"అర్ధంకావటం లేదు వదినా"
"కాదు బాబూ-ప్రపంచంపోకడ అర్ధం చేసుకోలేని సుకుమార హృదయుడివి నీకివి అర్ధం కావు - వద్దులే అప్పుడిప్పుడే వికసిస్తున్నమల్లెపూవు మీదమంచుకురిస్తే అది తడిసిస్నానం చేసినట్టు మీ మనసులు వెన్నెలవంటి అనురాగ ప్రవాహంలో స్నానం చేస్తున్నాయికానీ బాబూ-అది అందరికీ దక్కేది కాదు"
కొంచెం ఆగి అంది.
"నీవు నీ గీతాంజలి ఇద్దరూకలసి అంజలి పట్టడంసంతోషమూ శుభమూను"
అందుకు మీ తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ అంగీకరిస్తారు--ఆ నమ్మకంనాకు వుంది.
"మరింకేం వదినా?"
అతని అమాయకత్వానికి నవ్వువచ్చింది.
"బయటి ప్రపంచాన్ని గురించే బాధ అంతా బాబూ! నిన్ను చూస్తుంటే నీ అమాయకత్వం క్షణక్షణమూ ప్రస్ఫుటం అవుతుంటేనాలోని మాతృప్రేమపొంగి పొరలుతోంది సారధీ నిన్ను ఆశీర్వదిస్తున్నాను......మిమ్మల్ని భగవంతుడు సుఖంగా వుండేట్టు చేయాలని ఆశిస్తున్నాను-భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను"
మౌనంగా ఆమె పాదం నిమురుతూకూర్చున్నాడు సారధీ. అతని తల నిమురుతూ అంది సుభద్ర.
"స్త్రీహృదయంతో ఆటలాడుకోవద్దు సారధీ- మనసు ఇవ్వటంపుచ్చుకోవటం మగవానికిచాలా తేలిక-కానీ మగువ మనిపిస్తే మరల్చకోలేదు.
సారధి ఏమీ జవాబు ఇవ్వలేదు.
"నీమీద నమ్మకం లేకకాహ్డు సారధీ.....సహజంగా ఆడవారి అదృష్టం మీద నమ్మకం లేక అంటున్నాను -ఇంకోమాట కూడా గుర్తుంచుకో.....అవకాశాలు లేకపోతే ఆమె మనసుకి బంధం వేసుకుని మనవు చేసుకుంటుంది. నచ్చినవాడికి మనసిస్తే ఇవ్వవచ్చు కానీ ఇచ్చినవాడికిలోటు ఏనాడూ రానివ్వదు అంత నిగూఢమైన మనస్సుని అంచనా వేయడంలో మగవాడ్నెన్నడూ కృతత్యుడు కావటంలేదు- కాలేడు కూడా"
వదినగారు చెపుతున్న వజ్రపుతునకలవంటి మాటలు వింటూకూర్చున్నాడు సారధి.
ఆమెసాన్నిధ్యంలో అతనికి కలం కర్పూరంలా కరిగిపోతోంది.
"ఏనాటికైనా అనుభవం కన్నా అనుభూతిలో ఆనందం ఎక్కువ అనేమాట మరిచిపోవద్దు సారధీ-స్వార్ధంకన్నా త్యాగంలో వున్న మధురభావన మరెక్కడాలేదు. ఒక వస్తువుని మన దగ్గర వుంచుకుని ఆనందించటంలో వున్న ఆనందంకంటే ఆ వస్తువుని వేరేవారికి ఇచ్చేసి వారు ఆనందిస్తుంటే చూసి ఆనందించటంలో వున్న ఆనందంగొప్పది సారధీ-"
"వదినా మీ మరిది మీరు చెప్పేవి అన్నీ సువర్ణాక్షరాలతో తన మనసులో లిఖించుకుంటాడు. అవి చెదరవు-మీకు మాట చెపుతున్నాను వదినా- గీతాంజలితో కాపురం కలిస్తే భూలోకమే స్వర్గలోక మౌతుందిమాకు-
దేవతలేకాదంటే-
గీతాంజలితోడి స్నేహంలోని మధురానుభూతులే మనసులో స్వర్గాన్ని నిలుపుతాయి.
మనసునిండా మంచి భావనలు తాండవం ఆడుతూ వున్నప్పుడు అక్కడ నిశ్శబ్దం తాండవంచేయక శబ్దమయంకాదెప్పుడూ.
సారధీగీతాంజలి ఒకరిప్రక్కగా ఒకరు నడుచుకుంటూ వెళుతున్నారు.
"గీతా"
"......"
"మీనాన్నతో చెప్పావా?"
"మానాన్నతో ఏం చెప్పాలిసారధీ? నా మాటని మా నాన్న కాదనరు. నా కోరికను ఎప్పుడు ఔననే అన్నారు. నీరు పల్లానికి ప్రవహించినట్టు మా నాన్న ప్రేమసుథ ఎప్పుడూ నా పై ప్రవహిస్తూనే వుంటుంది. దాన్ని గురించి నాకు ఏనాడూ సందేహంలేదు"
"అయితే ఇక వుండే ఆలస్యమంతానాదేనంటావా?"
"నేనేమీ అనను"
"ఎందుకో?"
"నాకేంతొందర"
"పోనీనాకేలే"
"మరి"
"ఏమిటిమొండి సమాధానాలు"
"ఎవరివి"
"నీవి"
"ప్రశ్ననుబట్టి జవాబు"
"ఏయ్"
దెబ్బవేయబోయాడు తప్పించుకుని అంది
"సారధీ.....అందేద్రాక్ష పండుని కాదనేవారూ.....అందనివెలగపండుకి ఆశపడేవారూ......ఎవరూ ఉండరు. ఏమిటో ఆ తర్వాత నాకు తోచటంలేదు పో......."
మనసు నిండుగా మధురమైన భావన లహరి ప్రవహిస్తున్నపుడు మాటలు రావు.
అదేమాట అన్నాడు సారధి.
"మనసునిండా మధురోహాలు మరలు కొన్నపుడు మౌనమే కానీ మాటలురావు"
"......."
"అలా చూస్తున్నావేం గీతా?"
"......"
"నిజం......నీకు మనసులో నా మీద ఆవ్యాజానురాగం వెల్లివిరుస్తోంది. అదిమాటల్లో వ్యక్తం చేయగలిగేదా గీతా?"
సంతోషం ఎక్కువై అతనిచేయి అందుకుని నడవసాగింది.
అలాగే వెడుతున్నారు. వెనుక సైకిల్ గంట మ్రోగించారెవరో! అలాగే వెడుతున్నారు మళ్ళీ మ్రోగిందిగంట! తిరిగి చూశాడు సారధి.
మధు!
అప్పటికే సైకిల్ వాళ్ళమధ్యకురాబోతోంది దారిఇచ్చారు.
సైకిల్ కి ఇద్దరూ చెరోవైపువున్నారు. బ్రేక్ వేస్తూ అన్నాడు.
"అంతపరధ్యానమా?"
అతనిసైకిల్ హాండిల్ పట్టుకుని బాగా నిలబెడుతూ అన్నాడు సారధి.
"కాదు సధ్యానమే"
"ఓహో"
"ఆహా"
"అదేం"
నవ్వాడు సారధి.
సైకిల్ దిగి ముగ్గురూ నడకసాగించారు.
"పరీక్షలన్నీ అయిపోయాయి"
"అయితే ఏం?"
"మీనాక్షి నన్ను బ్రతకనివ్వటం లేదు సారధీ"
"ఏమీనాక్షి? మధుర మీనాక్షా?"
గీతాంజలి ప్రశ్నించింది ఆమె చమత్కారానికి నవ్వుకుని అన్నాడు.
"కంచికామాక్షి కాదు.....బెజవాడ కనకదుర్గమ్మా కాదు కలకత్తా కాళీ కాదు.....మధుర మీనాక్షే!"
"ఎందుకో?"
"అర్ధంకాలేదా?"
"ఏమైనామొక్కుబడి వుందా?"
"అవును"
"ఏమిటటో?"
"పరీక్షలుబాగావ్రాస్తే ఆమె దాసుడిని అవుతానని"
"పాసుకాకముందేనా?"