Home » Yerramsetti sai » Bomma Borusu


    "అవునండీ! ఇంతవరకూ నేనేనాడు బట్టలు ఉతకలేదు. ఆ అవసరం రాలేదు".
    "నువ్వు ఆడదానివి కావా?" ఆమెకు ఆ మాటతో సహనం నశించిపోయింది.
    "అంటే ఆడదానికి బండగుర్తుబట్టలుతకడం తెలిసి వుండటమా?" కోపంగా అడిగిందామె.
    "హేమా! అనవసరంగా రెచ్చగొట్టుకు. ఆడది, ఆడదానిలాగానే వుంటే అందం, గౌరవమూనూ! మగాడిలా ప్రవర్తిస్తే మర్యాద పోగొట్టుకుంటుంది నీచంగా చూడబడుతుంది".
    "అవును! అలా భావించేవారెవరో కూడా నాకు తెలుసు"
    "సరే-నీతో వాహనెందుగ్గానీ పద! బట్టలు ఉతకడం ఎలాగో నేను నేర్పిస్తాను నీకు! ఇకనుంచీ చాకలి అవసరమేలేదు. ఈ పని నువ్వే చూసుకోవాలి! అంతేకాదు. పనిమనిషి కూడా మానిపించేస్తాను. నిన్ను ఎలా దారిలోకితేవాలో నాకు తెలుసు!" ఆమెను చేయి పట్టుకుని బాత్ రూమ్ వేపు లాగుతూ అన్నాడతను.
    అతనిచేయి విసురుగా తోసివేసింది హేమ.
    "నాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు" అంది నిర్లక్ష్యంగా.
    అతను ఆ నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు. ఆమె వీపుమీద బలంగాకొట్టాడు. "పద, లోపలకు".
    "నేను ఉతకను! మీ భార్యనయినంతమాత్రాన మీకు చాకలిని, కూలిమనిషిని కూడా అనాలనిలేదు. 'భార్య' అంటే అర్ధం మీకు తెలుస్తే ఇంతనీచంగా చూడరు" కళ్ళవెంబడి నీళ్ళు తిరుగుతూండగా అందామె.
    "మరి వంట మాత్రం ఎందుకు చేస్తున్నావ్? అది మాత్రం భార్యే చేయాలని ఎక్కడుంది?" వెటకారంగా అడిగాడతను.
    "మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి, నేను ఉద్యోగం చేయడంలేదు కాబట్టి ఆ బాధ్యత తీసుకున్నాను. అదే నాకు ఉద్యోగం దొరికి, మీకు లేకపోయినట్లయితే మీతోనే చేయించేదానిని."
    రోషంగా అందామె.
    "అలాగా! మరింకా ఆలస్యం ఎందుకూ? ఉద్యోగంచేసెయ్! వండిపెడుతూంటాను నీకు!" హేళనచేస్తూ అన్నాడతను.
    "మీకంతసరదాగా ఉంటే అలాగే చేస్తాను! నాకేమీ అభ్యంతరంలేదు"
    "వెధవ తెలివికి సంతోషించాంగానీ ఇంక పద" మాసిన బట్టలు తీసుకొచ్చి బాత్ రూమ్ లోవేసి ఆమెను లోపలికి బలవంతంగా నెట్టాడతను.
    హేమకు పట్టుదల మరింత ఎక్కువయిపోయింది. "మీరేమయినాచేయండి! ఈ పని నావల్లకాదు అంతే!" అంది మొండిగా.
    అతను ఇంక సహించలేకపోయాడు. తనను తనేమర్చిపోయాడు. మరుక్షణం ఆమెను గొడ్డుని బాదినట్లు విచక్షణ లేకుండా కొట్టసాగాడు. ఆమె మౌనంగా రోదిస్తూ అక్కడే కూలబడిపోయిందిగానీ బట్టలు ముట్టుకోలేదు. కొద్దిసేపటికి తనకే చెయ్యి నొప్పిపుట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను. అతని అహం పూర్తిగా దెబ్బ తింది. హేమ తన చేయి దాటిపోతున్నట్లు భావించాడతను.
    ఇంకేమీ చేయడానికి తోచక ఆఫీస్ కి బయల్దేరాడు. ఆమెతోపాటు జీవితం గడపడమా, గడపకపోవడమా అనే విషయం గురించి పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమయినట్లనిపించింది. ఇలా ఎంతో కాలం జరుగడానికివీల్లేదు. వీలయినంత త్వరలోనే ఈ నాటకానికో ముగింపుకావాలి! ఆమె పూర్తిగా తనకు లొంగడమో, లేక శాశ్వతంగా తన నుండివిడిపోవడమో.....ఏదొకటి తేలిపోవాలి! అతను వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు హేమా అలానే కూర్చుండిపోయింది.
    ఆ క్షణంలోనే తనూ ఇల్లు వదలడం మంచిదనిపించిందామెకి. అతనలా చీటికిమాటికి తననోబానిసలా ట్రీట్ చేయడం, తనమీద చేయి చేసుకోవడం సహించలేనంత అవమానకరంగా ఉంది. అయితే తను అతని దెబ్బలకు భయపడదల్చుకోలేదు. అతని అహంకారానికి దెబ్బకొట్టి అప్పుడు ఇంట్లోనుంచి బయటపడితే తనకు శాంతిగా ఉంటుంది. తన సమస్యకో సంతృప్తికరమైన ముగింపు లభిస్తుంది. తరువాత అతను తన తప్పుతెలుసుకొని ప్రాధేయపడేవరకూ మళ్ళీ అతని మొఖం చూడకుండా గడపొచ్చు! మనసుని దిటవుపర్చుకుని వంటపనిలో మునిగిపోయింది ఆమె.
    ఆ మధ్యాహ్నం ఉషాదేవి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందామెకి. అప్పుడప్పుడూ ఉషాదేవికీ తనకూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయ్. విజయవాడలో కూడా కొంతమంది విద్యార్ధినులు, యువతులు తమ నారీ విప్లవసమితి ప్రారంభించడానికి ఉత్సాహపడుతున్నారనీ అంచేత ఆ ఏర్పాట్లు చేయడంలో వారికి సహకరించవలసిందనీ, ఈ సందర్భంలో వారు తమనుకలుసుకోడానికి రాబోతున్నారనీ తెలియజేస్తూరాసిందామె.
    కొంతకాలంగా మరుగున పడి వున్న కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే అవకాశం కలిగినందుకు ఆనందించింది హేమ. తనను అలాంటివాటిల్లో చేరకుండా శ్రీనివాసరావ్ అభ్యంతరం తప్పక చెప్తాడు.....తనకు తెలుసా విషయం! కానీ అతన్ని మామూలుగానే నిర్లక్ష్యం చేయదల్చుకుంది. అంతగా గొడవయితే ఇల్లువదలాలని ముందే నిశ్చయమయిపోయిందిగదా! ఆ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొస్తూనే తనచేతిలోని పత్రికను ఆమె మీద విసిరికొట్టాడతనుకోపంగా.
    "కథలురాయడమంటే పక్కింటివాళ్ళ జీవితాన్ని కాగితం మీద పెట్టటం కాదు! అయినావాడికీ, వాడి భార్యలకూ లేని బాధ మధ్యలో నీకు పట్టుకుందేం?" హేళన చేస్తూ అన్నాడతను. అతని మాటలేమీ లెక్కచేయకుండా ఆ పత్రిక అందుకుని, పేజీలు  ఆతృతగా తిరగవేయసాగిందామె. మొట్టమొదటికథే తనది.పెద్ద అక్షరాలతో తన పేరు, ఓ పక్క కథకి బొమ్మాకనిపించాయ్.
    తనకథ ప్రచురింపబడింది అన్న ఆనందం కంటే తన భావాలకు గుర్తింపు లభించింది అన్న ఆనందం ఎక్కువగా కలిగిందామెకి. "నేనీ కథరాసింది వాళ్ళకోసంగానీ, నాకోసంగానీ కాదు. అలాంటిమోసగాళ్ళయిన మగాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండమని యువతులకు హెచ్చరిక చేసేందుకు రాశాను...." జవాబిచ్చిందామె.
    "ఓహో! ప్రబోధాలు చేస్తున్నావన్నమాట! ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి కెగిరిందట! ముందు నీ సంసారం గొడవ చూసుకొని నీ లోటుపాట్లు తెలుసుకుంటే ఎంతోమందిని ఉద్ధరించినంత ఫలితం వస్తుంది...."
    "లోటుపాట్లు ఎవరివో నాకు తెలుసు..." అనేసి అక్కడినుంచి పెరట్లోకి నడిచిమెట్లమీద కూర్చుండిపోయింది ఆమె.
    అతనితో మాట్లాడడమే అయిష్టంగా ఉంది తనకు. "ఏయ్! టీ తీసుకురా!" అధికారం చెలాయించేధోరణిలో అరచాడతను.
    "టేబుల్ మీద ప్లాస్కులో ఉంచాను! తీసుకుని తాగండి!" అక్కడే కూర్చుని అందామె.
    ఆమె సమాధానం అతనికి ఎక్కడలేని కోపాన్ని తెప్పించింది. "అవును! నువ్వీ ఇంట్లో రాణివనుకుంటున్నావ్! పని చేయడానికి కాదు, నువ్వుంది!" ఆవేశంగా అన్నాడతను.
    "స్త్రీనితోటిమనిషిగా చూడడంచేతకాని మీలాంటి రాక్షసుడుకున్నంత కాలం ఆడదానికి అర్ధం చాకిరీ చేసేగొడ్డు మాత్రమే!" లేచి లోపలకునడుస్తూ అందామె.
    అప్పుడే ప్లాస్కులోని వేడి టీకప్పులోకి వంచి కప్పుచేతిలోకి తీసుకున్న శ్రీనివాసరావ్ కి ఆమె మాటపొగరుబోతు తనంగా కనిపించింది. క్షణికావేశంలో కప్పులోని టీని ఆమెమీదకు చిమ్మాడతను.
    "అవును! నేను రాక్షసుడినన్నావ్ కదా! ఇకనుంచీ రాక్షసత్వమే చవిచూద్దువుగాని!" వికటంగా అన్నాడతను. వేడి టీ మొఖమంతా చిందేసరికి ఆ బాధకు తాళలేక 'అబ్బా!' అంది ఆమె అక్కడే కూలబడిపోతూ అతను ఆమెవంక కూడా చూడకుండా అక్కడినుంచిగదిలోకి నడిచిబట్టలు మార్చుకుని బయటకు వెళ్ళిపోయాడు.
    హేమ మొఖంమీదా, మెడమీదా, చేతులకీ అక్కడక్కడా బొబ్బలెక్కిపోయినయ్. తాళలేని బాధ! అయినాగాని అంత బాధలోనూ ఆమెలో అదో విధమయిన ఆనందం కలిగింది. శ్రీనివాసరావ్ ని తనుమార్చగలదోలేదోగాని తను మాత్రం అతనికి లొంగటం లేదు. అతని దారిలోకి వెళ్ళటం లేదు. అతనిని లక్ష్యపెట్టటంలేదు. తను తననుకున్న విధంగానే ప్రవర్తిస్తోంది. అతను కొట్టినా, తిట్టినా తనాలోచించిన మార్గం వదలటంలేదు.
    "హేమగారు!" బయటనుంచి పిలుపు వినిపించేసరికి ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి తేరుకుందామె. చప్పున మొఖం తుడిచేసుకుని "ఎవరూ?" అంటూ బయటకునడిచింది. ఎదురుగ్గా చంద్రకాంత్ కనిపించాడామెకి. అతన్ని గుర్తుపట్టడంకొంచెం కష్టమే అయింది. బాగా పొడుగయిపోయాడు. మొఖంలో అదివరకటి బాల్యం ఛాయలు మాయమయిపోయినయ్. అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నాడు.
    "నన్నింకా గుర్తుపట్టలేదా ఏమిటి?" తనని చూస్తూ నిలబడిపోయిన ఆమెని చిరునవ్వుతో అడిగాడతను.
    "రా, చంద్రకాంత్! చాలామారిపోయావ్ కదూ నువ్వు! అందుకని నువ్వాకాదా అన్న సంశయంలో పడ్డాను!" చిరునవ్వులో ఆహ్వానిస్తూ అందామె. లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడతను.
    "మీరు వివాహం అవగానే హైద్రాబాద్ వచ్చేస్తారని ఎంతోఆశగా ఎదురు చూశాము. కానీ తర్వాత తెలిసింది. విజయవాడలో వున్నట్లు అడ్రెస్ కోసం నేనూ వసుంధరా ఎంతో ప్రయత్నించామనుకోండి! మీరు మాత్రం హాయిగా మమ్మల్ని మరిచిపోయినట్లున్నారు!" నిష్టూరంగా అన్నాడతను.
    "నేను మర్చిపోలేదు! కానీ మీరు అదివరకటి ఇల్లు మారి మరెక్కడో ఉన్నట్లు ఓసారి మీ వసుంధర ఫ్రెండొకామె కనిపించి చెప్పింది! కరెక్ట్ అడ్రస్ ఆమెకూ గుర్తులేదుట! దాంతో సంబంధాలు తెగిపోయాయి. వసుంధరకు వివాహం అయిందటగా?" అడిగిందామె.
    "అవును! మీకు శుభలేఖ పంపించాం కదా!"
    "మా నాన్నగారు రాశారు శుభలేఖ అందిందని!"
    "మరి పెళ్ళికి ఎందుకు రాలేదు?"
    "సంసారబంధం!" నవ్వుతూ అందామె.
    "మీరు వస్తారని అక్కయ్య ఎంతో ఎదురు చూసింది!" అన్నాడతను.
    "వాళ్ళాయనేం ఉద్యోగం చేస్తారు?"
    "రైల్వేలో...."
    "ఎక్కడ?"
    హైద్రాబాద్ లోనే!"
    "మరి నీ సంగతేమిటి? డిగ్రీ అయిపోయిందా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra