Previous Page Next Page 
భామ కలాపం పేజి 16

 

    బెడ్ మీద నగ్నంగా పడుకుని, పాలిపోయిన మొహంతో చూస్తున్న అమ్మాయి గాభరాగా బ్లాంకెట్ ని గుండెల మీదకు లాక్కుంది.


    "వెల్, అరుణాచలంగారూ! మీరు చెప్పినట్లు ఈ అమ్మాయి మీ భార్యే అనుకుందాం. అయితే ఈ విషయం అందరికి తెలిసేటట్లు చేస్తే బాగుంటుంది కదా! అలా అని ప్రకటిస్తూ ఒక స్టేట్ మెంటు సంతకం పెట్టి ఇవ్వగలరా?"

 

    అరుణాచలం నాలుగడుగులు వెనక్కి వేసి, శక్తి విహినంగా మంచం మీద కులబదిపోయాడు.

 

    "అల్ రైట్! మీరు నోరు మూసుకుని ఉండటానికి ఏం ఇవ్వమంటారు?" అన్నాడు బేరానికి దిగుతూ.

 

    "గెట్ ద హెల్ అవుట్ ఫ్ హియర్!" అంది సుదీర పెద్దగా.

 

    గదిలో ఉన్న అమ్మాయి చీర చుట్టేసుకుని , ఒకసారి మేనేజరు వైపు చూసి త్వరత్వరగా బయటికి వెళ్ళిపోబోయింది.

 

    "అగు!" అంది సుదీర.

 

    మంత్రం వేసిన పాములాగా ఆగిపోయింది ఆ అమ్మాయి.


    వంగి, మంచం కింద పడి వున్న బ్రాసరిని వెళ్ళ కొనలతో పట్టుకుని అంది సుదీర "ఇది కూడా తీసుకెళ్ళు!" అంది.


    ఎర్రబడ్డ మొహంతో అది అందుకుని,  పరుగెత్తి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి.

 

    అరుణాచలం కూడా హడావుడిగా బట్టలు తగిలించుకుని జారుకున్నాడు.

 

    మెనేజరువైపు తిరిగింది సుదీర. "ఇది హొటలా? వ్యభిచారపు కొంపనా?" అంది తీవ్రంగా.


    అతను చేతులు జోడించాడు. "నాకు ఏ పాపమూ తెలియదు మేడమ్! ఈ పనివాళ్ళలోనే ఎవరో వెధవలు లాలూచి పడి ఇలాంటి దగుల్భాజీ పనులు చేయిస్తున్నట్లున్నారు."

 

    "అవును పాపం! మీకే పాపము తెలియదు. ఈ పాప మీ అమ్మాయేనా, కాదా?"


    ఒక్కసారిగా వెయ్యేళ్ళ వయసు మీద పడినట్లుగా కుంచించుకు పోయాడు మేనేజరు.

 

    "కన్నకూతురి చేత వ్యభిచారం చేయిస్తారా? బ్లడీ షిట్!" అంటూ కారిడార్ లో ఉన్న ఫోన్ ఎత్తింది సుదీర. "ఎకౌంట్స్ క్లర్కు కావాలి."


    కొద్ది క్షణాలలో ఎకౌంట్స్ క్లర్కు లైనులోకి వచ్చాడు.

    
    మేనేజరుగారు రిజైన్ చేస్తున్నారు. ఆయనకి రావలసిన శాలరి, గ్రాట్యుయిటి అన్ని లెక్క వేసి రెడీ గా ఉంచండి."

 

    "అమ్మాయిగారు! పెళ్ళి కావలసిన కూతుళ్ళు ఇంకా ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగంలో నుంచి పికేస్తే ఈ సంగతి తక్కిన హోటల్సు కి తెలిస్తే, ఇంక నాకు పుట్టగతులు ఉండవు."

 

    "కూతుళ్ళ పెళ్ళిళ్ళు చెయ్యి, వాళ్ళ చేత రంకు చేయించకు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కుదిరాక నా దగ్గరకు రా, సాయం చేస్తాను." అంది ఖచ్చితంగా.

 

    ఆ తరువాత అరగంట వ్యవధిలో కొంతమందికి పనిష్ మెంట్, విధించి, మరి కొంతమందికి ప్రోత్సాహం ఇస్తూ ఇంక్రిమెంట్లు ప్రమోషనులు ఇచ్చింది సుదీర.


    తరువాత సుదీర, సారధి రెస్టారెంట్ లో కూర్చుని కాఫీ సిప్ చెయ్యడం మొదలెట్టారు.

 

    గాడ్! కన్నకూతురి చేతే ఇలాంటి పనులు చేయిస్తాడా రోగ్! అయినా, ఈ రహస్యాలన్నీ నీకెలా తెలిశాయి?" అంది సుదీర.


    నా పద్దతులు నాకున్నాయి" అన్నాడు సారధి చిరునవ్వుతో.

 

    "తలుచుకుంటేనే తల తిరిగిపోతోంది. ఈ రెస్టారెంట్ నిజంగానే గిరగిర తిరిగిపోతున్నట్లు అనిపిస్తోంది."

 

    సాలోచనగా ఆమె వైపు చూస్తూ అన్నాడు సారధి - "ఎగ్జాక్ట్లి నేను అదే చెప్పబోతున్నాను . మన హొటల్లో రివాల్వింగ్ రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటుంది?"

 

    అప్పటిదాకా వెనక్కి జారగిలబడి కూర్చున్న సుదీర కాఫీ కప్పు బల్ల మీద పెట్టేసి, "ఏమిటి?" అంటూ ఉత్సాహంగా ముందుకు వంగింది.

 

    అలా వంగినప్పుడు ఆమె షర్టు మధ్య ఖాళిలో నుంచి కనబడుతున్న వక్షస్థలం వైపు తదేకంగా చూశాడు సారధి.


    తన ఉత్సాహంతో అది గమనించలేదు సుదీర. "రివాల్వింగ్ రెస్టారెంట? చెప్పు చెప్పు! అంది.

 

    "ఇన్నాళ్ళ నుంచి మన హొటలు పాత పద్దతుల్లో నడిచింది. అభిమానం కొద్ది పాతకాలపు కస్టమర్స్ కొంతమంది రెగ్యులర్ గా వస్తున్నారు.......అంతే! కొత్తతరం వాళ్ళని, టినేజర్స్ ని ఆకర్షించాలంటే తమాషాలు చెయ్యాలి! రివాల్వింగ్ రెస్టారెంట్ అందులో ఒకటి."

 

    "డన్! చేసేద్దాం. ఇంకా?"

 

     ఒక కనుబొమ్మ పైకి ఎత్తి కాసేపు ఆలోచించాడు సారధి. "ఇంతవరకూ ఈ హైదరాబాదు  సిటిలో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, తందూరి , మొఘాలాయి, చైనీస్, కాంటినెంటల్ వెరైటి డిషెస్ మాత్రమే చేస్తున్నారు. మనం ఇంకా ముందుకు పోయి ఎగ్జోటిక్ గా ఫ్రెంచి వంటకాలు కూడా మొదలెడదాం. చెర్రిస్ ప్లాంబెల్స్ క్రేప్స్ నూజెట్టి, కాఫీ అ లేయిట్."


    "పారిస్ లో మాగ్జిమ్స్ లో లాగానా? డన్! చేసేద్దాం. ఇంకా?"

 

    "ఫోన్ డ్యూ! ఫోన్ డ్యూ అంటే మీకు తెలిసే వుంటుంది. చిన్న ట్రోలిలో పెనం వుంటుంది. దాన్ని తోసుకుంటూ కస్టమర్స్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తారు. ఆమ్లెట్ వేసి, దానిమీద విస్కీపోసి అవిస్కిని అంటిస్తారు. దానిలో కాలుతుంది ఆమ్లెట్.....!

 

    బోర్ గా చూసింది సుదీర. "నాకు హొటల్ మేనేజ్ మెంటులో ఆనర్స్ డిగ్రీ వుందని మర్చిపోతున్నావ్! ఫోన్ డ్యూ అంటే ఏమిటో నాకు వివరించక్కర్లేదు. ఆ సింపుల్ పద్దతి కూడా ఇక్కడ లేదా?"

 

    "ఉన్నట్లు లేదు"

 

    "ఒకే! పెడదాం"

 

    "చైనీస్ పుడ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక జోక్ చెబుతాను. ఒక చైనీయుణ్ణి "మీరు ఏమేమి తింటారు?" అని అడిగితే 'గాల్లో ఎగిరేవాటిల్లో గాలిపటాలని, నాలుగు కాళ్ళు ఉండే వాటిల్లో కుర్చిలని బల్లలని తప్ప మిగతావన్నీ తింటాం" అని చెప్పాడట!"

 

    వెనక్కి జారగిలబడి నవ్వింది సుదీర. ఆ భంగిమలో షర్టు బిగుతుగా ఒంటికి అతుక్కుపోయి ఆమె వంపులని స్పష్టంగా బయట పెడుతోంది.


    కళ్ళార్పకుండా చూశాడు సారధి. "ప్ర్హెంచి వాళ్ళ సంగతి వచ్చింది కాబట్టి ఒక ఫ్రెంచి జోక్ కూడా చెబుతాను. ఒక నావికుడు రెండు సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడట. ఇంటిదగ్గర అతని భార్య నెలల పాపాయిని ఎత్తుకుని పాలు ఇస్తోంది.

 

    అతను మండిపడి, "నేను లేకుండా ఎలా పుట్టింది పాప, చెప్పు.......నా ఫ్రెండ్ బాబ్ గాడి పనేనా ఇది?' అని నిలదీశాడు.

 

    'కాదు' అంది భార్య.

 

    "నా ఫ్రెండ్ బిల్ గాడు కదూ?"

 

    "కాదు...........కాదు!"

 

    "నా ఫ్రెండ్ మైక్ వెధవే అయింటాడు! అవునా?"

 

    "నా ఫ్రెండ్స్..........ఫ్రెండ్స్! ఎప్పుడూ నీ ఫ్రెండ్స్ నా? నాకు ఫ్రెండ్స్ ఉండరనుకున్నావా?" అంది భార్య విరుచుకుపడుతూ.

 

    నవ్వుని మింగేసి, అతని వైపు తీవ్రంగా చూసింది సుదీర.

 

    "సారీ! ఎందుకో గానీ, జోకులు ఎక్కువగా సెక్సు కి సంబంధించినవే ఉంటాయి. అందులో ఫ్రెంచ్ వి మరీనూ!"

 

    "ఇంక వెళ్దామా?" అంది సుదీర. ఆమెలో ఇందాకటి హుషారు లేదు.

 

    ఆమెకి కోపం వచ్చిందని గ్రహించాడు సారధి. వెంటనే వినయంగా అన్నాడు.

 

    "మేడమ్! ఒకవేళ మీరు ఇలా కొత్త కొత్త ఎక్స్ పెరిమెంట్లు చెయ్య దలుచుకుంటే ఈ హొటలు అందుకు సుటవదు. దీన్ని మార్పులతో ఇలాగే ఉండనిచ్చి వేరే పైవ్ స్టార్ హొటల్ కడితే బాగుంటుంది.

 

    "ఫైవ్ స్టార్ స్థాయి కావాలంటే హొటల్ కి ఉండవలసిన హంగులేమిటి?" అంది సుదీర. అతని జనరల్ నాలెడ్జిని పరిక్షిస్తున్నట్లు.

 

    "స్విమ్మింగ్ ఫూల్, ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టరు, కాంపౌండులోనే పోస్టాఫీసు, బాంకు లాండ్రి, బుక్ స్టాల్, ట్రావెల్ ఏజన్సీ, బ్యూటి సెలూన్, హెల్త్ క్లబ్, కాన్పరేన్సు హాలు, రూముల్లో ఫైవ్ ఛానల్ స్టీరియో , టి.వి. టెలిఫోన్, ఎయిర్ కండిషనర్..........."

 

    "అల్ రైట్! నేను స్టేట్స్ లో ఉన్నప్పుడే అక్కడ ఉన్న ఒక హొటల్ చెయిన్ తో ఒక ఒప్పందానికి వచ్చాను. వాళ్ళ కొలాబరేషన్ తో ఇక్కడ ఫైవ్ స్టార్ హొటలు కడతానని. కానీ స్థలమో? ఊరి మధ్య మంచి స్థలం దొరకాలంటే ప్రాబ్లం కదా?"

 

    "నా దృష్టిలో రెండు మూడు మంచి స్థలాలు ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడొచ్చు."

 

    "లెటజ్ గో!"

 

    కార్లో వెళ్ళేటప్పుడు చెప్పింది సుదీర. "ఫైవ్ స్టార్ హొటలంటే రాత్రింబవళ్ళు తెరిచి ఉండే కాఫీ షాపు, నాలుగైదు రకాల ఫాన్సీ రెస్టారెంట్లు ఉండి తీరాలి. వాటికి ఫాన్సీ పేర్లు పెడితేనే బాగుంటుంది కదూ!"

 

    రెండు స్థలాలు చూశారు. పెదవి విరిచింది సుదీర. అవి మరి చిన్నవిగా ఉన్నాయి. అక్కడ హొటలు కడితే వచ్చేపోయే కార్లకి మంచి అప్రోచ్ రోడ్లు లేవు. అన్ని ఇరుకు సందులు.

 

    మూడో స్థలం చూసి చూడగానే "దిసీజ్ ఇట్.......ఇదే మనకి కావాలి!" అంది సుదీర ఎగ్జయిటెడ్ గా.

 Previous Page Next Page