"ఇక్కడ ఏం చేస్తున్నారు?" అన్నాడు మాధవరావు.
    "నేషనల్ సీల్స్ లో పనిచేస్తున్నాను- మీరు"
    "హిందూస్తాన్ స్టీల్స్ లో అసిస్టెంటుగా చేరేను ఆర్నెల్లు ఐంది"
    కొంచెం ఆశ్చర్యంగా చూపేడు గోపాలం.
    అది గమనించి- 'ఆ రోజు ల్లోమాట జ్ఞాపకం వొచ్చిందా? చాలా కథఉందిలెండి.... మీ రెక్కడ ఉంటున్నారు?"
    'కామన్ స్ట్రీట్ లో.... మీరు?"
    "టాలీగంజ్ లో - చాలా ప్రయత్నించేక చిన్న ఫ్లాట్ దొరికింది- ఇవేళ మైదాన్ లో తిరుగు దామని వొచ్చి ఇలాగ వొచ్చాం-"
    వర్షం ఎక్కువ ఐ పోయింది. చేతిలో ఉన్న పుస్తకానికి డబ్బు ఇచ్చి, "పదండి- కాఫీ తాగుదాం. ఇక్కడ నిలబడితే తడిసిపోతాం" అన్నాడు గోపాలం,
    క్వాలిటీలోకి వెళ్ళి కూర్చున్నారు ముగ్గురూ- చాలా టేబిల్స్ ఖాళీగా ఉన్నాయి.
    మెనూచూసి, "ఏం తింటారు?" అన్నాడు గోపాలం.
    మాధవరావు శాంతవేపు చూశాడు. ఆమె తలదించుకుని ఏమీ అనలేదు, కాని, ఆ సంజ్ఞలో ఏదో సందేశం మాధవరావుకి అందించిందనే విచిత్రమైన అనుమానం కలిగింది గోపాలానికి.
    "కాఫీ-" అన్నాడు మాధవరావు.
    "నాకు ఆకలిగా ఉందండీ. వర్షంలో నాకు ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది." అని, పకోడీలూ, పేండ్విచ్ లూ ఆర్డర్ చేశాడు గోపాలం.
    నాలుగైదునిమిషాలు ఎవ్వరూ మాట్లాడలేదు ఆర్కెస్ట్రా సంగీతం రికార్డు సన్నగా వినిపిస్తోంది అక్కడా అక్కడా టేబిల్స్ దగ్గర ఉన్న మనుషులు అతి నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు.
    లోపల చాలా చల్లగా ఉంది- ఎయిర్ కండిషనింగ్ మూలాన్న కొంచెం చలివేసింది గోపాలానికి. అప్రయత్నంగా అతను శాంతివైపు చూశాడు. హఠాత్తుగా ఆమె చలికి వొణకడం. ఆమెబట్టలు తడిగా ఉండడం, గమనించి నొచ్చుకున్నాడు. బహుశా వర్షంలో ఆమె తడిసిపోయి ఇంటికి పోదామని అనుకుని ఉంటుంది...
    "మీరు తడిసినసంగతి చూడలేదు" అన్నాడు గోపాలం.
    "బాధలేదులెండి" అంది శాంత. మాధవరావు వైపు చూస్తూ.
    "చలిగా ఉందా!" అన్నాడు మాధవరావు ఆతృతగా.
    "లేదు. అంతగా లేదు" అంది శాంత.
    టేబిల్ మీద పెట్టిన ఆమె చేతిని నెమ్మదిగా నొక్కేడు మాధవరావు. అది గమనించిన గోపాలం ఆ చేష్టలో ప్రతిఫలిస్తూన్న ఆప్యాయతని గుర్తించకుండా ఉండలేకపోయాడు. కంతలో ఏముంది అతనిలో అంత మమత కలిగించడానికి?
    బేరర్ వొచ్చి  ప్లేటూ, కత్తులూ, ఫోర్కులూ చెంచాలూ టేబిల్ మీద సర్ది, మంచినీళ్ళు పెట్టేడు. మాధవరావు మంచినీళ్ళు తాగాడు- అతను దాహంగా ఉండే మంచినీళ్ళు అడగలేదని అనిపించింది గోపాలానికి.
    పకోడీలు వేడి వేడిగా ఉన్నాయి. ఈ చల్లదనంలో చాలా బాగా ఉన్నాయని తినడానికి.
    ముగించి కాఫీ తాగి, బీర్ చెల్లించాడు గోపాలం - మాధవరావు కొంచం చిన్న బుచ్చుకున్న అనుమానం కలిగింది గోపాలానికి.
    బయట వర్షం తగ్గింది, ట్రామ్ లైన్ దాకా వాళ్ళతో నడిచేడు గోపాలం. రోడ్డునిండా నీళ్ళు నిలిచి ఉన్నాయి. ఇంకా కార్లు ఎక్కువగా తిరగడం లేదు.
    ట్రామ్ స్టాఫ్ దగ్గర నిలబడ్డారు ముగ్గురూ. కానీ, ట్రాములు వొచ్చే సూచన ఏమీ కనిపించి లేదు. ఇంకో గంట. రెండు గంటల దాకా వొచ్చే ఆశ లేదని తెలిసింది త్వరలోనే.
    నిరాశగా చూసింది శాంత.
    "టాక్సీలో పోదాం" అన్నాడు మాధవరావు. కాని, టాక్సీ దొరికేలాగ కనిపించలేదు. మరో పది నిమిషాల తరవాత అదృష్టం కొద్దీ ఒక టాక్సీ దొరికింది.
    "పదండి, మిమ్మల్ని డ్రాప్ చేసి వొస్తాను" అన్నాడు గడియారం చూసి, ఆరుమాత్రమే అవడం గమనించి గోపాలం.
    వాళ్ళతో వెళ్ళాడు-ఇంటికి వెళ్ళే యిష్టం లేక.
    వాళ్ళ యిల్లు చిన్న సందులో వుంది. టాక్సీ మెయిన్ రోడ్ మీద వొదిలేసి, మాధవరావు ఇచ్చే లోపున డబ్బు ఇచ్చేసి వాళ్ళతో నడిచాడు.
    పాత ఇంట్లో రెండో ఫోర్ లో ఉంది మాధవ రావు ఫ్లాటు, ఒకటే గది. చిన్న కిచెనూ-వరండా అవతల బాత్ రూం.
    లోపలికి ఆహ్వానించి ఉన్న రెండు కుర్చీల్లోనూ ఒకదానిలో అతన్ని కూర్చోబెట్టీ ఇంకో దానిలో తాను కూర్చున్నాడు మాధవరావు. కొంచెం సేపట్లో బట్టలు మార్చుకుని ఎదురుగా పెట్టిమీద కూర్చుంది శాంత.
    "మీకు చాలా శ్రమ ఇచ్చేం" అన్నాడు మాధవరావు.
    "ఏమీ లేదండీ- ఇంతకాలం తరవాత మిమ్మల్ని కలియడమే చాలా సంతోషంగా వుంది. జ్ఞాపకం వుందా?-కిందటి సారి చిట్ట చివర కలుసుకోడం యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆఫీసులో - రిజల్ట్సు దగ్గర..."
    "అవునండీ, బాగా జ్ఞాపకం వుంది....... ఆ తరవాత చాలా కథ జరిగింది....
    మాధవరావుకి తల్లీ దండ్రీ చిన్నప్పుడే బోయేరు....అతన్ని అన్న పెంచి పెద్దచేశాడు అన్నది చాలా పెద్ద వ్యాపారం. దానితోనూ కంట్రాక్టులు చేసీ బాగా ఆర్జించేడు. మాధవ రావుని ఏ కొరతా రాకుండా చూచి యూనివర్శిటీకి పంపించేడు. చేతినిండా డబ్బు ఉండేలాగ చూసేవాడు.
    చదువు ముగించగానే అన్నయ్య ఫాను తెలిసింది. చాలా ధనవంతుల పిల్లతో తన వివాహం నిశ్చయం చెయ్యబోయాడు. ఆమె చాలా బాగుంటుందనీ, ఆమెకి పెద్ద ఆస్తిఉందని చూసి ...
    "అదంతా నిజమే..... కాని, మా మేష్టారి మ్మాయిని మరచిపోలేకపోయాను" అన్నాడు మాధవరావు.
    ప్రశ్నగా చూశాడు గోపాలం.
    "మా నాన్నగారు మ్యునిసిపల్ స్కూలులో మాస్టారు - ఈయన మా ఇంటిపక్క ఇంట్లోనే ఉండేవారు." అంది శాంత.
    "అన్నయ్యకి బలే కోపం వొచ్చింది. మటా మాటా వొచ్చి బయటికి వచ్చేశాను.....త్వరలోనే ఉద్యోగం దొరికింది" అని ముగించాడు మాధవరావు.
    అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. చేతి లోని పుస్తకంలోకి చూస్తూన్నా, గోపాలం ఆలోచనలు వాళ్ళమీదే ఉన్నాయి. ఈమెలో ఏమి ఉంది?
    తరవాత అవీ ఇవీ మాట్లాడుకుని ఏడయే సరికి వెళ్ళడానికి లేచాడు గోపాలం. కాని అక్కడ భోజనం చేసి వెళ్ళమని శాంతా, మాధవరావూ ప్రార్ధనలాగ అడగడాన్ని ఉండిపోయాడు.
    నిరాడంబరంగా ఉన్న ఆ భోజనం ఎంతో బాగా అనిపించింది గోపాలానికి. రాత్రి తొమ్మిదికి బయటికి వొచ్చి, తేలికపడ్డ మనస్సుతో ట్రామ్ డిపో దాకా నడిచి, అక్కడ టాక్సీతీసుకుని ఇల్లు చేరేడు. దారిపొడుగునా అతనికి శాంత. మాధవరావు రావు వాళ్ళజీవితం జ్ఞాపకంవొచ్చాయి. ఇంటికి చేరి తలుపుతీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఒక్క సారి తన జీవితం అంతా మళ్ళీ తన ఆలోచనలని ఆవరించి ప్రస్తుతానికి తెచ్చింది.
    వసంత చీకట్లో నిశ్శబ్దంగా పడుకుంది, అతనికి ఏదో విపరీతమైన ఆతృత కలిగింది.
    పక్కని కూర్చుని కొంచెంసేపు ఆమెవేపు చూశాడు. జుత్తు చిందర వందరగా ఆమె ముఖాన్ని దాచుతోంది.
    నెమ్మదిగా చెయ్యివేసి ఆమెని తన వేపు తప్పేడు.
    ముందర అతన్ని ఆకర్షించినది ఆమె ముఖంలోని విపరీతమైన ఎరుపు ఆమె కళ్ళు తుడుచుకుని. తీక్షణంగా అతనివైపు చూసింది.
    "ఏమిటి వసంతా?- ఏం జరిగింది?"
    "ఏమీలేదు - ఎక్కడికి వెళ్ళేవు?"
    పాతఫ్రెండు ఎవరోకనిపిస్తే వెళ్ళేను-లాలిగంజ్. నువ్వెందుకు అలాగ ఉన్నావు?"
    "ఆ మాట చెప్పినా నీకు బోధపడదు - పడుకొనీ నిద్రవొస్తూంది."
    ఆమె ఇంక మాట్లాడలేదు. బయట వర్షం ప్రారంభించింది.

                                  *    *    *

           

    ఆ సాయంత్రం ఏం జరిగిందో గోపాలానికి మరో వారం రోజులదాకా తెలియలేదు ఆ సాయంత్రం కలకత్తా వొచ్చిన వెంకట్రామ్ ని కల్సుకోడానికి గ్రాండ్ హోటలుకి వెళ్ళేడు అక్కడ ముఖర్జీ, అతని భార్యా ఎవరినో చూసి వెడుతూ తనని పలకరించారు.
    కుశల ప్రశ్నలయాక, మేం వస్తాము రేపు - ఆ రోజు వసంత అనవసరంగా బాధపడింది. ఆ తరవాత మళ్ళీ ఆమె క్లబ్బుకి రాలేదు-" అంది శ్రీమతి ముఖర్జీ.
    "ఏమిటది?" అన్నాడు గోపాలం.
    భార్యా భర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాక, ముఖర్జీ, "కిందటి ఆదివారం - వసంత క్లబ్బుకి వొచ్చి మాతో బ్రిడ్జి ఆడుతూంటే జరగకూడని ఒక సంఘటన జరిగింది. మీకు చెప్పి ఉంటుందాని అనుకున్నాము...." అన్నాడు.
    గోపాలం వింటున్నాడు.
    "రాయ్ సెక్రటరీ- మాటేబిల్ దగ్గరికి వొచ్చి మాట్లాడుతూ వసంత భుజంమీద పరధ్యానంగా చెయ్యి వేశాడు- మా శ్రీమతి గమనించింది. రాయ్ ని పక్కకి పిలిచి గట్టిగా చీవాట్లు వేసింది. ఎంత క్లబ్బైనా అంత చనువుకూడదని......అదీ కాక అతను మాటి మాటికీ ఆమెకి విస్కీ ఆఫర్ చెయ్యడం- ఆమెని ప్రెస్ చెయ్యడం మాకు నచ్చలేదు."
    ఏమీ అనలేదు గోపాలం.
    "ఆ తరవాత వసంతతో అతనికి దూరంగా ఉండమనీ, అతని చరిత్ర మంచిది కాదనీ చెప్పింది, ఎలాగో ఆ రబ్బర్ ముగించి వసంత వెళ్లిపోయింది. మేం అనుకున్నాం. బహుశా ఆమె వ్యవహారాల్లో జోక్యం కలుగజేసుకోడాన్ని వసంతకి కోపం వొచ్చిందని."
    కలుగజేసుకుని శ్రీమతి ముఖర్జీ. "ఆమెని చూస్తే మా పిల్లలాగే ఉంటుంది. చిన్నపిల్ల....మరో విధంగా ఏమీ అనలేదు" అంది క్షమాపణ చెప్తూన్నట్టు."
    వలలు "రేపు వొస్తా"మని చెప్పి వెళ్ళిపోయారు.
    ఆలోచిస్తూ వెంకట్రామ్ ఉంటూన్న రూముకి వెళ్ళేడు గోపాలం,
    అతన్ని ఆహ్వానించి. "ఏం అలాగ ఉన్నావు!" అని అడిగారు వెంకట్రామ్.
    నిజం చెప్పాలా వొద్దా అని ఆలోచించి, తాను మరీ దాపరికం చేస్తోన్న సంగతి గుర్తుంచుకుని ముఖర్జీతో జరిగిన సంభాషణ వివరించేడు గోపాలం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra