"అసలేం జరిగింది" నిశ్చయంగా అడిగాడు త్యాగి.
    
    "ఏం జరిగితేనేం...... ఆ విషయం....."
    
    "మరిచిపోతానుసూర్యంగారూ...... ముందు నాకు వివరాలు కావాలి"
    
    "నీదసలే ఉడుకు రక్తం త్యాగీ......" తనకైన గాయానికి కాక త్యాగి తొందరపడతాడేమో అన్న అంతర్మధనంతో ఆందోళనగా అన్నాడు" ఇలాంటివి మామూలే.....ఏదో కోపం వచ్చి వుంటుంది. నీ కోసం వచ్చారు...... లేకపోయేసరికి ద్వారం పగలగొట్టి నీ గదిలోకి వెళ్ళబోయారు. నేను వారించబోతే నా మీద చెయ్యి చేసుకోబోయారు" "చేసుకోబోయారు కాదు......చేసుకున్నారు."
    
    మధ్యతరగతి రాజీ సూర్యంగొంతులో "గాయం పరిణామం కాదు నేనంటున్నది మొత్తానికి గాయపరిచారు"
    
    "వాళ్ళని ఆపేవాడ్నే మీ వదిన భయంతో నన్నుచుట్టేసే సరికి ఇల్లంతా చిందరవందర చేశారు. అయినా పెద్ద నష్టం జరగలేదనుకుంటాను"
    
    "ఇక్కడ మనం ఆలోచించాల్సింది నష్టం విలువ కాదు సూర్యం గారూ. అక్రమంగా యింటిలోకి ప్రవేశించేదాన్ని మమ్మల్ని గాయపరచటాన్ని"
    
    "నాగురించి పట్టించుకోకు పట్టించుకోకుండా ఎలా వుండను. మీరుగాయపడింది నా గురించేగా అది కాదయ్యా....."
    
    "సూర్యంగారూ......" ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ.
    
    యధాలాపంగా అన్నాడు "ఓ అన్నలా మీరు నాకోసం ఆలోచిస్తున్నారని నేను జరిగింది చాలామామూలు విషయంగా మరిచిపోయి ప్రత్యర్ధులకోసం గాలించకుండా మరోఆపదలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని కోరుకుంటున్నారని వూహించగలను. కాని నేను బాధ్యతగల పౌరుడ్ని మాత్రమేకాదు. ఊరుకుని ఆత్మద్రోహం చేసుకోలేనంటున్నది" మరింత కంగారుపడిపోయాడు సూర్యం "అది కాదు త్యాగీ......వచ్చినవాళ్ళు ఎంత బలవంతులో నువ్వూహించలేవు"
    
    "అలాఆలోచించటానికి నేనూ బలహీనుడ్నికాను"  

 

    "నామాటవిను త్యాగీ" ఇంచుమించుగా చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాడు సూర్యం. "ప్రాణాలకు తెగించినగూండాలతో పెట్టుకుని ఎంత కాలం క్షేమంగా బ్రతగ్గలవు."
    
    "ఏమనిషైనా బ్రతికేది యెంత కాలం" టక్కునఅడిగాడు త్యాగి.
    
    అసలు ఈ ప్రశ్నత్యాగి ఎందుకడిగాడో ఇదే ప్రశ్న నుంచి ప్రపంచమంత పెద్ద జవాబుని ఎలా రాబట్టగలడో తెలీని సూర్యం అప్రతిభుడిలాచూస్తుండగానే అన్నాడు త్యాగి గొంతులో ఉద్విగ్నతని నొక్కి పెడుతూ. "నేనుకర్మ సిద్దాంతం గురించి మాట్టాడ్డంలేదు సూర్యంగారూ. ఇలాబ్రతికే కన్నా బ్రతక్కపోతేనేం అంటున్నాను.
    
    ఇలాబ్రతకడమే మనిషి లక్ష్యమైతే నిన్నటివిప్లవాలకి ఉద్యమాలకి చారిత్రక పరిణామాల కి అర్ధం లేదంటున్నాను...... మీ భాషలో చెప్పాలీ అంటే సీత లేకపోతేనేం అనుకుంటే రామ రావణయుద్ధం జరిగేదికాదు..... బానిసలుగా.
    
    బ్రతికితేనేం అని నిన్నటి తరంఅనుకుంటే స్వాతంత్ర్యం సమరంలో ఆత్మబలిదానాలూ వుండేవి కాదు...... ఎలాగైనా బ్రతికితే చాలు అనుకుంటే యింత శాస్త్రపురోగతిసాంకేతిక విజ్ఞానంకోసం సమరం అవసరమయ్యేవి కావు. బ్రతకడం అంటే ఏదోలా చచ్చేదాకా వుండడం కాదు మనిషిగా బ్రతకడం......."
    
    త్యాగిచెప్పింది కొంతే అర్దమైంది అతడలా ఆలోచించడమూ కంగారు పెట్టింది. అందుకే అసంకల్పితంగా అనేశాడు" అసలు నీకోసం వచ్చిందెవరో తెలిస్తే నువ్వలామాటాడవు"
    
    "వచ్చిందెవరు......వీధి గూండాలు.....అంతేగా"
    
    "లేదుత్యాగీ......ఈ నగరంలో ప్రముఖనేరస్థులైనా బెదిరే పరమకిరాతకుడైనసత్తి. పైగా వచ్చింది ఒక్కడూ కాదు...... అబ్కారీమంత్రి మల్లేశంతమ్ముడు పోచయ్యతో అసలు పోచయ్యకూడా సామాన్యుడు కాడు"
    
    క్లూదొరికింది.....అది చాలనుకున్నాడేమో త్యాగి బయలుదేరబోతుంటే" ఎక్కడికి పోలీసుల దగ్గరికా....." అన్నాడు సూర్యం.
    
    "అంతే"
    
    "పోలీసులదగ్గరికి వెళ్లొద్దు." అంటూ అడ్డం పడ్డాడు.
    
    "సరే....." హామీ యిచ్చాడు త్యాగి. "పోలీసులకి తెలియచెప్పేపిచ్చి పనికి సిద్దపడను........రాత్రి పదిగంటలు కావస్తుండగా బయటకువెళ్ళిన త్యాగి అరగంటవ్యవధిలో మరో ఫోటోగ్రాఫర్ తో రావడంగాని, గదిని ఫోటోలు తీయడం గాని ఎందుకోసూర్యానికి అర్ధం కాకపోయినా పోలీసుల దగ్గరికి వెళ్ళకపోవడం కాస్త ఊరటని కలిగించింది.
    
    నిజమే......మంత్రుల అండతో సాగించే గూండాల స్వైరవిహారం గురించి తెలిసినసగటు సూర్యం ఈ రాష్ట్రంలో అంచెలంచెలుగా పేరుకు పోయిన సత్తిలాంటిదాదాలు ఎంత బలవంతులో అర్ధం కావడం వల్లనే అన్యాయం జరిగినపుడు పోలీసుల అండ కోసం ప్రయత్నించరు.
    
                                                             * * *
    
    అపరాత్రిదాటిన సూచనగా కవాడి గూడాలలోని ఆ మురికివాడ సద్దుమణిగివుంది. ఎముక తొలుస్తున్నచలిగాలి నెమ్మదిగా వస్తోంది. అక్కడ గుడిసెల్లోనిజనం కలత నిద్రలోకి జారిపోతే...... మురికికాలువ ప్రక్క నున్నచిన్న పెంకుటిల్లు ఆ చిన్న సామ్రాజ్యాన్ని నియంత్రించగలకోటలా దర్శనమిస్తూంది. లోపలనుంచి ఓయువతి గాజులచప్పడుతో బాటు తాగిన మైకం తోనో లేక ఆడదందించే మత్తు మూలంగానే 'సత్తి' కంఠం మగతగా వినిపిస్తూంది. "అలసిపోయినవ్......" సత్తి కంఠంలో విజయగర్వం.....
    
    "నువ్వు మనిసివైతేగా...." అతడి మగసిరిని అభినందించిందామె.
    
    "పక్కన్జేరితే సాలు పెయ్యని ముక్కల్జేస్తవ్."
    
    "నీయవ్వ గింతలో ఏమైందే......యిగజాసుకోమల్లా......"    

    "ఒగ్గేయ్.....నీకాల్మొక్కుతా......"
    
    "గట్లయిడిసి పెట్టెటోన్నికాదు......నీయవ్వ గిసువంటిదానివేమే వయసుపోరీ అంటే గెట్లుండాలే జర్రంత మౌకా యిస్తే జర్రున దూసుకుపోవాలె.....ఏం .....పైసల్దీసుకోవట్లే...."
    
    "హమ్మో" సన్నని మూలుగు వెలువడింది ఆమె గొంతు నుంచి.
    
    "తాతలుయాది కొస్తున్నారే......తాతల్లాదే......ముత్తాతల్ యాద్కొచ్చేట్లుదూమ్ చేసేస్తా"
    
    దఢేలునతలుపు తెరుచుకుంది. ఉలిక్కిపడింది మంచంపైపడుకుని వున్న రాములమ్మకాదు.....అప్పటికే ఆమెనుఆక్రమించుకున్న సత్తి.  "మాకీ......"     
    
    ఉక్రోషంతో మండిపడ్డాడు.
    
    "సత్తి ఎవరు బే....."
    
    జవాబులేదు. చీరేయాలన్నంతకోపం వచ్చేసింది సత్తికి. అలాంటిసమయంలో సాక్షాత్తూ మంత్రి మల్లేశం వచ్చినా క్షమించలేనంత మైకంలో అరిచాడు" ముందుదర్వాజా బంద్ చెయ్ బే"
    
    తలుపుమూసిన త్యాగి ముందుకు కదిలాడు "నువ్వా" క్రీనీడలో నుంచి మసకవెలుతురులోకి వచ్చిన త్యాగిని చూసి చెంగున పైకి లేచాడు సత్తి "నీ యవ్వ నీకెన్ని గుండెల్ బే...... పనిలో ఉన్నప్పుడు గిట్ల.... సత్తి వాక్యం యింకా పూర్తి కానే లేదు......గూబ పగిలిపోయింది.
    
    నగ్నంగా వున్న సత్తి దేహంవల్ల పాషాణంలా నిగనిగలాడటమే కాదు అంత ఉద్వేగం గానూ కదిలిత్యాగిని ఢీకొంది. ప్రక్కకు జరిగిన త్యాగిపాదం నేలకి సమాంతరంగా లేచి ముందుగాలిని చీల్చింది. మరుక్షణం సత్తి గడ్డాన్ని తాకింది. సన్నని మూలుగు. అప్పటికే ఒంటికి చీరని చుట్టుకున్న రాములమ్మ కెవ్వుమంటూ బయటికి పరుగెత్తింది. ఆ కేకతో నిద్రపోతున్న కుక్కలు భౌ మన్నాయి. వాడ మొత్తం మేల్కొంది. పిడిగుద్దుల చప్పుళ్ళు నీరవతని భగ్నం చేసే క్రూర పదమట్టనలు...... కుక్కగొడుగుల విశ్వరూపాన్ని నేలమట్టం చేసే మారణాస్త్రంలా లిప్తలిప్తకీ విస్తరిస్తున్న అగ్ని తేజంలా త్యాగి విజ్రుంభిస్తూ సత్తిని బయటకు ఈడ్చుకొచ్చాడు.
    
    సత్తిబలాధ్యుడే........కాని త్యాగిని ఎదుర్కోలేకపోతున్నాడు. పోరాటమంటే ప్రాణాలకు తెగించగలవాడే. కాని త్యాగి వేగం ముందుప్రాణం కడంటిపోతూంది. పదిమంది ఒకేసారి చుట్టుముట్టి పైబడినట్టు తిరుగులేని తనుచరిత్రకిలా విఘాతమేర్పడటం భరింపశక్యం కానట్టు యింకా శక్తినికూడగట్టు కుంటున్నాడు కానీ ప్రయోజనంలేకపోయింది.
    
    సరిగ్గా పది నిమిషాల కాలం.....
    
    చీకటిరగిల్చిన అగ్నిజిహ్వలా., మౌన ప్రవాసం నుంచినిద్ర లేచి శృంఖలాన్నింవిచ్చిన్నం చేస్తున్న వీరభద్రుడిలా కదిలి 'సత్తి' ని నేలకూల్చాడు. చావలేదు కానీ రక్తసిక్తమైన దేహంతో స్పృహ తప్పేట్టున్నాడు.
    
    త్యాగి నెమ్మదిగా అన్నాడు "ఇంతకాలం నీ చరిత్రఎంతైనా గాని నామీద దాడిచేసి తొందరపడ్డావు సత్తి.......మరోసారి యిలాంటి ప్రయత్నానికి సిద్దపడకు" వెళ్ళిపోయాడు త్యాగి. అందరూ చూస్తుండగానే......నిజమే.....ఓ కిరాతకుడిలా బ్రతికిన సత్తికిది దారుణమైన శిక్ష.....అరకిలోమీటరు దూరంలో వచ్చినత్యాగి ఓ పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగాడు.......ఇంకా చల్లారని ఉక్రోషం......ఫోన్ రింగ్ చేశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra