Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 16


    అందులో కొన్ని వందల మంది పిచ్చాళ్ళుండగా వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఇద్దరే సిబ్బంది కనిపించారు.
    "ఇంతమంది పిచ్చాళ్ళను మీ ఇద్దరే కంట్రోల్ చేయగలరా? వాళ్ళంతా కలిసి ఎటాక్ చేస్తే మీరేం చేస్తారు?" ఆశ్చర్యంగా అడిగారు అఖిలపక్షం వాళ్ళు.
    "పిచ్చాళ్ళు ఎప్పటికీ ఐకమత్యంగా ఉండలేరు సార్! వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకు ఛస్తూంటారెప్పుడూ -" చెప్పారు సిబ్బంది.

    ఆదిత్య రాత్రి తనకొచ్చిన అద్భుతమైన కల గురించి రాజేష్ కి చెప్తున్నాడు.
    "నిజంగా అంతమంచి కలకనటం ఎవడివల్లా కాదు బ్రదర్! నేను సింగపూర్ వెళ్ళానంట! అక్కడ హోటల్ రూమ్ లో నలుగురు బ్యూటిఫుల్ గాళ్స్ ఒకేసారి నా మీద పడి ఒకటే లవ్ మేకింగ్ అబ్బ! భలే ఎంజాయ్ మెంట్ లే!"
    రాజేష్ అతనిని చూసి జాలిగా నవ్వాడు.
    "నీ కల కంటే అద్భుతమయిన ఇన్సిడెంట్ నాకూ రాత్రే జరిగింది! పైగా అది రియల్!"
    ఆదిత్య ఉలిక్కిపడ్డాడు.
    "రియలా? ఏంటది?"
    "రాత్రి సుష్మిత, సుష్మిత ఫ్రెండ్ వినీల ఇద్దరూ నా రూమ్ కొచ్చి నైటంతా నాతోనే ఉండిపోయారు-"
    "ఇదన్యాయం రా! వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఫోన్ కొడితే నేనూ వచ్చేవాడిని కదా! ఇద్దరం చెరో గాళ్ తో ఎంజాయ్ చేసేవాళ్ళం!"
    "భలేవాడివే! నీ కోసం నాలుగుసార్లు ఫోన్ చేశాను- ఎప్పుడు చేసినా మీ బ్రదర్ నువ్ సింగపూర్ లో ఉన్నావని చెప్పాడు"

    "చిన్నప్పుడు నువ్వు స్కూలు మానకుండా రెగ్యులర్ గా వెళ్ళి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ వస్తూండే వాడివా నాన్నా?"
    "అవున్రా! ఒక్కరోజు కూడా స్కూల్ మానలేదు- హోమ్ వర్క్ మానలేదు- ఎప్పుడూ క్లాస్ ఫస్టే-"
    "మరిప్పుడు అవన్నీ నేనూ చేసినా లాభమేముంది నాన్నా! నీలాగా నాకూ దొరికేది ఈ చిన్న ఉద్యోగమేగా!"

    ఒక పెద్ద సూపర్ బజార్ యజమాని తన స్టోర్స్ లో ఎప్పటినుంచో జరుగుతోన్న ఓ దొంగతనం కనుక్కుని - అందుక్కారణమైన ఉద్యోగిని పట్టుకున్నాడు.
    తీరాచూస్తే అతను తనకు చాలా నమ్మకస్థుడయిన రంగనాథం-
    "అయామ్ వెరీ సారీ రంగనాథ్! నువ్ ఈ అయిదేళ్ళల్లో దగ్గర దగ్గర యాభై లక్షలు కాజేశావ్! ఇప్పుడీ విషయం అందరి ఎదురుగ్గా బయటపెట్టాననుకో! నువ్ జైలు కెళ్ళటమే కాదు- నా కంపెనీకి చెడ్డపేరు  వస్తుంది. అందుకని జరిగిందంతా మర్చిపోయి నిన్ను డిస్ మిస్ చేస్తున్నాను- నోర్మూసుకుని వెళ్ళిఫో-" అన్నాడు బాస్.
    "ఓకే సార్-వెళ్ళిపోతాను నాకేం ప్రాబ్లెం లేదు. ఈ అయిదేళ్ళల్లో నేను నాలుగు ఇళ్ళు కొన్నాను - చాలా మంచి కంపెనీల షేర్లు కొన్నాను. నాలుగు కార్లుకొని ఒక ట్రావెల్స్ కంపెనీ పెట్టాను. నెలకు పాతికవేలు వడ్డీ వస్తుంది. అద్దెలు వస్తాయ్ - కనుక నేనింత దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఇప్పుడు ఇవేమీ లేనివాడిని - నా స్థానంలో అపాయింట్ చేసుకున్నారనుకోండి మళ్ళీ ఏం జరుగుతుందో మీకే తెలుసు-"

    జైల్లో సాధారణంగా విజిటర్స్ డే నాడు ఖైదీలందరి కోసం వారి వారి కుటుంబీకులు, స్నేహితులు, దగ్గర బంధువులు రావటం వారితో కలసి ఖైదీలు సరదాగా గడపటం పరిపాటి.
    కానీ ఒకే ఒక్క ఖైదీకోసం ఒక్కరు కూడా రాకపోవటం ఆ జైలు వార్డెన్ కి అనుమానం కలిగించింది.
    "ఏమోయ్ సింగారం! నీకోసం ఎవ్వరూ రావటం లేదేమిటి సంగతి? నీకు బంధువులూ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సూ ఎవ్వరూ లేరా?"
    "చాలామంది ఉన్నారు సార్-"
    "మరి వాళ్ళల్లో ఒక్కరైనా నిన్ను చూడ్డానికి రారేం?"
    "వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కద్సార్-"

    ఒక లోకల్ రాజకీయ నాయకుడు తన చెంచాలను వెంటేసుకుని ఓ పత్రికాఫీస్ లోకి జొరబడి ఎడిటర్ గల్లా పట్టుకున్నాడు.
    "ఏందిరా! నాగురించి న్యూస్ ఎట్ల రాసినావ్ బే!"
    "మీరు పార్టీ పోస్ట్ కి రిజైన్ చేశానని స్టేట్ మెంట్ ఇచ్చిన్రు గద్సార్! గదే ఛపాయించినాం-"
    "అరే హౌలే! ఆ న్యూస్ ఏ హెడ్డింగ్ కింద ఏసినావ్ బే? 'ఉందిలే మంచీ కాలం ముందుముందునా' అనే దానికింద ఏస్తారు బే?"

    లాయర్ ని తన తరపున వాదించమని కోరడాని కొచ్చిన వ్యక్తి కేస్ గురించి అంతా వివరంగా చెప్పాడు.
    లాయర్ చాలా ఉత్సాహంగా, హాపీగా ఫీలయ్యాడు.
    "అంతా అన్ని విధాలా నీకు ఫేవర్ గా ఉంది! ఈ కేస్ లో నిన్ను గెలిపించలేకపోతే ఇంకా నా లాయర్ ప్రాక్టీసే దండగ- డెడ్ ఈజీ కేస్! షూర్ గా- సెంట్ పర్సెంట్ గెలుస్తావ్"
    లాయర్ మాటలు విన్న వ్యక్తి నెమ్మదిగా లేచి నిలబడ్డాడు.
    "అలాగయితే ఇంక కోర్ట్ కెక్కడంలో అర్ధంలేద్సార్! ఎందుకంటే ఇంతవరకూ ఈ కేస్ వివరాలు నా ప్రత్యర్ధి తరపున - అతని పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పాను. మీరు చెప్పిన లెక్కన వాడితో రాజీపడటమే బెస్ట్" అనేసి వెళ్ళిపోయాడతను.

    ఓ కోటీశ్వరుడి భార్య చనిపోయి చాలా రోజులయాక ఆ ఊరి గుడి కమిటీ వాళ్ళు ఆయన దగ్గర డబ్బు కొట్టేయడానికి అదే మంచి ఛాన్సని ఆయనింటికి వచ్చారు.
    "సార్! మీ భార్య మహా ఉత్తమ ఇల్లాలని మన ఊళ్ళో అంతా చెప్పుకుంటారు. అలాంటామెను ప్రతిక్షణం భక్తులకు గుర్తు తెచ్చే విధంగా తమరేదయినా వస్తువు గుడికి దానం చేశారంటే ఆమె ఆత్మ ఎంతో సంతోషిస్తుంది-"
    ఆయన చాలాసేపు ఆలోచించి ఓ లౌడ్ స్పీకర్ గుడికి బహుకరిస్తున్నట్లు ఎనౌన్స్ చేశాడు.
    "మా మిసెస్ ని గుర్తుకి తెచ్చేదిదొక్కటే" అన్నాడు హ్యాపీగా.

    ఒక సీనియర్ పార్టీ లీడర్ మాట్లాడితే ముఖ్యమంత్రి దగ్గరకొచ్చి తన లాంటి గొప్ప ప్రతిభగల నాయకుడికి వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని పేచీ మొదలుపెట్టాడు.
    ముఖ్యమంత్రి అతన్నెలా వదిలించుకోవాలో తెలీక "ఈ సారి మంత్రి పదవి వేకెన్సీ రాగానే నీకే ఇస్తాను" అని ప్రామిస్ చేశాడు.
    ఇది జరిగిన రోజునే హుస్సేన్ సాగర్ లో మునిగిపోయిన ఓ వ్యక్తి శవాన్ని పోలీసులు బయటకు లాగుతోంటే దారిన పోతున్న ఆ సీనియర్ పార్టీ లీడర్ చూసి ఆ చనిపోయిన వ్యక్తి రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడని గుర్తుపట్టి వెంటనే ఆనందంతో ముఖ్యమంత్రి దగ్గరకు పరుగెత్తాడు.
    "సార్! ఇప్పుడే మీ మినిష్టర్ శంకరయ్య డెడ్ బాడీని హుస్సేన్ సాగర్ లో నుంచి తీస్తూండగా చూశాను సార్- అతని మంత్రి పదవి ఖాళీ అయింది గనుక నాకే ఇవ్వాలి సార్-" అన్నాడు ఆశగా.
    "సారీ బ్రదర్! ఆ పోస్ట్ ఇందాకే భర్తీ అయిపోయింది. ఆ మినిష్టర్ శంకరయ్య హుసేన్ సాగర్ లో దూకబోతూండగా చూసిన మన పార్టీ లీడర్ రత్నారెడ్డి అప్పటికప్పుడే వచ్చి ఆ పోస్ట్ తనకు రిజర్వ్ చేసుకున్నాడు. ముందు వచ్చి అడిగాడు గనుక అతనికే ఇవ్వక తప్పలేదు-" అన్నాడు ముఖ్యమంత్రి.

    ఓ కుర్రాడు స్కూల్ కెళ్ళనని మారాం చేస్తుంటే తండ్రి వాడినెలాగైనా స్కూల్ కి పంపాలని ప్రయత్నిస్తున్నాడు.

 Previous Page Next Page