" ఈ రోజు మీ అమ్మ రాదటగా" అంటూ దగ్గిరి కొచ్చాడు.
వెన్నెలంతా మనిషి రూపం ఎత్తి తనను నొక్కేస్తున్నట్టు ఫీలయ్యింది ఆమె.
"ఆఁ. నెల్లూరు వెళ్లింది."
"అందుకే మామూలుగా సాయంకాలం రాకుండా ఇప్పుడొచ్చాను" అన్నాడు.
తను ద్వారం దగ్గరనుంచి కదిలితే అతను లోపలికొచ్చేస్తాడని గ్రహించి అక్కడే నిలబడిపోయింది.
"ఎందుకు?"
"చెబుతాను లోపలికి రానివ్వు"
"లోపలికొద్దు అమ్మమ్మ మేల్కొనే వుంది. ఇక్కడే కూర్చుందాం" అని మెట్లమీద కూర్చుంది.
అతను ఓ మెట్టు కింద కూర్చున్నాడు.
చీకటి నల్లటి దుమ్ము ఆవరించినట్టుంది.
గాలి మరికాస్త రొమాంటిక్ గా మారినట్టు అధ్బుతంగా వుంది.
"నిన్ను ఓ గంటసేపు చూడకపోతే ఎలా వుంటుందో తెలుసా? మొత్తం రాజ్యాన్ని యుద్దంలో పోగొట్టుకున్న చక్రవర్తి కూడా ఇంత దిగులు పడడనుకుంటా. రక్తమంతా ఒంటినుంచికారిపోతే ఎలా వుంటుందో అలా అయిపోతుంది శరీరం.
ఇక మనసు కథ చెప్పక్కర్లేదు. దిగులంతా తనదే అయిపోతుంది."అన్నాడు భరణి.
"అలానా" అంది గాఢంగా.
"ఆఁ" అని ఆమె రెండు భుజాల మీద చేతులు వేశాడు.
"నాకో పెద్ద కోరిక వుంది" అని ఆగాడు.
తన భుజాల మీద అతని చేయి నొక్కుకుపోతున్న తీరును చూస్తే ఆ కోరిక ఏమిటో ఆమెకి తెలిసిపోతోంది. అదేమిటో ఊహించగానే రక్తమంతా బుగ్గల్లోకి పరిగెత్తుకొచ్చింది.
పైట జారుడుబండ మీద నుంచి జారినట్టు జర్రుమని జారి ఒళ్ళో పడింది.
లోపలున్న అందాలు మరింత పొంగి కొండల్ని అద్దంలో చూపినట్టు అయిపోయాయి.
ఆమె ఠక్కున పైట తీసుకుని సిగ్గును చిరునవ్వులో దాచినట్టు కప్పుకుంది.
"ఆ కోరిక ఏమిటో చెప్పనా?"
"ఊఁ" చిన్న నీటి కాలువ మలుపు తిరిగినట్టు ఆమె కంఠం వంపులు తిరిగింది.
"నా మనసును ముక్కలుగా చేసి వాటితో అద్దాల జాకెట్టును కుట్టినట్టు ఓ జాకెట్ కుట్టి నీకు ప్రజెంటేషన్ కింద ఇవ్వాలనుంది" అన్నాడు.
ఆమె ఆ మాటలు విని తట్టుకోలేకపోయింది.
అలానే తన అభిమానాన్ని, అనురాగాన్ని అతని హృదయానికి వినిపిస్తున్నట్టు తన ఎద అతని ఛాతీలో కూరుకుపోయే విధంగా గట్టిగా అదుముకుంది.
ఆ కౌగిలింత అనతిలో వింత సంచలనాన్ని రేపుతోంది. నరాల్లో డైనమేట్ పెట్టి పేల్చేసినట్టు చిట్లుతున్నాయి. రక్తం మరింత ఎరుపెక్కినట్టు తోస్తోంది. కోరిక శరీరాన్ని రగిలిస్తోంది.
ఇక ఆగలేక అతని చేతులు ఆమె నడుం మీదకి జాకి చిటికెన వేలు పట్టుకున్న బంగారపు వుంగరంలా అయిపోయాయి.
అంచెలంచెలుగా వీస్తున్న గాలికి గాలిమర సుతారంగా తిరిగినట్టు పొట్టచుట్టూ అతని వేళ్లు కదులుతున్నాయి.


