Home » Kommuri venugopala rao » నెత్తుటిబొట్టు

    "అమ్మా! సామాజిక ధర్మం కోసం మనని మనం బలి చేసుకోవాలా? మనకో ఊహ, ఆశయం, పికి రావాలనే తపన, వాని కోసం సాధన...ఇవన్నీ వుండకూడదా?"

    రాఘవమ్మ నవ్వింది.  ఆ నవ్వులో జీవితపు లోతులు తొంగిచూశాయి.

    "నీ వయసులో నీకన్నా ఎక్కువగానే వీటి గురించి ఆలోచించాను ప్రజ్ఞా, కానీ ..."

    ఉరకలు వేసే వయసులోకి దుమకబోతున్న కూతురితో ఆ విషయాలు ప్రస్తావించడం సమంజసంగా తోచక అంతటితో ఆపేసింది.


                 *                       *                   *


    జానకిరామయ్య ఆ రోజు ఆఫీసుకు వెళ్ళడానికి తయారయ్యాడు. పంచా, చొక్కా వేసుకున్నాడు. చొక్కాకు అక్కడక్కడా మాసికలున్నాయి.

    ప్రజ్ఞ తండ్రి ముఖంలోకి పరిశీలనగా చూస్తోంది. రక్తం లేనట్టు పాలిపోయి, దీనంగా వున్నాడు.

    ప్రజ్ఞకు తండ్రి గురించి తెలుసు. ఆయనది చాలా కష్టపడే స్వభావం. చీకటి మాటికీ మూలుగుతూ పడుకోవడం ఆయనకిష్టం వుండదు. ఒకప్పుడు రాత్రి పదకొండయినా, పన్నెండయినా ఎకౌంటు పుస్తకాలు ముందేసుకుని రాసుకుంటూ కూర్చుని, తిరిగి వేకువ జామున లేచి పనిపాటలు చూసుకున్న సందర్భాలు ఆమెకు తెలుసు కాని ఆరోగ్యమాయన్ని తినేసి, జవసత్వాలు హరించుకు పోయేసరికి రోజురోజుకూ జీవచ్చవంలా మారిపోతున్నాడు.

    "నాన్నా !" అంది ప్రజ్ఞ ఆయనకు దగ్గరగా వెళ్ళి.

    "ఏమిటమ్మా" అన్నాడాయన ