హాస్పిటల్ వాతావరణం మిగతా ప్రపంచవాతావరణానికి చాలాకొత్తగా, విపరీతంగా వింతగా వుంటుంది.
    
    రాత్రి అంతా వెలిగే లైట్లు.
        
    సదామందుల వాసనతో నిండిన గాలులు-కొంతసుకుమార హృదయులకి వెగటు అనిపిస్తుంది.  

 

    కానీ-ప్రపంచంలో మానవుడికి కష్టాలు దాపురించినప్పుడు అతడికి రంగు, రుచి, వాసనతెలీదు.
    
    కొత్త ఊరయితే చెట్టుకింద అయినా పడుకుంటాడు. ఆ సమయంలో సుఖమనేప్రశ్నలేనేలేదక్కడ.
    
    బజారుకొళాయి నీళ్ళయినా త్రాగుతాడులేదా ఏ దిగుడు బావిలోనేచేదబావిలోనే ఏమైనా సరే. పల్లెటూర్లో కమ్మని గేదెపాలతో చిక్కని డికాక్షనుతో మందులు కలపక అచ్చమైన రుచిగల్గిన నీటితో చేసిన కాఫీ త్రాగిన ఆ మానవుడు, అవసరం వస్తే రోడ్డు మీద తిరుగుతూ కాఫీ అమ్మేవారి దగ్గర అమృతంలాగా తాగుతాడు ఆ కాఫీని.
    
    అక్కడ కమ్మని గేదె పెరుగు ఘుమఘుమలాడే నేతితో రుచివోడేకూరగాయలతో ముత్యాలవంటి బియ్యంతోచేసిన అన్నముతిన్న ఆ మానవుడు-హోటల్లో ఉడికీ ఉడకని అన్నం-రుచివచ్చిన కూరగాయలతో చేసిన నంజుళ్ళు-వాసనలేనిడాల్డా కలిపిన నెయ్యిలాంటి పదార్ధం-పొడి పాల పెరుగు-
    
    శివశివా! తలుచుకుంటేనే వెగటనిపించే ఆ తిండిని-ఆవురావురని తినీతినక-కార్యావసరాలతో ఏమి గమనించుకోకుండా వెడతాడు-అవసరం అలాంటిది.
    
    ఆదిమానవుడిని గడ్డికూడా తినిపిస్తుంది. సామాన్యమైనరోజుల్లో వెగటువేసినమందుల వాసన అప్పుడతనికి- సుగంధపు సువాసనలని వెదజల్లుతుంది.
    
    రాత్రి సుమారు 11 గంటలు దాటింది-ఆపరేషన్ థియేటరు నుంచి బయటకురాని సారధికోసం ఎదురుచూస్తూ బయటకారిడార్ లో కూర్చుంది గీతాంజలి ఎత్తైన ఆ రెండంతస్థులభవనంలో-చుట్టూ అల్లుకున్న సన్నజాజితీవలు నిండుగాపూసి ఆ జాజులు సుగంధం మెల్లమెల్లగా వీస్తోంటే వాటికితోడు మరో వేపు మందులవాసన నా ముక్కు పుటాల్ని భేదిస్తోంది.
    
    చిత్రవిచిత్రమైన అనుభూతులు కలిగించే వాతావరణం హాస్పిటల్ వాతావరణం.
    
    అక్కడే నరకంవుంది కొందరికి. అక్కడే స్వర్గం వుంది కొందరికి స్వర్గం, నరకం తోడునీడగా ఆదుకునిపాడుకున్న స్థలం హాస్పిటల్.
    
    విసుగ్గాలేచి నిలబడి, పచార్లు చేయసాగింది.
    
    హద్దులేని వరదలాగా హద్దూపద్దూ లేకుండా ఆలోచనలు రాసాగాయి.
    
    "వేర్ ది మైండ్ ఈజ్ విథౌట్ ఫియర్    
    
    వేర్ ధీ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ-'
    
    ఓహ్!
    
    ఎంతటిసుభావుకతా సీమలో విహరించాలనుకున్నాడు.
    
    పిచ్చివాడైనాకవి హృదయం పోలేదు-
    
    పాపం!
    
    దైవోపహతుడు-
    
    ఒంటికంటితో భగవానుడు చూసిన చూపుకి వక్రగతిపట్టింది జీవితం-
    
    తిరిగి ఆ దేవుడు ఏనాడు తెరుస్తాడో ఆ కన్ను--లేకపోతే-
    
    శాశ్వతంగా మూసేస్తే-
    
    ఝల్లుమన్నాయ్ గుండెలు--
    
    భగవాన్! అలా కానీకు-
    
    అతనెవరైనా కానీ నా వల్లనే రెండుసార్లు-
    
    సహజంగా అనుకోకుండా రెండవసారి అనుకోనిప్రమాదం జరిగింది. ఏదో ఈ ఆపదనుండి గట్టునపడితే.
    
