Home » Akkala saraswathi baburao » Jeevana Valayam


    టెలిగ్రామ్ అందించింది నజ్ మాకు చాలా జబ్బుగా ఉంది. చూడాలనుకొంటే వెంటనే రమ్మని ఉంది అందులో.
    "అక్కా, వెళతావా?"
    "వెళ్ళాలనే ఉంది, మధూ, నా నింకా ఇంటికి రాలేదు" అంటూండగానే "నేను చూసివస్తానుండు" అని బయటకు దూసుకుపోయాడు. పావుగంట తర్వాత మధు రమాకాంత్ ను వెంటబెట్టుకు వచ్చాడు. రమా కాంత్ కు రావటం కుదరదన్నాడు. రాత్రికి రాత్రి మధు, లత మద్రాసు బయలుదేరారు.
    లతా మధులను సాదరంగా, ఆనందంగా ఆహ్వానించింది గీత. అంతా కలిసి నజ్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నజ్ మా తెల్లగా పాలిపోయి, అతి నీరసంగా వత్తిగిలి పడుకుంది. లతను చూడగానే వెయ్యి జ్యోతులు వెలిగాయి ఆమె కళ్ళలో లేవలేని స్థితిలో ఉన్నా ఆమె లేచి లతను కౌగిలించుకోబోయింది. లత ఆమెను వారించి పక్కలోనే కూర్చుంది. మధు వంక చూస్తున్న నజ్ మాతో "ఇతడు నా తమ్ముడు. మధు. నీకు రాజా ఎంతో ఇతడూ అంతేననుకో" అంటూ పరిచయం చేసింది. నజ్ మా చిరునవ్వుతో చేతులు జోడించింది. అలా చేస్తున్నప్పుడు చిరునవ్వుతో ఆమె ఇంకా అందంగానే కనబడింది మధుకు.
    "మీ గురించి లతక్క ద్వారా విన్నాను. మీరు ఒక స్త్రీ యాబై సంవత్సరాల క్రిందట ప్రవర్తించి నట్లు ప్రవర్తించారు. ఇది మంచిది కాదు. మారుతున్న కాలంతోబాటు మనమూ మారాలి. ఆ విధంగా మారి ఉంటే ఇప్పుడు మీ జీవితం మళ్ళీ ఆనందంతో వెల్లివిరుస్తూ ఉండేది గదా!" అన్నాడు మధు.
    నజ్ మా కొంచెంసేపు అతనిని అలాగే చూసింది.
    "మధుబాబూ! పాత జ్ఞాపకాలు మనస్సును తొలిచి వేస్తున్నంతకాలం కొత్త ఆనందాన్ని పొందలేం. కాలం మారింది అనుకోవటమే గాని తరాలుగా వస్తున్న మనస్తత్వాలు ఎంతవరకు మారినాయి, చెప్పండి? స్త్రీ చదువుకొంటూంది, సంపాదించగలుగుతూంది, స్వతంత్రంగా జీవించగలుగుతూంది అనుకోవటమేగాని భర్తను కాదని ఏ పనైనా చేయగలుగుతూందా? భర్త ఇష్టానికి వ్యతిరేకంగా నడువగలుగుతుందా? అలా నడిచినా ఆ సంసారంలో శాంతి లోపిస్తుంది." కొంచెం ఆయాసపడినట్లు ఆగింది.
    "మీరు విశ్రాంతి తీసుకోండి" అంటూ మధు గది బయటకు వచ్చాడు.
    లత అలాగే నజ్ మా చేయి తన ఒడిలో పెట్టుకొని, దానిని నిమురుతూ కూర్చొంది.
    "లతా..."
    "ఏం?"
    "ఏమీ మాట్లాడవే?"
    "ఏం మాట్లాడమన్నావు?"
    "ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకొన్నాం గదా నీకు మాటలే కరువయినవా?" నవ్వింది నజ్ మా. నిజానికి నజ్ మాను చూస్తుంటే లతకు గొంతు పెగలటం లేదు. ఏదో తెలియని ఆవేదన, బాధ కంఠాన్ని నొక్కి పెడుతున్నట్లుగా ఉంది. సన్నగా, అతి సన్నగా కనిపిస్తున్న నజ్ మా, పాలిపోయిన ముఖంతో, లోతుకుపోయిన కళ్ళతో, మాట్లాడటానికే ఆయాసపడుతున్న నజ్ మా తన ఎదురుగా ఉన్నా, లతకు చిన్ననాడు చలాకీగా నవ్వుతూ, గెంతుతూ ఆటలు ఆడే నజ్ మా కళ్ళ ముందు కదులాడుతూంది. ఆ నాటి ఆ ఆనందం, ఆ ప్రశాంతత మళ్ళీ నజ్ మా తన వివాహానంతర జీవితంలో ఏనాడూ అనుభవించి ఉండదు. తలుచుకొన్న కొద్దీ లత కంటి నిండుకు నీరు నిండింది. నజ్ మా చూడకుండా పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకొంది.
    "లతా, అన్నయ్యకు నేను చచ్చిపోతానని భయం కాని నే నెందుకు చచ్చిపోతాను? భగవంతుడు నాకు చావులోని ప్రశాంతతను కూడా ఇవ్వడు. ఇలా జీవచ్చవంలా బ్రతకవలసిందే. ఎంతటి పుణ్యాత్ములకోకాని చావు రాదు. నాలాటి పాపి చిరాయువు." దుఃఖంతో ఆమె మాట్లాడలేకపోయింది.
    వారిస్తూ, "నీ విలా మాట్లాడితే నే నిప్పుడే వెళ్ళిపోతాను" అంది లత.
    "ఎలా వెళతావు? నీకోసం ఎన్నో రోజులనుండి ఎదురుచూస్తున్నాను. నిన్ను కడసారిగా చూడాలని ఉంటేనే రాజాతో వైర్ ఇప్పించాను." కొంచెం ఆగింది.
    "నువ్వు విశ్రాంతిగా పడుకో, నజ్ మా నీకు తగ్గే వరకూ నే నిక్కడే ఉంటాగా."
    "నన్ను మాట్లాడనియ్యి, లతా. నా కెవరున్నారు, చెప్పు? నాన్న పోయారా! నన్ను కళ్ళలో పెట్టుకొని చూసే అమ్మకూడా ఇప్పుడు లేదు. నా కోసం తను వివాహం కూడా చేసుకోకుండా అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకొంటున్నాడు. ఇలాటి అన్న దొరకటం నా పూర్వజన్మ ఫలమే. నేను బాబాయి దగ్గరకు వెళతానన్నా పంపడు. నాకోసం తన సుఖాన్ని, సంతోషాన్ని త్యాగం చేసుకొని శ్రమపడుతున్న అన్నయ్యను నే నెలా చూస్తూ బ్రతకగలను, చెప్పు? అందుకే చావు కావాలని కోరుకొంటాను. కాని అది నాలాటి వారికి రాదు, లతా...రాదు."
    లత బలవంతంగా ఆమె మాటల నాపి నిద్ర పోయేటట్లు చేసింది. మానవులను మృత్యుదేవతకు సమీపంగా తీసుకువచ్చే వాటిలో మానసికాందోళన ఒకటి. ఏ మృత్యువైతే తనను సమీపించలేదని నజ్ మా భావిస్తూందో ఆ మృత్యువు ఆమె కెంతో దూరంలో లేదనిపించింది లతకు.
    ఆ రాత్రి అంతా భోజనాలు చేస్తున్నారు. ఎవరూ మాట్లాడటం లేదు.
    "ఏమిటి బాబూ ఈ నిశ్శబ్దం? ఇంత నిశ్శబ్దంగా భోజనం చేయటం నాకు చేతగాదు" అంది గీత.
    "ఎవరికి వారే నజ్ మా విషయంలో ఆలోచిస్తున్నాం. కదన్నయ్యా?" అంది లత.
    'అవు'నన్నట్లు తల ఊపాడు రాజా. కొంచెం ఆగి, "నజ్ మా ఇక ఎంతోకాలం బ్రతకదమ్మా. అందుకే నీకు వ్రాశాను. చాలా రోజుల నుండి నిన్ను చూడాలని కూడా అంటూంది" అన్నాడు.
    "అయితే?" భోజనం పూర్తి చేసి వాష్ బేసిన్ వైపు వెళుతూ అంది లత.
    "నేను చెపుతాను విను, లతా, నజ్ మాకు బ్లడ్ ప్రెషర్. ఆమె విశ్రాంతిగా ఉండాలని, ఎలాటి మానసికాందోళన కలగకూడదని డాక్టరు చెప్పాడు. కాని అదెలా సాధ్యం? ఆమె మనశ్శాంతికోసం ఏ సినిమా చూసినా అందులో భార్యాభర్తలు, లేకపోతె ప్రేమ. ఒక పుస్తకం చదివినా అంతే. కుటుంబం గురించి విన్నా, ప్రేమ గురించి చదివినా ఆమె తన సంసారాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది. మళ్ళీ కొన్నాళ్ళు జబ్బు పడుతోంది.
    "అయినా ఇప్పటిలాగ ఇన్నాళ్ళు మంచంమీద ఇది వరకు లేదుగా?" గీత అందిస్తున్న ఆకులు అందుకొంటూ అన్నాడు రాజా.
    "ఇంతకీ నజ్ మా మంచమెక్కటానికి కారణం ఆ 'పగిలిన హృదయాలు" అంది అంది గీత.
    "చూశావా, మధూ? ఆ రోజు నీతో ఇది చదివి నజ్ మా బాధపడుతుందనే చెప్పాను. కాని మంచమే ఎక్కింది" అంది లత.
    "ఒక్కొక్కసారి ఆ సీరియల్ చదవటం, చూశావా, గీతా, ఆ రోజు ఇలా జరిగింది మా ఇంట్లో నే నప్పుడు ఇలా అన్నాను అని చెబుతుంటే ఆమె ఇప్పటికీ ఆ జరిగిన సంఘటనలకు భయపడుతున్నట్లు వణికిపోయేది. ఎంతో కష్టంమీద ఆమె ఆరోగ్యం కాపాడుతున్న భాషా ఇక ఆమెను ఏ విధంగానూ కాపాడలేకపోయాడు. ఆ నవల ఆమె నంతగా కదిల్చివేస్తూంది." గీత కొంచెం ఆగింది.
    "కొందరికి గడిచిన దినాలు, అనుభవాలు ఎంతో మధుర స్మృతులను, మనశ్శాంతిని కలగజేస్తాయి. కాని నజ్ మాకు గడిచిన జీవితం తలుచుకొన్న కొలదీ విషాదం, బాధ తప్ప మరేమీ లేదు."
    
                               *    *    *

    నజ్ మా ఆలోచనలతో లత ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పోలేకపోయింది. ఉదయం లేచేటప్పటికి బాగా ఎండ వచ్చింది. డైనింగ్ రూమ్ లో గీత మాటలు వినిపిస్తున్నాయి. లత కూడా గబగబ ముఖం కడుక్కొని వచ్చి కూర్చుంది.
    "అసలెప్పుడూ ఆవిడ అంతేనండీ. బేడ, పావలా కంటే కూరకు ఎక్కువ ఖర్చు పెట్టదు. పైగా, ఆ తెలివితేటలు చూశారా? ఆకుకూరలైతే ఎక్కువగా వస్తాయని అవే కొంటుంది. మరీ అంత పీనాసిగా ఉంటే ఎలా బాబూ?" అంటూంది గీత.
    "అవును నిజంగానే ఆమె తెలివిగలది. అందుకే అటు పొదుపుచేస్తూ బలమైన కూరలు పండగలుగుతూంది." టిఫిన్ తింటూనే నిదానంగా చెప్పాడు రాజా.
    "అంటే?" అర్ధం కానట్లు చూసింది రొట్టె ముక్కలకు వెన్న రాస్తున్న గీత.
    "అంటే ఆకు కూరలు చౌకగా వస్తాయి. పైగా, అందులో విటమిన్సు ఎక్కువగాను ఉంటాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్ట గలిగేవారు బలమైన ఆహారం ఏమైనా తినగలరు. కాని అలా ఖర్చుపెట్టలేని వారు తాముతినేది ప్రతిదీ చౌకలో బలమైంది చూసుకోవాలి."
    "మీ రెప్పుడూ ఇలాగే అంటారు. వాళ్ళా ఇంట్లో కొచ్చి ఇన్నాళ్ళైందా? చాకలికి బట్టలు వేయటం చూడలేదు గదా? ఎప్పుడూ ఆమే ఉతుక్కొంటుంది. ఒక్క చాకలి పనేమిటి? బట్టలు కుట్టటం, అంట్లు తోమటం, ఇస్త్రీ చెయ్యటం-అన్నీ తనే చేస్తుంది. ఇలాటి వారిని నే నెక్కడా చూడలేదు బాబూ!" అంది విసుక్కొన్నట్లు.
    "నువ్వు చూడకపోవచ్చు. కాని లోకంలో అలాటి వారు చాలా మంది ఉన్నారు."
    నమ్మలేనట్లు చూసింది గీత.
    "అవును. నువ్వెలా నమ్మగలవు? భర్త కొన్ని వందలు సంపాదిస్తుంటే అవి ఖర్చుపెట్టి, చాలదని పుట్టింటినుండి తెప్పించుకొనే నీవు ఆమె వనెలా అర్ధం చేసుకొంటావు?" అన్నాడు రాజా.
    "ఎవరి సంగతన్నయ్యా మీరు మాట్లాడేది!" అప్పటివరకు వింటూ కూర్చున్న లత అడిగింది.
    "మన ఔట్ హౌస్ ను ఎవరికో అద్దెకు ఇచ్చారమ్మా. అందులో ఒక ఎస్. జి. ఓ. ఫామిలీ దిగింది. ముగ్గురు పిల్లలు, భార్యా భర్త. వారిని చూసి ఈమె రోజూ గొడవే" అని కొంచె మాగి "అస లీవిడ గారు ఆమెతో మాట్లాడేది గాదులే. మరి ఈమె ఆఫీసరు భార్య గదా?" అన్నాడు.
    "ఫో, అన్నయ్యా, నువ్వు మరీను" అంది నవ్వుతూ లత.
    "నిజం, లతా కాని ఆ ఇంట్లో పిల్లలున్నారు చూశావూ, బంతుల్లా ముద్దుగా ఉంటారమ్మా. గీతకు వాళ్ళతో అయిన స్నేహం వాళ్ళమ్మ వరకూ పోయిందమ్మా. అక్కడి నుండి ఈమె వాళ్ళ గుట్టు మట్లు తెలుసుకొని ఇలా అల్లరి పెడుతోంది."
    "నేనేం అల్లరి పెట్టలేదు." మీకే కదూ చెప్పాను. చూడు, లతా, ఆమె చేసే ప్రతిదీ నాకు చిత్రంగానే ఉంటుంది. క్షణం ఊరికే కూర్చోదు. ఒక క్లబ్బు లేదు. షికారు లేదు. నెలకు ఒక్క సినిమా కూడా చూడరంటే నమ్ము."
    "నువ్వనేది మరీ బాగుంది, వదినా! అలా ఉండక పోతే ఈ పట్నంలో ఎన్. జి. ఓ. లు ఎలా బ్రతక గలరు, చెప్పు?"
    "గీత కెలా చెప్పినా అర్ధం కాదమ్మా చూడు, గీతా, నీ భర్తకే అలాంటి సంపాదన ఉండి, వెనక ఎవరూ పెట్టే వారు లేరనుకో ఆ వచ్చిన రెండు వందలలోనే మీ బ్రతుకు మీరు బ్రతకండి అని పెద్దలంటే అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బు విలువ."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra