Previous Page Next Page 
మరో ప్రస్థానం పేజి 14


                                             వజ్రం

  

మన తరిమెల నాగిరెడ్డి
అనంతపురం జిల్లాలో దొరికిన    
వజ్రకరూర్1వైఢూర్యం

నా తరిమెల నాగిరెడ్డి
విశాఖపట్నం సముద్ర తీరంలో
ఆకస్మికంగా అగుపించిన ఆణిముత్యం

ఒక తరిమెల నాగిరెడ్డి
స్నేహనికీ; స్వేచ్ఛకీ; విప్లవానికీ
ఒకే ఒక పర్యాయ పదం

ఇంతెందుకూ
ఈ తరిమెల నాగిరెడ్డి
పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం


                                                    ముద్రణ: తెలుగు వెలుగు వారపత్రిక, 9-11-1973
                                         పునర్ముద్రణ : మరో ప్రస్థానం, విరసం ప్రచురణ - మే, 1980


1. వజ్రకరూరు : అనంతపురం జిల్లాలో వజ్రాలకు ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు వజ్రాలు నేలపైననే కనిపిస్తాయి.

 Previous Page Next Page