Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 17


    "హిలైక్స్ మీ సో మచ్. నాకే భయం వేస్తూంటుంది అప్పుడప్పుడు! నా పేరు మీద వైజాగ్ లో ఓ ఇల్లురాసేశాడు. ఈ కొబ్బరితోటానాకు కొంచెం జ్వరం వచ్చిందంటే చాలు ఎంత ఆధుర్ధానో! అన్నీ బాగానే వున్నాయ్ కానీ ఒకే వీక్ నెస్."
    సురేష్ ఆదుర్దాగా చెవులు రిక్కించాడు.
    "ఏమిటది?" అడిగింది తులసి.
    మాయనవ్వింది.
    "అదే.....ఈమగరాయుళ్ళకుండేది"
    సురేష్ అదిరిపడ్డాడు.
    "మైగాడ్! ఉన్న ఇద్దరు చాలకా?"
    "మా ఇద్దరికీ అక్కడే పేచీలొస్తుంటాయ్" అతనిమాటలు పట్టించుకోకుండా చెప్పిందామె.
    "నన్నడిగితే పేచీలనవసరం అంటాను! ఎందుకంటే మగాడి సైకాలజీయే అలా ఉంటుంది. గాడ్స్ క్రియేషన్!" సమర్ధిస్తూ అన్నాడు.
    తులసి హేళనగా చూసింది.
    "అలాగా! ఆడాళ్ళు కూడా అలా ప్రవర్తిస్తే ఎలా వుంటుంది!"
    "ఇప్పుడు ప్రవర్తించటం లేదని ఎవరన్నారు? కాకపోతేమావి బయట పడిపోతాయ్.....మీవి మూడో కంటపడవ్!"
    మాయకల్పించుకోక తప్పలేదు.
    "ఆఖరికి మీరు మగాడనిపించేశారా! ఆడాళ్ళు అన్ని రంగాల్లోనూ మగాళ్ళు నిర్వహించే సోప్స్ అన్నీ సమర్ధంగా నిర్వహిస్తూ మగాళ్ళకు దెబ్బకొడుతున్నారని ఉక్రోషం!"
    "అయామ్ వెరీసారీ! నన్ను మీరిద్దరూ అపార్ధం చేసుకున్నారు కాబట్టి నేనో స్టేట్ మెంట్ ఇవ్వకతప్పటంలేదు......." గంభీరంగా నటిస్తూ అన్నాడు.
    "ఏమిటా స్టేట్ మెంట్?"
    "మగాళ్ళపొజీషన్స్ అన్నీ ఆడాళ్ళు ఆక్యూపయ్ చేస్తున్నమాటనిజమేగానీ మగాళ్ళు మాత్రం విరామం లేకుండా రాత్రింబగళ్ళు కొత్త ఓపెనింగ్స్ కోసం వెతుకుతూనే వుంటారు. విజయంపొందుతూనే వుంటారు....."
    మాయ, తులసి మొఖాలు చూసుకున్నారు.
    "ఇదా! పెద్ద స్టేట్ మెంట్ ఇస్తానన్నావ్?" ఎగతాళిగా అంది తులసి.
    మాయ ఆలోచనలో పడింది....
    "మీ స్టేట్ మెంట్ లో ఏదయినా 'మాయ' ఉందేమో ఆలోచిస్తున్నాను" అంది నడుస్తూ.
    అందరి స్విమ్మింగ్ ఫూల్ దగ్గరకు చేరుకున్నారు.
    అది చూస్తూనే ఆశ్చర్యపోయాడతను.
    "నిజంగానే మీ ఎస్టేట్ మయసభలాగానే వుంది. ఎక్కడో మారుమూలన్న ఈ నర్సాపూర్ లో స్విమ్మింగ్ ఫూలా?"
    "చెప్పానుకదా! యాడ్ ఫిలిమ్స్ కి, నాకూ ఉపయోగపడవచ్చని మహీధర్ ఏర్పాటు చేశాడు...." మాయ చెప్పింది.
    "అయితే నేను తులసీ కూడా మిగతా జీవితమంతా ఇక్కడే మీతో గడపబోతున్నాం..... ముగ్గురం ఆనందంగా, స్విమ్మింగ్ చేస్తూ.....ఆడుకుంటూ...."
    ముగ్గురు ఇంటికి చేరుకుంటూండగా హఠాత్తుగా ఆగిపోయింది మాయ.
    "మైగాడ్! మరీ అంత ఘోరంగా మాట్లాడతారామీరు?"
    తులసీ సురేష్ ఆశ్చర్యపోయారు.
    "ఏ విషయం మీరంటోంది?" అడిగాడు.
    ఆమె ముఖం ఎర్రగా అయిపోయింది.
    "అదే....ఆ స్టేట్ మెంట్.....ఛీ! తులసి చెప్తే అబద్దమనుకున్నాను...."
    తులసి చప్పున గ్రహించుకుని అతి కష్టం మీద నవ్వాపుకుంది.
    "ఇదే తలనొప్పి ఈ కాండిడేట్ తో..."
    "మాట మార్చకు! అది వరకు నడుమునొప్పి అని మళ్ళీ ఇప్పుడు తలనొప్పి అంటావేం?" కోపంగా అన్నాడు.
    ముగ్గురూ పోర్టికోలో నిలబడ్డారు.
    "ప్రభా!" పిలిచింది మాయ.
    వంటామెబయటికొచ్చింది.
    "ఏంటండీ!"
    "వీళ్ళకు 'టీ' తెచ్చివ్వు! ఆ టేప్ రికార్డర్ కాసెట్స్ కూడా ఇవ్వు!"
    "ఆయ్! అలాగేనండీ!"
    ఆమె వెళ్ళిపోగానే మాయ లేచి నిలబడింది.
    "నేను టౌన్ లో కెళ్ళివస్తాను."
    "ఎందుకు?" అడిగింది తులసి.
    "పెళ్ళి ఏర్పాట్లు చేయవద్దు?"
    మోపెడ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది.
    ప్రభటేప్ రికార్డర్ తెచ్చి సురేష్ ముందుంచింది. ఎక్స్ టెన్షన్ వైర్ కి తనే కనెక్షన్ కూడా ఇచ్చేసింది. ప్లే నొక్కగానే స్టీరియో సౌండ్ తో ఇంగ్లీషు కాసెట్ శ్రావ్యంగా వినపించసాగింది.
    "లోపలిగదిలో కూర్చుని విందాంపద"
    "ఎందుకు ఇక్కడే వినవచ్చుగా"
    "వినవచ్చననుకో! కానీ మీ అక్క గదిలో అద్దాలున్నాయ్ కదా సీలింగ్ లో.....ఆ అద్దంలో చూస్తూ పాటలు వింటూ....."
    "ఇదిగో.....నీకుముందే చెప్తున్నాను. ఇక్కడున్నన్ని రోజులుపిచ్చివేషాలేయకు....."
    వ్వాట్ పిచ్చివేషాలా? అంటే ఏమిటివి?"
    "అదే...ఎక్కడపడితే అక్కడ మీద కొచ్చేయటం, మీదకు లాక్కోవటం......మనం ఇంకొకరింట్లో ఉన్నప్పుడు వాళ్ళకు గౌరవం ఇవ్వాలి!"
    "ఓ! అదా అర్ధమయింది. నీ బదులు మీ సిస్టర్! అంతేకదా! కానీ మీ అక్క వప్పుకుంటుందంటావా?"
    "దేనికి?"
    "నేనిచ్చేగౌరవం తీసుకోవటానికి అవునూ! ఆమెకు గౌరవం ఆమె రూమ్ లో ఇవ్వాలా, అవుట్ హౌస్ లో ఇవ్వాలా?"
    "సురేష్...." నవ్వూ, చిరాకూ....
    "ఆల్ రైట్......పదలోపలికెళదాం!"
    తులసి టేప్ రికార్డర్ తీసుకుని మాయ గదిలోకి నడవసాగింది.
    గది గడపలో హఠాత్తుగా ఆగేసరికి సురేష్ ఆమె మీదకు వంగిపోయాడు.
    తులసి విసుగ్గా చూసిందతనివొంక.
    "సురేష్! ఇలావెనుకే నన్నంటుకునినడవడం కూడా ఇక్కడున్నన్నిరోజులూ కట్టిపెట్టాలి....."
    "ఆల్ రైట్!"
    "లోపల అసభ్యంగా నాతో ప్రవర్తించేట్లయితే నేనసలు రాను"
    "అబ్బే! కేవలం ఎంజాయ్ చేద్దాం......హాయిగా ఆ మంచాల మీద పడుకుని...."
    "ఒకవేళ ఆ మ్యూజిక్ బోరుకొడితే"
    "అప్పుడే నువ్ డ్రస్ చేసుకుని బయటకెళ్ళిపోవచ్చు..."

 Previous Page Next Page