చీ రాని మాటలతో మురిపెంగా పలికెడు బాబు--
    'మా బాబే! బంగారు కొండే! నన్ను కన్న తండ్రే! మాటలు బాగా నేర్చాడు. రొమ్ముకు వాడి తలను అదుముకుంటూ ఆనంద భాష్పాలు రాల్చింది లక్ష్మీ.
    ఒకరోజు రాత్రి లక్ష్మీ కి నొప్పులు ప్రారంభమయ్యాయి... అసలే ఆరోగ్యం సరిగా లేదు....బాధతో విల విలలాడిపోసాగింది.
    మంత్రసాని గది నుండి బయటికి వచ్చి 'అయ్యా, రమణయ్య గారూ.... పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. కాన్పు తేలికగా అయ్యే సూచనలు లేవు. త్వరగా వెళ్ళి డాక్టరు గారిని తీసుకు రావాలి. ఆలస్యం కాకూడదు...'
    పై మాటలని లోపలికి వెళ్ళింది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. 'భగవంతుడా నా నుండి లక్ష్మీ ని దూరం చేయకు. ఆమె నాకు దూరమైన నాడు నా జీవితాని కిక చీకటే మిగులుతుంది.' అని మనసులో భగవంతుడ్ని ప్రార్ధిస్తూ డాక్టరు కోసం పరుగెత్తాను ఆ సమయానికి అతను యింటి వద్ద లేడు. అప్పటి నా మనో వేదన చెప్పలేనటు వంటిది. ఆలస్యం జరుగుతే ఏం ప్రమాదమో? లక్ష్మీ కి ఎటువంటి ప్రమాదమూ జరుగకుండా చూడవలసిందని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ డాక్టరు గారి రాక కోసం ఎదురు చూడసాగాను.
    నేను వెళ్ళిన తర్వాత ఒక అరగంట కు పొరుగూరి నుండి ఎంతో అలసటతో యింటికి వచ్చాడు. రాగానే నన్ను పలకరించి సంగతి తెలుసుకొని 'అలాగే వెడదాం.... అరగంట లో తయారై వస్తాను.... స్నానం....భోజనం...' అని సమాధానానికి ఎదురు చూడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు.
    'హి భగవాన్....నీదే భారం....' అని దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో చేరగిలబడ్డాను. నన్ను అధైర్యం ఆవహించింది. నిరాశ, నిస్పృహ లతో కృంగి పోయాను. పాపం....డాక్టరు గారు అరగంట కన్న ముందు గానే తయారై వచ్చారు. కాని నాకు ఆ కొద్ది సమయమే ఎన్నో యుగాలుగా తోచింది. ఇద్దరమూ వేగంగా యింటి వైపు బయలు దేరాము.
    ఇంటికి చేరేసరికి పరిస్థితి విషమించింది. లక్ష్మీ కి స్పృహ వస్తూ, పోతూ ఉంది. మేము ఇల్లు చేరేసరికి స్పృహ కోల్పోయింది. డాక్టరు గారు లక్ష్మీ ని పరీక్షించారు. నన్ను ఒక ప్రక్కగా పిలిచి 'ఇక లాభం లేదండీ రమణయ్య గారూ.. పరిస్థితి చేయి దాటి పోయింది. నా ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. నాకైతే ఏమాత్రం ఆశ కనుపించడం లేదు. నా నెత్తిన పిడుగు పడినట్లైంది.
    'డాక్టర్! ఎన్ని వేలైనా ఖర్చు పెడతాను. మీరు చెబితే పట్నం తీసుకు వెడతాను. ఏది ఏమైనా నా లక్ష్మీ మరణించడానికి వీలు లేదు.'

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra