Previous Page Next Page 
యోధుడు పేజి 16

    సరిగ్గా అదే సమయంలో....

    డాక్టర్ మధురిమ డోర్ తెరుచుకుని లోనికొచ్చింది.

    "మీ క్లయింట్ తో మాట్లాడటం అయిపోయిందా?" నవ్వుతూ తెలియని విషయాల మిస్టరీ విప్పాల్సిందేమీరే."

    "నేనా...?!" ఆశ్చర్యపోతూ అంది మధురిమ.

    "అవును డాక్టర్... ఆ నలుగురు కుర్రాళ్ళు ఇతన్ని హాస్పిటల్ కు తీసుకువచినప్పుడు మీకేం చెప్పారు?" లాయర్ నీలకంఠన్   అడిగాడు.

    "పేషెంట్ దగ్గర ఈ విషయం మాట్లాడటం బాగోదేమో... నా ఛాంబర్ కు రండి" అందామె వెనక్కీ తిరిగి ఆ గదిలోంచి బయటకు నడుస్తూ.
   
                                                   *    *    *    *

    "కాశీచరణ్ కేసులో ఎక్కడో, ఏదో మిస్టరీ వుందని నాకనిపిస్తోంది" అంది డాక్టర్ మధురిమ.

    "మిస్టరీ ఏముంది?" అయోమయంగా అడిగాడు లాయర్  నీలకంఠన్ .

    ఆ రోజు రాత్రి ఆ నలుగురు యువకులు గాయాలతో బేబీనగర్ రైల్వేక్రాసింగ్ దగ్గరున్న పొదల్లో పడున్న కాశీచరణ్ తన హాస్పిటల్ కు తీసుకురావటం, మరో ఆలోచన లేకుండా తను ఎడ్మిట్ చేసుకోవడం గురించి చెప్పింది మధురిమ.

    "ఇక్కడ మీకో డౌటు రావడంలేదా?" అడిగాడు లాయర్  నీలకంఠన్.

    "రైల్వే సిబ్బింది మిగతావాళ్ళతోపాటు కాశీచరణ్ ని కూడా రైల్వే హాస్పిటల్ కు తీసుకెళ్ళాలికదా... ఎందుకు తీసుకెళ్ళలేదు... రైల్వేఅధికారులు కూడా ఇతన్ని ఎందుకు పట్టించుకోలేదు?

    అంటే రైల్వే రిలీఫ్ స్క్వాడ్ దృష్టికి రానంత విసురుగా వెళ్ళి కుప్పల్లో పడిపోయాడా కాశీచరణ్...?విచిత్రంగా అతని పక్కనే తుప్పు లలో సూట్కేస్ కూడా వుంది. దాన్ని బట్టి యాక్సిడెంట్ జరగబోతొందని కాశీచరణ్ ముందుగానే పసిగట్టి, తన సూట్ కేస్ ని తనతోనే గట్టిగా పట్టుకొని వున్నడా? కాశీచరణ్ ని రక్షించి తీసుకొచ్చిన కుర్రాళ్ళు నిజంగా మేడికోసేనా? లేక శత్రువులా? ఇంతకీ మీరనుకునే వ్యక్తి. ఇతను ఒకరే అని మీరు నముతున్నారా?

    అసలు కాశీచరణ్ గురించి మీరింతగా అరాటపడటానికి కారణం నేను తెలుసుకోవచ్చా?" అడిగింది మధురిమ.

    "ఇందులో రహస్యమేమీ లేదు డాక్టర్!" అని కాశీచరణ్ గతమంతా చెప్పుకొచ్చాడు లాయర్  నీలకంఠన్ .

    "కాశీచరణ్ కోటీశ్వరుడా?" ఆశ్చర్యపోయిందామె.

    "కాబోయే కోటీశ్వరుడు. నా డౌట్స్ అన్నీ తీరిపోగానే అతను కోటీశ్వరుడైపోతాడు. ఇంతకీ పేషెంట్ కు సంబంధించిన సూట్ కేసు చూశారా?" లాయర్ అడిగాడు అత్రుతుగా.

    "లేదు... కాశీచరణ్ కు సంభందించిన దుస్తుల కోసం ఆ సూట్ కేసుని ఓపెన్ చేయాల్సి వచ్చిందట_ దానిలో అతని దుస్తులు, ఏవో కాగితాలు... డైరీ కనిపించాయట. దాన్ని ఓపెన్ చేసింది మా జూనియర్ వార్డ్ బాయ్ దిలీఫ్" చెప్పింది మధురిమ.

    లాయర్ అభ్యర్ధనపై మధురిమ దిలీఫ్ పిలిపించింది.

    "అ సూట్ కేసులో ఏమున్నాయి?" అడిగాడు  నీలకంఠన్  దీలీఫ్ ని.

    "ఒక డైరీ, బట్టలు మరేవో, కాగితాలు, అవీ... ఇవీ వున్నాయి..."

    "మరి నీకతని పేరు కాశీచరణ్ అని ఎలా తెలిసింది?" అడిగాడు.

    "ఆ సూట్ కేసులో అతని విజిటింగ్ కార్ద్సు వున్నాయి సార్! వాటి మీదే అతని పేరుంది. దానిని బట్టి అతని పేరుకాశీచరణ్ అని అనుకొన్నాను సార్..." చెప్పాడు దీలేఫ్.

    "ఎందుకైనా మంచిది... యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలోనూ, రైల్వే డాక్టర్ని ఎంక్వయిరీ చేస్తే...." లాయర్  నీలకంఠన్  అన్నాడు.

    "ఆ రోజు అతను ఆంద్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ లో ఫస్ట్ క్లాస్ లో ఎక్కాడు గదా... అందుకు సంబంధించిన రిజర్వేషన్ చార్ట్ రైల్వే డిపార్ట్మెంట్ దగ్గరుంతుంది. దాన్ని చెక్ చేస్తే మీ డౌట్స్  క్లీయర్ అవుతాయేమో?" చెప్పింది డాక్టర్ మధురిమ.

    "గుడ్ ఐడియా... డాక్టర్ మధురిమా... అసలు మీరు పోలీస్ డిపార్ట్ మెంట్ లో వుండాల్సిన వ్యక్తి.... ఇంతవరకూ ఈ దశిగా నేను ఆలోచించలేదు. ఇవాలే మా అసిస్టెంట్ నియా పన్లు మీద వినియోగిస్తాను" చెప్పాడు లాయర్  నీలకంఠన్ .

    "కాశీచరణ్ మీ హాస్పిటల్లో అప్పగించిన ఆ నలుగురు కుర్రాళ్ళను కాల్సుకోవడానికి వీలవుతుందా?" అడిగాడు  నీలకంఠన్  సాలోచనగా.

    "వాళ్ళు నలుగురూ తాము ఉస్మానియా మేడికోస్ మని చెప్పారు కదా? ఉస్మానియా మెడికల్ కాలేజీకి వెళితే కలుసుకోవచ్చు" అందామె.

    "ప్రస్తుతానికి అవసరం లేదనుకోండి... అవసరమైతేనే... అదీ కాకుండా ప్రస్తుతం మా అసిస్టెంట్లు బెంగుళూరు లో వున్నారు. కాశీచరణ్ కి ఆస్తి అప్పగించేందుకు నాక్కూడా ఎలాంటి సందేహాలుండకూడదుకదా? బెంగుళూరు, తదితర ప్రాతంల్లో  అప్పుడేప్పుడో  స్థిరపడ్డా మరాఠీ కేవల్కర్ కుటుంబలా ద్వారా సంతోష్ కేవల్కర్ గురించిన వివరాలను సేకరించడానికి పంపించాను.

`    రెండు రోజుల్లో ఆ విషయాలు మనకు తెలుస్తాయి_ సందేహాలన్నీ తీరిపోతే_ లీగల్ గా ఈ ఆస్తికి అతన్ని వారసుడ్ని చేసేయ్యేచ్చు.

    అయినా... సత్యం మనవడే కాశీచరణ్ అని నేను మాత్రం నముతున్నాను. నమ్మినప్పటికీ ఆ సూట్ కేస్ అతనిదేనా? అతను కాశీచరణేనా?

    అయితే అతను నిజంగా మాకీం సత్యం మనవడేనా? లేక నేను రేండోసారిచ్చిన ఆస్తి వివరాల ప్రకటన చూసి వేరే వ్యక్తి అందుకు తగిన ఎలిబీని సృషించుకొని బయలుదేరాడా? అలా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే డాబు ఎన్ని పనుల్నయినా చేయిస్తోంది" చెప్పి, లేచి నిలబడ్డాడు  నీలకంఠన్ .

    "అప్పుడెప్పుడూ ఫోన్ చేసి నేను మిమల్ని డిస్టర్బ్ చేయేచ్చుగా?" అన్నాడతను నవ్వుతూ.

 Previous Page Next Page