Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 17

 

    సరదాపడి నేర్చుకున్న విద్య సాయపడుతుంది. అనుకుంది సీత.

 

    దారి పొడుగూత అలోచేస్తూనే వుంది. పెద్ద టైలరింగ్ షాపు రంగు రంగుల బ్లవుజులు, మ్యక్సిలు, ఎంబ్రాయిడరీ చేసిన సిల్కు జరిలా అద్దాల బీరువాలలో హేంగర్స్ కు తగిలించి వేలాడుతున్నాయి. ఎన్నో మిషన్ లు "హిష్...హిష్...హిష్..." అని పనిచేస్తున్నాయి. మిషన్ లు తిరుగుతున్న ధ్వని జంత్ర వాయిద్యాల లాగా వినపడుతున్నది. ప్రతి మిషన్ ముందు ఓ అమ్మాయి ఎవరికి భారం లేకుండా తను మానాన తాను బతుకుతున్నామనే తృప్తి వాళ్ళ ముఖాలలో కనిపిస్తుంది. మధ్య మధ్య మిషన్ ముందు నుంచి ఎవరో ఒకరు లేచి "గ్రేకలరు క్లాతుకి ఉత్త ఎంబ్రాయిడిరి పూలు బదులు ఈ రంగు పూసలు కలిపి కుడితే బాగుంటుందా? చెంకి కలపమా? అని సలహా అడుగుతున్నారు సీతని. వాళ్ళ మధ్య సీత తన గొప్పతనం చాటుకోవటంలేదు. ఓ స్నేహితురాలిగా అవసరమయితే ఇంకో అమ్మాయిని కూడా సలహా అడిగి పని చక్కగా పలుగురిని ఆకర్షించేలా వస్త్రాలను తయారు చేస్తున్నది.

 

    పెద్ద శబ్దంచేస్తూ మోటరు సైకిలు పక్కనుంచి దుసుకుపోవటంతో సీత ఉలిక్కిపడింది. బజారు మధ్యలో తను నడుస్తున్నట్లు గమనించింది. తన వుహలకి తనే నవ్వుకుంది.  ప్రతివారు టైలరు కుట్టినవే ధరిస్తారు. టైలరింగ్ గొప్పపని ఎవరూ అనుకోరేమిటి? పది టైపు మిషన్లు కొని టైపు నేర్పితే వున్న విలువ పది మిషన్లు కొని టైలరింగ్ నేర్పితే వుండదు. ఇది పూర్తిగా నిజమా! తను పోరాబడుతున్నదా?

 

    మళ్ళి ఆలోచనల్లో పడింది సీత. కాని పూర్తి పరిసరాలు మర్చిపోక ఓ కంట గమనిస్తూ నడుస్తుంది.

 

    వకుళమ్మ యింటి నుంచి సరాసరి ఇంటికే బయలుదేరలేదు సీత. బజారులో పనికూడా వుండటం వల్ల, బజారులో కావాల్సిన సరుకులు చేతి సంచిని కూడా తీసుకుని ఇంటి ముఖం పట్టింది.

 

    నాలుగడుగులు వేసిన సీత కొద్ది దూరంలో ఓ షాపులోంచి వస్తున్న జంటని చూసి నిర్ఘాంతపోయి, అలాగే ఆగిపోయింది.

 

    ఆ జంట ఓ యువతి యువకుడిది. అతని పేరేదో ఉరేదో తెలియదు గాని ఆ యువతి మాత్రం రూప. అక్షరాలా అదే రూపం కాదు రూపే సందేహం లేదు.

 

    రూప, అతను నవ్వుకుంటూ సర్దాగా మాట్లాడుకుంటూ ఫాన్సీ షాపులోంచి బైటికి వచ్చారు. షాపు బయట నిలిపిన రాయల్ ని స్టార్ట్ చేశాడు. రూప అతని వెనుక సీటు మీద కుర్చుని సుతారంగా అతని నడుం పట్టుకుంది. వెంటనే రాయల్ ఆఘమేఘాలమీద పయనిస్తున్నట్లు వేగంగా ముందుకు సాగి అర నిమిషంలో కనుమరుగయింది. చైత్నయం వచ్చిన దానిలా సీత అప్పుడు కదిలింది.

 

    సీత ఆలోచనలు, సీత కలలు, సీత సంతోషం, అన్ని మాయమయ్యాయి. కళ్ళముందు రూప అతను కనపడుతున్నారు.

 

    "ఈ మధ్య రూప చాలాసార్లు ఆలశ్యంగా యింటికోస్తున్నది. అదేమిటంటే "తోడు కోసం తనే డబ్బులు పెట్టుకుని ఓ ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్ళింది ఓ ఫ్రెండ్ ఇంట్లో చదువుకుంటూ వున్నాను.  స్నేహితురాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటూ కూచుంటే టైము తెలియలేదు. జాంబవతి ఇంట్లో టిఫిన్ తిన్నాను ఈ పూట ఆకలిలేదు." ఇలా రూప ఈరోజు చెప్పింది మర్నాడు చెప్పకుండా ప్రతిరోజూ ఏదో ఓ కారణం చెప్పేది. ఎప్పుడైనా ఒకసారి ఇది అబద్దం చెప్పటం లేదు కదా, అనిపించేది. తనే అనవసరంగా అపోహ పడుతున్నదేమో అని సర్డుకునేది. ఈ రోజు తెలిసిపోయింది రూప రూప..... యింతకు తెగించిందా? ఇదింకా ఎంత దూరం పోతుందో, నాన్నకి తెలిస్తే! అమ్మో! ఇంకేమయినా వుందా? నన్నాకి తెలియనివ్వకూడదు రూపాని మందలించాలి.

 

    రూప తనమాట వింటుందా!

 

    అసలేమని బుకాయిస్తుందో

 

    రూప విన్నా వినకపోయినా మందలించి మంచి మార్గంలో పెట్టటం తన కర్తవ్యం.

 

    మాట వినకపోతే వినేలా చేయాలి.

 

    ఇవాళ నుంచి రూప ఆటలు సాగనివ్వకూడదు.

 

    ఓ నిశ్చయానికొచ్చిన సీత నడక వేగం హెచ్చింది.

    
                                                         12

 

    అక్కెందుకు ముభావంగా వుందో రుపకర్ధం కాలేదు.

 

    రూప సాయంత్రం యింటికి రాగానే సీత అడక్కపోయినా "ఈ రోజు కాలేజిలో ఓ గంట ఆలశ్యం అయింది." అంటూ సంజాయిషీ చెప్పుకుంది.

 

    "ఓహో! అంది సీత.

 

    "ఆ ఓహో అనటంలో ఎత్తి పొడుపు వ్యంగ్యం స్పురించాయి రుపకి. అలాంటిదేం లేదులే. ఏదో పరధ్యానంలో వుండి ఓహో అని వుంటుందిలే అని సర్దుకుంది రూప.   

 Previous Page Next Page