Home » Dr c. ananda ramam » Neeraja

                                          

    జరిగిన సంగతి ఎవరికైనా చెప్పాలో. చెప్పకూడదో కూడా నిర్ణయించుకోలేకపోయింది నీరజ.
    ఏమీ జరగనట్లే ఊరుకుంది నీరజ -- కానీ వేణు -- ఊరుకోలేదు -- ప్రభును పిలిచి "నేను ఒక్కసారి నీరజను పరీక్ష చేయాలి?" అన్నాడు.
    ప్రభుకు చాలా కోపం వచ్చింది.
    "పరీక్ష చెయ్యవలసిన అవసరం లేదు -- ఏమీ జరగలేదని నీరజ చెప్పింది."
    "ఆవిడ అలా కాక ఇంకెలా చెప్తుంది?"
    "నాకు నీరజ మాటల్లో నమ్మకముంది. అదీ కాక పోలీసులు నియమించిన డాక్టర్ కూడా నీరజకు ఏ ప్రమాదమూ జరగలేదని చెప్పాడు."
    "దానిదేముందీ? కాస్త లంచం పడేస్తే ఎలా అంటే అలా చెప్తాడు."
    ప్రభు కోపం అణచుకోలేకపోతున్నాడు.
    "అయినా మీకెందు కాబాధ? పెళ్ళి చేసుకోబోతున్నది నేను?" వెటకారంగా నవ్వాడు ప్రభు.
    "అవును నువ్వే! ఇంతటి మహాకార్యం మరొకరు చెయ్యలేరు- కానీ ఇది ఒక్క శీలానికి సంబంధించినది కాదు. ఆరోగ్యానికి కూడా సంబంధించినది ..... ఆవిడకు ఏవైనా జబ్బులు పట్టుకునే అవకాశం ఉంది. వెంటనే చెక్ చేయించుకోకపోతే, ఇంట్లో అందరి ఆరోగ్యాలూ పాడవుతాయి."
    ప్రభు నోట మాటరాలేదు - ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు వేణు?
    "నాకు నీరజలో నమ్మకం ఉంది. ఏ పరీక్ష చెయ్యవలసిన అవసరం లేదు - ఎవరికీ ఎలాంటి జబ్బులూ రావు."
    "పోనీ, ఒక్కసారి పరీక్ష చేస్తే వచ్చిన నష్టం ఏముందీ?"
    "నావల్ల కాదు -- నీరజను అలా అవమానించలేను."
    "అయితే నేను ఇక్కడిక ఉండలేను. మీకు ఉన్నంత త్యాగబుద్ది నాకు లేదు."
    "మీ యిష్టం."
    ఈ సంభాషణ అంతా రహస్యంగా జరగలేదు..... నీరజ , ల,లక్ష్మీదేవి,  యశోధర ఉండగానే జరిగింది.
    "నాకు చావు ఎందుకురాదో !" అని తల కొట్టుకుని లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
    "త్వరగా నీ సామానులు సర్దుకో!" అన్నాడు యశోధరతో వేణు.
    "సర్దుకునే ఉన్నాను!"
    శాంతంగా చెప్పింది యశోధర.
    "నిజంగానా?" ఆశ్చర్యంగా అడిగాడు.
    "ఎందుకంత ఆశ్చర్యం? మా అందరి మేలూ కోరి మీ రింతగా చెప్తోంటే కాదంటానా? ఎంత స్వార్ధత్యాగం మీది? మీకు ఏం వచ్చినా పరవాలేదనుకొని అర్ధరాత్రి పక్క దగ్గరకే వెళ్ళగలరు- మిగిలిన వాళ్ళు ఆరోగ్యం గురించి మాత్రం ఎక్కడ లేని శ్రద్దా తీసుకోగలరు ?" స్థాణువై నిలబడిపోయాడు వేణు.
    "ఎవరు చెప్పారు ఈ సంగతి ? నీరజేనా?"
    "కాదు! నీరజకు అంత మంచి బుద్ది లేదు - జరిగిందంతా మింగేసి సహనంతో నోరు మూసుకుంది -- ఆరోజు నీరజ గట్టిగా అరిచేసరికి నాకే మెలకువ వచ్చింది. నేనే అంతా విన్నాను."
    "విని ."
    "విని కూడా నోరు మూసుకున్నాను -- ఈ ప్రస్తావన మళ్ళీ మీ దగ్గర లేవటానికి కూడా అసహ్యం వేసింది -- కానీ,  ఇవాళ మీ ఔదార్యం చూసాక......"
    వేణు తల వంచుకుని వెళ్ళిపోయాడు - మళ్ళీ వెళ్ళిపోతానని అనలేదు -- కానీ వాతావరణంలో మాత్రం వెనకటి ఉల్లాసం పూర్తిగా లోపించింది.  
    యశోధర , వేణు వచ్చిన దగ్గరనుండి,  లక్ష్మీదేవి , నీరజ వీధి గదిలో పడుకుంటూన్నారు- ఒక రాత్రి వేళ లక్ష్మీదేవికి ఎందుకో మెలకువ వచ్చింది. వీధి తలుపులు తెరిచి ఉన్నాయి. లక్ష్మీదేవి గుండెలు ఝల్లుమన్నాయి.
    "దొంగ! దొంగ!" అని గట్టిగా అరిచింది -- ఆ గోలకు ఇట్లో అందరూ లేచారు -- కంగారుగా వెతుకున్నారు -- అన్ని వస్తువులూ ఉన్నాయి. ఏమీ పోలేదు.
    "అన్నట్లు నీరజ ఏదీ?" అన్నాడు వేణు.
    అందరూ నీరజ కోసం చూసారు -- ఎక్కడా లేదు.
    ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు -- ఎవరి మటుకు వారికే నోరు విప్పడానికే భయంగా ఉంది -- కానీ ఎవరూ నిద్రపోలేదు -- అందరూ హాలులోనే కూర్చున్నారు.
    "ఆ రాక్షసి నా కొడుకు గుండెలు పగలకొట్టడానికే పుట్టింది ....." అంటూ ఏడ్చింది లక్ష్మీదేవి.
    ఆ ఏడుపు విన్నాక మాట్లాడటానికి వేణుకు ధైర్యం వచ్చింది.
    "ప్రభూ! మీరా అమ్మాయిని మరచిపోవటమే మంచిది -- ఎప్పటికప్పుడే  ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కొంటూ ఎన్నాళ్ళని సహించగలరు ?" అన్నాడు.
    "అసలు నీరజ మళ్ళీ వస్తుందా?" బెంగగా అంది యశోధర.
    "పీడా వదిలిపోతుంది -- అది రాకపోతే వెయ్యి దేముళ్ళకు కొబ్బరికాయలు కొట్టుకుంటాను ." కసిగా అంది లక్ష్మీ దేవి.
    సరిగ్గా ఆ సమయంలో ఇంట్లోకి అడుగు పెట్టింది నీరజ.
    ముఖంలో కంగారు, భయమూ, ఆరాటమూ స్పష్టంగా కనిపిస్తున్నాయి . ఎంతో దూరం నుండి నడిచి వచ్చినదానిలా అలసటగా ఉంది -- అందరి ముఖాలలోకి ఒక్కసారి చూసి తలవంచుకుని నిలబడింది.
    "ఎక్కడికి వెళ్లావు నీరజా?" అనునయిస్తున్నట్ట్లుగా అడిగాడు ప్రభు.
    నీరజ మాట్లాడలేదు.
    అలాంటి పరిస్థితిలో కూడా ప్రభు నీరజతో అంత ఆప్యాయంగా మాట్లాడటం లక్ష్మీదేవి మనసు మండించింది.
    "నీరజా! నిన్ను నమ్మి కళ్ళు మూసి పడుకున్నందుకు తలుపులు బార్లా తీసి పోయావెందుకు ? దొంగలు పడి ఇల్లు దోచుకు పొతే ఏం జరిగేది?"
    వేణుకు అవకాశం దొరికింది.
    "ఏమిటండీ మీ పిచ్చి! నీరజ ఇక్కడ ఉండగా మీ ఇంటికి దొంగలేందుకు వస్తారు ?" అన్నాడు. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra