Previous Page Next Page 
శతఘ్ని పేజి 16

 

    "దేనికి?" అడిగాడు అప్పారావు.
    
    "ఇంతమందిపోయిన సందర్భంలో చచ్చిన ఆత్మసంతృప్తి పడాలి అంటేరాష్ట్ర ప్రభుత్వం బ్రిటీష్ ప్రధానిని రప్పించాలనీ క్షమార్పణలు చెప్పిస్తేగాని తను పచ్చినీళ్ళయినా ముట్టనని శపథంచేస్తాడు......"
    
    అంతాచప్పట్లు కొట్టారుకాని బ్రహ్మాజీకి ముచ్చెమటలుపోశాయి.
    
    "ఆ తర్వాత బ్రహ్మాజీరోజు రోజుకి శుష్కించిపోతాడు. ప్రభుత్వం నిమ్మరసం ఇచ్చి నిరాహారదీక్ష విరమింపచేయాలని ప్రయత్నిస్తుంది. తిరస్కరిస్తాడు బ్రహ్మాజీ,

    పూజ్యపొట్టి శ్రీ రాములుగారి ఫక్కీలో నీరసించిపోయే బ్రహ్మాజీని చూసిన ప్రజలు కలత చెందుతారు. ఉద్యమం మరింతగా ఉధృతమౌతుంది"
    
    "బెమ్మాజీబాయి సచ్చిన రోజు యింకా వూరూ వాడా ఏకమైపోద్ది అప్పుడు గరవ్నమెంటు కూలిపోద్ది" నాయుడు తన విశ్వాసాన్ని వ్యక్తంచేశాడు.
    
    అంతేకాదు మిగతా జిల్లా ప్రతినిధులంతా ముక్తకంఠంతో నిరాహారదీక్ష నిర్ణయాన్ని సమర్ధించడంతోబాటు ఇక మొదలుపెట్టాల్సిన ఉద్యమానికి వ్యవధి లేనట్టు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.
    
    "ఇదిదారుణం" అరిచాడు బ్రహ్మాజీకంపించిపోతూ "ఏమిటి?" చిద్విలాసంగా నవ్వాడు పరమహంస "నాతోచెప్పకుండా నా నిరాహారదీక్షని మీరు ప్రకటించడం."
    
    "తప్పదు బ్రహ్మాజీ యిప్పుడు మనం అనుభవించే స్వాంతంత్ర్యం ఎందరెందరో మహాత్ములు ప్రణాలొడ్డి సాధించింది. అలాగే నువ్వూ ప్రాణాన్ని......"
    
    "వీల్లేదు నేను మహానాయకుడ్ని కావాలనుకుంటున్నాను తప్ప మహాత్ముడ్ని కాదలుచుకోలేదు"
    
    స్కౌండ్రల్స్ కి చివరి లక్ష్యమైన రాజకీయాల గురించి అంత అందంగా నిర్వచించిన బ్రహ్మాజీని చూసి నవ్వాడు పరమహంస" నవ్వడం కాదు.....ఒక్కసారైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిఅయితే తప్ప నేను చావదలుచుకోలేదు."
    
    "ఎవరన్నారు నువ్వు ఛస్తావని"
    
    "ఈదేశానికి బ్రిటిష్ ప్రధాని వచ్చే అవకాశం లేనప్పుడు క్షమార్పణలు చెప్పే ఛాన్సు లేనప్పుడు నేను చావడం ఖాయం"
    
    "నువ్వుసగం లుచ్చాగాడివి"
    
    "పరమహంసగారూ"
    
    "కాబట్టేపూర్తిస్థాయి లుచ్చాలా అంటే పరిపక్వత వున్న రాజకీయ నాయకుడిలా ఆలోచించలేకపోతున్నావు.
    
    పరమహంసలో యిందాకటి ప్రసన్నతలేదు. అతడికళ్ళు మండుతున్న అగ్నిగోళాల్లా మారిపోయాయి "బ్రహ్మాజీ...... అసలు నువ్వు చస్తేపెట్టిన నా పెట్టుబడి మాటేమిటీ అని నన్ను నిలదీయాల్సింది ముకుందం. కాని అడగటానికి నువ్వెవడివి..... పైకిరావాలి అని వుంటేచెప్పినట్టుచావు..... అంతేగాని ప్రశ్నించకు....." పరమహంసదూకుడుగా గదిలోకివెళ్ళిపోయాడు.
    
    రెండుక్షణాల మౌనంతర్వాత బ్రహ్మాజీవెళ్ళాడు పరమహంసదగ్గరికి "క్షమించండి...... రెండు రోజుల్లో నిరూపించుకుంటాను."
    
    "ఏమని"
    
    "నేను నూరుశాతం లుచ్చానని."
    
    "బ్రహ్మాజీ......" క్రూరంగా నవ్వాడు పరమహంస "నిప్పు రవ్వ రగిలింది అది ఓ దావానలంగా మారబోతూంది. కాలిపోతున్నవాళ్ళని రాలిపోతున్న వాళ్ళని చూసి ఆనందించుతప్ప నీ చావు గురించికంగారు పడకు......"
    
                                                                 * * *
    
    "అంకుల్"
    
    ఇంటిఆవరణలో బైక్ ఆపగానే ఎనిమిదేళ్ళమున్నీ పరుగున వచ్చి త్యాగిని చుట్టేసింది. మసకచీకటి......శ్మశానంలా పేరుకున్న నిశ్శబ్దం......కొన్ని క్షణాలక్రితమే చల్లబడినతుఫాను ప్రశాంతత గుంపుగా చేరిన జనంఒక్కొక్కరూ కదిలి వెళుతుంటే ముందు జరిగిందేమిటో అర్ధం కాలేదు.
    
    మనసుచుట్టూ జ్వలిస్తున్న కాంతివలయాలు.
    
    పాపనెత్తుకుని వేగంగా గదిలోకినడిచి లైటువెలిగించాడు.....
    
    కూలినద్వారం...... పగిలిన కుర్చీ...... అస్తవ్యస్తంగా సీలికలైపడివున్నా పుస్తకాలూ..... "ఏ......మైంది" త్యాగిగొంతులో గగుర్పాటు లేదు...... పూర్తిగా అర్ధంకాని విషయాన్ని లోతుగా తెలుసుకోవాలన్న తపన ..... మున్నీ కళ్ళలో నీళ్ళు పేరుకుంటున్నాయి. అదికాదు....... భయం వలనేమోయింకా కంపిస్తూనే వుంది.
    
    "మున్నీ....." అంకుల్ అలా నవ్వుతూమాటాడ్డం నచ్చలేదుమున్నీకి" మరేమో......వాళ్ళంతా జీపులో నీకోసం వచ్చారా నువ్వులేవని కోపంతో కొట్టారు...... నాన్న అడ్డుకోబోతే......"
    
    అప్పుడు చూశాడు ద్వారం దగ్గిరనిలబడ్డ మున్ని తండ్రి సూర్యాన్ని.......తలకి బాండేజ్ తో తనపై జరగాల్సినదాడికి బలైనతొలిసాక్షిలా కనిపించాడు.
    
    మనసుబాధగా మూలిగింది. ఆయింట అద్దెకు దిగింది రెండు నెలల క్రితమే అయినా పాప చేరికతో అన్నలా ఆప్యాయంగా పలకరించే సూర్యం ఆత్మీయతలో రెండేళ్ళ అనుబంధాన్ని పెంచుకున్న త్యాగి తనకుజరిగిన నష్టం గురించి ఆలోచించడం లేదు. నెమ్మదస్తుడిలా, సంస్కారవంతుడిగా తెలిసినసూర్యపై జరిగిన దాడిగురించే కలవరపడ్డాడు. "అంకుల్ యింటికి రాగానే కంప్లయింట్ మొదలు పెట్టావా ఇంటికెళ్ళు" బాధనిపించిందేమో- "వచ్చిందెవరు?" అడిగాడు త్యాగి.
    
    "ఎవరైతేనేం..... వచ్చారు...... వెళ్లారు...... ముందు నువ్వుకాళ్ళూ చేతులు కడుక్కుంటే కాస్త ఎంగిలిపడొచ్చు. అప్పుడప్పుడూ ఇలా బలవంతంచేసి భోజనానికి తీసుకు వెళ్ళడం అలవాటే. ముందునా ప్రశ్నకి జవాబు చెప్పండి సూర్యంగారూ...." సూర్యం మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.
    
    "పోలీసు కంప్లయింటిచ్చారా....." అడిగాడు త్యాగి మళ్ళీ....." జరిగింది పెద్దనష్టమేం కాదయ్యాత్యాగీ.... ఆ విషయం మరిచిపో"
    
    మున్నీని కిందికి దించిన త్యాగిపాపతో అన్నాడు చనువుగా "మీ డాడీతో మాటాడాలి...... మంచి పాపంటే చెప్పగానే మమ్మీదగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట......"
    
    మున్నీ వెళ్ళిపోయింది మంచిపాపలాగే.

 Previous Page Next Page