ఆ మాటలకి ఆశ్చర్యపోయడతను. "నువ్వు నువ్వు..."
'నేను ఉలూచిని అంటే తెలవదా! అర్జునుడు... శ్రీకృష్ణుని బావమరది... కుంతి కొడుకు... అతన్ని వలచిన నాగకన్య నేను...'
'ఆ ఉలుచివా నువ్వు?" అప్రతిభుడై అడిగాడు
ఫక్కున నవ్విందామె 'ఉహూ కాదు.ఆమె మనవరాలి మనవరాలిని. నాపెరూ ఉలూచే ?"
'నువ్వు నాగకన్యవా?'
'అఁ నాగ దేవతను...'
అతనేం అన్లేదు! అలాగే చూస్తున్నాడు. ఉల్లి పావురలాటి పైటరివ్వున గాలికి ఎగురుతోంది ట్రాన్స్పరెంట్ లాటి చీర శరీర సౌందర్యాన్ని కాంతి తరంగాలుగా ప్రస్ఫుటీకరిస్తోంది.నృత్య భంగిమలో నించున్న ఆమె శరీరం నాట్యశాస్రం, శిల్పశాస్రం బాగా తెలిసిన వ్యక్తి గండరీకరించినట్లుగా వుంది అందం ఆకృతి దాల్చినట్లుంది ఆమె.
'ఆదిత్యా'
తననే తదేక దృష్టితో చూస్తున్న పిలిచిందామె 'ఎందుకలా చూస్తున్నావ్?"
"ఊఁ"
'నా అండమా? ఆదిత్యా! మానవులకి యీ అందం వస్తుందా! మనుష్య స్రీలలో నా అందగత్తెలుమ్టారా? ఎక్కడైనా చూశావా? ఆఖరికిస్తిల్ లోనయినా చూశావా?'
అతను జవాబివ్వలేదు.
'నువ్వంటే నా కెంత యిష్టమో_ ఎంత ప్రేమో_ ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేను. నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే నా అందాన్ని అభిమానాన్ని అరాధానని అనురాగాన్ని కలపి నిన్ను అర్చిస్తాను. ప్రపంచచరిత్రలో ప్రేమికుల దాంపత్యం మనలాటి దంపతులు మనలాటి జంట పూర్వం లేరు_ ఇప్పుడు లేరు. ఇక వుండరు అన్నట్లుగా రుజువు చేద్దాం!"
ఆమె మాటలు అతని ఏదని శృతి చేశాయి. ఎంత గొప్ప భావన ఎంత ఆరాధన! ఎంత ఆత్మీయత! ఇలాటి శ్రీకి పాదాభివందనం చేయాలి ఇంతటి ఔన్నత్యం గల వనితని ఆరాధించాలి.
"పలకవేం ఆదిత్యా! నువ్వు జన్మజన్మాలుగా ఇలాగే మూగగా వుంటున్నావు? ఇప్పుడూ అదే మౌనమా? మోవ్నమేలనోయీ! నా మనస్సే ఒక వలపు వీణ అయి ప్రమనురాగాన్ని దాంపత్య సంగీత సౌరభాల్ని పలకిమ్చి ఒలోకిస్తున్న వేళ ఎలా నఒయీ యీ మౌనం?"
"నన్ను జన్మజన్మలుగా ప్రేమిస్తున్నావా?"
"అఁఇప్పుటికీ వెయ్యేళ్ళు అయ్యింది నువ్వు రాజరాజ నరేంద్రుని సామంతుడి కూమారుడివి. అతని కొలువులో సైనకాధికారిగా వున్నావు విన్న అప్పుడు చూశాను పాపి కొండల్లో_"
"అప్పుడు_"
"అప్పటికీ నీవు తులోత్తంగా చోళుని బంధువుల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు. అప్పుడు బహుపత్నీవ్రతం నిషిద్దం కాదు. పైగా క్షత్రయులకి చెల్లుతుంది అయినా ఏ పత్నీవ్రత్రుడివి నువ్వు. నీ భార్య ప్రేమించిన మనస్సుతో నన్ను ప్రేమిమ్చాలెం పోయావు. నేను తిరస్క్రుతనయ్యను_"
"ఆ తరవాత'కుతూలంగా వుండటానికి.... తన గత జన్మలు తెలుసుకోవటంలో కుతూహలం కంటే అనందం కన్పించింది.
ఆ తర్వాత మళ్ళీ పదహారో శతాబ్దిదాకా నువ్వు మనుష్య జన్మ ఎత్తలేదు!"
ఎక్కడున్నాను?"
'దేవలోకంలో- గంధర్వలోకంలో_కిన్నెరరాజ్యంలో_'
'అప్పుడు ప్రయత్నించలేదా?"
'ఉహూ మాకు- అంటే నాగులకి మీకూ సంభందాలు లేవు. పైగా మేమంటే మీకు చిన్న చూపు-'
'సరే_ మనిషిగా రాయలయుగంలో పుట్టాను అప్పుడు_"
శ్రీ కృష్ణదేవరాయలకి నలుగురు అంగరక్షకులుండేవాడు వాళ్ళలో నువ్వొకడివి. సుక్షత్రుయుడివి వివాహం చేసుకోకుండా రాయల రక్షణకి అంకితమై పోయావు నా వలపుని తిరస్కరించావు. తర్వాత హబుమని సుల్తానులపై రాయలు దండేత్తినప్పుడు ఆ పోరులో చనిపోయావు, నీవు దక్కలేదు నాకు_ కానీ నీ శవం దక్కింది, అదే పదివేలు అనుకుని నీకు సంస్కారం చేశాను. ఆ పుణ్యంతో నీవు మళ్ళీ స్వర్గానికి వెళ్ళవు.
అక్కడే వుంది ఆశించలేదు_'
నిట్టూర్చాడు ఆదిత్య
'తర్వాత నువ్వు గత శాతాబ్డంతో జన్మించావు. అయితే నీ తల్లితండ్రులు ఎంతో పాపులు. నీ తల్లి హంషుల. ఆమె గర్బవాసావ జన్మించిన దోష కారణంగా నీకు ఆరోగ్యం చేడిపోయింది. నరాలు దెబ్బతిన్నాయి. అలాగే తీసుకుని తీసుకుని బ్రహ్మచారిగానే చనిపోయావు_"
ఇప్పుడీ జన్మ_"
"అవును. మళ్ళీ వందేళ్ళకి పుట్టేవు. ఈ వందీల్లో నీవు హిమాలయాల్లో బదరీ నాద స్వామీ క్షేత్రంలో జ్యావుతిర్మూర్తిగా వున్నావు. అందుకే నీకు ఇప్పుడీ ఐశ్వర్యం, ఆరోగ్యం, విద్య అబ్బేయి_ నీ మనస్సుకి నచ్చిన స్త్రీ _"
'ఎవరు?'
'వెయ్యేళ్ళ క్రితం నీ బార్య ఇప్పటి శ_' ఆమె మద్యలో ఆగిపోయింది. పేరు చెప్పలేదు.
అతన్న్లో ఉత్సకత పెరిగింది 'ఎవరు? చెప్పండి?" అని అడిగాడు ఆత్రంగా.
"ఊహూ అది రహస్యం"
"ఎందుకు చెప్పకూడదు?"
"ఆదిత్యా!ఇవన్నీ మామూలు మనుషులకి వింతగా కొత్త అనిపిస్తాయి. ఒకప్పుడు నేను బ్రహ్మలోకం వెళ్ళాను. అక్కడో పండు ముసలి బ్రాహ్మడు కూర్చున్నాడు. అతని ప్రక్కన్నే ఓ తెల్లని స్రీ. సర్వ శుక్ల_ కూర్చుని వీణ వాయిస్తోంది దాంపత్య రాగం మధుర మధురంగా పలికుతోంది ఆ వీణ తీగలపైన.
అతను అటు తీగ, యిటుతీగ తీసుకుంటున్నాడు.రెంటికి మూడు ముల్లు వేస్తున్నాడు అతని కుడి ఎడమల కొన్ని కట్ల తీగలు పది వున్నాయి. ఆయనా కుడి వైపున తీగ చేతికి తీసుకోగానే ఎడమవైపు వున్న తీగల్లో వున్న అన్ని తీగల్లో దీనికి జత అయినా తీగని వెతికి ముడివేస్తున్నాయి వెళ్ళు.
అయన పరమేష్టి. ఆమె వీణాపాణ సరస్వతి.