"అయితే నాకు వందరూపాయలివ్వు- స్కూలు కెళ్తా" అన్నాడా కుర్రాడు.
"వందరూపాయలే! మా చిన్నతనంలో మేము అయిదు రూపాయలకంటే ఎక్కువ అడిగే వాళ్ళం కాదు! తెలుసా?"
ఓకే డాడీ- అయితే అయిదు నోట్లు ఇరవై ఇవ్వండి-"
"నువ్వూ- మా అమ్మా ఇంత కలివిడిగా కలసి ఉంటారనుకోలేదు సోనీ! అందరు అత్తాకోడళ్ళలాగా గొడవ పడతారేమో నని భయపడ్డాను" అన్నాడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ ఇండియన్ తన భార్యతో.
"భలేవారే - నేనెందుకు గొడవపడతాను? ఇక్కడ బేబీ సిట్టర్ ఎంత ఖరీదో నాకు తెలియకపోతే కదా!"
కొత్తగా పెళ్ళయిన జంట సిటీలో కాపురం పెట్టారు. ఓ రోజు భర్త ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి భార్య ఏడుస్తూ కనిపించింది.
"ఏం జరిగింది?" కంగారుగా అడిగాడతను.
"మా అమ్మరాసిచ్చిన వంటల చిట్కాల పుస్తకం ఉపయోగించి కేక్ తయారు చేశాను- తీరా అది కాస్తా మన పిల్లి తినేసింది-"
"ఓశ్ ఇంతేనా? డోంట్ వర్రీ! దాని ఆయుష్షు అంతవరకే ఉందనుకో! అయినా ఈ సారి అరడజను పిల్లిపిల్లల్ని తెస్తాలే! ఎందుకయినా మంచిది నువ్ ఆ వంటల పుస్తకం ఫాలో అయి ఏదొక వంటకం చేస్తూనే ఉంటావ్ కదా!"
ఓ డాక్టర్ తన పేషెంట్ ని ఎగ్జామిన్ చేశాడు.
"చూడండి మిస్టర్! మీకు కొంచెం ఎక్సర్ సైజ్ అవసరం - ఓ పని చేయండి! రోజూ ఆ కొండమీద బార్ లో స్ట్రిప్ డాన్స్ లు చూడండి! చాలు-"
"అదేంటి? స్ట్రిప్ డాన్స్ లు చూస్తే ఎక్సర్సయిజ్ ఎలా అవుతుంది?"
"ఆ కొండ ఎక్కడానికి నలభై నిమిషాలు పడుతుంది కదా! ఆ ఎక్సర్సయిజ్ చాలు-"
"నేను కొంతకాలం ఆఫ్రికా అడవుల్లో సఫారి కెళ్ళాను- అక్కడ చాలా పెద్ద పులులను షూట్ చేసేశాను" గొప్పలు చెప్పాడో వేటగాడు.
ఎదురుగ్గా వున్న వ్యక్తి అనుమానంగా చూశాడు.
"ఆఫ్రికాలో పెద్దపులుల్ని షూట్ చేశావా? ఆఫ్రికాలో అవి ఎక్కడున్నాయ్ అసలు?"
"నేను చెప్పేదదే కదా! అన్నిటినీ నేను షూట్ చేసి పారేశాక ఇంకెక్కడుంటయ్?"
ఇద్దరు లాయర్లు ఓ కోర్ట్ కేస్ గొడవలో ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు.
"అరేయ్- నీ బ్రతుకెవడికి తెలీదురా? నీ ఆపోజిట్ పార్టీ దగ్గర లక్షలు తినేసి నీ స్వంత క్లయింట్ ని ముంచేశావ్ కాదురా లుచ్చా-"
"నీ సంగతి ఎవడికి తెలీదు బే! నీ క్లయింట్ నీ నువ్వే ఓడిపోయే స్థితికి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలుసురా దగుల్భాజీ"
"నువ్ నీచ్ కమీనే కుత్తేవిరా"
"నువ్ జటాచోర్ మాదచ్చోద్ వి రా"
కాసేపు వాళ్ళను తిట్టుకోనిచ్చాక జడ్జీ "ఆర్డర్ ఆర్డర్" అంటూ అరిచాడు.
"మీ ఇద్దరూ ఒకరి నొకరు పరిచయం చేసుకోవటం జరిగింది కాబట్టి ఇంక కేస్ గురించి వాదనలు ప్ర్రారంభించండి!"
జడ్జీగారు బోనులో నిలబడ్డ ముద్దాయి వేపు జాలిగా చూశాడు.
"చూడవోయ్ - మీ లాయర్ కి జ్వరంగా ఉండి కోర్టుకి రాలేకపోయాడంటున్నావ్! ఓ.కే. వప్పుకుంటున్నా - కానీ మీ లాయర్ వచ్చినా నీకేం లాభం? సాక్ష్యాలన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయ్! ఆఖరికి నువ్ కూడా మర్డర్ చేసినట్లు వప్పుకున్నావ్! ఇప్పుడింక మీ లాయర్ వచ్చినా నిన్నెలా రక్షించగలడంటావ్?" అడిగాడు జడ్జీ.
"అదేసార్- నాకూ తెగ సస్పెన్స్ గా ఉంది! ఖచ్చితంగా నేను నిర్దోషినని రుజువు చేస్తానంటున్నాడు మరి! అదేంటో చూద్దామని..............."
కంగారుపడుతున్న ఓ పేషెంట్ కి డాక్టర్ ధైర్యం చెప్తున్నాడు.
"నువ్వేం గాబరా పడనక్కర్లేదోయ్- ఈ ఆపరేషన్ చేసుకునే ప్రతి ఆరుగురిలో అయిదుగురు పోతారని నేను చెప్పిన మాట నిజమేగానీ ఆ అయిదుగురూ ఇప్పటికే పోయారు - నువ్ ఆరో వాడివి. కాబట్టి నీకేం ఢోకా లేదు- బి హాపీ- ఏదీ ఒక్కసారి నవ్వు- నవ్వవయ్యా!"
ఓ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది అంతా విచారంగా ఉన్నారు. అందుక్కారణం నెల రోజుల్నుంచి నేరాలు లేవు, మానభంగాలు లేవు, మర్డర్స్ లేవు- ఆఖరికి లారీల వాళ్ళు సమ్మె చేయటం వల్ల ట్రాఫిక్ కూడా లేదు.
"ఇలాగయితే అందరం ఛావటం ఖాయం! వట్టి జీతాలతో ఎన్నాళ్ళని బ్రతుకుతాం?" ఓ కానిస్టేబుల్ అన్నాడు.
ఇన్ స్పెక్టర్ అందరికి ధైర్యం చెప్పాడు.
"మీరేం వర్రీ అవకండి! మనుషుల మీద నమ్మకం ఉంచండి! ఎక్కువ కాలం వాళ్ళు ఇలాగే ఉండాలన్న ఉండలేరు-"
ఓ పనిపాటాలేని టీవీ ఛానెల్ జర్నలిస్ట్ ఏమీ న్యూస్ దొరక్క కార్లో ఒక చిన్న ఊరు చేరుకున్నాడు.
ఊరు చిన్నదే అయినా ఓ పోలీస్ స్టేషన్ కనిపించింది.
వెంటనే పోలీస్ స్టేషన్లోకెళ్ళాడు.
"మీరిక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు?" సబ్ ఇన్ స్పెక్టర్ ని అడిగాడు జర్నలిస్ట్.
"మొత్తం నాతో కలిపి నలుగురు-"
"కానీ నలుగురికి సరిపడా పనేముంటుందిక్కడ?"
"ఒక్కరికి కూడా పని ఉండదు-" వప్పుకున్నాడతను.
వెంటనే టీవీ జర్నలిస్ట్ ఉత్సాహంగా దాన్ని గొప్ప లైవ్ న్యూస్ ఐటెమ్ చేయడానికి ప్రయత్నించాడు.
కెమెరావైపు తిరిగి "చూశారా- ఇంత చిన్న ఊళ్ళో నలుగురు పోలీసులు పైగా హోమ్ మినిష్టర్ పోలీస్ సిబ్బంది తక్కువగా ఉన్నారు అంటూ లెక్చర్లిస్తున్నారు- ఈ నలుగురు పోలీసులకూ అయ్యే ఖర్చంతా ఎవరు భరిస్తారు? మన ప్రజలు, ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతోందో చెప్పడానికి ఇదొక మచ్చుక-" అని రికార్డు చేస్తూంటే సబిన్ స్పెక్టర్ అతని భుజం తట్టాడు.
"చూడు! మా నలుగురికి సరిపోయినంత పనిలేదు- నిజమే! కానీ మా నలుగురినీ తీసేసి చూడు! పాతికమంది పోలీసులకు సరిపడే పని వస్తుంది!"
ఒక లాయర్ హాపీగా ఉన్నప్పుడు తన చిన్నతనం గురించి తన క్లయింట్స్ కి చెప్తున్నాడు.
"మీకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు! చిన్నప్పుడు నేను పెద్దయ్యాక ఓ పెద్ద దోపిడీ దొంగ నవ్వాలని ఎంతో ఉత్సాహపడేవాడిని!"
"కంగ్రాచ్యులేషన్స్ సార్! అనుకున్నది సాధించారు" అన్నాడు ఓ క్లయింట్ పొగుడుతూ.
బాగా పేరున్న ఓ టైలర్ దగ్గర బట్టలు కుట్టించడానికొచ్చాడు ఓ వ్యక్తి.
"ఈ నాలుగు జతలూ కుట్టడానికి ఎన్ని రోజుల టైమ్ తీసుకుంటావ్?" అడిగాడావ్యక్తి.
"రెండు నెలలు సార్!"
"వ్వాట్? రెండు నెలలా? ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి దేవుడి కెన్ని రోజులు పట్టిందో తెలుసా? ఆర్రోజులు! నీకు నాలుగు జతలకు రెండు నెలలు కావాలా?"
"ఆర్రోజుల్లో తయారు చేసిన ఈ ప్రపంచం పరిస్థితేమిటో ఒక్కసారి చూడండి! నన్నూ అలా ఇష్టం వచ్చినట్లు వర్క్ చేయమంటారా?"