Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 15

 

    "నాకా... ఈత... రాదే..."
    
    "మరెలాగండీ బాబూ.... పడవ మరి ముందుకెళ్ళదు....ఒడ్డుకి వెళ్ళాలంటే ఈదాల్సిందే ....మరి, మీరేం చేస్తారో మీ యిష్టం.... నేను దూకుతున్నాను" అని దూకేసి, తన ప్రాణాలను రక్షించుకున్నాడు.
    
    ఇక్కడ జ్ఞానం ఆపద నుంచి పడవవాడ్ని రక్షించే ఈతే వేదాలు. భారత రామాయణాలు కావు.... ఎట్టకేలకు అతికష్టంమ్మీద ఒడ్డుకి చేరిన మహా విద్వాంసుడికి ఏది అసలైన విద్యో ఆఖరికి తెల్సింది."
    
    చెప్పడం ఆపింది త్రిభువనేశ్వరి.
    
    "మీకు ఇలాంటి పిట్టకధలు కూడా వచ్చన్నమాట..."
    
    "సి.ఎం. అంటే....రాతి విగ్రహంలా ఉండమనా.... మీ ఉద్దేశ్యం వరద రాజన్ గారూ..."
    
    ఆ మాటకు హేమాద్రిశర్మ నవ్వాడు.
    
    త్రిభువనేశ్వరీదేవి మళ్ళీ చీఫ్ జస్టిస్ సుఖరామ్ కారంత్ కు ఫోన్ చేసి సలహా తీసుకుంది.
    
    హైకోర్టుకు హాలీడే డిక్లేర్ చెయ్యడానికి ఆయన ఒప్పుకున్నారు. సి.ఎమ్. ముఖం వికసించింది.
    
    "ది సీజ్ అవర్ ఫస్ట్ విక్టరీ...చీఫ్ జస్టిస్.... రేపు కోర్టుకి హాలీడే డిక్లేర్ చేస్తున్నారు."
    
    "సో, మనం....కాంట్రాక్టర్స్ కి ఏమాత్రం అవకాశం లేకుండా చెయ్యగలుగుతున్నందుకు హేపీగా ఉంది మేడమ్..." అన్నాడు హేమాద్రి శర్మ.
    
    "ఇంకో పాయింట్ మేడమ్... మీరు ప్రెస్ మీట్ లో ముందుగా ఎనౌన్స్ చేస్తే న్యూస్ లీక్ అవుతుందేమో, శత్రువులు...జాగ్రత్త పడడానికి మనం అవకాశం ఇస్తామేమో...." అనుమానం వ్యక్తం చేసాడు వరదరాజన్.
    
    "నో మిస్టర్ వరదరాజన్.... మనం ప్రొహిబిషన్ తేవడం రహస్యం కాదు....జీవోను తేవడం రహస్యం కాదు.... నో లీకేజ్ క్వశ్చన్.... మిస్టర్ చీఫ్ సెక్రట్రీ.... ఏ క్షణంలోనైనా....ప్రభుత్వం మద్యనిషేధం జీ.ఒను తెస్తుందన్న విషయం అన్ని సర్కిల్స్ కూ, ఇప్పటికీ తెల్సు... అవునా."
    
    "ఎస్....మేడమ్..."
    
    "కోర్టుకు వెళ్ళకుండా, స్టే తెచ్చుకోకుండా చేస్తున్నాం. అది మాత్రమే రహస్యంగా జరుగుతున్న వ్యవహారం."
    
    "ప్రొహిబిషన్ సెల్ ను ఏర్పాటు చేయకుండా....జీ.ఓను తెస్తే రేపట్నింఛీ జరిగే అనర్ధాల్ని మన ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ గానీ, పోలీసులుగానీ, ఎదుర్కోగలరంటారా మేడమ్..."
    
    "చెయ్యలేదు మిస్టర్ వరదరాజన్...మన ఎక్సయిజ్ డిపార్ట్ మెంట్ మీద నాకేమాత్రం నమ్మకంలేదు... స్పెషల్ ప్రొహిబిషన్ సెల్ ని, ఇమ్మీడియట్ గా మనం ఏర్పాటు చేస్తాం..." చెప్పింది సి.ఎం.
    
    "ఇప్పటికిప్పుడు అది సాధ్యమా మేడమ్..." సందేహాన్ని వ్యక్తం చేసాడు హేమాద్రిశర్మ.
    
    "ఇట్స్ పాజిబుల్ మిస్టర్ హేమాద్రి....ఆశయం, ఆలోచన ఉన్నవాడు తననుకున్నది....వెంటనే అమలు చెయ్యడానికి ప్రయత్నిస్తాడు. ఇదే నేను నమ్మిన సూత్రం ప్రొహిబిషన్ సెల్ కి.... మీరు సూచించిన ఆఫీసర్స్ ఫైల్ ఇది...హోం సెక్రటరీ కూడా ఈ పేర్లను ఎగ్రీ చేసారు... చూడండి..." ఫైల్ ని వరదరాజన్ ముందుకు తోస్తూ అంది త్రిభువనేశ్వరి.
    
    "ఎక్స్ పీరియన్స్ తోపాటు, డేషింగ్, డేరింగ్ ఉన్న వ్యక్తి మనకు కావాలి గుర్తుంచుకోండి..."
    
    వరదరాజన్ ఫైలుని తిరగేస్తున్నాడు....
    
    "మనం ఏర్పాటు చేసే, స్పెషల్ ప్రొహిబిషన్ సెల్ కి, నీతి నిజాయితీ కూడిన పటిష్టమైన యంత్రాంగం కావాలి. ఒక సిన్సియర్ ఐ.పి.ఎస్. ఆఫీసర్ ని దానికి హెడ్ గా చేసి, పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించాలి.
    
    ఎక్సయిజ్ డిపార్టు మెంట్ పూర్తిగా అతనికి కో ఆపరేట్ చేస్తుంది. ఈ బడా లిక్కర్ సిండికేటుల్ని, ఈ లీడర్స్ ను ఎదుర్కోవాలంటే... చావ, చేవ, ధైర్యం ఉన్న వ్యక్తి మనకు కావాలి....ఆలాంటప్పుడు మాత్రమే మనం అనుకున్న నిషేధం సక్సస్ అవుతుంది...." చెప్పాడు హేమాద్రిశర్మ.
    
    "ఎగ్జాట్లీ....యూ ఆర్ కరెక్టు....అన్నాడు హేమాద్రిశర్మ."
    
    ఫైల్లోకి చూస్తూ, కొన్ని పేర్లు చెప్పాడు వరదరాజన్.
    
    పెదవి విరిచిందామె.
    
    "కొత్తవాళ్ళ నెవరినైనా రిక్రూట్ చేసుకుంటే..." హేమాద్రిశర్మ."
    
    ఫైల్లోకి చూస్తూ, కొన్ని పేర్లు చెప్పాడు వరదరాజన్.
    
    పెదవి విరిచిందామె.
    
    "కొత్తవాళ్ళ నెవరినైనా రిక్రూట్ చేసుకుంటే..." హేమాద్రిశర్మ అన్నాడు.
    
    "నో...మనకంత టైమ్ లేదు.."
    
    "మనం ఏర్పాటు చేసే ఈ స్పెషల్ ప్రొహిబిషన్ సెల్....ప్రజలకోసం ఒక ప్రొటెక్షన్ సెల్ గా బలంగా పని చేయాలి. సారా మాఫియా ముఠాల్ని అదుపులో పెట్టాలి..." మళ్ళీ చెప్పింది త్రిభువనేశ్వరి.
    
    "అంటే....అబ్బయ్యనాయుడిని ఢీకొనగలిగే వ్యక్తి మనకు కావాలన్న మాట..." నవ్వుతూ అన్నాడు వరదరాజన్.
    
    "ఎగ్జాట్లీ.... ఇంతకీ, అబ్బయ్యనాయుడు....అబ్బయ్యనాయుడు అంటారు. అతని వయసెంతండీ..." ఆసక్తిగా అడిగింది సి.ఎమ్. త్రిభువనేశ్వరి.
    
    "మీరీ ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు అడుగుతారని నాకు తెలుసు. చెబితే మీరు ఆశ్చర్యపోతారు...." అన్నాడు హేమాద్రిశర్మ.
    
    "ఎనభై ఏళ్ళుటాయా..."
    
    "లేదు.... ఓన్లీ.... థర్టీ ఫైన్ ఆర్ థర్టీ సిక్స్."
    
    "బిలో ఫార్టీయా?" ఆశ్చర్యంగా కనుబొమలు ఎగరేస్తూ అంది త్రిభువనేశ్వరీదేవి.
    
    "ఎస్ మేడమ్....అతనేవిటీ.... లిక్కర్ మాఫియా లీడరేంటని...ఆశ్చర్యపోతున్నారా? అదంతే ఈ ముఠాకి చాలాకాలం లీడర్ అబ్బయ్య నాయుడు తండ్రి జగపతినాయుడు ప్రస్తుతం డెబ్బై ఏళ్లవాడు- నెల్లూరు, దగ్గరున్న తడలో, అతనొక్కడి కోసమే....అంటే అబ్బయ్యనాయుడు ఫామిలీ కోసం కట్టించుకున్న స్పెషల్ హాస్పిటల్లో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు..."
    
    "వాళ్ళ ఫామిలీకోసం స్పెషల్ హాస్పిటలా....?" మరింతగా ఆశ్చర్యపోయింది సి.ఎమ్.
    
    "ఎస్....మేడమ్...దేశంలోని స్పెషలిస్టులందరూ...ఆ హాస్పిటల్ విజిటింగ్ డాక్టర్స్..." చెప్పాడు వరదరాజన్.
    
    "ఎప్పుడూ అబ్బయ్యనాయుడు....బయటి ప్రపంచంలోకి రాడా?"
    
    "తెలీదు మేడమ్....అబ్బయ్యనాయుడు ఎలా ఉంటాడో.... ఎవరికీ తెలీదు. ఆయన తరపున పనులన్నీ....అబ్బయ్య నాయుడు బావమరిది శ్రీరాములు నాయుడే చేస్తుంటాడు. ఒక రకంగా శ్రీరాములు నాయుడు...అబ్బయ్యనాయుడికి బుల్లెట్ ప్రూఫ్ లాంటివాడు."
    
    "బుల్లెట్ ఫ్రూఫ్-"
    
    "అబ్బయ్యనాయుడు ఒక ప్యారలల్ గవర్నమెంట్ మేడమ్.... తడ రోడ్డుమీద ఏ కారెళ్ళినా అబ్బయ్యనాయుడి సెక్యూరిటీ స్టాఫ్ చెకింగ్ చేస్తారు."
    
    "విచిత్రంగా ఉందే.... నేనా దారిలో, కారులో వెళ్తున్నాననుకోండి. నన్ను కూడా చెక్ చేస్తారా...."
    
    "చేస్తారేమో..." నవ్వుతూ అన్నాడు హేమాద్రిశర్మ.
    
    "అబ్బయ్యనాయుడు....ఎప్పుడు...ఎలా రియాక్టు అవుతాడో....తెలీదట మేడమ్. కన్నింగ్ జాకాల్. అయిదేళ్ళ క్రితం తడలో జరిగిన, ఏదో మర్డర్ కి సంబంధించి....ఇన్వెస్టిగేషన్ కి అబ్బయ్యనాయుడి బంగ్లాకి వెళ్ళిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఆ బంగ్లాలోంచి మరి బయటకు రాలేదు మేడమ్..."
    
    "ఈజిట్... ట్రూ..."
    
    "ఎస్.... మేడమ్..."
    
    "భయంకరమైన క్రిమినల్ అలా విచ్చలవిడిగా తిరుగుతుంటే, గవర్నమెంట్, హోం మినిస్టర్....ఈ పోలీసులూ ఎందుకండీ...రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే నాకు జాలేస్తుంది. పంజాబ్ లో గోల్డ్ టెంపుల్ ని, బింద్రన్ వాల్ టైమ్ లో చుట్టు ముట్టినట్టు....చుట్టుముడితే..." ఆవేశంగా అంది సి.ఎమ్.

 Previous Page Next Page