"ఉహుఁ మీకు ప్రతిదీ వేళాకోళంగా వుంది. సీరియస్ నెస్ అనేది మీకు బొత్తిగా తెలియదల్లే ఉంది.... ఎందుకలా వూరికే నవ్వుతారు?"
    గట్టిగా నవ్వేస్తూ అంది.
    "ఏమిటి డాక్టర్ మీ ఉద్దేశ్యం__నవ్వకపోతే ఏడ్వమంటారా__ పోనీలెండి మీ యిష్టమే నా యిష్టం.... అలాగే ఏడ్చేస్తాను ఊఁ.... ఊఁ...."
    ఏడ్పుని అభినయించింది మనసులో దుఃఖం లేకపోయినా, ఒక్కసారి చిలిపిగా, తమాషాగా ఏడ్పును అభినయించాక కన్నీళ్ళు వస్తాయి. ఎందుకో అర్ధంకాని భగవంతుడి చిత్రాల్లో ఇదీ ఒకటి అనుకోవటం కంటే ఏమీ నిర్ణయించలేము.
    ఆమెనాస్థితిలో చూసేసరికి గాబరాపడ్డాడు. పరమ ఆతురతతో వ్యాకులపాటుతో అన్నాడు__
    "నిజంగా ఏడుస్తున్నారేమిటి కొంపదీసి....ఛీ! ఛీ! మీరు మంచివారు....ఏదీ నవ్వండి__ ఒక్కసారి.... అదో....అలా....అలా....వెన్నెల....కురిసినట్టు....మల్లెలు రాలినట్టు....ముద్దబంతి విరిసినట్టు.... మూగమనసు బాసాడినట్టు....మీరు మాత్రమే నవ్వగలిగినట్టు...."  
    అతని మాటలకు విరుగబడి నవ్వింది. ప్రపంచంలో నవ్వనేది చాలా విచిత్రమైన మందు. అది ఎలాంటి రోగమైనా యిట్టే పోగొడుతుంది. ఏ డాక్టరులూ ఏ ఔషధమూ లొంగదీసుకోలేని రోగాన్ని అట్టే పట్టేస్తుంది.
    "సరేలెండి మీ మాటలకేమొచ్చే! ఒక మంచి పాట పాడండి."
    ఏం జవాబు చెప్పినా ఏం ముంచుకువస్తుందోనని మెల్లిగా జయదేవుని అష్టపది "ధీరసమీరే....యమునాతీరే" పాడటం మొదలుపెట్టాడు. శ్రావ్యమైన గొంతుకతో లలితంగా అతడు పాడుతున్న పాట ఆ నీటి వేడిగాల్పుని చల్లబరుస్తుంది.
    "విగళిత వసనం" అనే చోట అతని గొంతుక కొద్దిగా చలించి మహానుభావుడైన జయదేవుని అష్టపదికి సంపూర్ణత్వానికి చేకూర్చింది.
    విశిష్టమైన ఆ గీతాన్ని భావశుద్ధమైన ఆ కవితని శ్రావ్యంగా వింటూ మైమరచిపోయింది. సంగీతమూ సాహిత్యమూ ప్రేయసీ ప్రియుల్లాకలసి వేడుకగా విహరించిన పుణ్యభూమి జయదేవునికవితావనం.
    అతని పాటకు పరవశించి తెలియరాని ఏవోలోకాల్లో తేలిపోతో మధురమైన స్వప్నాల్ని కంటూ అలాగే పడుకుంది కూర్చోలేక.
    పాట ముగించి చూశాడు.
    మట్టిగట్టిగా వున్నా ఎంతైనా అది నేలే!
    నేలమీద పడుకున్న ఆమెను చూసేసరికి అతనిలో చెప్పలేని బాధ కలిగింది. నిడుపాటి జడ.... మొగలి రేకులతో నిండుగా కట్టుకుంది.
    చేతికి తీసుకుని దుమ్ము దులిపి అన్నాడు. "లేవండి లేవండి.... ఒళ్ళంతా దుమ్ముకొట్టుకుంటుంది. ఖరీదైనచీర పాడౌతుంది. అంత శుభ్రంగా వున్న జడ దుమ్ము పాలౌతుంది. అంతకంటే అందమైన నీరు దుమ్ములో పడుకోవటం నా కిష్టంలేదు."
    లేవకుండా అలాగే పడుకుని అతని చేతిలోని జడని లాక్కుని చివరి రిబ్బను ముక్కుని మెలిపెడుతూ అంది....
    "మీ పాట విని మైమరచి పడుకున్నాను. లేవలేను_నాపైన మీకు అంత అభిమానమే వుంటే ఇంకో పాట వినాలంటే....లేకపోతే భరింపలేదు.
    ప్రార్ధనా పూర్వకంగా దయనీయమైన గొంతుకతో ఆమె అడుగుతోంది. అయినా అతను చలించకుండా అన్నాడు.
    "మీరు ముందులేచి కూర్చోండి. నేను అంతవరకూ పాడను."
    ఆమె గులాబీరేకుల కంటే సున్నితమూ మృదులమూ సౌందర్యవంతమూ అయిన దేహం అలా నేలమీద పడటం హూసి సహింపలేక మొండిగా అన్నాడు.  
    నల్లటి మట్టిపై పొరపాటుగ ఏ ధనవంతురాలో పడవేసుకున్న బంగారు కాసులదండవలే వుందామె.
    "ప్లీజ్, మీరు పాడండి. పాడి తీరాలి. నేను లేవలేను లేవను. అయినా నేలమీద పడుకుంటే మీరేమిటో బాధ...." నిశితంగా అతని కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది. అలా అడిగేప్పుడు ఆమె కొంటె పెదవుల వెనుక శరన్శేఘముల చాటున జ్యోత్స్నకారుడి వలె నువ్వు వెలుగక మానలేదు.
    "మరేం లేదు....మీ వళ్ళంతా దుమ్ముకొట్టుకుంటుందని అంతే" మరేమీ లేదన్నట్టు అతనన్నా అతని ఉచ్ఛారణలో అతనేదో దాచి అంటున్నాడనేది స్పష్టమౌతోంది.
    "అలాగా? అయితే ఓ మాట చెప్పనా? మీరు పైన వేసుకున్న ఆ శాలువా ఇవ్వండి. అయినా యిదేమిటండీ డాక్టరూ, కవులూ పండితులలాగా గోచి కట్టూ జబ్బాశాలువా? పోనీలెండి ఆ శాలువాయిటివ్వండి. పరుచుకుని పడుకుంటాను మీరు అలాగే కూర్చోండి. మీ తొడని ఆధారంగా చేసుకుని పడుకుంటాను. అయినా మీ శాలువకి దుమ్ము కాదా ఏమిటి? పోనీలెండి ఉతికించి యిస్తాను...."   
    విస్తుబోయాడు అతను ఏమీ జవాబు చెప్పలేదు. ఏమిటి ఈవిడ ఉద్దేశ్యము? యిలా యిలా ప్రశ్నించటంలో అంతలోనే తన ఆలోచనల్ని మరల్చుకున్నాడు. ఛీ, ఛీ, ఏమిటలా ఆలోచిస్తున్నాడు తను. తనెవరు? ఆమె ఎవరు? ఆమె అలా అడిగినంత మాత్రాన తొందరగా ఓ నిర్ణయానికీ రావటం తప్పు కాదూ. తన వివేకానికి లోటు కాదూ.
    "ఏమిటి ఆలోచిస్తున్నారు?"
    ఒక్క క్షణం ఆలోచించి అంది "సందేహిస్తున్నారా"
    అసలైన బాణం వదిలింది. బ్రహ్మ శిరోనామకాస్త్రానికి శిరస్సు వంచాల్సిందే!
    అంతవరకూ వచ్చాక ఇక ఎదురు తిరిగితే కధే అడ్డం తిరుగుతుంది. అనాగారికుడిలో వ్యతిరేకించేకన్నా ఆమె మాటలని వినడమే మంచిదని మేలని అనుకుంటున్నాడతను. మౌనంగా శాలువ తీసి యిచ్చాడు. అందించిన శాలువని పరుచుకుని అతని తొడలపై తల ఆనించి కళ్ళు మూసుకుని అంది.
    "ఇక పాడటం ప్రారంభించండి ప్లీజ్.... నేను వద్దు అనేవరకూ అలాగే పాడుతూ వుండండి.
    అతనికి కోపం వచ్చేసింది. ఉధృతంగా అయినా అణుచుకుని కొంచెం కోపం మిళితమైన స్వరంతో అన్నాడు.

    "నేనేం గ్రామఫోన్ని కాదు. పాట వెంటనే పాట అక్కరలేదు అని మీరనేవరకూ పాడుతూ వుండటానికి."
    అందమైన అతని చేతిని అందుకుంటూ వుంగరపు వేలుని వున్న లేత నీలపు తెల్లరాతి వుంగరాన్ని మృదువుగా ఒక్కసారి అలా కదిలించి చిటికెన వ్రేలు వున్న లేత ఆకుపచ్చ వుంగరాన్ని మృదువుగా స్పృశిస్తూ అంది.
    అభ్యంతర పూర్వకంగా అతను లాక్కోపోతే కళ్ళు చిట్లించి కోపంగా నీకోపాన్ని ప్రదర్శించే కనులతో మృదువైన స్వరంతో అంది. "ప్లీజ్....ఏమిటిది మొండి పిల్లాడిలా....
    అతనేమీ జవాబు చెప్పలేదు. విపరీత ప్రకృతితో విచిత్రమయిన చర్యలతో కనిపించే ఆ చిత్ర సుందరి వేపు చూడసాగాడు.
    మృదువుగా అతని అరచేతి స్పృశిస్తూ అంది "దయచేసి పాడండి. మీ యిష్టం వచ్చి నన్నే పాడండి.... అయినా మీకు అంత శ్రమ కలిగిస్తానని ఎలా అనుకున్నారు...."
    ఇంకేమీ జవాబు చెప్పకుండా మరో అష్ట పది అందుకున్నాడు.
    "ప్రియే చారుశీలే! ముంచమయి మానమ నిదానం"
    ఒక్కో పదాన్ని ఒక్కో వజ్రపు తునకలా బంగారంలో పొదిగినట్టు పరమ సొంపుగా కూర్చిన జయదేవ కవిచంద్రుని అదృష్టం ఏమని పొగడను. భావం, పదం, సంగీతం అన్నీ ముప్పీటలుగా అల్లుకుని సరస సంగీత సాహితే లోకాన్ని సృజిస్తూ వుండేలా గానం చేసిన ఆయన భావనాశక్తి, కల్పనా శక్తి అద్భుతం! ఏమాత్రం సంగీతం తెలిసిన వాడైనా ఆయనకి జోహారులు అర్పించకుండా వుండలేడు.
    "స్మర గరళ ఖండనం మమ శిరపి మందనం దేహి పద పల్లవ ముదారృ"
    "దేహి అని" పద పల్లవ ముదారం అనేప్పుడు అతని గానవాహిని స్పురింప జేసిన భావాన్ని ఆసాహిత్యం కానీ నేను కానీ స్పష్టంగా చెప్పలేక పోతున్నాం. అప్పుడు వినవలసి వుండింది అంతే. ఆ అదృష్టం ఆమెకు మాత్రమే దక్కింది. ఇతరులు కోరుకున్నా దక్కనిది అది. అంత చక్కటిది అది.
    పాట ముగిసింది. భావనోద్రిక్త మనస్సుతో ఆ కవితకీ, ఈగానానికీ మురిసి అతని చేతిని అలాగే అందుకుని పరమ సున్నితంగా పరమ భావనాస్పోరకంగా ముద్దిడుకుంది.
    గుండె ఝల్లుమంది అతనికి.... మెల్లిగా ఆమె చేతిని విడిపించుకున్నాడు. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అంతే. అనుకోకుండా ఆమె కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయ్.
    ప్రార్ధనా పూర్వకంగా అడిగింది "ఏమండీ! ఇంకొక పాటపాడరూ సావిరహే తనదీనా పాడరూ! ప్లీజ్!"
    ఏమంటాడు....ఎవరయినా తమకైతాము చిక్కుకున్న బంధనం నుంచి తప్పించుకుని బయట పడటం కష్టమే....
    "నిందతి చందన మిందుకి రాణయను నిందతి బేదమదీరమ్"
    ఒక్కో వ్యక్తి ఒక్కో పాట పాడితే ఇకవారు మాత్రమే ఆ పాటని పాడాలి మరెవ్వరూ పాడినా సహించలేం అనిపిస్తుంది. "కరోతి కుసుమ శయ నీయం" అతని కంఠ ప్రోతస్విని నుండి ఆమద బిందువులు జారినప్పుడు ఆమె అతని వేపు చూసి గుంభనగా నవ్వింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra