నాకేం కావాలి? ఊహూఁ ఏమీ వద్దు. నాకేం కావాలో మీ అబ్బాయిని అడగండి! అయన వచ్చేస్తారు యిప్పుడే. నేను వెళుతున్నాను ఆయన్నదిగి, ఒప్పించి, ఒప్పుకుని, నాకు కావలసింది యివ్వండి!'చప్పున బయటకి వెళ్ళిపోయింది.
ధర్మరాజుగారు "అమ్మాయ్! అమ్మాయ్!" అంటూ పిలిపిస్తున్నా ఆగకుండా వెళ్ళిపోయింది. అయన నిర్ఘాంతపోయి నుంచున్నారు.
గేటుదాటి అటు తిరిగింది సరళ. ఇటు వచ్చాడు ఆదిత్య కనుబొమలు ముడిపడ్డాయి. ఆమె రివ్వున వేల్లోపావుయిమ్ది లోపలకి వచ్చాడు ఆదిత్య. సాలోచనగా "ఎవరు బాబూ ఆ అమ్మాయి?' ప్రశ్నించాడు ధర్మరాజు.
15
'నాగారాజూ! నువ్వు సర్బావిని సరాల్ల్సో విషసర్పాలున్నాయి దేవతా సర్పాలున్నాయి దేవతా సర్పాలుంటాయి. విషసర్పాల్ని చంపెయ్యాలి దేవతా శ్ర్పాలని పూజించాలి నువ్వు ఎంత ఆరాధన చేస్తే అంతగా ఫలిస్తుంది నీ ఆరాధన భక్తీవుండాలి. భావన వుండాలి. అత్రి వుండాలి. అప్పుడే భక్తీ ఫలించేది.
నాగారాజూ! నువ్వు సంధ్యని పెళ్ళి చేసుకుంటానంటున్నావు. ఆమె పూర్వ పూర్వ జన్మలో ఎవరో తెలుసా? గరుఢస్రీ. నువ్వు నగరజువి. మీ యిద్దరికీ జన్మజన్మల వైర్యం వుంది అందుకే ఆమెకి నువ్వంటే అసహ్యం.
వరుసకి నువ్వు బావవి.స్వయాన మేనత్త కొడుకివి కాకపోయిన నువ్వు వేలు విడిచిన మేనత్త కొడుకువే! మీ ముత్తాత, ఆమె ముత్తాత స్వయాన ఒక తండ్రి బిడ్డలు.
నువ్వు ఆమెని పెళ్ళి చేసుకోవడం జన్మహక్కులే!
అయితే మీ వరసలు అడ్డంకి వస్తోంది. ఆమెని గుణచారిని చెయ్యాలనుకుంటుంది విశాలాక్షి. విశ్వేశ్వరానికి యిష్టంలేదు. అతని దైవభక్తి అంత బూటకం. అతనిది చిత్తచాంచల్యం సైకియాట్రిస్టుక్ చూపిస్తే సరిపోయేది.
నలభయ్యేళ్ల వయస్సులో అతనికి కామా ప్రకోచన కల్గింది.మీ అత్తయ్య సామాన్య స్రీ.అతనిది అవధులు లేని కామం. దాని వల్ల అతని మెదడులో నరాలు దెబ్బతిన్నాయ్. అది భక్తీ అనుకుంటున్నారు.
రాజూ!
అసలైన విషయం మరొకటి వుంది.
సంధ్య యిష్టపడుతున్న వ్యక్తి ఆదిత్య. అతనితండ్రి ధర్మరాజు.మనం అటునుంచి నరుక్కుని రావాలి. ధర్మరాజుకి అనారైగ్యం కలిగిద్దాం. ఆదిత్యని భయపడదాం!
తన నాడి జాతకం చదివి, అన్ని విషయాలు క్షుణ్ణంగా చెబుతున్న అతన్ని శక్తిని చూసి అదిరి పోయాడు నాగారాజు.
"గురూ!"
చప్పున అయన పాదాలపై వాలిపోయాడు అతను
'లే' చిరునవ్వుతో అన్నాడు వైద్యనాధన్.
అలాగే పాదాల వద్ద కూర్చున్నాడు నాగరాజు. అభయహస్త ముద్రలో కూర్చున్నాడు నాగరాజు. అభయహస్త ముద్రలో కూర్చున్నాడు వైద్యనాధన్.
'మనిషిని బాధించే మార్గాలు తెలుసా?'
తలాడించేడు రాజు,
"ఇదిగో యిటు చూడు!ఇది బొమ్మ! దీనికి గుండుసూదులు కుచ్చేస్తాను.ఆ మనిషి విలవిలలాడి పోవాలి! పోలీసువాడి దెబ్బలాగ గాయం కన్పించని బాధని కలిగిస్తాయి,రాజూ! ఆక్యుపంక్చర్ వైద్యం తెలుసా! ఎక్కడ నెప్పి వుమ్తుమ్దావు అక్కడ సూది కుచ్చుతారు.
ఓ యినప సూది నేరుగా నరానికి కుచ్చుకుంటే ఆ నరం పెరలైజ్ అవుతుంది చచ్చుబడి పోతుంది కానీ ఆ వైద్య విధానంలో సూది నేరుగా కుచ్చేస్తారు. నరాని స్టిమ్యులేట్ చేస్తారు.
మనదీ అదే విధానం ఇక్కడ సూదుల్ని కుచ్చేద్దాం. తలుచుకుంటే నరాన్ని పార లైజ్ చేద్దాం. లేదా హైస్టిమ్యులేట్ చేసేద్దాం. నరం చచ్ఘుబడుతుంది.లేదా తెవ్రమైన నరాల స్పందన కలుగుతుంది. సర్వీస్ టెన్షన్ తెలుసుకదా! అదే తల నైప్పికి కారణం
రాజూ! పాన్ గాలి రేంజ్ పెరిగే కొద్దీ హాయి, కాని మామూలు గాలి తీవ్రత పెరిగితే_ ఉక్కిరిబిక్కిరవుతాం సుడిగాలిలో చిక్కుకుంటే ప్రాణాన్ని నిలిపే ప్రాణవాయువు చూట్టూ వున్నా ఆ మనిషికి ఊపిరి అందరు విలవిల లాడతారు.
నరాల్ని అలా తీవ్రతకి తెప్పిమ్ద్దాం.
"ధర్మరాజికి తెలుస్తోంది"
'గురూ!' ఆనందముగా అన్నాడు నాగరాజు "ఆదిత్య తండ్రి అనారోగ్యంతో స్తిమితం చెడితే-దానికి కారణం సంద్యగ అనుమానం కల్గిద్దాం దాంతో-
"శభాష్!"అన్నాడు వైద్యనాధన్
జేబులోంచి డబ్బుతీసి యిచ్చాడు రాజు
"దాన్ని 'అమ్మా'పాదాలముందుంచు-మేం డబ్బుముట్టం!"
రాజు భక్తిగా దేవి పాదాలముందుంచాడు డబ్బుని
'వెళ్ళిరా!'
లేచి నుంచున్నాడు రాజు గురూ! నాకు సంధ్య దక్కాలి దక్కి అమ్మవారికి స్వర్ణపుష్పాలతో పూజ చేయిస్తాను' అన్నాడు
చిరునవ్వు నవ్వేడు వైద్యనాధన్
16
'ఏ అమ్మాయి నాన్న!,
"ఇపుడు వెళ్ళిన అమ్మాయి ఆమె పేరు సరళట. నీకు తెలుసట కదా!' అన్నాడు ధర్మరాజు.
అడిత్యకి ఆశ్చర్యం కలిగించింది' అతనికింకా తండ్రికి కనుచూపు వచ్చిన విషయం తెలియదు. తండ్రి ఆ అమ్మాయి పేరు సరళని చెప్పగానే ఆశ్చర్యం కలిగించింది.... ఎందుకంటే....
"నీ మనస్సుకి నచ్చిన స్రీ... వెయ్యేళ్ళ క్రితం నీ భార్యా.... ఇప్పటి స-"
ఉలూచి చెప్పిన మాటలు చప్పున గుర్తుకి వచ్చాయి.
'అయితే! తన జన్మ జన్మల ప్రేయసి సరలనా? సంధ్య కాదా యీ అమ్మాయి ఎవరు?' అనుకున్నాడు మనస్సులో
'ఆదిత్యా!' మళ్ళీ పిలిచాడు ధర్మరాజు.
'ఏమిటి నాన్నా!'