రామచంద్రం ఆఫీసు కెళ్ళబోతూ భోం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఏవో మాటలు రావటంతో దానిమీద బాబా ప్రసక్తి వచ్చింది.
ఆఫీసు కాలశ్యం అవుతుందనేమోననే తొందరలో గబగబ అన్నం తింటున్న రామచంద్రంకి ముద్ద గొంతుకడ్డం పడి దగ్గొచ్చింది.
"నెమ్మదిగా భోం చేయండి నాన్నా ఆఫీసు టైము కాలేదులే. అంది సీత.
"నేను అన్నం సరిగ ఎక్కడ తిననో అని నీ భయం టైం కాలేదని చెపితే చాలా పిచ్చి తల్లి టైము టైమే కొత్తగా వచ్చిన ఆఫీసరు చండశాసునుడు. ఎన్నాళ్ళనుంచో పటుకుపోయినవాడిని కూడా ఏరి పారేయ్యగల కఠినుడు ఈ ఉద్యోగం కూడా లేకపోతే గంజి తాగడానికి కూడా నోచుకోము."
"అలా అనుకోవటం ఎందుకులే నాన్నా!" అంది సీత తండ్రి కంచములో మజ్జిగా పోస్తూ.
"ఇలా ప్రతి నిమిషం భయంతో అనుకోవటం నాకూ మీకు మంచిదమ్మా! ఈ ఉద్యోగం లేకపోతె ఎవరో ఆదుకుంటారనే ఆశ లేదు కదా. మొన్న మొన్నటిదాకా నాకేమయినా ఫరవాలేదు బాబా వున్నాడనుకున్నాను. రెక్కలొచ్చిన పక్షిలా వాడిదోవ వాడు చూసుకున్నాడు. వాడు చేసిన ఘనకార్యం బాగుంది. నే అంటే తప్పోచ్చింది. నెలనెలా డబ్బు పంపేవాడు అది మానేశాడు. ఉత్తరం ముక్క అది మానేశాడు. ఎవరేమి మానేసినా నాకు తప్పదమ్మా. తప్పనప్పుడు భయపడటంలో తప్పేముంది?" అంటూ రామచంద్రం పిటమీద నుంచి లేచాడు.
సీత ఏమి మాట్లాడలేదు. "బాబా వచ్చిన ఆ వక్కసారి సహనం వహిస్తే, ఈ బాధ నికుండేది కాదు నాన్నా! బాబా తొందరపడ్డాడు సరే మీరూ అదే చేశారు కదా? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు." అనుకుంది.
బాబా పెళ్ళి చేసుకుని రావటం వెంటనే వెళ్ళటం జరిగి ఆరు నెలలయింది. బాబావద్ద నుండి మళ్ళి కబురు లేదు. ఈ అరునెలలలో రామచంద్రం తలలో నున్న మిగిలిన కొద్ది పాటి నల్ల వెంట్రుకలు తెల్లపడ్డాయి. నడుం వంగింది దిగులు....దిగులు.... తండ్రి బాధ సీతకి తెలుసు. నేనే మగపిల్లడినయితే నాన్నకి కుడిభుజంగా వుండేదాన్ని. మా కోసం నాన్న ఎంతగా శ్ర్హమిస్తున్నాడు ఈ ఏటితో రూప చదువయిపోతుంది. పెద్ద చదువులు చదివించేది ఎలాగు లేదు. నాకన్నా అది ఎక్కువ చదివింది. ఏ చిన్న ఉద్యోగామయినా దొరికితే ఫరవాలేదు. ఇదే మాట రుపతో అంటే భలేదానివే అక్కా! స్వీట్ డ్రీమ్స్ తో భవిస్యత్తు ఆలోచించక, కులీ నాలి చేసుకుని బతుకుదామంటావేమిటో," అంటూ పకపక నవ్వింది. అదింకా పసితనంలో మాట్లాడుతుంది. నేనే ఏదయినా టైలరింగ్ ఎంబ్రాయిడి చేయటం నేర్చిన వకుళమ్మ చాలా మంచిది ఆవిడనే ఏదయినా సలహా అడగాలి.
సీతకి తృప్తి కలిగింది.
సీత తియ్యని కలలు కనకపోయినా వయసు గిలిగింతలు పెడుతు కలలు కనేట్లే చేస్తున్నది. బరువు భాద్యతలు తెలుసు. కాబట్టి ఈ ఆలోచనతో బ్లాకండ్ వయిట్ తప్ప స్కోప్ తో కూడిన ఈస్టమన్ కలర్ కలలు కనటంలేదు. అయినా తండ్రి బాధ పడుతూ ఏదయినా అంటే ఉత్త కలలు కూడా మానేసి ముందు కర్తవ్యం ఏమిటా? అని ఆలోచిస్తుంది.
మాటిమాటికి అటు బాబా ఇటు తండ్రి గుర్తుకొచ్చి ఏమిటో ఆలోచిస్తూనే వుంది.
మద్యహ్నమయింది.
పనంతా అయి ఖాళీగా వున్న సీత ఓ నిశ్చయానికొచ్చి వకుళమ్మ ఇంటికి వెళ్లలనుకుంది.
మరి కొద్దిసేపటిలో సీత ఇంటికి తాళం వేసి బైలుదేరింది.
11
ఇంటికి బైలుదేరిన సీత మనసంతా అనందం నింపుకుని.
వకుళమ్మ మంచి మనిషి సీత చెప్పిందంతా విని పెళ్ళయి ఓ యింటికి వెళ్ళవలసిన దానివి అయినా కష్టపడి పనిచేయటంలో తప్పేంలేదు. ఇన్ స్టాల్ పద్దతి మీద ముందుగా ఒక మిషన్ కొనుక్కో. నేర్చుకున్న విద్య మర్చిపోకుండాను వుంటుంది. పది మిషన్లు చేసి కుట్లు క్లాసులు నడపడమో, స్వయం పధకంలో టైలరింగ్ షాపు గాని నడపను వచ్చు. అందరూ బి.ఏ.లు ఏ మ్మేలు, చదివే వుంటారా? చదివిన ప్రతివాడికి ఉద్యోగాలు సిద్దంగా వున్నాయా?" అంటూ చక్కగా సలహాలిచ్చింది.