Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 14


    నేనంటే పడనివారు ఇప్పుడు  ఎంతమందో. వారిలో ఓ ఒక్కరు పుణ్యం కట్టుకున్నా విపరీత పరిణామాల్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుంది- ఆ పరిణామాల్లో నా ప్రాణంవల్ల కూడా ప్రమాదం పొంచి వుంటుందని నాకు తెలుసు. తెలిసే సాహసం చేస్తున్న నన్ను రక్షించగలవారు నా  శత్రువులే- ఎలాగంటే నేను ఎవర్ని ఉద్దేశించి రాస్తున్నానో వారికి తెలియపరచకుండా, గతంలో అతనికి వ్యతిరేకంగా, అతని చీకటి జీవిత ప్రపంచపు అంచుల్ని తాకిన ఎందరో అరేబియా సముద్రపు అలలకు కొట్టుకొచ్చి ఒడ్డునపడ్డారు. ఆ మహానగరపు ప్రధాన డ్రైనేజి కాలువలో శవస్నానం చేసినవారూ ఉన్నారు. వారిలో జర్నలిస్టులు, ప్రెస్  ఫోటో గ్రాఫర్సు,దేశభక్తులు, యాదర్థవాదులు ఎందరో.
    చూద్దాం నా ఈ సాహసం ఏ పరిస్థితులకు దారితీస్తుందో?
    ఇక కరాళ నృత్యంలోకి వెళతాను.
    దినేష్ ఎదురుగా ఉన్న అతని అనుచరులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
    ఈ నల్లురు అనుచిరులకో ప్రత్యేకత ఉంది. పైకి అందరూ కార్మికుల్లాగే  కనిపిస్తారు. మిగతా  వారితో కలసి  ఫ్యాక్టరీ  రూల్స్  ప్రకారమే పనిచేస్తుంటారు. ఈ విషయాలు మాత్రమే  అందరికి తెలిసినవి, భూపతిరావుకి, దినేష్  మాత్రమే తెలిసినవి వేరే  ఉన్నాయి.
    బయట ప్రపంచానికి ఏమాత్రం  తెలియకుండా, ఎవరూ పసిగట్టకుండా నల్గురు మేధావులతో ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ని నెలకొల్పారు.
    అదే లెంప్. "లెంప్"లో నాలుగు ఇంగ్లీషు అక్షరాలున్నాయి. ఒక్కో అక్షరం ఆ ఆర్గన్నైజేషన్ లో  వున్న  ఒక్కో వ్యక్తి రహస్య చిరునామా. ఆ వ్యక్తిని ఆ ఇంగ్లీషు అక్షరం పేరుతోనే పిలుస్తుంటారు భూపతిరావు, దినేష్, ఆ అక్షరంలోనే వాళ్ళు చేయవల్సిన పనికిసంబంధించిన ఇంగ్లీషు పదం మొదటి అక్షరం కూడా ఉంటుంది.
    లెంప్ లో L E M P  అనే నాలుగు లక్షరాలున్నాయి.
    L అంటే టేబుల్. మొదటి వ్యక్తిని 'యల్' అని గుర్తించారు. ఇతను లేబర్ ప్రాబ్లమ్స్ ని ముందుగానే పసిగట్టే వేట కుక్కలాంటి వ్యక్తి.
    ఇతను అందరు కార్మికుల్లాగే డ్యూటీకి హాజరవుతూ, పని చేస్తూ, తోటి కార్మికులోచెలరేగే అసంతృప్తిని, అశాంతిని పసిగట్టి వాటిని ఎప్పటి కప్పుడు  రహస్యంగా  దినేష్ కి చేరవేస్తుంటాడు.
    కార్మికుల్లో చెలరేగే అసంతృప్తిని పసిగట్టటానికి ఇతను అనేక పద్దతులు అవలంభిస్తుంటాడు.
    మేనేజ్ మెంట్ కి వ్యతిరేకంగా అప్పుడప్పుడు రెచ్చిపోతుంటాడు. ఆ సందర్భంలో తనను సపోర్ట్  చేసే వ్యక్తుల్ని గుర్తుంచుకొని, వారినే నీడలా వెంటాడతాడు. యూనియన్ లీడర్స్ కి చెందిన అంతరంగికుల్ని వివిధ రకాలుగా తన గుప్పిట్లో కి తెచ్చుకుంటాడు. వారి ద్వారా లీడర్ ! అంతరంగాన్ని అంచనా  వేస్తాడు.
    కార్మికులు గాని, యూనియన్స్ గాని భవిష్యత్తులో ఏ డిమాండ్ మీద మేనేజ్ మెంటు మీద తిరగబడవచ్చో తెలుసుకుంటాడు. అది మరు క్షణం దినేష్ కి అందించబడుతుంది.
    ఆ వార్తా ప్రాముఖ్యాన్ని బట్టి దాన్ని తన పరిధిలోనే పరిష్కరించవచ్చా-లేదా తండ్రిదాకా తీసుకెళ్ళాలా అనేది దినేష్ నిర్ణయించుకుంటాడు.
    ఇందుకుగాను 'డి' ప్రతికెలా వేలల్లో సొమ్ము అందించబడుతుంది. కానీ ఈ అంకెలు కంపెనీ ఎకౌంట్ బుక్స్ లో రికార్డ్  కావు. ఈ ఖర్చు వేరే పద్దుల క్రింద చూపెట్టబడుతుంది.
    రెండవ అక్షరం 'E' 'ఈ' అంటే ఎకనామిక్  పోలసీన్ అండ్ ప్రాబ్లమ్స్ ప్రభుత్వాలు, ఆర్థక సంస్థలు అవి తీసుకొనే నిర్ణయాలు, వడ్డీ రేటు, పెట్టుబడులు, వీదేశీ  మారక ద్రవ్య వివరాలు, షేర్  మార్కట్  స్టాక్ ఎక్చేంజ్ అట్టడుగు పొరల్లో వచ్చే అతి ప్రమాదకర కదలికల్ని 'ఈ' అనే వ్యక్తి పసిగట్టి దినేష్ కి చేరవేస్తాడు. ఇతని ఖర్చు వేలల్లో ఉంటుంది. ఒక్కోసారి లక్షల్లో కూడా.  
    భవిష్యత్ లో వడ్డీ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని ముందే తెలిస్తే పెరగకముందే పెద్ద మొత్తాల్లో లోన్స్ తీసుకుంటాడు భూపతిరావు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏ వస్తువుపై ధర పెంచనున్నాయో ముందే ఈ వ్యక్తిద్వారా తెలిసిపోతుంది గనుక డానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాడు.
    మూడవ అక్షరం 'M' (ఎమ్) అంటే మేనేజీరియల్ ప్రాబ్లమ్స్.     
    భూపతిరావుకి దాదాపు 25  కంపెనీలున్నాయి. ప్రతి కంపెనీకి ఆయా శాఖల్లో ఉన్నత విద్యార్హతలు, పరిణత గల వ్యక్తుల్ని ఎక్టిక్యూటివ్ లెవెవ్ లో నియమిస్తాడు.
    వీరి చేతుల్లోనే ఆయా సంస్థల పనితీరు, సామర్థ్యం, ప్రొడక్టివిటీ లాంటివి ఉంటాయి. ప్రతి సంస్థను, ప్రతి అంశాన్ని యాజమాని ఒక్కడే (లేకకొద్దిమంది యజమానులు) చూసుకోలేడు గనుక ఆ విధంగా నియమిస్తారు.
    ఈ వ్యక్తులు తలచుకుంటే ఎలాంటి సంస్థనయినా 24 గంటల్లో  స్థంభింపచేయగలరు. ఈ స్థానాలు అతి ప్రమాదకరమైనవి. సాధారణంగా ఇలాంటి పదవుల్లో బందువుల్నో, స్నేహితుల్నో, నిజాయితీపరులో విశ్వాసం ఉన్న వ్యక్తుల్నో నియమిస్తారు. అయినా దెబ్బతిన్న  సంస్థలున్నాయి. ఈ 'ఎమ్' అనే వ్యక్తి యాజమాన్యానికి వ్యతిరేకమయిన వాడిగా ఈ పదవుల్లోఉన్నవారి దృష్టిలో పడతారు  కావాలని అలా కనిపిస్తేనే వారిలో యాజమాన్యంపట్ల ఏమయినా అసంతృప్తి నిరసన ఉంటే బయటపడతాయని, (ఇలాంటి గూఢచారుల్ని ఈ మధ్య ప్రతి సంస్థానియమిస్తోంది. రానున్న ప్రమాదాల్ని ముందుగానే పసిగట్టేందుకు) ఇది మరుక్షణం దినేష్ కి చేరుతుంది. దినేష్ వార్ని అన్యాపదేశంగా మందలించటమో, హెచ్చరించటమో, బెదిరించటమో చేస్తాడు. దాంతో వారు సెట్ రైట్ అయితే వారి పదవులు కొనసాగుతాయి. లేదంటే ఈ విషయం భూపతిరావు దృష్టికి తీసుకువెళ్తాడు దినేష్. ఆ రాత్రికి రాత్రి ఆ వ్యక్తి ఉద్యోగం ఊడిపోతుంది అతను అది తెలియక మరుసటి  రోజు ఆఫీసుకు వచ్చి, తన సీటు దగ్గరకు వెళ్ళగా అందులో మరో కొత్తవ్యక్తి కూర్చుని ఉంటాడు. అతను వెంటనే ఇతన్ని డిస్ మిస్ చేసిన కంపెనీ లెటర్ అందిస్తాడు. సవినయంగా.
    ఇక నాల్గవ అక్షరం పి. 'పి'  అను పొలిటికల్  ఛేంజెస్ అండ్ కూప్స్ రాజకీయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వచ్చేమార్పులు, వాటి  పట్ల  ప్రతిపక్షాల రియాక్షన్స్, వాటి విశ్వరూపం మొదలగునవి
    ఇతనెప్పుడూ ఏదో  పనున్నట్లుగా నటిస్తూ, నలుగురికీ పైరవీలు చేసిపెట్టి, నాలుగు డబ్బులు సంపాదించుకొనే పొలిటికల్ బ్రోకర్ గా అనిపిస్తాడు అందరికి అతను భూపతిరావు కంపెనీలకు చెందిన మనిషని ఎవరూ  ఇంతవరకూ పసిగట్టలేదు.
    భూపతిరావుకు రాజకీయంగా ఏదన్నా పనికావల్సివస్తే, తనకై  తాను ప్రయత్నించటం అతని స్థాయికి తగదు గనుక, ఇతని ద్వారా ఆ పనులన్నీ సానుకూల పర్చుకుంటాడు.
    ఈ నల్లురిలోకి అతి ముఖ్యమైన, ఎల్. ఎమ్. ఒక సంస్థ సమర్థవంతంగా పనిచేయాలంటే లేబర్ సమస్యలు, నిర్వాహక సమస్యలు ఉండకూడదు వీటిని ముందుగానే పసిగట్టి, తగిన చర్యలు తీసుకోగల సంస్థలే నేడు సవ్యంగా నడుస్తున్నాయి.
    ఎల్. ఎమ్. లాంటి సి.ఐ.డి. వ్యక్తులు ప్రతి సంస్థలోనూ ఉంటారని ప్రతిసిబ్బందికి తెలుసు. ఉంటారనే కాని, ఎవరు  అనేది 'తెలియదు' తెలుసుకోలేరు.
    సిబ్బందిలో ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యమే. తాము అనుకున్న విషయం క్షణాల్లో హైలెవల్ మేనేజ్ మెంటుకి ఎలా తెలిసిపోతోందని. ప్రతిసారీ ఈసారికి జాగ్రత్తగా ఉండాలనేఅనుకుంటారు. కాని ఎక్కడో లీక్ అయిపోతుంది.
    తెలియని 'ఎల్' గురించి సిబ్బందికి భయమైతే, తెలుసుకోలేని 'ఎమ్' గురించి బోర్డాఫ్ డైరెక్టర్స్ కి , షేర్ హొల్డర్స్ కి భయం.
    'లెంప్' లాంటి ఆర్గనైజేషన్స్ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంటే, ప్రభుత్వ సంస్థల్లో సి ఐ డి, సి బి  సి. ఐ.డి, యాంటికరప్షన్, పొలిటికల్ సెక్రటరీ నమ్మకస్తులైన పార్టీ  కార్యకర్తలు పై కార్యకలాపాల్ని నిర్వహిస్తారు.

 Previous Page Next Page