Home » Rabindranath tagore » Panchabhuthaalu

    "పురాతన ప్రపంచంలో సకల విషయాలూ తెలిసిన వారికే ఆదరం యెక్కువగా  వుండేది. ఆ కాలంలో మానవత్వానికి పహరాలేదు. ఆ కాలంలో శక్తి సామర్ద్యాలు, తేజస్సూగల వారి అధికారం ప్రపంచ మంతటా నెలకొనేది. ఈ కాలంలో ప్రపంచం అన్ని విధాలా సభ్యత యీ పరుగు పందెంలో ముందడుగు వేసింది. ప్రబలత అధికారంలో వేరయి పోయింది. ఈ కాలంలో శక్తి విహీనులు కూడా ప్రపంచంలోని ఒక గొప్ప అంసానికి సాక్షులయారు. ఈ కాలంలో కావ్యాలు, ఉపాఖ్యానాలలో కూడా భీష్మ ద్రోణాదులను వదలివేసి మూగజాతివారి భాష భావాలు కవులు వెల్లడించ నారంభించారు" అని అన్నాడు పృద్వీరాజ్.
     పవన్ దేవ్, "నవ్యోదయం అయినపుడు సాహిత్య రూప సూర్యుని కిరణాలు ముందు ముందుగా అన్నిటికంటె యెత్తయిన పర్వత శిఖరం మీద పడ్డాయి. ఇపుడు మెలమెల్లగా క్రిందివేపుకు వ్యాపించి దరిద్రుల గుడిసెలనుకూడా ప్రకాశింప జేస్తూంది." అని అన్నాడు.
                                        మనసు
     పగలు మూడోజాము, నదీతీరాన ఒక పల్లెటూరి ఒంటి అంతస్తు మేడలోని ఒక గదిలో ఒంటరిగా కూర్చున్నాను. ఒకబల్లి గదిమూల టికటికా అంటోంది. పంకా తాడులాగే గోడ రంధ్రంలో గూడుగట్టుకోవడానికి పిచ్చుకలు గడ్డి, ఆకులు, అలములు పోగుచేసి తెచ్చి కిచకిచ లాడుతూ తొందర తొందరగా వాటిని అలంకరిస్తున్నాయి. నీలాకాశంలో యెత్తయిన తటాకం నుంచి విచ్చుకున్న తెరచాపకొయ్య కొంచెం కొంచెం గోచరిస్తున్నాయి. శీతలమంద సుగంధ వాయువు వీస్తోంది. ఆకాశం పాలు లాగా నిర్మలంగా వుంది. అవతలివేపు సుదూర రేఖనుంచి నా వసారా గోడచుట్టూ వున్న చిన్నతోటవరకు మనోహరదృశ్యం ధవళసూర్య కాంతితో ఒక నిర్జీవ చిత్తరువులాగా ప్రకాశిస్తోంది. ఎంత సుఖప్రదమైన జీవితం! బిడ్డ తల్లిఒడిలో ఒక విధమైన వెచ్చదనమూ, ఆరామం, స్నేహ స్పర్శ అనుభవించినట్టి ఈ పురాతన ప్రకృతి ఒడిలో కూర్చుని నేనూ ఒక విధమయిన ఆరామం అనుభవిస్తున్నాను. ఈ విధమయిన జీవితం గడపుతూంటే కొదువ యేముంది? నేను ఈ విధముగా ఈ ప్రకృతి ఒడిలో ఆడుకుంటూండగూడదా? కలం, కాగితం తీసుకు కూర్చోవలసిందని నన్ను యెవరు ప్రేరేపిస్తున్నారు? ఏ విషయంలోనయినా నా అభిప్రాయమేమిటో యేది రుచిస్తుందో యేది రుచించదో, దానినిబట్టి కట్టవలసిన అవసరమేముంది? ఇదిగో చూడండి. మైదానంలో యెక్కడా యేమీ లేదు. హఠాత్తుగా సుడిగాలి లేచింది. ఆకులు తీసుకొని పందెపు గుర్రం లాగా సుళ్ళు తిరుగుతూ  అధ్బుతం గొలుపుతోంది. అది తన కాలివేళ్ల మీద అధ్బుత అంగభంగిమలతో ఆకాశంవేపు తిరుగుతూ కొద్దిక్షణాలు నిలబడి తిరిగి చెత్తా చెదారం చిమ్ముతూ ఏ దేశానికో చేరింది. ఇందులో రక్షించడానికేముంది? కొద్దిగా మట్టీమశానం, బూడిద దొంగిలించి పోగుచేసుకుంది. వాటిని తీసుకుని అది ద్రాక్షతీగలాగ ఆడుతూ నాట్యం చేసింది. ఈ విధంగానే యెడారులలో నిర్జన ప్రదేశాలలో తిరుగుతూంటుంది.  దానికి ఉద్దేశ్యమేమీ లేదు. ప్రేక్షకులు అక్కరలేదు. దానికే మతమూ లేదు. ఏ తత్వమూలేదు. సమాజం లేదు. దాని యితిహాసం గురించి తెలిసినవారు లేరు. భూమిమీద  నిరర్దకమయిన వస్తువులన్నిటినీ జనులు చెత్తా చెదారంగా భావించి పారవేస్తారు. వాటినీ గాలి వేగంతో మేలు  కొలిపి క్షణకాలం ప్రాణంపోసి సౌందర్యాన్ని ప్రసాదిస్తుంది.
     నా జీవితంకూడా సరళంగా, మధురంగా వుండి నేను కూడా ఈ విధంగా అక్కడక్కడి వస్తువులను పీడించి పైకి యెగరకొట్టి యేదో విధంగా నిలబెట్టి బొంగరంలాగ ఆడించ గలిగితే నేను ధన్యుడనని భావిస్తాను. నేనుకూడా నవ్వుతూ ఆడుతూ సృజించి పీడించి పైకి యెగరగొట్ట గలనా? చింతారహిత చేష్టారహిత, లక్ష్యరహిత జీవితం గడపగలనా? భూమ్యాకాశాలలో జీవితమనే సుడిగాలివలేపి,  గుప్పెడు ధూళి చేతితో తీసుకుని ఇంద్రజాలం చేయడమేమిటి? సరళ మధుర జీవితం! సమ్మోహిత హృదయాలకు ఉదార ఉల్లాసం! అలా అయినా  దానిని తెలుసుకోవచ్చు. కాని చెమటధారవోసి రాయిమీద రాయిపేరుస్తూ వెడితే మానస్తూపం కొద్దియెత్తు పెరుగుతుందేగాని దానివల్ల విశ్లేషించి ఉపకారం జరగదు. ఆ స్థూపంలో చేష్టలేదు. ప్రేమ లేదు. ప్రాణం లేదు.  దానివల్ల కేవలం స్థూపకీర్తి ప్రాప్తిస్తుంది.  కొందరు కాళ్లతో దానిని తన్నుతారు, దాని యోగ్యత యెలావున్నా.
     కాని ఇఛ్చవున్నా ఈ పనినుంచి వైదొలగడం కష్టం. సభ్యతను వినయంతో గౌరవించి మనసు అనే తన శరీరాంశకు ఉత్సాహమిచ్చి ఆకాశమంత యెత్తున పెంపొందిస్తాడు. ఆ సమయంలో ఆ మనసుతో సంబంధం పెంచుకోవాలని కోరతాడు. కాని అది అతనిని వదలదు. గట్టిగా పెనువేసుకుంటుంది.
     వ్రాస్తూ వ్రాస్తూ బయటకు చూశాను. ఒక మనిషి ఎండమూలంగా తలమీద వుత్తరీయం కప్పుకుని కుడి చేతితో ఆకుదొన్నెలో కొద్దిగా వెన్న పెట్టుకుని వంటింటి వేపు వెళుతున్నాడు. వాడు నా నౌకరు నారాయణసింగు మంచి పుష్టిగా వుంటాడు. యువకుడు. అతని ముఖంలో సర్వవేళలా నవ్వు నృత్యం చేస్తుంటుంది.  అతని ప్రకృతి  బాగా ఎరుపెక్కిన పనసచెట్టులాగా వుంటుంది. అటువంటి మనుషులు కలుపుగోలుగా  వుంటారు. దీనికితోడు యోగ్యత కూడా వుంది. ప్రకృతికీ, అతనికి మధ్య ఎక్కువ అంతర మేమీలేదు. ఈ విశాల వసుంధరను అంటిపెట్టుకుని సుఖంగా జీవితం గడుపుతున్నాడు. అతనికి అతని అంతఃకరణతో యే మాత్రం సంఘర్షణ లేదు. చెట్టు వేరు నుంచి చివరవరకు విలక్షణంగా పెరుగుతుంది. అంతకంటే ఎక్కువగా పెరగడానికి బుద్దిచాతుర్యం వినియోగించరాదు. అలాంటివాడే మా నారాయణసింగ్, అతనిలో యే దోషమూ జనించలేదు.
     కాని కుతూహల ప్రియదేవత ఎవరయినా ఆ పనసచెట్టు వేరులో ఒక చుక్క మనసును లగ్నం చేస్తే మహా అనర్దకం దాపురిస్తుంది. ఆ సరస జీవితంలో ఒకజీవి ఆందోళన  పరివర్తన ప్రారంభమవుతాయి. చింతా క్రాంతమయిన మీదట దాని ఆకుపచ్చని ఆకులు పసుపు పచ్చగా ఆయిపోతాయి.  వేరునుంచి పూలగుత్తులవరకు, వృద్దుని నుదురులాగా ముడతలు పడిపోతాయి. అప్పుడు  వసంత కాలాలు ఎన్ని వచ్చిపోయినా దాని అపూర్వ ఆకుపచ్చతనం తిరిగిరాదు. దాని పూగుత్తులు పూర్వం లాగా వేలాడవు. అపుడు దినమంతా ఒంటికాలిమీద నిలబడి భగవంతుడు నా మీద ఆకుల మహాభారాన్ని ఎందుకు మోపాడు? అని ఆలోచిస్తుంది. "నాకు రెక్కలు ఎందుకు యివ్వలేదు?ఇంత నిటారుగా యింత ఎత్తుగా నిలబడినాను గాని ఈశ్వరుని సుందర ప్రకృతిని చూచి తగినంతగా ఆనందం పొందలేకపోతున్నాను. నాకే రెక్కలు వుంటే ఎగిరి ఎగిరి దాని శోభను విలోకిస్తాను .ఈ దిగంతం  అవతల ఏమున్నదో చూస్తాను. ఆకాశంలోని తారలు ఏ చెట్లకొమ్మన వికసించాయో వాటిని యోవిధంగా పట్టుకోగలమో చూస్తాను. నేను ఎక్కడినుంచి వచ్చాను? ఎక్కడికి వెళుతున్నాను? ఈ విషయం తేలేవరకు ఆకులను రాల్చి, రెమ్మలను ఎండ బెట్టి రాయిలాగా ధ్యానిస్తుంటాను. నా అస్తిత్వం చింతలో పడిపోతుంది. ఈ ప్రశ్నలకు సరయిన జవాబులు  లభించేవరకు నాకు విశ్రాంతి వుండదు. సుఖం వుండదు. వర్షాకాలం తరువాత మున్ముందుగా వుదయభానుడు వుదయించిన రోజున నా శరీరంలో ఎటువంటి విద్యుత్తు దౌడు తీస్తుందో, ఎటువంటి  ఆనందం లభిస్తుందో వ్యక్తీకరించే శక్తి నాకు లేదు. చలికాలం ఆఖరయిన తరువాత ఫాల్గుణమాసం మధ్యలో హఠాత్తుగా సాయంకాలం దక్షిణవాయువు వీచినపుడు యే యిచ్చ రేకెత్తిస్తుందో నా కెవరూ చెప్పలేదు" అని అనుకుంటుంది.
     పాపం! ఇపుడు ఆ పసనచెట్టు పరిస్థితి ఎంత శోచనీయం! ఇపుడు దానికి పూలు పూయవు, పండ్లు కాయవు. ఈ చెట్టు తన పూర్వస్థితికి చేరుకోవాలని  ప్రయత్నించింది. వున్తి పొందాలని కోరింది. కాని దానిపట్ల 'రెంటికీ చెడిన రేవడి' అనే సూక్తి సార్దకమవుతుంది. చివరకు ఒక రోజున హఠాత్తుగా అంతర్వేదనతో విచ్చిన్నమయిపోతుంది. దాని అంగాంగాలు  తిరుగుబాటు చేయడానికి తయారవుతాయి.  ఇదంతా ఏ మాసపత్రికకో లేఖ రాయడానికి కూచున్నాను. వ్యాఖ్య, అటవీశాఖా సంబంధమయిన అసమాయకతత్త్వ బోధాభావాలకు ప్రాధాన్యం అందులో గోచరించింది. కాని ఆ లేఖలో ఆకుల గలగలధ్వని పూర్వపు శీతల ఛాయ, నరనరాల్లో వ్యాపించిన సరసత పొడగట్టవు.
     కాని ఒక భయంకరమయిన సైతాను నాగుబాములాగా దాగిదాగి మట్టిని తొలుచుకుని వెళ్లి వేలు వంకరటింకర వేరులలో మనసు పెట్టితే సకల ప్రపంచమందలి చెట్లు చేమలు శుష్కించిపోతాయి. ప్రపంచమంతా ఎడారిలా తరాయరువుతంది. సుఖశాంతులు లోపిస్తాయి. తోటలలో  పాడే పక్షుల పాటలకు అర్దంవుండదు. అక్షర రహితమైన పచ్చని ఆకులకు బదులు శుష్కించిన తెల్లని మాసపత్రికలు, వార్తాపత్రికలు విజ్ఞాపనలు వేలాడుతూ కనిపిస్తాయేమో!
     చెట్లకు చింతాశీలత లేదు. ఉమ్మెత్త చెట్లు కామినీ వృక్షంతో నీ పువ్వులలో కోమలత్వంగాని తేజస్సులేదని విమర్శించదు. రేగిపండు పనసపండుతో నువు పెద్దదానివని భావిస్తున్నావుగాని నేను మతా్రం నీ కంటె గుమ్మడిపండుకే వున్నతాసం యిస్తాను అని అనదు. అరటి చెట్టు తక్కువ వెలకు అన్నిటికంటె పెద్ద పెద్ద ఆకులు యిస్తున్నాననదు చేమదుంప పోటీకి దాగి దానికంటే తక్కువ ధరకు ఆకులు అమ్మదు.
     చింతాపీడిత మానవుడు సంయుతుడయి  వుంటాడు. అల్పమనో రూప అగ్నికణాన్ని ఆర్పి వేయడానికి ప్రసాంత సముద్ర జలరాశి ఎంతయినా  అవసరం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra