Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 16


    "స్త్రీకి ముఖ్యం తన లైఫ్ లోకి ఎంతమంది మగాళ్ళు వచ్చారూ అన్నది కాదు.. ఆమగాళ్ళల్లో ఎంతమందిలో లైఫ్ వుందీ అన్న విషయం ముఖ్యం...." టీజింగ్ గా అంది.
    సురేష్ అదిరిపడ్డాడు.
    అమ్మో! మొఖం పగిలేలాకొట్టింది.
    టేబుల్ మీదున్న మంచినీళ్ళు గడగడ తాగేశాడు.
    తులసి అతని అవస్థ చూసి ఆనందిస్తోంది.
    "తులసి ఇందాకే చెప్పింది మీ ఎడ్వెంచర్స్ గురించి......" మాయ అంది.
    సురేష్ అనుమానంగా తులసివేపు చూశాడు.
    ఏమి చెప్పిఉంటుంది? తను ఇంట్లో అతిగా ప్రవర్తించటంగురించా?
    అదే అయుంటుంది ఎందుకయినా మంచిదనిముందే.....
    "అదా.....అదీ......అదీ......జస్ట్ ఫర్ ఫన్"
    ఆమెకు అర్ధంకాలేదు.
    "ఏమిటి ఫన్?"
    "అదే తులసితో.....ఇంట్లో....."
    తులసి టేబుల్ కిందనుంచీ అతని తొడమీద కందిపోయేలాగిల్లేసింది.
    "అక్క మాట్లాడేది ఆ విషయంకాదు...." కోపం అణుచుకుంటూ రహస్యంగా చెప్పింది.
    "అలాగా.......అయితే మీరే విషయం మాట్లాడుతున్నారు?"
    "మీరే విషయం అనుకుంటున్నారు?" టీజింగ్ గా అడిగింది మాయ.
    సురేష్ ఇబ్బందిగా తులసివేపు చూశాడు.
    తులసి సీలింగ్ కోసం వెతికి ఆకాశంవేపు చూసింది.
    "నీ జాబ్ సంగతి" టాపిక్ మార్చేసింది తులసి.
    "ఓ! అదా! అవునవును! ఆ విషయం తులసి అందరితో చెప్తూంటుంది"
    "ఒకవేళమీకు జాబ్ దొరకదనుకుంటే 'మోడలింగ్' చేస్తే కొంత హెల్ప్ ఫుల్ గా వుంటుందనుకుంటాను."
    "ఓ! మోడలింగ్! ఫెంటాస్టిక్ అయిడియా! అయామ్ ఆల్ ఫరిట్!......కానీ నన్ను అయ్ మీన్...నేను మోడల్ గా పనికొస్తానా?"
    "అయ్ థింక్ సో......మీ ఛాతీ ఇంకొంచెం ఉబికి ఉంటే బావుండేది! అయినా యూ కెన్ ఆల్వేస్ ఇంప్రూవ్! ఫరెగ్జాంపుల్ బుల్ వర్కర్స్..."
    "ఎక్సర్సయిజ్ చేస్తే ఫలితం చాలా త్వరగా వుంటుంది."
    "చేయకపోవటమేమిటి! రోజూ రాత్రింబగళ్ళు.....అమ్మో...." తులసి అందిరవరకు గిల్లిన చోటే మళ్ళీ గిల్లింది.
    "మీ ఫేస్ ఓ.కే పనికొస్తుంది."
    "ఆమాట మీరనుకుంటే ఏంలాభం?"
    "గోవా కోల్డ్ క్రీమ్ యాడ్ ఫిల్మ్ చేయటానికి వాళ్ళయూనిట్ ఒకటి నాలుగురోజుల్లోవస్తోంది. ఎడ్వర్టయిజింగ్ కంపెనీ బాస్ తో మీ విషయం మాట్లాడతాను"
    "థాంక్యూ.....అది సరేగానీ గోవా కోల్డ్ క్రీమ్ కీ, నర్సాపూర్ కొబ్బరి తోటలకు ఏమిటి సంబంధం?"
    "యాడ్ ఫిల్మ్ కీ, ప్రొడక్ట్స్ కీ ఏమీ సంబంధం ఉండక్కరలేదు. చూసేవాళ్ళ మనసుల్లో రిజిష్టర్ చేయగలుగుతే చాలు!ఇక్కడి దృశ్యాలు అందంగా ఉంటాయని సాధారణంగా వాళ్ళు ఇక్కడికే వస్తూంటారు. అదీ గాకుండా నేను ఇక్కడే ఉండటంవల్ల వాళ్ళకు రాజమర్యాదలన్నీ జరిగిపోతుంటాయి."
    "ఓహ్! అయ్ కెన్ 'అండర్' స్టాండ్ యూ నౌ!"
    మాయచురుక్కుమంటూ చూసిందతనివేపు.
    'పదక్కా! గార్డెన్స్ లో కెళ్దాం"
    ముగ్గురూతోటలోకి నడిచారు. కొబ్బరి చెట్లమధ్యలో రకరకాలపళ్ళ మొక్కలు, కూరగాయలు చెట్లూ నిండిపోయి వున్నాయ్. అంతా పచ్చగా కలకలలాడిపోతోంది.
    "మీరు హాయిగారోజూ కొబ్బరి బొళ్ళాలు తాగుతూంటారనుకుంటాను" మాయతో అన్నాడు.
    "రోజూకాదుగానీ ఎప్పుడయినా ఒకటి! ఎందుకనో తెలీదుగానీ ఈ కొబ్బరి బొళ్ళాం తాగినప్పుడల్లా వయసు అయిదేళ్ళు తగ్గిపోయినంత ఉల్లాసంగా ఉంటుంది."
    "వెరీగుడ్! అయితే ఈ సారి కొబ్బరి బొళ్ళాంతాగినప్పుడు నన్నుపిలవండి. తులసికంటే అయిదేళ్ళు పెద్దదాన్నని ఇందాక అభ్యంతరం చెప్పారు కదా!"
    మాయకు నవ్వాగలేదు. ఓ కొబ్బరిచెట్టుకానుకుని నవ్వింది కొద్ది సెకన్లపాటు. ఆమె కళ్ళవెంబడి నీళ్ళు కూయా వచ్చేసినయ్ ఆ నవ్వుకి.
    "అబ్బ! ఎంతకాలమయిపోయిందో ఇంతగా నవ్వి" కన్నీరు తుడుచుకుంటూ అంది! చాలా దూరంగా ఫెన్స్ దగ్గర చెట్లగుబుర్ల మధ్యకనిపించిందో అందమయిన హౌస్. ఒకే ఒక్క గది! చిన్న బాల్కనీ.
    "ఇదేమిటిక్కడా?" అడిగాడు సురేష్.
    "మహీధర్ యోగా ప్రాక్టీస్ చేస్తాడు......"
    "మైగాడ్! బుల్ వర్కరే కాకుండా యోగా కూడానా?"
    గంటసేపు పట్టింది తోటంతా తిరగడానికి.
    తులసిపూల మొక్కల మధ్యమైమరచిపోతోంది.
    "మళ్ళీ బొమ్మలు గీయాలనిపిస్తోంది. ఇక్కడి అందమయిన ప్రకృతి దృశ్యాలు చూస్తూంటే...." తన్మయత్వంతో అందామె.
    "కాలేజ్ లో చదువుతున్నప్పుడు చేశావ్.....అలాంటిదా?" అడిగాడతను.
    మాయనవ్వేసింది. "అవును! మర్చిపోయాను! 'వనకన్య' అని బొమ్మ గీసిందా రోజుల్లో అది ఇంకా ఉందా?"
    "ఉండటమా? దానిమీద నేను చేత్తో 'ఇలా' అంటుకోడానిక్కూడావీల్లేదని రూలింగ్ పెట్టింది."
    "రియల్లీ....ఇటీజ్ నైస్ పిక్చర్" అంది మాయ.
    "ఏమో! నాకుమాత్రం వనకన్య మెజర్ మెంట్స్ నచ్చలేదు"
    మాయకు అనుమానం వచ్చింది.
    "మెజర్ మెంట్స్ ఏమిటి?"    
    "అదే.......మెజర్ మెంట్స్ అంటే......మీ దగ్గర టేప్ ఉందా?"
    తులసి అతను కాలిమీద విరుసుగాతన్నింది.ల    
    దాంతో నార్మల్ అయిపోయాడు.
    "అంటే అదే....ఉదయం మీతో అన్నాడు చూడండీ! ఉన్నతమయినస్థితి.......అంటే....మీ లావూ, పొడుగూ, వెడల్పూ...అవన్నమాట."
    మాయమళ్ళీ మనసారానవ్వింది.
    "34......28......32 అంటే అర్ధం తెలీని పాపాయిననుకోకండి. పైగా నేను చేసేది మోడలింగ్ వృత్తి."
    సురేష్ నోరుతెరచేశాడు.
    అవును తనా విషయమే మర్చిపోయాడు. ఆమె తనకంటే ఫీల్డులో వుంది.
    మాయతులసితో తనగురించి చెప్తోంది.

 Previous Page Next Page