Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 15

 

    ఒకసారి తేజస్వి వైపు చూసి , వెంటనే చూపులు మరల్చుకున్నాడు పరమహంస

 

    అవును. నిజమే."

 

    "ఎందుకు?"

 

    కంపెని లాస్ లో నడుస్తోంది. ఈ సంవత్సరం ఒక్క పైసా లాభం రాకపోగా పదిహేను లక్షల నష్టం వచ్చింది.

 

    తల వెనక్కి వాల్చి నవ్వాడు తేజస్వి. "మిస్టర్ పరమహంసా! యూ మాస్ట్ బీ జొకింగ్! ఫార్మాన్యూటికల్స్ అంటే బంగారు గుడ్లు పెట్టె బాతు లాంటి ఇండస్ట్రి. మందులు తయారు చేసే ఈ పరిశ్రమలో నష్టం వచ్చే ప్రసక్త్ర్ లేదు.

    
    సంతోషం లేకుండా నవ్వాడు పరమహంస. "బట్ మిస్టర్ తేజస్వి! మీకు తెలుసు. మనం మన మందులని ఎంత తక్కువ రేట్లకి అమ్ముతున్నమో. అవునా?"

 

    'ఎంత తక్కువ రేటుకి అమ్మినా, నూటికి నాలుగొందల నుంచి వెయ్యి రూపాయల దాకా లాభాలు వచ్చేటట్లు చూసుకుని రెట్లు ఫిక్స్ చేస్తున్నాయి చాలా కంపెనీలు. మీరు చాలా తక్కువ రేటుకి అమ్మగలుగుతున్నారంటే అంతకంటే తక్కువ రేటుకి మందులని తయారు చేయగలుగుతూ ఉండి తీరాలి. అంతే గానీ మీరు కేవలం పుణ్యం పురుషార్ధం కోసం ఈ బిజినెస్ లోకి వచ్చారంటే నేను నమ్మను, నమ్మలేను." అన్నాడు తేజస్వి.

 

    సహనంగా అన్నాడు పరమహంస. "ఓ.కే మిస్టర్ తేజస్వి! కంపెని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ తెప్పిస్తాను చూస్తారా? బాలెన్స్ షీట్ తెప్పిస్తాను. వెరిపై చేస్తారా? చూసి మీరే తేల్చుకోండి నేను చెబుతున్నది నిజాలో అబద్దాలో!

 

    'యా ఐయామ్ సర్టన్లి గోయింగ్ టూసి' అన్నాడు తేజస్వి స్థిరంగా.

 

    అకొంట్స్ బుక్స్ అన్నీ తెప్పించాడు పరమహంస.

 

    ఒకదాని తరువాత ఒకటి అవన్నీ జాగ్రత్తగా చూశాడు తేజస్వి. వాటిలో తేడా ఏమి కనబడలేదు అతనికి. ఇన్ క మ్ టాక్స్ ఎగ్గొట్టాడానికి ఇంకో అకౌంటు మెయిన్ టెయిన్ చేస్తూ, దేంట్లో నష్టాలు చూపిస్తున్నట్లు దాఖాలాలు లేవు.

 

    అన్నీ సరిగ్గానే ఉన్నాయి. కానీ కంపెని పరిస్థితే సరిగ్గా లేదు. నష్టాలతో నడుం విరిగిపోతోంది కంపెనీకి.

 

    కానీ, ఎందుకు? ఎందుకు?

 

    "నేను చెబుతాను" అన్నాడు పరమహంస. తరువాత సిగార్ బాక్స్ లో నుంచి ఒక పెన్సిల్ లాంటి పొడుగాటి చుట్ట తీసి వెలిగించి, చాలా సేపు గుప్పు గుప్పున పొగ వదుల్తూ ఉండిపోయాడు.

 

    అప్పుడు హటాత్తుగా అన్నాడు. "మా వంశం తరతరాలుగా ఆయుర్వేదానికి ప్రసిద్హి. మా ముత్తాత ఒక రాజాగారి దగ్గర అష్టాన వైద్యులుగా ఉండేవారు. అయన వైద్యం వల్ల రాజాగారి కూతురు ఒక మహా వ్యాధి నుంచి బయట పడింది. అందుకు సంతోషించి రాజాగారు మా ముత్తాతకి చిన్న జాగీరు ఇచ్చారు. అండ్ వీ బికేమ్ రిచ్. ఆ ఆస్తులు తింటూ, పరోపకారానికి వైద్యం చేస్తూ తరాలు గడిపారు. మా వాళ్ళు.

 

    నేను కాలంతో బాటు మారి, ఇంకొంచెం అడ్వాన్స్ అవుదాం అన్న ప్రయత్నం చేసి ఫార్మసి చదివాను. అంటే అల్లోపతీ మందులు తయారుచేసే కోర్సు.

 

    "మా తండ్రిగారితో అయుద్వేదం వెనకబడిపోయింది. నేను ఇంగ్లిషు మందులు తయారు చేయడం మొదలెట్టాను. ఇండస్ట్రి పెట్టాను.

 

    "న్యాయంగా వ్యాపారం చెయ్యబోయాను తేజస్వి. అందుకని అన్యాయమైపోయాను. పాపలా సొమ్ముని పది రూపాయలకు అమ్మి, పాపం మూట కట్టుకునే చాకచక్యం నాకు లేకపోయింది.

 

    "అండ్ హియర్ వీ ఆర్!

 

    "ఐయామ్ సారీ తేజస్వి! మేనేజ్ మెంట్ లోపమో, మార్కెటింగ్ లోపమో కానీ మనం కొన్ని మందులని కొన్న ఖరీదు కంటే తక్కువకి అమ్ముతున్నాం. అమ్మవలసి వస్తోంది. దటీజ్ ఏ పాక్ట్!

 


    "ఈ పరిస్థితుల్లో ఒక్కటే మార్గం ఉంది. ప్రతిచోటా, ప్రతిపైసా అదా చెయ్యడం."

 

    "అందుకు అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ ఏర్పాట్లలో స్టాఫ్ ని తగ్గించడం ఒకటి.

 

    జాగ్రత్తగా వింటున్నాడు తేజస్వి.

 

    "కానీ- ఒక్క విషయం! అన్నాడు పరమహంస వెంటనే. మిస్టర్ తేజస్వి! దీనివల్ల మీకు పర్సనల్ గా ఎలాంటి నష్టమూ జరగదు. యూ విల్ స్టే విత్ అజ్ దిసీజ్ ఏ ప్రామిస్. స్టాఫ్ ని ఎంత తగ్గించినా మిమ్మల్ని మాత్రం కదలించమూ మేము."

 

    " అలా ఎప్పటికి జరగదు" అన్నాడు తేజస్వి నిశ్చయంగా. "మిస్టర్ పరమహంసా! స్టాఫ్ ని తగ్గించడానికి గనక మీరు రిట్రేంచ్ మెంట్ మొదలెడితే అందరికంటే ముందు నన్నే తీసేయ్యాలి. మా వాళ్ళంతా నన్ను నమ్మి నన్ను వాళ్ళ నాయకుడిగా ఎన్నుకున్నారు. నమ్మకముంచిన వాళ్ళని ముంచేయ్యడం నాయకుల లక్షణం కాకూడదు. పరమహంసగారూ? ఈ కంపెనీలో నుంచి ఏ ఒక్కరిని తొలగించ దలచుకున్నా ఆ ఒక్కణ్ణి నేనే కావాలి. అంతే?"

 

    "నో నో నో నో !" అన్నాడు పరమహంస తక్షణం తేజస్వి చేతులు పట్టుకుంటూ - తేజస్వి! మీరు అసోసియేషన్ లీడర్ కావచ్చు. కానీ మీరు చాలా హార్డ్ వర్కర్ చాలా సిన్సియర్ వర్కర్ కూడా. మీరు తలచుకుంటే, అసోసియేషన్ లీడర్ గా ఉన్న పరపతిని మీరు దుర్వినియోగం చేసి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడూ ఎప్పుడూ కూడా అలా మిస్ యూజ్ చెయ్యలేదు. మీలాంటి వాళ్ళు కొందరున్నా ఉండబట్టే కంపెని ఇలా కుంటుతూ నన్నా నడపగలుగుతోంది తేజస్వి! మిమ్మల్ని మేం వదులుకోవడం మిస్టర్ తేజస్వి కలలో కూడా జరగదు."

 

    "మీ కాంప్లిమెంట్ కి చాలా థాంక్స్! మీ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి నేను అహోరాత్రులు నా శాయశక్తుల కృషి చేస్తాను." అన్నాడు తేజస్వి నిర్వికారంగా. "కానీ, ఏ విషయాని కా విషయమే. మా అసోసియేషన్ జనరల్ సెక్రటరిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దయచేసి స్టాఫ్ ని రిట్రేంచ్ చేసి మరిన్ని కష్టాలు కొని తెచ్చుకోకండి ప్లీజ్!"

 Previous Page Next Page