చక్రపాణి వులిక్కిపడ్డాడు. మైబ్లడ్ ఏమిటి? అనుకుంటు.
"మైబ్లడ్! మనందరి మిత్రుడికి ప్రమోషన్ వచ్చింది. ఏ.బి. దాటుకుని సి. లోకి మార్చబడ్డాడు. ఈ శుభ సమయంలో స్వీట్ బ్రూటల్ పార్టీ ఏర్పాటు చేసి మీ అందరిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మిస్టర్ ఎక్స్ తో పాటు మరికొద్ది సేపటిలో మీ అందరికి అపురూపమయిన డిషెస్ అందచేయబడతాయి ఆరగించి ఆనందించండి."
అతనూ మాట పూర్తిచేయక ముందే అక్కడున్న అందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ
"ఉళ..ఉళ..ఉళ...ళ..ళ..ళ.."అన్నారు. పెద్ద గొంతుకతో జంతు ముఖాలు తగ్గట్టుగానే వుంది. వాళ్ళు ఆనంద "ఉళ" శబ్దం తో వుచ్చరించటం.
"మైబ్లడ్! ముందుగా మీ అందరికి రెడ్ సూప్ ఇవ్వబడుతుంది. ఆ తరువాత విందు ఏర్పాటు" గుర్రం ముఖం వ్యక్తీ చెప్పి చక్రపాణిని తీసుకుని ఓ టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.
భయ్యా అనొచ్చు, భాయీ అనొచ్చు. మిత్రులారా అనొచ్చు కామ్రేడ్ అనొచ్చు. ఈ మాటలన్నీ అందరికి తెలిసిందే! మైబ్లడ్ ఏమిటి? అసలు అలా ఎవరయినా ఎక్కడయినా అంటారా? మిస్టర్ ఎక్స్ గా తను వాళ్ళకి పరిచయం చేయబడ్డాడు. అక్కడ వున్న మిగతావాళ్ళు ఎ. బి. సి. డీలా? ఇంతమందిలో ఎవరు ఎ. నో. ఎవరు బి. నో.
7)
ఇతరులకి ఎలా తెలుస్తుంది? ఫలానా జంతువు ముఖం తగిలించున్న వాడు, ఎ అనుకోవడానికి అక్కడ సమావేశం అయిన వాళ్ళు తలో జంతుముఖంలో లేరు. సింహం తలకాయలు మూడు. కోతి తలలు రెండు ఎద్దు తలకాయలు నాలుగు అల వున్నారు. ఎవరికిష్టమైన ముఖం వాళ్ళు తగిలించుకున్నారు. తనలాగే ఆ మూడో టేబుల్ చివర కూర్చున్న వాడు కూడా పులిముఖం మాస్క్ ధరించాడు ఇదంతా చూస్తుంటే....
చక్రపాణి ఆలోచనలు అలా సాగుతుండగా తక్కువ కాంతిగల లైటు ఆరిపోయి పెద్దలైటు వెలిగింది, అయితే ఆ కాంతి వలయాల్లా తిరుగుతూ అక్కడంతా పరుచుకుంది. ఒక్కసారిగా అరడజను స్కేలిటన్ లు చేతుల్లో ట్రేలు ట్రేలు మధ్య గాజు గ్లాసులతో వచ్చాయి.
అధాటున చూస్తే హడలి చచ్చేలా ఆ స్కేలిటన్ లు వున్నాయి. కాదు వున్నారు. కొందరు మనుషులు స్కేలిటన్ ఆకారంగల ఫుల్ గా మాస్క్ ధరించి వచ్చారు.
మళ్ళి అక్కడ స్రీ రోదన ధ్వని తాలూకా మ్యూజిక్ మొదలయింది.
ట్రైలో తెచ్చిన గ్లాసులలో వున్నది రెడ్ సూప్ గ్లాసుల ఆకారాలు బాగానే వున్నాయి. వాటిమీద పిచాచాల ఆకారంగల బొమ్మలు వేసి వున్నాయి. కధల్లో దెయ్యాలని పిచాచాలని వర్ణిస్తుంటారు. అలా వున్నాయి అ బొమ్మలు. గ్లాసులోని ద్రవం రక్తంలాగా వుంది.
స్కేలిటన్ లు స్వయంగా వాళ్ళ చేతులతో ఆ గ్లాసులని అక్కడున్న వాళ్ళకి అందించారు. అలా అందిస్తూ శబ్దం వచ్చేలా నెమ్మదిగా నవ్వారు. ఆ నవ్వు వికృతంగా వుంది.
ఆప్యాయంగా గ్లాసులు అందుకుని ఆర్తిగా గ్లాసులని నోటి దగ్గర పెట్టుకుని చప్పరిస్తూ తాగారు అ ద్రవాన్ని. తప్పదు చక్రపాణి కూడా తాగాడు. రెడ్ సూప్ అంటే రక్తం కాదు కదా! మనసు సంశాయిస్తున్నా, తప్పదు కాబట్టి నెమ్మదిగా చాలా కొద్దిగా కొద్దిగా చప్పరించాడు. వగరు తప్ప మరి రుచి లేదు. బ్రాంది విస్కీ రమ్ జిన్ ఓల్కా ఏ రుచి కాదు అది.
రెండు నిముషాలు పూర్తీ అయింది.
ప్రతి టేబుల్ మీద మెనుకార్డు దానితో పాటు పెన్సిల్ వున్నాయి. మెనుకార్డు మీద రకరకాల ఐటమ్స్ పేర్లు వున్నాయి. ఆ పేర్లు అర్ధమయ్యే పదార్ధాల భాషలో లేవు.
గుర్రం ముఖం వ్యక్తీ మెనుకార్డు చేతిలోకి తీసుకుని ఒక అయిటమ్ మీద పెన్సిల్తో టిక్ పెట్టాడు. తర్వాత చక్రపాణికి యిచ్చాడు.
చక్రపాణి మెనుకార్డుని పైనుంచి కిందదాకా ఎగాదిగా చదువుతూ చూశాడు. అర్ధం చేసుకోవడం సులభం కాదని గ్రహించి ఓ అయిటమ్ పక్కనే పెన్సిల్ తో చిన్న టిక్ పెట్టాడు.
పది నిముషాలు గడిచిపోయాయి.