Home » Chandu harshavardhan » డేంజర్ మినిట్స్



    "సారి మేడమ్! మీ అభిప్రాయంతో నేను ఎకిభావించను. నేను చెప్పేది  వింటే మీ అభిప్రాయం మార్చుకుంటారు కూడా."

    ఇన్స్ పెక్టర్  ధీరజలో క్యూరియసిటి!

    "ఏమిటో చెప్పండి?"

    "నీలిమ గురించి  మీకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఆమె ఎవరికీ చెప్పకుండా మూడు రోజులపాటు ఎక్కడికో వెళ్ళిందంటే నేను నమ్మను."

    "అంటే!  ఎవరయినా కిడ్నాప్ చేసివుంటారని మీ అనుమానమా?"


    "అది తెలుసుకావలసింది మీరే. ఆమెకు ఎవరూ  బంధువులు లేరు. చెప్పుపెట్టకుండా హఠాత్తుగా యూనివర్శిటికి గ్తెర్ హాజరు కావలసినంత ప్రాబ్లమ్స్  ఆమెకు  ఏమీ లేవని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంకొక మాట....షి ఈజ్  వేరి  సెన్సిటివ్....ఆమెను నొప్పించకుండా ప్రశ్నించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి"

    "ఆమె గుంరిచి మీరు చెప్పేది  ఇంకేమయినా వుందా?"

    "నీలిమ డిసిప్లెన్ ను పాటించే బాధ్యత కలిగిన వార్డెన్ కూడా. కనిసం  హెడ్  ఆఫ్ ది డిపార్ట్ మెంట్ కు  కూడా  ఇన్ ఫామ్  చేయకుండా హాస్టల్ లోని స్టూడెంట్స్ ను గాలికి వదిలేసి వెళ్ళిందంటే  నేను నమ్మను.....ఐదింక్ దర్  ఈజ్  నందింగ్ రాంగ్."

    "మీ అనుమానాలేమితో వివరంగా చెప్పండి."

    "ప్రత్యేకించి  ఏమిలేకపోయినా ఎవరో  బుద్దిపూర్వకంగానే  ఆమెను మాయచేసి వుండాలి అనుకుంటున్నాను."

    "సరే....అలానే అనుకుందాం. ఇప్పుడు వచ్చిన తరువాత నిలిమను మీరేమి ప్రశ్నించాలేదా?"

    "అడిగాను....కానీ ఆమె చెప్పే సమాధానం శుద్ధ అబద్దం అని చెప్పగలను."

    "అంటే?"

    "అసలు తను ఎక్కడకూ వెళ్ళలేదంటుంది. ప్రతిరోజూ క్లాస్ సకు అటెండ్  అవుతూనే  వున్నానంటుంది."

    "వెరి ఇంటరెస్టింగ్."

    "కావాలంటే అటెండెన్స్ రిజిస్టర్ చూసుకోండి....నేను ప్రతిరోజూ వచ్చి సంతకం చేసి వెళుతున్నాను అన్నది. అలాగే రిజిస్టర్ చూస్తే అంతకుముందు రాణి మూడు రోజులూ వచ్చినట్టు ఆమె సంతకాలు వున్నాయి."

    "ఆ మూడు సంతకాలు కూడా నిన్న వచ్చిన తరువాత చేసిందేమో" తన అనుమానాన్ని వెలిబుచ్చింది ఇన్స్ పెక్టర్ ధీరజ.

    "లేదు...ఆమె రాణి రోజు నేను ఆబ్ సెంట్ పెట్టాను. కానీ విచిత్రంగా ఆమె చెప్పినతరువాత చూస్తే సంతకాలు చేసి వున్నాయి."

    "అంటే, చెరిపేసి సంతకాలు చేసిందటారా?"

    "ఇంపాజిబుల్.....నా ఎదురుగానే సంతకం  చేసింది. అదికాక అంత తక్కువ వ్యవధిలో అలా చేయడం అసంభవం. కొట్టివేతలూలేవు.....చేరిపెయడమూ జరగలేదు. కానీ, నేను పెట్టిన ఆబ్ సెంట్  మార్క్ లకు  బదులు సంతకాలు వున్నాయి. ఇదేదో  కనికట్టో....మేస్మరిజమో అనిపించింది నాకు...." వీ.సి. ఒక నిమిషంపాటు చెప్పడం ఆపాడు.

    "సంతకాలు విషయం ఎలా వున్నా, కనిపించకుండా పోయిన ఆ మూడు రోజులలో ఏదో  జరిగిందనేది మాత్రం నిజం అంటారు. ఆమె కావాలనే అబద్దం చెబుతూ వుండాలి. ఆమె నుంచి ఏదో ఆశించి  ఎవరో ఆమెను కిడ్నఫ్  చేసి వుండవచ్చు వదిలేసినా తరువాత వాళ్ళు బెదిరించి  ఆమెను అలా చెప్పమంటే  అలా చేబుతూనయినా వుండి వుండవచ్చు. అదే  నిజమయితే వాళ్ళెవరో , ఎందుకు ఆమెను కిడ్నాఫ్ చేశారో, ఎందుకలా బెదిరిస్తున్నారో తెలుసుకోవాలి....అంతే కదూ?"

    "ఎస్....ఎస్! అసలు నేనే మీతో ఈ విషయాలన్నీ మాట్లడాలనుకున్నాను. ఇంతలో మీరే  వచ్చారు. ఎలాగయినా ఈ మిస్టరీని మీరు చేదించాలి. ఇది మా యూనివర్సిటి ప్రిస్టేజ్ క్వశ్చన్ నీలిమ  అదృశ్యం వెనుక నున్న అదృశ్య వ్యక్తుల ఆచూకి తిసి వాళ్ళను అరెస్టు  చేసి, వాళ్ళకు  శిక్షపడేలా చూడాలి" అంటూ  అభ్యర్ధించాడు వ్తేస్ చాన్సలర్.

    "డోన్ట్ వర్రి సర్....ఇట్స్ మ్తె డ్యూటి ....ఐవిల్ టెక్ దిస్ యాజ్ ఏ చాలెంజ్."

    "ధాంక్యూ...మీరు ఆర్కియాలజీ డిపార్టుమెంట్ హెడ్ ప్రొఫెసర్ ప్రేమ్ చంద్ గారిని కలవడం మంచిది. ఆమె గుంరించి ఏమయినా వివరాలు  చెప్పగల అవకాశం ఆయనకోక్కడికే వున్నది."

    "వాట్ ఎబవుట్ సుధాకర్ ?"

    "ఐమిన్, ఆర్కియలజి లెక్చరర్ సుధాకర్ గురించేనా మీరడిగేది?"

    "ఎస్ సర్! అతను కూడా నీలిమ కొలిగే కదా....అతని  బిహేవియర్  ఎలాంటిదో చెప్పగలరా?" ధీరజ సూటిగా ప్రశ్నించింది.

    "వాడొట్టి రోగ్.....పేరుకు లెక్చరర్ అన్నమాటే కానీ నితినియమాలు లేని కల్చర్ లెస్ బ్రూట్ అని ఒక్క మాటలో చెప్పు వచ్చు స్త్రి అంటే చులకన భావం తప్పు ఆమెను పవిత్రంగా చూసే సహృదయం లేదతనికి."

    ధీరజకు సుధాకర్ ను మొట్టమొదటి సారి కలిసినప్పదు అతను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

    తను ఏంతో నీతిమంతుడినని గొప్పగా చెప్పకున్నడప్పడు.... అంతేకాదు నీలిమ కారెక్టర్ లేని ఆడదాని కూడా చెప్పినట్టు గుర్తు.

    "ఇఫ్యూ డోంట్ మ్తేండ్ ....మిలిమ కారెక్టర్  ఎలాంటిదో చెప్పుగలరా?" షడన్ గా టాపిక్ మార్చి  తన  అనుమాన నివృత్తికోసం  సూటిగా ప్రశ్నించింది ధీరజ.

    "చెప్పడానికేమిలేదు. షి ఈజ్ వెరి సిన్సియర్....అసలు అలాంటి బుద్దిమంతురాలీని నేనింతవరకూ ణ సుదీర్ఘ సర్వస లో చూడనే లేదంటే అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఎలాంటి మచ్చాలేని సచ్చిలురాలు  నీలిమ అందుకే నాకు కూతుళ్ళు  లేకపోయినా కూరుతులాంటి నీలిమ ఏదయినా సమస్యల వలయంలో చిక్కుకుందేమోనన్న ఆరాటంతోనే పోలిస్ కంప్లయింట్ యిచ్చాను.

    "కానీ, సుదాకర్ ఆమెను గురించి నాకు చాలా బాడ్ గా  చెప్పాడే!"

    "చెబుతాడు. ఎందుకు చెప్పడు? ఒంటరిగా ఉద్యోగం చేసే ఆడదంటే అతనికి చులక ఎక్కువ ....ఒకసారి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra