Previous Page Next Page 
పాదాభివందనం పేజి 16

మీరు ఈ అవకాశాన్ని దురినియోగం చేసుకోకండి! సద్వినియోగం చేసుకోండి. బాగా చదువుకోండి! మంచి మార్కులు తెచ్చుకోండి!"

ఆమాటలు చిదంబరం మనస్సులో శిలా క్షరాలుగా నిలిచాయి. అందుకే అతను చదువుకున్నన్ని రోజులు హైస్కూల్లో, కాలేజిలో స్టయిఫండ్, స్కాలర్ షిప్ మెరిట్ స్కాలర్ షిప్ లాంటివి వుంటే అవి అతనికి తప్పనిసరిగా దక్కాలి! దక్కేవి!

శ్రద్దగా చదువుకోవటం, ఫస్ట్ గ్రేడ్ లో వుండటం, ఫస్ట్ రాంక్ లో స్కూల్ ఫస్ట్ రావటం చిదంబరం సాంకేతిక లక్షణాలు, చిరినవ్వు చెరక్కపోవటం, వినయంగా మాట్లాడటం, టిచర్ల పెద్దల అభిమానాన్ని సంపాదించటం అతని చిహ్నాలు, పదుగుర్లో వున్నా ఒకడిగా గుర్తించబడటం అతని ప్రత్యేకత! ఒకడిగా వున్నా లెక్కింపుకి రావటం అతని జీవలక్షణం.

చదువుపూర్తయింది. ఉద్యోగం వచ్చింది. మొదటి నుంచి ఇతన్ని గమనిస్తోన్న ఓ పెద్దమనిషి తన కూతుర్నిచ్చి చేశాడు. భార్యతో తొలిసారి ఆ వూళ్ళో అడుగు పెట్టాడు చిదంబరం.

పదప్రవేశం అయిన రోజున ఆ ఊర్లో పెద్దల్ని, గ్రామాధికారుల్ని ఎంతగా మెప్పించి మనస్సు చూరగోన్నాడో- యీ యిరవై రెండేళ్ళలోనూ అతను అతని భార్య పిల్లలు దాన్నలాగే నిల్పుకున్నారు.

యోగ్యుడు, నెమ్మదైనవాడు, మంచివాడు, అనే కితాబు సంపాదించుకున్నాడు చిదంబరం. దాన్ని పదిలంగా పిత్రార్జితంలాగా కాపాడుకున్నాడతను.

అధికారంలో, అధికారుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రెసిడెంట్, సర్పంచులుగా మారిపోయారు. బ్లాకులు, సమితులు అయ్యాయి.బోర్డులు పరిషత్తులయ్యాయి. అయితేనేం ముగ్గురమ్మాయిలు , ఇద్దరబ్బాయిలూ పొందిగ్గా బ్రతకటం నేర్చుకున్నారు. ఆ ఘనత చిదంబరం భార్యమణికి మాత్రమే చెందదు.


ఉన్నదాన్లోనే కాలు ముడుచుకుని పడుకోవాలన్నది చిదంబరం సిద్దాంతం. అది ఇంటిల్లిపాదీకి నేర్పించాడతను.

బావిలో నుంచి చెరువులో పడ్డట్టయింది యిపుడు. అంతకుముందు మంచి పల్లెలో కాపురం. ఇంటి బాడుగ చాలా స్వల్పం. నామికేవాస్తే పదిరూపాయలు. పాలకి నెలకి నాలుగు రూపాయలు! కూరా నారా ఊరికే దొరికేవి. చిదంబరం యింటికి కాయగూరలు తెచ్చివటం సేవగా భావించేవాళ్ళు. వంట చేరక్కి ఏనాడూ యిబ్బంది పడలేదు. కొనలేదు. మోపులు మోపులు తెచ్చిపదేసేవారు. రూపాయి కిరోసన్ తో ఇల్లు వెలిగేది.

ఇక యిప్పుడో! అమ్మ బాబోయ్! గాలి పిలిస్తే డబ్బు! విడిస్తే డబ్బు! పాలు లీటర్ మూడు, నాలుగూ! మజ్జిగకే (పెరుక్కి కాదు) రోజుకి అరలీటరు పాలు కావాలి. కరెంటుకి శ్లాబు చార్జీ పదిరూపాయలు. ఇంటి అద్దె ఎనబై రూపాయలు. వంట చెరుక్కి నెలకి ముప్పై చాలటం లేదు. కురగాయలకి రోజు రూపాయి రుపాయిన్నారా తగ్గ జిహకి రిచిగా తగలటం లేదు.


 'పట్టణాల్లోనే యిలా అయితే సిటిలో ఎలా బతుకుతున్నారో అనుకున్నాడతను. పిల్ల కలువ నించి సముద్రంలోకి కొట్టుకొచ్చినట్టుగా వుంది స్థితి. వచ్చే జీతంలో మార్పు లేదు. పెరిగిన ఇంటిఅద్దె, అలవెన్స్ ఏ మూలకి వచ్చేట్టు! బ్రతికే తీరులో మాత్రం ఎంతో మార్పోచ్చింది! ఎలా లంకె కుదుర్చుకునేది?

                                             డబ్బు! డబ్బు! డబ్బు!

ఎక్కడ చూసినా డబ్బుతో అవసరం. ఎటు చూసినా డబ్బు కల్పించే అవసరాల నాట్యం. పిల్లలంతా హైస్కూల్లో, జూనియర్ కాలేజీల్లో చదువుకుంటున్నారు. ఎక్కడా తప్పటం లేదు. మార్కులు బాగా వస్తున్నాయి. ఇక చదువు వద్దనేదెలా? ఎవరిని మన్పించెట్టు అమ్మాయిలయితేనేం చదవనక్కర్లేదా?


ఆళ్ళగడ్డ వచ్చాక పిల్లలతో మరో రెండు గొడవలు ఎక్కువ అయ్యాయి. స్కూలు డ్రస్సు అంటూ తలా రెండు మూడు జతల గుడ్డల ఖర్చు. ఆ వూళ్ళో యీ పట్టింపు లేదు. రూల్సు వున్నా పల్లెల్లో పాటించేదెవరు? రెండో గొడవ సినిమాలు! వీధి అంతా రోజు సినిమాలయాలకి - వెళ్ళి అభిమాన నటినటుల్ని దర్శించుకుని వస్తోంటే లేత మనస్సుల్ని ఆపేదెలా.


అవసరాలు రెట్టింపు అయ్యాయి.


ఆదాయం మాత్రం అంతే వుంది.


జీతం డబ్బులు మొదటి రోజు పర్సు నిండుగా వుంటాయి. రెండో రోజు పదుల్లో- మూడో రోజున ఒకట్లలో నాలుగోరోజు చిల్లర క్రింద అయిపోతున్నాయి.

ఎవరితో చెప్పుకునే బాధయిది.

పెరిగిన జీవన వ్యయంతో పాటు పెరగని జీతం యిచ్చే యజమన్యాన్నా? అది ప్రభుత్వరితి. దాన్నే మనగలం? ఎలా మనగలగటం?

మారిపోయిన ఆర్ధిక పరిస్తితులా?

వాటికీ బాధ్యులెవరు?

ఈ పరిస్థితి మరేదేలా?

మర్చేదేవరు?

ఆ రోజు సహా ఉపాధ్యాయుడు సాయంకాలం ఆరింటికి ఏదో చార్టు గబగబా తిరగేస్తూ, గణితం, గణితం, రీడింగ్ చేస్తూ ఏవేవో అంకెలకి ఎదురుగా పది ఇరవై రాసేస్తున్నాడు.

చిదంబరం దగ్గరగా వెళ్ళేడు.

మేనక వచ్చినా చలించని ధీరతంలో ఉన్నా విశ్వామిత్రుడిలాగా చార్టులో మునిగిపోయాడు చిదానందం.

"ఏమిటి?" పక్కనే కూర్చుంటూ అడిగాడు చిదంబరం.

ఆ ప్రశ్నకి చిదానందంగా నవ్వి "డబ్బు సంపాదించే సులువైన మార్గం " అన్నాడతను. తొలిసారి సినిమా తారని అతి దగ్గర్లో చూసిన పల్లెటూరి అర్భాకుడిలా, జీవితంలో మెట్టమొదటిసారిగా ఎలక్షన్ మీటింగ్ లో ప్రదానిని చూసిన గిరిజన మహిళలా అయ్యాడు చిదంబరం.

"డబ్బు అంత సులువుగా వస్తుందా?"

"అందరికి రాదు, ఈ రీడింగ్ తెలిసి వుండాలి. ఈ రన్నింగ్ తెలిసి వుండాలి ఓపెన్ ని, క్లోజుని పట్టుకోగలగాలి. అబ్బా అదో యజ్ఞంలే! నీ కెందుకు?"


జేబులోంచి పదిహేను పైసలు తీశాడు. తనూ రాశాడు. ఉహూ అతనితో రాయించాడు.

"ఇంతేనా?" పెదవి విరిచాడు.

"జీతంలో మిగిలిందిది" పేలవంగా నవేడు చిదంబరం.

ఆ మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో లక్ష్మి దేవి గలగలలతో మొదలయింది. ప్రొద్దున్నే పన్నెండు రూపాయలు తీసుకుని వచ్చాడు చిదానందం. "ఇదిగో నీ డబ్బు" అంటూ యిచ్చాడు.

"బ్రాకెట్ వచ్చిందా?" ఆత్రంగా అడిగాడు.

"నంబర్ తగిలింది?"

 Previous Page Next Page