Home » D kameshwari » Subhodayaam


    మాధవ్ కూర్చున్నవాడు లేచి నుంచుని "ఎందుకూ ఫరవాలేదు, యింకా ఐదు నిముషాలలో అయిపోతుంది" అన్నాడు.
    మాధవ్ లేచి నుంచోగానే ఒకడు అతివేగంగా మాధవ్ ఏం జరిగిందో ఊహించేలోగా గడ్డంకింద ఒక్క గుద్దు గుద్దాడు. ఏమరుపాటుగా వున్న మాధవి వెల్లకిలా పడ్డాడు. రాధ కెవ్వుమనబోయింది. ఒకడు చటుక్కున రాధ నోరు మూసి రెండుచేతుల మధ్య రాధని కదలకుండా పట్టుకున్నాడు. మాధవ్ కి ఆ ముగ్గురూ గుండాలని అర్థమయి లేవబోతుంటే పొట్టలో ఒకటి గుద్దాడు. ఆ దెబ్బకి మాధవ్ తట్టుకోలేక పొట్టపట్టుకు కూలబడిపోయాడు. రాధ అరవబోయింది. నోరు నొక్కేసి గింజుకుంటున్న రాధని మరింత గట్టిగా బిగించి పట్టుకున్నాడు. కిందపడిన మాధవ్ ని ఇష్టంవచ్చినట్లు ఎడాపెడా నాలుగైదు దెబ్బలు కొట్టడంతో మాధవ్... ఆ తాకిడికి తట్టుకోలేక ప్రతిఘటించలేక చలనరహితంగా వుండిపోయాడు.
    మూడోవాడు చకచక మాధవ్ జేబులు వెతికి పర్సు, వాచి తీసుకుని నోట్లో ఒక రుమాలు కుక్కి, యింకో రుమాలుతో చేతులు వెనక్కి కట్టి మాధవ్ ని రోడ్డుపక్కకి లాగేసాడు. స్కూటర్ చెట్టుపక్కకి లాగాడు. ఒకడు రాధని పట్టుకుంటే మరోడు రాధవంటినున్న నగలన్నీ ఊడలాగి జేబులో వేసుకున్నాడు. వాచీ కూడా విప్పేశాడు. రాధకి భయంతో బాహ్యస్మృతి పోయింది. కళ్ళముందు మాధవ్ చావుదెబ్బలు తిని పడిపోవడం చూసి భయంతో ఆమె నిశ్చేష్టురాలైంది. వస్తువులు లాక్కుంటూంటే నగలకోసం యింతపని చేస్తున్నారని నగలన్నీ తీసేసుకోండి, తీసుకుని వదిలిపెట్టండన్నట్టు చేతుల జోడించి సౌంజ్ఞచేసింది. అంతవరకు కేవలం డబ్బు, నగలు దొంగతనంచేసే ఉద్దేశం వున్నా గుండాలు ఆ వెన్నెల వెలుగులో తెల్లచీరతో మెరిసిపోతున్న రాధని చూడగానే వాళ్ళ మనసులో అప్పటికప్పుడు కొత్త ఆలోచన మెదిలింది. ముగ్గురూ కూడబలుక్కున్నారు. కాళ్ళు చేతులు కొట్టుకు గింజుకుంటూన్న రాధని ముగ్గురూ రోడ్డుపక్క ఖాళీస్థలంలో చెట్లచాటుకి తీసుకెళ్లిపోయారు. జరిగే ఘోరం చూడలేనన్నట్టు చంద్రుడు మబ్బులచాటుకి వెళ్ళిపోయాడు. సగం సగం స్మారకస్థితిలో వుండి జరుగుతున్నది చూడక తప్పలేదు మాధవ్ కి. కదలలేక, అరవలేక, వళ్ళంతా చితికిపోయి ముక్కులోంచి రక్తం కారిపోతూంటే రాధపై జరుగుతున్న అత్యాచారాన్ని ఏ విధంగానూ ఆపలేని మాధవ్... కొంతసేపటికి పూర్తిగా స్పృహ కోల్పోయాడు.


                          9


    తెల్లవారేసరికి ఊరు ఊరంతా ఈ వార్తతో గుప్పుమంది.
    రోడ్డుపక్కన పడివున్న భార్యాభర్తలని ఎవరో లారీవాళ్లు చూసి తీసికెళ్ళి ఆస్పత్రిలో పడేశారు. మాధవ్ కి మోపయిన గాయాలు తగిలాయి. ఎడంచెయ్యి విరిగింది. ముక్కులోంచి చాలా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. రాధని ఘోరంగా మానభంగం చేసినట్లు డాక్టర్లు గుర్తించారు. పోలీసులకి కంప్లయింట్ యిచ్చారు.
    ఉదయం ఆరుగంటలకి ముందుగా రాధకి తెలివి వచ్చింది. ఆమె శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ దెబ్బతినడంతో షాక్ కి తెలివితప్పింది. తెలివివస్తూనే మాధవ్, మాధవ్ అంటూ కలవరించింది. పూర్తిగా తెలివివచ్చి జరిగింది గుర్తురాగా భోరున విలపించింది. "మాధవ్ మాధవ్... మాధవ్ ఏడి... నన్ను చూడనీండి" అంటూ డాక్టర్లు వారిస్తున్నా వినకుండా అతని దగ్గిరకి తీసికెళ్ళేవరకు వూరుకోలేదు.
    మంచంమీద వంటినిండా కట్లతో తెలివిలేకుండా పడివున్న మాధవ్ ని చూస్తూనే అతనిమీద వాలిపోయి ఏడవసాగింది. మాధవ్ కి రక్తం ఎక్కిస్తున్నారు కదల్చకూడదని ఆమెని నర్సులు బలవంతంగా లేవదీసి తీసికెళ్ళిపోయారు. "ఉహు. నన్ను వదలండి, మాధవ్ ని వదిలి నేనుండను. నన్నిక్కడే వుండనీయండి" అంటూ పక్కనే వున్న కుర్చీలో కూలబడింది. ఆమె అసలు నించోలేని స్థితిలో వుంది. కాళ్ళు వణుకుతూ, కళ్ళు తిరుగుతున్నట్టున్నా బలవంతంగా కూర్చుంది.
    ఈలోగా పోలీసులు వచ్చి వివరాలు అడిగారు. తమ పరువు, ప్రతిష్ట అన్నీ మంటగలిపిన ఈ దుర్ఘటన గురించి చెప్పకుండా వుండలేని పరిస్థితిలో పడింది. ఎవరికీ తెలియకుండా జరిగితే తమలో తాము బాధపడవచ్చు. తెలివి తప్పిన స్థితిలో ఆస్పత్రిలో చేర్చాక, పోలీసు కేసయ్యాక వివరాలు ఎలా దాచగలరు? మానభంగం జరిగిన అవమానంకంటే... దాన్ని గురించి నలుగురిముందు వెల్లడించుకోవడం... ఊరూ వాడా ఈ సంగతి తెలియడం, పేపర్లలో వార్తలు వస్తాయి. శరీరానికి జరిగిన అవమానభంగం కంటే నలుగురిముందు బతుకు బట్టబయలు అయిన 'మానభంగం' ఎక్కువ కష్టం కల్గించింది రాధకి. చెపుతూ చెపుతూ ఇన్ స్పెక్టర్ మొహం చూడలేక, డాక్టర్ మొహం చూడలేక తలదించుకుని కన్నీళ్లు కారుస్తున్న రాధని చూసి లేడీ డాక్టర్ ఓదార్పుగా భుజంతట్టి "టేకిట్ ఈజీ... వుయ్ ఆర్ ఆల్ విత్ యూ. అవమానం మా అందరిదీనూ..." అంటూ ఇన్ స్పెక్టర్ తో దోషులని పట్టుకుని శిక్షించాలని ఆవేశంగా అంది.
    ఇన్ స్పెక్టర్ "వుయ్ విల్ ట్రై అవర్ బెస్ట్ మేడమ్" అన్నాడు. రాధ ఉద్యోగాస్థురాలని, ఏ దిక్కుమొక్కులేని ఏ ఆడవాళ్ళ కేసులో అయితే తీసుకోకపోయినా ఫరవాలేదుగాని ఇలాంటి ఉన్నత కుటుంబం స్త్రీపై జరిగిన ఈ అత్యాచారాన్ని చూసీ చూడనట్లు వూరుకోవడానికి వీలులేదని అతనికి తెలుసు.
    "హు... ఎన్ని యుగాలు గడిచినా ఆడదాన్ని ఆటవస్తువుగా, విలాస వస్తువుగా వాడుకునే ఈ పురుష ప్రవృత్తి యింకెన్ని యుగాలకి మారుతుందో ఒక ఆడదానికి ఈ సమాజంలో వున్న రక్షణ ఏమిటి, భర్త పక్కనున్నా ఇంత ఘాతుకం చేస్తే, పురుష అండలేని స్త్రీల గతి ఏమిటి? ఎంత అభ్యుదయ సాధించాం అనుకున్నా స్త్రీ వంటరిగా ఈనాటికి బతికే రక్షణలేని మనం సాధించిన ప్రగతి ఏమిటి?... ఛా... ఇంత ఘాతుకంగా, యింత కిరాతకంగా ఓ ఆడదాన్ని అనుభవించే ఆ వెధవలకి దొరికే ఆనందం ఏమిటో... సెక్స్ అంటే పైశాచిక కామమా? అదో సున్నితమైన తీయని అనుభూతి కావాలిగాని పైశాచిక కృత్యం జరిపేవాళ్ళు రాక్షసులు కాక మనుషులా... కీచకులు, రావణులు అన్నియుగాలలోను వుంటారు గాబోలు. ఇన్ స్పెక్టర్... ఈనాడు ఈమె. ఇంకోరోజు ఇంకో స్త్రీ... ఇలా ఎన్ని మానభంగం కేసులు వస్తున్నాయో తెలుసా? ఈ మానభంగం జరిగిన స్త్రీల గతేమిటి? వారి భవిష్యత్తేమిటి?... లేడి డాక్టర్ చాలా ఆవేశంగా అంటూ రాధ మొహం చూసి ఆగిపోయింది. అప్పుడామె వున్నస్థితిలో యింకా మాట్లాడి ఆమెని భయపెట్టలేకపోయింది. ఆమె మాటలకి తోటి డాక్టర్లు, నర్సులు అంతా ఏకగ్రీవంగా రాధకి జరిగిన అన్యాయం ఆమె ఒక్కరిదే కాదు మొత్తం స్త్రీ జాతిదే అంటూ మాట్లాడారు. "మానం, గీనం, పవిత్రత అంతా ట్రాష్. ఐడోంట్ బిలీవ్ దోజ్ థింగ్స్. కాని ఒక స్త్రీని ఇష్టంలేకుండా అంత క్రూరంగా చెరచడం మాత్రం అమానుషం. పశుత్వం ఉపయోగించి బలప్రయోగంతో ఒక స్త్రీని అనుభవించే హక్కు వాళ్ళకేముంది? మనకు చెందిన ఏ వస్తువన్నా యింకోరు దొంగిలిస్తే వూరుకోం. అలాంటిది ఒక స్త్రీని యిలా అవమానంపాలు చేసిన వాళ్ళని చట్టం ఉరితీసినా పాపం లేదంటాను. జైలుశిక్ష కాకుండా హత్య చేసిన వాడికి విధించే ఉరిశిక్షలాంటిది విధించాలంటాను. హత్యచేస్తే మనిషి ఒకసారే చస్తాడు. కాని యిలా మానభంగం జరిగిన స్త్రీ రోజురోజుకి చచ్చే పరిస్థితి మన సమాజం కల్పిస్తుంది. అంచేత హత్యకంటే తక్కువ నేరం కాదంటాను..." లేడి డాక్టర్ చాలా ఆవేశంగా అరిచింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra