Home » Govindaraju seetadevi » Jeevana Kalasam


    గజిబిజి గలిగిస్తున్న ఆలోచనల్ని తల విసిరి పక్కకు నెట్టాడు.
    అప్పటికే వీథిలైట్లు వెలిగాయి.
    ఇల్లు దగ్గరపడింది. ఇదివరకుగ బగవాయెక్కి వెళ్ళే ఆ మెట్లు మెల్లగా సంకోచంగా ఒక్కోక్కటీ యెక్కుతున్నాడు.
    లోపలనుంచి రాఘవరావు గొంతు ఖంగున విన్పిస్తూంటే వాసు తనచేతిలోని గొలుసూ. గాజులూవున్న చేతిరుమాలు గట్టిగా పట్టుకున్నాడు.
    "సిగ్గులేకుండా ఆ దౌర్భాగ్యుడి ఇంటికి నువ్వెందుకెళ్ళావ్? చెప్పు?"
    "......................"
    "నల్లరాయిలాగా మాట్లాడకపోతే వూరుకోను. ఇలా దొంగవేషాలూ ఎన్నిరోజులుగా వేస్తున్నావ్... చెప్పవేం"
    చెంప పగలేటట్లు కొట్టిన శబ్దం.
    శ్రీలక్ష్మి వెక్కి వెక్కి యేడుస్తోంది. పిల్లలు "అమ్మా" అంటూ యేడుస్తున్నారు.
    వాసు వీథి తలుపు తోశాడు. ఘడియ బిగించి వుంది. రాలేదు. ఏం చెయ్యటం! యెలా పిలవటం?
    "బజారు ఆడదాన్ని దగ్గర పెట్టుకుని కులుకుతున్న ఆ వెధవ ఇంటికి వెడతావా? ఈవాళ జైలుకెళ్ళింది. రేపు హత్యలు చేస్తుంది. అయినా పిలవడు దాన్ని. అసలు దాన్ని విడిచి వుండలేడు. నీ పెంపు. నీవు నూరిపోసిన ఆదర్శాలు- అన్నీ వాడికి నీవే మప్పి పెట్టావు. నా తల వాలి పోతుంది, యెక్కడికి వెళ్ళినా మీ తమ్ముడు అంటూ ప్రతివాడూ నన్ను యెక్కిరించే వాడే. నువ్వూ పోవే .... వాడి దగ్గరే దానితోపాటు వుండు" అంటూ బలంగా తోసిన శబ్దం.
    వాసు తలుపు దబదబా బాదేస్తున్నా యెవరూ విన్పించుకునే స్థితిలో లేరు.
    శ్రీలక్ష్మి అంతవరకు భర్త ఎలాంటి మాటలు విసురుతున్నా సహించింది. కాని వ్యంగ్యాన్ని భరించలేక యెదురు తిరిగింది.
    "నన్ను వెళ్ళమనటానికి మీ రెవ్వరు? ఇది నా యిల్లు. మీరు ఇల్లువదిలి వూరిమీద కాలక్షేపం చేస్తూంటే నవ్వనిలోకం వాసునే చూసి నవ్వుతుందా! సరిగా ఆఫీసుకి వెళ్ళకుండా దాని దగ్గర యెందుకు కూర్చుంటున్నారు. యెన్ని రాత్రులు ఇంటికి వస్తున్నారు. ఇవన్నీ లోకానికి తెలియవు. అనుకుంటున్నారు. వాసునే కాదు. మిమ్మల్నీ చూసి నవ్వుతోంది. పెళ్ళాం. పిల్లలూ వున్నా..........
    శ్రీలక్ష్మి ఇంకా యేమేమో అంటూనే వుంది.
    "నోరు మూసుకుని పడివుండు. లేకుంటేపో .....నా యిష్టం వచ్చినట్లు తాగుతాను తందనా లాడతను, నువ్వెవరు నేను మగాడిని."
    వాసు భరించలేకపోయాడు. తలుపు దబ దబా బాదేశాడు, పిల్లలయేడుపూ శ్రీలక్ష్మిగొంతూ రాఘవరావు అరుపులూ కలిసిపోయి గందర గోళంగా విన్పిస్తూంటే ఇరుగూ పొరుగూ విచిత్రంగా చూస్తూవుండిపోయారు.
    తలుపు తెరుచుకుంది,
    పూనకం పూనిన వాడిలాగా రాఘవరావు యెటూ చూడకుండా వాసుని తోసుకుంటూ బైటికి వెళ్ళిపోయాడు.
    వాసుని చూస్తూనే బిక్క ముఖాలేసుకునివున్న వీణా. బాబ్జీ "చిన్నాన్నా" అంటూ కావులించుకుని బావురుమన్నారు.
    వాసు రాక గుర్తించిన శ్రీలక్ష్మి రెండు చేతుల్లోనూ ముఖం కప్పుకుని వంటగదిలోకి పారిపోయి తలుపు లేసేసుకుంది.
    "మమ్మల్ని విడిచి వెళ్ళకు చిన్నాన్నా" అంటూ ఆ ఇద్దరూ ప్రతిరోజూ ఇంట్లో జరిగే విషయాలన్నీ చెప్పేశారు.    
    "నాన్న అమ్మని అస్తమానం కొడుతున్నారు" అంటూ వీణ బోరుమంది ఏమిటిదంతా......ఇదంతా నిజంగానే జరుగుతున్నదా?
    పరువూ మర్యాదా అంటూ ప్రాణాలు వదిలే అన్నయ్య ఇంత మారాడా? దీనికి కారకులెవరు. ఎవరై వుంటారు.
    అర్ధం కాలేదు వాసుకి.
    ఆ ఇద్దరినీ వోదార్చి వంటఇంటి తలుపు తట్టాడు. "వదినా వదినా" అంటూ. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి.
    ఆ వదినా మరుదు లిద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటూ వుండిపోయారు ఒక్కక్షణం.
    వాసు కళ్ళనీళ్ళు గిర్రున తిరిగి అవి అక్కడే ఆగిపోయాయి.

                                  *    *    *

    ఆలోచిస్తూ నడుస్తున్న వాసు తన దగ్గరగా వచ్చిన ప్రసన్నని చూడనేలేదు.
    "నమస్కారం" అంది సంతోషంగా.
    నమస్కారం.... మీ రా.... ఇలా యెందుకొచ్చారు.
    చాలా రోజుల తర్వాత చూడటం జరిగింది ప్రసన్నలక్ష్మి ని అసలు ఆ సమయంలో ఆ అమ్మాయి కన్పిస్తుందని కాని కన్పించాలనిగాని ఆలోచించే స్థితిలో లేడు వాసు.
    "ప్లీజ్.....మీతో కాస్సేపు మాట్టాడేందుకు అవకాశం ఇస్తారా"
    బెదురుగా వాసుముఖంలోకి చూడకుండా తల వంచి చేతిలోని హేండ్ బ్యాగ్ ని తిప్పుతూ అంది.
    "నాతో పనేం వుందీ..."    
    "అలా పార్కులోకి వస్తే చెప్తాను"
    "సరే పదండి...." అంటూ పార్కువైపు దారితీసిన వాసు చాలా చిత్రంగా నే వుంది అనుకున్నాడు,
    పార్కులోని పచ్చగడ్డిలో కాస్త దూరంగా కూర్చున్నారు ఇద్దరూ,
    రెండు నిముషాలు నిశ్శబ్దంగా దొర్లినాయి.
    వాసు ప్రసన్న చెప్తుంది అని వూరుకున్నాడు.
    అసలు యెలా మొదలుపెట్టి మాట్లాడాలో అర్ధంకాక బెదురుతూ చుట్టూ చూస్తూ ఊరుకుంది.
    "ఎక్కడ నించి వస్తున్నారు?"
    "మీ ఆరోగ్యం ఇప్పుడు బాగున్నట్లేనా! ఒకే సారి ఇద్దరూ మాట్లాడారు.
    తన తొందరపాటుకి సిగ్గుపడింది ప్రసన్న.
    ప్రసన్న చేతిలో బ్యాగ్ వుందిగనుక దాన్నే ఇటూ అటూ మారుస్తూ మాట్లాడుతోంది. వాసు కాసేపుకూడా కదలకుండా కూర్చోలేడు. కాస్సేపు షర్టు వెనక్కీ ముందుకీ లాక్కున్నాడు. క్రాపు వేళ్ళతో సరిచేసుకున్నాడు. అయినా యేదో వుదుకుష్టంగా ఫీలవున్నాడు.
    సంభాషణ సాగుతున్న కొద్దీ ఈ అవస్తదాటిపోతోంది ఆ ఇద్దరికీ.
    "ఏదో చెప్తానని తీసుకి వచ్చారు. చెప్పనేలేదు." గుర్తుచేశాడు వాసు.
    ".................."    
    టైము చాలా అయితే నాకేం ఫర్వాలేదు మీరు వంటరిగా ఇంటికెళ్ళడమే చాలా కష్టం" నవ్వుతూ అన్నాడు.
    మీ దగ్గర వున్న నాకు భయం ఉండదు అనుకుంది మనస్సులో.
    "చెప్పండి నాకింకా చాలా పనివుంది"
    "నేను ఉద్యోగంలో చేరాను"
    "సంతోషం.... ఇది చెప్పడానికేనా ఇక్కడికి పిల్చింది"
    విసుగ్గా చూశాడు. ప్రసన్న గాబరా పడిపోయింది.
    "కా... కాదు. ముఖ్య విషయం చెప్పాలని" గుటకలు మింగింది ప్రసన్న.
    పెళ్ళిచూపులనాడు వాసూ తనూ....అలా అలా యేవేవో గుర్తు వచ్చేస్తున్నాయి. అతను మాత్రం యే వికారం లేకుండా నిబ్బరంగా కూర్చున్నాడు ఒక చెయ్యి కింద ఆన్చి ఒక పక్కకి కాస్త వరిగి.
    "మీరు వైదేహి ఇంటికి ఇంకా వెడుతూనే వున్నారా?"
    "ఎందుకు?" సూటిగా చూస్తూ అడిగితే ఎలా చెప్పటం. అనుకుంది.
    "మన్నించాలి. అప్రియమైన విషయం చెప్పవలసి వచ్చినందుకు.
    "ఫర్వాలేదు....వింటున్నాను." త్వరపెట్టాడు వాసు.
    వాసు త్వరపెడుతూంటే ప్రసన్న మరీ కంగారుపడుతోందిగాని మాట రావటంలేదు. అప్పటి వరకూ వున్న అలసట యెక్కడ పోయిందో చాలా హయిగా అన్పిస్తోంది. చల్లని గాలి వీస్తూంటే. వాసులో చిలిపితనం చోటు చేసుకుంది.
    "మీరింత పిరికివారని అనుకోలేదు" గడ్డిపరక తుంచేస్తూ అన్నాడు.
    ప్రసన్న ముఖం క్షణం యెర్రబడి అంత లోనే మామూలుగా అయిపోయింది. వాసు ఆ ముఖంలో మారే భావాలని కుతూహలంగా గమనిస్తున్నాడు. వాసు యెంతసేపు యెదురు చూసినా ప్రసన్న నోట్లోంచి మాటలేదు. వాసే మొదలేట్టాడు.

             
    "ఆ రోజు ఫోను చేసినప్పుడు నేను మాట్లాడుతుండగానే పెట్టేశారేం.... అదీకాక అక్కడ వుండవద్దని చెప్పి ప్రసన్న వెంటనే జవాబు ఇచ్చేసింది.
    "నేనూ వైదేహీ అక్క చెల్లెలు పిల్లలం.
    ఓ. అలాగా.... వైదేహీ చెప్పనేలేదే... అయితే "వైదేహిని మీరు చూసి ఇష్టపడక పోవటం...
    "మిమ్మల్ని చూసి ఆమోదం తెలియచెయ్యటం..." అందించాడు వాసు. అసలు విషయ మేమిటో తెల్సుకోవాలని కుతూహలంగా కూడా వుంది.
    వాసు కొంటెతనం ప్రసన్నకి గింతలు పెడుతోంది.
    యెంత చెడ్డవాడబ్బా. అన్నది మనస్సు. కాదు తను సరదాగా మాట్లాడి ఎదుటి వాళ్ళలోని బెరుకుని పోగొడతాడు.
    "మేం ఈ విషయంలో తగూపడ్డాం" అని ఈయనకి ఎలా చెప్పటం. ఆలోచిస్తోంది ప్రసన్న.
    "మీరు చెప్పేది వినాలంటే తెల్లవారేటట్లు వుంది. టైము ఎంత అయిందో చూడండి కాస్త"
    వాసు చేతికి గడియారం లేదు.
    "తొమ్మిదిన్నర"        
    "అమ్మయ్యో..... ఇంక ఒక్కక్షణం వుండను. సారీ మీరు చెప్పదల్చుకున్నది మరోసారి వింటాను. శలవా మరి" లేచి పాంటుకి అంటిన గడ్డి దులుపుకుంటూ అన్నాడు.
    "అంత అర్జెంట్ పనేమిటో అడగవచ్చా" ఇష్టంలేకున్నా లేస్తూ అన్నది "నిరభ్యంతరంగా అడగవచ్చు. చూడండి నగలు సంపాదించినది చాలటంలేదు. అందుకని.... ఇంకా యేదో ప్రయత్నించి..."
    "సరేగాని కాస్త మా ఇంటివరకూ సాయంగా రారూ... ఒంటరిగా వెడితే చాలా భయంవేస్తుంది. అదీకాక కాలం యేం బాగాలేదు"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra