చిత్రకారుడు డావిన్సి తన అద్బుతమైన పెయింటింగ్ కి మోడల్ గా వుండి తనకెంతో ప్రేరణ ఇచ్చిన లియోనార్డో పేరును తన  పేరు ముందు 1516లో డావిన్సీ ఫ్రాన్స్ వెళ్ళగా ఆ దేశపు రాజుగారు నాలుగు వేల బంగారు  నాణాలిచ్చి మోనాలిసా పెయింటింగ్ ని తీసుకున్నారట. ఆ తర్వాత ఆ పెయింటింగ్  ఎందరో రాజుల చేతులు మారి  ఆఖరికి ప్యారిన్ ఆర్ట్ మ్యూజియంకు చేరింది. అక్కడ 1911లో దొంగతనానికి గురై రెండేళ్ళ తర్వాత ఇటలీలో దొరికింది. అలాగే మోనాలిసా ఒరిజినల్ పేరు మీద  చాలా డూప్లికేట్ చిత్రాలు కోట్ల రూపాలకు అమ్ముడైన సంగతి తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది.

 

    సంపన్న  వర్గాలు తన మానసిక అనందం  కోసం  పెయింటింగ్స్ ని ఎప్పుడయితే ఆదరించడం మొదలెట్టారో అప్పటినుంచీ ఆర్ట్  దొంగలు కూడా బయలుదేరారు. 1992 ఫిబ్రవరి  2న ఇటలీలోని హెర్కులేనియమ్ మ్యూజియంలో కొంతమంది ముసుగు దొంగలు ప్రవేశించి మొత్తం 304 విలువయిన వస్తువుల్ని అపహరించుకుని వెళ్ళిపోయారు. వాటి ఖరీదు రెండు బిలియన్ల లైరులు. ఆ అపహరించుకుపోయిన వస్తువులలో ఎంతో విలువైన పెయింటింగ్స్ కూడా వున్నాయి.

 

    1991 ఏప్రిల్ 14న ఆమ్ స్టర్ డామ్ లోని వాంగో మ్యూజియమ్ మీద ఆయుధాలతో కొంతమంది దాడిచేసి అతి విలువైన ఇరవై   పెయింటింగ్సుని తీసుకుపోయారు. వీటి ఖరీదు  500 మిలియన్ల డాలర్లు.

 

    1991 జూన్ 11న  జ్యూరిచ్ లోని మాక్స్ బోల్లాగ్ మోడ్రస్ ఆర్ట్ సెంటర్  మీద కొంతమంది వ్యక్తులు దాడిచేసి పాబ్లో పికాసో రెండు పెయింటింగ్స్ ని పట్టుకుని పారిపోయారు. వాటి  ఖరీదు యాభై మిలియన్ల స్వీస్  ఫ్రాంకులు (ఒక సీచస్ ఫాంక్ విలువ  దాదాపు 24 రూపాయలు)

 

    ఒక్క స్యూయర్క్ సంబంధించి చూస్తే 1988-90 మధ్య 300 ఆర్ట్ దొంగతనాలు జరిగాయి. బ్రిటన్లో ప్రతి ఏటా దాదాపు అయిదువేల పెయింటింగ్స్ దొంగతనాలకు గురవుతుంటాయి.

 

    అతి విలువైన పెయింటింగ్స్ సెక్యూరిటీ ద్వారా కోట్లాది రూపాయల  వ్యాపారాలు జరగడం చాలా చిత్రమైన  విషయం.

 

    ఇటలీకి చెందిన కారవాగియో 1609లో చిత్రించిన "నేటివిటీ" అనే పెయింటింగ్ 1969లో దొంగిలించబడింది. పరిశోధకుల అంచనా ప్రకారం ఆ పెయింటింగు వాల్యూ 50 మిలియన్  అమెరికన్ డాలర్లు. అంటే  180 కోట్లు. ఆ పెయింటింగ్స్ సిసిలీలోని మాఫియా గ్రూప్ దగ్గరుందని, అది వాళ్ళ ముఠాల డ్రగ్ డీలింగ్స్ కి సెక్యూరిటీగా  20 ఏళ్ళుగా వుపయోగ పడుతోందని సీక్రెట్ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి.

 

    అంతర్జాతీయంగా స్మర్గర్లకు ఆర్ట్ మ్యూజియమ్స్ సూపర్ మార్కెట్స్ లా కనిపిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఆర్ట్ పెయింటింగుని, ఒక స్టోర్ రూంలో పడేస్తే అయిదేళ్ళ తర్వాత దాని విలువ ప్రారంభంలో వున్న దానికంటే పదిరెట్లు ఎక్కువ ధర పలుకుతుంది.

 

    మన దేశం విలువైన కళాత్మక చిత్రాలకు, అద్భుతమైన శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అందజేస్తున్న వివరాల ప్రకారం ప్రతీ ఏటా 850 విలువైన కళాత్మక వస్తువులూ, పెయింటింగులూ మన దేశంలో చౌర్యానికి గురవుతున్నాయని తెలుస్తోంది. ఈ చోరీ ఎక్కువ శాతం దొంగతనాలు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ ల లోనే  జరుగుతున్నాయని పోలీస్ వర్గాలంటున్నాయి. భారతదేశం నుంచి తస్కరించి విదేశాలకు అమ్మబడిన  వాటిల్లో ఎక్కువగా కళాత్మక శిల్పాలు చోటు చేసుకున్నాయి. పదో  శతాబ్దానికి చెందిన నటరాజ్  విగ్రహం, యక్షిణి కుబేరుల  విగ్రహాలు, మద్రాసు మ్యూజియం నుంచి తొమ్మిదో శతాబ్దానికి చెందిన బంగారు పూత  మైత్రేయి విగ్రహం, 1982 ఫిబ్రవరిలో చోరీకి గురయ్యాయి. విదేశాల్లో పెయింటింగ్స్ కి ఎంత విలువుందో  మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళే అపురూప శిల్పాలకు అదే స్థాయిలో విలువుండటం విశేషం.

 

    ఈ మధ్య  టెర్రరిస్ట్ లకు సమయానుకూలంగా సరిపడా నిధులు  అందకపోవడంతో వారి దృష్టి విలువైన వస్తువుల్ని దొంగిలించటం మీ పడింది. బ్యాంకులకి, నగల దుకాణాలకి సెక్యూరిటీ పెరగటం, అదే సమయంలో  గుళ్ళు , గోపురాలు, మ్యూజియమ్స్ కి అంత సెక్యూరిటీ లేక పోవటంతో టెర్రరిస్ట్ ల దృష్టి కళాత్మక వస్తువుల మీదకు పోతోంది. వాటిని దొంగిలించి అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మి వారికవసరమైన మారణా యుధాలు సేకరించుకోవటం ఎక్కువయి  పోయింది. పుష్పరాజ్  విషయంలో అదే జరుగుతోందని ణా నమ్మకం" హరిహరన్ ఒక అభిప్రాయానికి వస్తూ అన్నాడు.

 

    ఒక అరగంట తర్వాత రెసిడెన్స్ కి వచ్చేసినా హరిహరన్ కి నిద్ర రావటం  లేదు.

 

    అతని బ్రెయిన్ ని వెంటాడుతున్న వ్యక్తి పుష్పరాజ్. అస్పష్టంగా అతని బ్రెయిన్లో కదలాడుతున్న ఏదో ఐడియా పూర్తిగా ఆకృతి దాల్చని ఆలోచన......

 

    గించుకుంటున్నాడు సిట్ చీఫ్  హరిహరన్.

 


                                         *    *    *

 

    సరిగ్గా-


    
    రాత్రి మూడూ పది నిమిషాలైంది.

 

    చక్ మని మెరుపులా అతని బ్రెయిన్ లోకి ఒక ఐడియా వచ్చింది.

 

    ఫైర్ ఫోబియా...... పుష్పరాజ్...... పెయింటింగ్స్.

 

    వేళ్ళ మధ్యనున్న సిగరెట్ ను హుషారుగా యాష్ ట్రేలో కుక్కి ఫోను వైపు నడిచాడు హరిహరన్.

 

    రిసీవర్  అందుకుని హైద్రాబాద్ ఎస్.టి.డి. నెంబరు డయల్ చేసి తనకు కావలసిన నెంబరు ప్రెస్ చేశాడు.

 

    అదేపనిగా మోగుతున్న ఫోను శబ్దానికి మెలుకువ వచ్చింది కావ్యకు.

 

    గబుక్కున బెడ్  మీంచి లేచి ఫోను రిసీవరు  అందుకుంది.

 

    "సారీ కావ్యా! అయామ్ హరిహరన్."

 

    హరహరన్ పేరును, ఆ వ్యక్తిని గుర్తుచేసుకోవడానికి ఇరవై సెకన్లు పట్టిందామెకు.

 

    కరెక్టుగా రెండు నెలల క్రితం మద్రాసులో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్  మీట్ లో కల్సిందతనని కావ్య.

 

    ఒక నేషనల్ లీడర్ మర్డర్ విషయంలో ప్రెస్ పీపుల్ యాడ్ ఏజెన్సీల కో పరేషాన్ కోసం హరిహరన్ ఆ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra