Home » Yerramsetti sai » Death Chamber


    ఆ తరువాత మరి కొంతమంది తనకు చేరువవాలని ప్రయత్నించినా తను తెలివిగా తప్పించుకుంది.
    మళ్ళీ అలాంటి తెలివి తక్కువ క్షణాలు తనను ఆవహించకుండా జాగ్రత్త పడింది. హీరోయిన్ నటించాక అసలు తన విషయంలో అంత ధైర్యం చేసేవారేలేకపోయారు. శంతన్రావ్ కూడా ఆ తరువాత ఎప్పుడూ తనని మళ్ళీ కోరలేదు. ఎక్కడయినా తటస్థపడినా అసలు తామిద్దరికీ ఎలాంటి పరిచయమూ లేనట్లేమసలేవాడు.
    తనకెందుకో అతనంటే అయిష్టం.
    అతనిని చూడడానికి కూడా మనసొప్పదు. అందుకే ఆ తరువాత అతని చిత్రాలన్నిటిలోనూ అతను అవకాశాలిచ్చినా తను అంగీకరించలేదు.
    తలుపు తట్టినచప్పుడయి ఉలిక్కిపడింది చంద్రిక. టైము చూసిందామె. ఒంటిగంటవుతోంది.
    ఇంత రాత్రిలో ఎవరయి వుంటారు?
    "ఎవరు?" నెమ్మదిగా అడిగిందామె తలుపు దగ్గరకు నడిచి.
    "నేనే! ప్రేమ్ కుమార్!"
    తలుపు తీసింది చంద్రిక.
    అతను లోపలికొచ్చాడు నవ్వుతూ.
    "మీరింకా నిద్రపోలేదా?" కుర్చీలో కూర్చుంటూ అడిగాడామెని.
    "ఉహు! నిద్రపట్టడం లేదు!"
    "ఆశ్చర్యంగా వుందే! నాకూ నిద్ర పట్టకే పచార్లు చేస్తుంటే మీ గదిలో లైటు వెలగడం కనిపించింది."
    నైట్ డ్రస్ లో అందంగా, హుందాగా వున్న అతన్ని చూసి సమ్మోహితురాలయింది చంద్రిక. ఎంత అందం అతనిది! అందుకే అతని కౌగిలి తనకంత మత్తుని కలిగించింది.
    అతను లేచిహఠాత్తుగా రెండుతలుపులూ మూసిగడియ వేసేసాడు. చంద్రిక అతనికోసమే ఎదుర్చూస్తున్నట్లు అతని కౌగిట్లో వాలిపోయింది.ల్ తనెందుకలా చేస్తోందో, ఎందుకతనికి లొంగిపోయిందో ఏ మాత్రం ఆలోచించేస్థితిలో లేదు.
    తెల్లారుతుండగా అతను ఆమెను కౌగిటనుంచి వదలి తన గదికి చేరుకున్నాడు.
    తనకేనాటి నుంచో అతని మీద వున్న ఆరాధన తననతనికి మనః పూర్వకంగా లొంగిపోయేలా చేసింది.
    జరిగిందానికి తనేమీ విచారపడటం లేదుకూడా అయితే ఈ బంధం ముందు ముందు ఎలా పరిణమిస్తుందో తనకుతెలీదు.
    అతను వివాహితుడు. తనకు తెలుసా విషయం. లేకపోతే తనను వివాహం చేసుకోమని అతనిని ప్రాధేయపడేది.
    ఉదయం షూటింగ్ కి బయల్దేరేప్పుడు ఆమెను చూసి నవ్వాడతను చంద్రిక కూడా నవ్వింది సిగ్గుపడుతూ.
    మధ్యాహ్నంలొకేషన్లో భోజనాలసమయం వరకూ తామిద్దరకూ ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశమే కలుగలేదు.
    భోజనాలయాక అతను ఆమె దగ్గరకొచ్చికూర్చున్నాడు -
    "ఇంకా జరిగింది కలానిజమా అన్న నమ్మకం కలగడంలేదు" చిరునవ్వుతో అన్నాడతను.
    చంద్రిక ఏమీ మాట్లాడలేదు.
    రాత్రి అతను ఆ ఆవేశంలో ఏవేవో మాటలు చెప్పడం తనకు గుర్తుంది.
    "చంద్రిక! నిజం చెపుతున్నాను. ఇంతవరకూ నేను చాలామందితో క్లోజ్ గా నటించానుగానీ ఇలా ఎప్పుడూ ఆకర్షింపబడలేదు.
    "చంద్రికా! నాకు నువు శాశ్వతంగా కావాలి. అదెలా సాధ్యమో నాకే తెలీదు. ఇంత అందమయిన నిన్ను వదలిఉండటం నా వల్లకాదు.....చంద్రికా! నాకేమనిపిస్తూందో తెలుసా? ఎప్పటికీ మనమిద్దరమే ప్రేయసీ ప్రియులుగా నటించాలి. మనిద్దరి మధ్యా ఇంకెవరూ రాకుండావుంటే బావుండుననిపిస్తోంది!"
    అతని మాటలు తఃనకు మరింత మత్తు, మరింత ఆనందం కలిగించినయ్.
    అతను తనను అంత గాఢంగా ప్రేమించడమే ఆశ్చర్యమే ఎందుకంటే తనకంటే అందమైన అనేకమంది హీరోయిన్ లతో కలసి నటించాడతను. మరి వారెవరూ అతనిని ఇంతగా ఆకర్షించలేదంటే విచిత్రంగానే వుంది.
    "నా పరిస్థితీ అంతే! మీరు నా వారయితే బావుండునని ఎప్పటి నుంచి మనసులోవున్న కోరిక! కాని ఇదిలా పరిణమిస్తుందనుకోలేదు" అంది తను.
    "చంద్రికా! మనంజీవితాంతం ఇలా కలసివుండగలమా?" అడిగాడతను.
    "అదెలా సాధ్యం?" ఆశ్చర్యంగా అడిగిందామె.
    "నువ్వే ఆలోచించు! నువెలా చెపితే అలా చేయడానికి సిద్దంగా వున్నాను. కానీ నిన్ను విడిచిమాత్రం వుండలేనేమో అనిపిస్తోంది."
    "నాకొక్క మాటివ్వగలరా?"
    "ఎప్పటికీ నామీద ఇదేప్రేమ చూపగలరా?"
    "సందేహమా! నేనీ మాటలు ఊరికే చెప్పడం లేదు. మనం వివాహం చేసుకుందాం. సరేనా?"
    చంద్రిక ఆనందంతో అతని వేపు చూసింది.
    "ఇంక ఈ జీవితంతో సాధించాల్సిందేమీ లేదు. అటు మంచినటినన్న పేరు, ఇటు మిమ్మల్నివరంగా సంపాదించగలిగాను!"
    "నేనూ అదే అనుకుంటున్నాను చంద్రికా! నిన్ను నా దానిగా చేసుకోగలిగాను! ఈ జన్మకీ అదృష్టంచాలు!"
    "కానీ అందువల్ల మీకేమీ సమస్యలు తలెత్తవూ?"
    "ఏమిటవి?"
    "మీ భార్యకూ మీకూ వివాదాలు....."
    "తప్పదు కదా! అయినా అవేమంత పెద్ద విషయాలు కావు మా మిసెస్ కి చాలావరకూ సర్దుకుపోయే స్వభావం!"
    చంద్రికకు అతనిమాటలు ఎంతో రిలీఫ్ నిచ్చాయి.
    ఆ రాత్రంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ గడిపేశారిద్దరూ.
    మరో పదిరోజుల్లో షూటింగు పూర్తయిపోయింది. ఈలోగా ఇద్దరి మధ్యాపూర్తి సన్నిహితత్వం ఏర్పడిపోయింది.
    మద్రాసు చేరుకున్నాక రెండో రోజున ప్రేమ్ కుమార్ ఆమె యింటికి వచ్చాడు.
    "చంద్రికా! నువు నాకు ఇంత దూరంలో వుంటే నేను భరించలేను. మా యింటికి దగ్గరలో ఓ బిల్డింగ్ ఖాళీ అయింది. అది నీ కోసం మాట్లాడాను. అడ్వాన్సుకూడా యిచ్చేశాను. ఎప్పుడు వచ్చేస్తావ్ మరి అక్కడికి?"
    "సరే! రేపే ఆ ఇంట్లోకొస్తాం" అంగీకరించిందామె.
    "ఇదిగో ఇంటి తాళం చెవి. ఇది ఇంటి నెంబరు- అడ్రసు" కాగితం, తాళం చెవి అందించాడతను.
    మర్నాడే కొత్త ఇంట్లోకి మారిపోయింది చంద్రిక. అది పెద్ద మేడ! ఆధునికంగా, అందంగా కట్టబడింది. అలాంటి ఇంట్లోకి మారాలని తను అనుకుంటూనే వుంది ఎలాగో!
    అక్కడికి అతి సమీపంలోనే వుంది ప్రేమ్ కుమార్ భవనం. తీరిక సమయాల్లో ఎక్కువభాగం తన దగ్గరేవుండటం మామూలయిపోయిందతనికి. చాలామంది నిర్మాతలు తామిద్దరినీ నాయకీ నాయకులు బుక్ చేయడం జరుగుతోంది.
    అందువల్ల తనకు పదిహేను లక్షలు ఇవ్వడానికి కూడా ఎవరూ వెనుకాడడంలేదు.
    సంవత్సరం తిరక్కుండానే బాంక్ బాలెన్స్ యాభైలక్షలు దాటింది.
    తామిద్దరి మధ్యా ఉన్న సంబంధం గురించి కొన్ని చీఫ్ సినిమా పత్రికలు ప్రచురించడం గమనించింది తను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra