అక్కడ కూర్చున్న ఎవరు మాట్లాడుకోవటం లేదు. మౌనంగా కుర్చుని మ్యూజిక్ వింటున్నారు.
చక్రపాణి హాలులో వున్న వాళ్ళని చూస్తున్నాడు. చూడటం అంటే జంతు ముఖాలని చూడటమే.
చక్రపాణి వెయ్యి కళ్ళు చేసుకుని పరిశీలించినా ఒకటి మాత్రం గ్రహించలేక పోయాడు. జంతు ముఖాలు వున్న మాస్క్ లు ఒకే రకంవి ఒక్కరే ధరించటం. ఒకడు గుడ్లగూబ ముఖం తగిలించుకుంటే వేరొకడు కుందేలు ముఖం ధరించాడు, గుడ్లగూబ ముఖం కుందేలు ముఖం అక్కడ ఒక్కొక్కటే వున్నాయి.
అలా ఒక్కటే వుండటానికి కారణం ఇరువురు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు మాస్క్ ముఖాలను కోరుకుని మిగతా వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ఒకే రకంని యిష్టపడి ధరించార? లేక వాళ్ళిద్దరూ స్పెషల్ గా అక్కడ మనుషుల్లో చేరిపోయి ఎవరినన్నా కనిపెడుతున్నారా!
చక్రపాణి ఆ యిద్దరిని కనిపెట్టలేదు. కనిపెట్టినట్లయితే అతని ఆలోచనలు యిలాగే సాగేవి.
రోదన ధ్వని తాలూకా మ్యూజిక్ ఆగిపోయింది. కొత్త మ్యూజిక్ మొదలయింది వెంటనే అరుపులు పెడబొబ్బలు వాటి మధ్య వికృత వికట్ట హాసాలు.
ఊ.... అబ్బ.... అబ్బ.... ఆ... అమ్మా....యిస్..అయ్యో! అయ్యే అయ్యే....
తను తాగిన రెడ్ సూప్ మెదడు మీద పనిచేస్తున్నట్టు చక్రపాణి గ్రహించాడు. లేకపోతె తిక్కతిక్కగా వుండటం ఏమిటి? ఈ తిక్క యింతటితో ఆగుతుందా లేక బ్రెయిన్ తన అధినంలో లేకుండా పోయి.... అలా అయితే తాను చాలా చిక్కుల్లో పడతాడు. శరీర అవయవాలకన్నా మనసు కంట్రోల్లో వుండటం ముఖ్యం.
"అర్జంట్ గా బాత్ రూం కెళ్ళాలి కుదురుతుందా?" గుర్రం ముఖం వ్యక్తితో నెమ్మదిగా అడిగాడు చక్రపాణి.
"మనిషికి కాకపోతే మానుకి వస్తుందా అవసరం మిస్టర్ ఎక్స్! పదండి" అంటూ అతను లేచాడు.
హాలుకి కాస్త దూరంగా ఏటాచ్ద్ బాత్ రూం చూపించడంతో చక్రపాణి ఒక్కడూ లోపలికి వెళ్ళాడు. తలుపు లోపల బోల్ట్ బిగించుకున్నాడు.
చక్రపాణి ఈ హాలులోకి వచ్చేముందు డ్రెస్ మార్చాడు. ఫ్యాంట్ మదతల్లోను షర్టు కాలర్లోను జిప్పు, గుండిలు అవసరినికి ఉపయోగించే సుక్మమైన పరికరాలు వాటిల్లో వున్నాయి. సమయానికి అవి డ్రెస్ మర్చడంవల్ల దగ్గరలేవు. ఒకే ఒక్క ఆయుధం ద్రయరుకున్న బొందు మధ్యలో వున్న చిన్న ప్లాస్టిక్ వైరు.
చక్రపాణి బాత్ రూంలోకి రాగానే ఒకటి గ్రహించాడు. బయట మ్యూజిక్ తాలూకా శబ్దం లోపలికి రావటం లేదు అని.... ఒకసారి బాత్ రూమ్ ని పరిక్ష చేశాడు. అనుమానానికి తవెక్కడా కానరాలేదు. వేగంగా ఫ్యాంట్ విప్పేశాడు, డ్రాయరు ఎలాస్టిక్ ది , అయినా వేరే బొందు
వుంది. ఆ బొందుని తీసి దానిలో వున్న మూరెడు పొడుగు సన్నని వైరుని పైకి తీశాడు.
చక్రపాణి కుడివేపు చాతిమీద వైరు చివరి భాగాన్ని ఆనించి ఓ చేతితో ఇటుపక్క భాగాన్ని నోటిదగ్గరగా వుంచుకుని నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. నిమిషం తర్వాత యధాప్రకారం డ్రాయరు బొందులోకి వైరుని దూర్చి ద్రాయరుకి పెట్టుకున్నాడు. ఫ్యాంటు వేసుకుని బైటికి వచ్చాడు. బాత్ రూమ్ నుంచి. ఇప్పుడు అతని మనసు తేలిగ్గా వుంది.
చక్రపాణి కాస్త తొందరపడ్డాడు. ఈ తొందరపడటం అనేదానిలో రిస్క్ వుంది. ప్రయోజనమువుంది. అతను చేసిన ఆ పనివల్ల ముందు ముందు రిస్క్ లో పడనున్నాడా! ప్రయోజనం పొందనున్నాడా! అది కూడా అతి తొందరలోనే అనుభవంలో తెలియనుంది.
చక్రపాణి బాత్ రూమ్ నుంచి వచ్చి తన స్టానంలో కూర్చున్నాడు. గుర్రం ముఖం వ్యక్తీ యధాస్టానంలో కుర్చుని వున్నాడు. ఎదురుగా మనిషి వున్నడుకదా అని అనవసరంగా మాట్లాడకూడదు. అదేకాక మరో నిబందన కూడా వుంది. థాంక్స్ లాంటి మాటలు అతి మర్యాద పార్మాల్టిస్ యివేవి పనికి రావు.
సాధారణంగా పార్టీ అనంగానే అందరూ కలిసి కబుర్లు జోకులు కలబోసుకుంటూ ఉషారుగా పార్టీలో పాల్గొంటారు. మీటింగ్ అయితే చెప్పింది విని చర్చలోకి దిగుతారు. ఇక్కడ అలాంటిదేమీ లేదు.