"ఊహు హాలుబైట బోర్డు అలా వుంది."
"అయితే నీవు చూసింది ఏం ఫిల్మ్?"
"బ్లూ ఫిల్మ్."
"బ్లూ ఫిల్మా?"
"అవునురా గౌతమ్ అదే."
"మరి వాడు నాకుకూడా టిక్కెట్టు యివ్వవచ్చు కదా?"
"ఇవ్వొచ్చు కాని యివ్వడు"
"ఎందుకని యివ్వడు నేను చేసుకున్న పాపం ఏమిటి నీవు చేసుకున్న పుణ్యం ఏమిటిట...?" గౌతమ్ అడిగాడు.
"ఇక్కడ పాపపుణ్యాల ప్రసక్తి లేదు బ్రదర్! అంతా దొంగచాటు వ్యవహారం రెండొవది మని, బ్లూ ఫిల్మ్ ప్రదర్సిస్తున్నట్లు తెలిస్తే పోలీసులు పట్టుకుపోతారు. అందుకని అతి రహస్యంగా ప్రదర్శిస్తారు. ఒక్కో టిక్కెట్టు ధర వంద రూపాయలు...
"వందరుపయలా!"
"వందరుపాయలా అని అలా నోరు వెళ్ళబెట్టకు. కొత్త ఫిలిం అయితే ఒక్కొ టిక్కెట్టు ధర అయిదువందల నుంచి వెయ్యిదాకా వుంటుంది. ఇది పాతఫిలిం కాబట్టే కారు చౌకకి లభించింది."
"ఎవరుబడితే వాళ్ళు చూడొచ్చా?"
"రహస్యంగా... అంత డబ్బు పెట్టి టిక్కెట్టుకొని చూడగలిగితే చూడొచ్చు పోలీసులకి తెలిస్తే ప్రదర్శించే వాళ్లతో పాటు బ్లూఫిల్మ్ చూసే వాళ్ళనికూడా పట్టుకెళతారు.దుర్గామందిర్ మరు మూలనున్న దోక్కుహాలు ఎవరు ఆ హాలుకి వెళ్ళరు.ఎక్కడా చోటులేక ఈ తఫా ఆ హాలులో రహస్యంగా ఫిల్మ్ వేశారు. ఓ స్నేహితుడు చెపితే నేను కూడా వెళ్ళి చూశాను."
"నాకు తెలియని స్నేహితుడు నీకేవరున్నరోయ్?" గౌతమ్ అడిగాడు.
"నాలాంటి బీద ఓ సేల్స్ మెన్ స్నేహితుడు. వాడి ద్వారా వెళ్ళాను" చాలా చక్కగా బొంకాడు వరదరాజులు.
"చూస్తుంటే చాలా బాగుంటుందా?" గౌతమ్ కుతూహలంగా అడిగాడు.
"ఛా...లా...నా....అంటూ నెమ్మదిగా అంటావేమిటి? తేలిక భాషలో చెప్పాలంటే చాలా త్రిల్లింగ్ గా వుంటుంది. మరో భాషలో చెప్పాలి అంటే వంట్లో నరలన్నిటిని తోడేసి వేడి వేడి నీళ్ళలో జాడించి గట్టిగా మెలితిప్పి పిండితే ఎంత యిదిగా వుంటుందో యిది అంత యిదిగా వుంటుంది. అందమైన దొరజాంపండు వయసులోని ఆడపిల్లని దోవనపోతుంటే కళ్ళార్పకుండా చూస్తాము అ పిల్ల వంటిమీద వలువలె లేకపోతె, గుడ్లుమిటకరించుకుని మరి చూస్తాము, అలాంటిది వంటిమీద నులుపోగు లెకుండా రాతిమన్మదుల కామకేళి విలాసాలు......"వరదరాజులు వర్ణిస్తూ చెప్పుకుపోయాడు.
నాలుకతో ఓ సారి పేదలు తడుపుకుని "ఈ తఫా ఎక్కడయినా బ్లూ ఫిల్మ్ ప్రదర్శిస్తుంటే చెప్పరా వరదాయ్! నేను కూడా చూస్తాను" అన్నాడు గౌతమ్.
"ఏమిటి నీ విలాంటివి చూస్తావా?" వరదరాజులు ఆశ్చర్యపోయాడు.
"ఏం నేను మటుకు మనిషిని కానా?
మాంచి వయసులో వున్న వాడినికదా రక్తం ఉడుకేత్తుతుంటే కోరికలు వేర్రిగంతులు వేస్తున్నాయి. బ్లూ ఫిల్మ్ చూస్తే తప్పు ఏమిటిరా? ఫిల్మ్ తిదేవాళ్ళు వున్నారు. దానిలో సిగ్గు పూర్తిగా వదిలేసి నటించేవాళ్ళు వున్నారు. చూస్తే తప్పు వచ్హిందా?" గౌతమ్ అడిగాడు.
"తప్పు లేదు భాయ్" అన్నాడు వరదరాజులు.
మరో అరగంటసేపు వారిమధ్య ఎన్నో విషయాలు దొర్లాయి. గౌతమ్ కొన్ని విషయాలు చాలా ఆవేశంగా మాట్లాడాడు. మధ్య మధ్య కలుసుకుందాం అనుకున్నారు విడిపోయారు.
"ఈ రోజు ఎంత ప్రమాదం తప్పింది?" పడక పడక గౌతమ్ కంట్లో ఇది పడాలా? బ్లూ ఫిల్మ్ అని బొంకబట్టి సరిపోయింది. మరో అబద్దమయితే అతికేది కాదు. తను చాలా జాగ్రత్తగా వుండాలి. డబ్బు చాలని వాడివి అరగంటకోసం వందరుపాయలు తగలేశావా! అని ఎక్కడ అడుగుతాడో అని మరో అబద్దం ఆడటానికి రెడీగా ఆలోచించుకుని పెట్టుకున్నాడు. కాని అతనికి ఆ ఆలోచన అసలు రాలేదు.
వరదరాజులు అనుకున్నాడు గౌతమ్ వెళ్ళిపోయిన తరువాత.