Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 17

   
    దొంగనోట్ల మారకం తమ హొటల్లో జరుగుతోందని మోహన్ అన్నప్పటినుంఛీ ప్రసూన వివిధ ఉద్దేశాలతో కదలిపోతూంది...... సాంబశివం ఐశ్వర్యమంతా ఈ దొంగనోట్లతో సంపాదించినదేనా? సుశీలకు ఈ సంగతి తెలుసా? తెలియదా? తను ఇన్నాళ్ళుగా అనుభవించినదీ, ఇలా సంఘాన్ని మోసం చేసి కూడబెట్టిన సోమ్మేనా?
    దొంగ నోట్ల మారకం తాలూకు లెక్కలన్నీ రాసిన రికార్దు ఈ హోటల్లోనే వుంటుందన్నాడు మోహన్. ఆ రికార్డు ఎలాగైనా సంపాదించి మోహన్ కప్పగించి తన నిజాయితీ నిరూపించుకో గలిగితే .....
    సాంబశివం గదిలోకి ఏ క్షణంలోనైనా వెళ్ళగలిగే స్వాతంత్యం ప్రసూనకు ఉంది.
    ఆ రోజు సాంబశివం వెళ్ళటం గమనించింది. పిల్లిలా అతని గదిలోకి వెళ్ళింది ....... సాంబశివం గదిలో అలమారు లేవి ఉండవు ..... నాలుగు ద్రాయిరులున్న రైటింగ్ టేబుల్ మాతరం ఉంది .,.... ఆ డ్రాయర్ లకు తాళాలున్నాయి . తాళం చెవులున్నా సాధరణంగా సాంబశివం దగ్గరకానీ, ఎక్కౌటెంట్ శేఖర్ దగ్గరకాని ఉంటాయి. సాహసించి శేఖర్ దగ్గరకెళ్ళి "తాళం చెవులు మీ దగ్గరుననాయా?" అంది.
    "ఎందుకు ?" ఎవో లెక్కలు చూసుకుంటూనే అదిగాడు శేఖర్ ........
    సాంబశివంగారు ఓక్ ఉత్తరం అర్జంటుగా టైపు చెయ్యమన్నారు. ఇప్పుడు చూస్తె బల్లమీద లేదు. ఒక వేళ డ్రాయర్ లో పడేశారేమోనని .... ... ..."
    ప్రసూనకు సాంబశివం దగ్గరున్న చనువు ఆవిడకున్న అధికారము తెలిసిన శేఖర్ మరేమీ ప్రశ్నించకుండ తాళం చెవులు ప్రసూనకిచ్చేశాడు. ప్రసూన ఒక్కొక్క డ్రాయర్ లాగి అన్నీ చూస్తోంది ఏవేవో ఉత్తరాలు _ నగ్న స్రీళ ఫోటోలు _ ఎవరెవరివో చిరునామాలు  __ కానీ, రికార్డు కనబడటంలేదు ....... అకస్మాత్తుగా ప్రసూన భుజంమీద చెయ్యి పడింది.
    ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది ప్రసూన.
    పకపక నవ్వింది సుశీల ... ...
    "హమ్మయ్య, నువ్వేనా?"
    "ఆ! నేనే ! ముందు ముఖానికున్న ఆ చేయట తుడుచుకో! ఆ తరువాత కుర్చీలో కూచుని కాకిని మంచి నీళ్ళు తాగు ...... దొంగతనానికి ఒకళ్ళు పనికిరారు. ఇద్దరు కావాలి. నేను గుమ్మందగ్గరుండి లోపలకు ఎవ్వరూ రాకుండా కాపాలా కాస్తాను. నువ్వు నీ పని ముగించు . అప్పుడైనా స్థిమితంగా అసలు సంగాతేమిటో నాకు చెప్పు ......
    ప్రసూన కుర్చీలో కూలబడింది.
    "లాభంలేదు . నువ్వు కాపాలా కాయక్కర్లేదు , నాకు కావలససింది ఇక్కడ లేదు. శేఖర్ దగ్గరుందేమో! ......."
    "ఏమిటది? శేఖర్ దగ్గరున్న మాట నిజమే అయితే నేను తప్పకుండా సంపాదించగలను  ........"
    ప్రసూన సందేహిస్తూ ఆగింది.
    "ఇడియట్ ! నన్నే అనుమానిస్తున్నావా? ఫలితాన్ని అనుభవిస్తావు ....."
    కోపమూ, నువ్వూ కలిపి అంది సుశీల .... ....
    నిష్కల్మషమయిన సుశీల ముఖం చూస్తోంటే ఏ సంగతయినా దాచాలని అనిపించలేదు ప్రసూనకు. మోహన్ చెప్పిందంతా చెప్పేసింది .... .....
    సుశీల ముఖం పాలిపోయింది.
    "అదా సంగతి!" ఆశ్చర్యంగా అంతవరకు అర్ధం కాని దేదో అర్ధంచేసుకుంటున్నట్లు అంది సుశీల .......    
    "ఏమిటి ?" తెల్లబోతూ అడిగింది ప్రసూన .......
    "అంతా చేపుతానులే ! నువ్వు నా దగ్గరా అన్నీ దాస్తావుకానీ. నీ దగ్గర నేనేదీ దాచాను. ఇన్నాళ్ళు శేఖర్ నాకు అర్ధం కాలేదు. ఇప్పుడు విషయం అర్ధమయ్యింది . అదీ సంగతి."
    తనలోతను ఏదో అలోచించుకుంటూ కూర్చుంది షుశీల.

                                          10    
    
    తన వెనుకనుండి కళ్ళుమూసిన సుశీల చేతులు తడిమి "సుశీల!" అన్నాడు శేఖర్ .........
    సుశీల నవ్వి చేతులు వదిలి ఎదురుగా కూచుని "వెంటనే చెప్పుకున్నావే! అంది ......
    "మా ఇంట్లోకి వచ్చి నా కళ్ళు మూయగలిగే సరసులు "సహాసాలూ ఎవరు?"
    "నేను సాహాసినా?"
    "మీ కంటె సాహాసినా ?" దొంగనోట్లు తయారుచేస్తూ దొంగా వ్యాపారం చేస్తున్న.
    ఉలికిపడ్డాడు శేఖర్ ..... పాలిపోయిన ముఖంతో సుశీలను చూస్తూ "ఎవరుచెప్పారు నీకిది ?" అన్నాడు ......
    "వేరు చెప్తేనేంలే? ఇన్నాళ్ళుగా నేనెంత దగ్గర కావాలనుకుంటున్నా , నువ్వు నాకు దూరంగా ఉంటున్నది ఇందుకేనా?"
    శేఖర్ మాట్లాడలేదు .....
    "తెలసి పోతుందేమో అని అనుమానమున్నంత వరకే! తెలిసిపోయాక భయమెందుకు ? చెప్పు ...."
    "మనం మొదటిసారి ఏకాంతంగా నా గదిలో కాల్సుకున్నప్పుడు నువ్వొక మాట అన్నావు గుర్తుందా?"
    సుశీలకు గుర్తుంది .....    
    శేఖర్ మొదట సాంబశివం సుశీలకు పరిచయం చేశాడు .... సుశీల చాలా అరుదుగా హొటల్ కి వస్తుంది. ఆడైనా ప్రసూనకోసం .... అలా వచ్చినప్పుడు ఒకసారి సాంబశివం  దగ్గర శేఖర్ ఉన్నాడు ......
    మా అమ్మాయి __ సుశీల ....." అని ఎంతో గర్వంగా పరిచయం చేశాడు సాంబశివం  .... సుశీలను ఎవరికీ పరిషయం చేసినా అతను గర్వంతోనూ మాట్లాడు తాడు .... అప్పుడు చూసిన శేఖర్ ను సుశీల మరచిపోలేక పోయింది అతను అందగాడే! కానీ ఆమెను ఆకర్షించింది అతని రూపం కాదు .... పైకి ఎంతో వినయంగా సంస్కారం ఉట్టి పడేలా మాట్లాడే శేఖర్ కళ్ళలో కదిలే ఏదో అనుమానం .... ఎక్కడి నుండో .... ఎవరినుండో  తప్పించుకుపోవాలనిపించే తపన ..... అతణ్ణి చూడగానే సుశీలకు మొదట కలిగింది ఆకర్షణకాదు, కుతూహలం! ఆతరువాత కలసి వాళ్ళింటికి వెళ్ళింది .... ఎవరో సరదాగా శేఖర్ ని "నీ పెళ్ళేప్పుడోయ్ !" అన్నారు. "నా పెళ్ళా?" అని నవ్వాడు శేఖర్ ..... ఆ నవ్వులో గూడు కట్టిన విషాదం ఎంతో విచిత్రంగా తోచింది సుశీలకి ..... ఆ విషాదంలో దైన్యంలేదు .... ఆవేదన ఉంది .... సున్నితమైన మనసు విపరీతంగా నలిగిపోతున్నప్పుడు కలిగే ఆవేదన .......

 Previous Page Next Page