    గట్టునపడినా--
    
    పిచ్చివాడేకదా?
    
    భగవానుడు ఒంటరిగా ఆడుకునే ఈ చదరంగంలో మామూలు మానవులుకాల్బలమైతే పిచ్చివాళ్ళు గుర్ర్రాలు-
    
    ఒకనిర్ణీతమైన నడకలేదు-
    
    ఏదోచిత్తం వచ్చినట్టు నిర్ణీతంగా సాగుతారు.
    
    నిర్దిబుద్ధ నిబద్దమైన జీవితాలు వాళ్ళవి-
    
    మనసు ఆడదు-
    
    బుద్ది పాడదు.
    
    మనసూబుద్దీ రెండూ కలిసిపాడుతూ ఆడతాయ్-
    
    హృదయం కలియని పాట-
    
    మనసు తెలియని ఆట-
    
    గొంతు సాగినట్లు మాట-
    
    కాలుసాగినట్లు పాట-
    
    ఏమిప్రపంచం?-
    
    హఠాత్తుగా ఆలోచనలకి బ్రేకువేసుకుంది.
    
    "అనవసరంగా ఎవరో ఓ వ్యక్తి అతని అజ్ఞానం వలన, అవివేకం వలన అతనేదో ఆపదని కొనితెచ్చుకుంటే అందులో తన దోషం ఏముంది? తనెందుకు బాధపడాలి?'
    
    నిజంగా దోషం తనలో లేదా?
    
    ఏమో! ఉందోలేదో తనకేం తెల్సు?
    
    బాధ ఎందుకు పడాలి తను?
    
    బాధ అనేది ఒకరు పడితే వచ్చేదా? వద్దనుకొంటే పోయేదా? అర్ధంలేని ఆలోచన కాకపోతే?
    
    ఆలోచనల్ని ఆపుకుని కూర్చుంది.
    
    మరో పది నిమిషాలు గడిచాయి-కాలాన్ని ఎప్పుడూ మానవులనుండి తీసుకుని భగవానుడి పరం చేస్తూ వుంటుంది విధి-
    
    విధి ఆడుకునే కూడికలు, తీసివేతల లెక్కల్లో మరి పది నిమిషాలు కలిశాయి.
    
    అందులో తీసివేత అనే శీర్షికేలేదు-
    
    ఎప్పుడూ కూడికే-
    
    ఇవ్వటం తీసుకోవటం అనేది అన్నిటికీ అందరికీ సహజంకాదు-
    
    కొందరు సూర్యభగవానుడిలో వస్తువుల నుండిరసాల్ని గ్రహించి, తిరిగి ఆరసాల్ని వస్తువులకి ఇచ్చినట్టు ఇస్తారు. మరికొందరు ఇవ్వకపోగా-అగ్ని దేవుడిలా తీసుకోవడం మాత్రం ఎరుగుదురు. అందుకే ఆయన 'సాహా వల్లభుడు'
    
    వాకిలి తెరుచుకుంది.
    
    డాక్టరుగారు, సారధి బయటికివచ్చారు.
    
    వారివెంట మౌనంగా తనూ డాక్టరుగారిగదిలోకి వెళ్ళింది గీతాంజలి.
    
    కుర్చీలో కూర్చుంటూ వాళ్ళనీ కూర్చోమని ఫాన్ వేసి సిగరెట్ ముట్టించుకుని అన్నాడు.
    
    "సారీసార్! చాలా రక్తం కారిపోయింది. దెబ్బ బాగా బ్రెయిన్ మీద తగిలింది. బహుశమనిషికి మతి చలించవచ్చు "సారధి చిత్రంగా చూశాడు.
    
    "నిజం! అతనికి బలమైనదెబ్బ తగిలింది. మెదదు మీద నూటికినూరుపాళ్ళు మతిచలించే అవకాశంవుంది" ఆయన మాటలకి అడ్డొస్తూ అన్నాడు సారధి.
    
    "అదికాదు డాక్టరుగారూ! నిజంగా అతనికి మతి చలిస్తుందంటారా?"    

 

    "తప్పకుండా! సామాన్యంగా నా అంచనా తప్పిపోదు"
    
    భయంవేసింది గీతాంజలికి.
    
    "ఏమిటి అపశకునం మాటలు. డాక్టరుగారు ఇలాగేనా మాట్లాడవలసింది"
    
    బయటికి రాబోయిన మాటల్ని మనసులోనే బంధించింది.
    
    "ఒకచిన్న సందేహంసార్"
    
    సారధివైపు చిత్రంగా చూసి అన్నాడు.
    
    "అడగండి"
    
    "ఇంతకుపూర్వమే మతి చలించివుంటుందనుకోండి ఇప్పుడు మతి మళ్ళీచలించే అవకాశంవుండటం వలన ఒకవేళ అలా జరిగేట్టయితే అతని మతి బాగుపడవచ్చంటారా?"   

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra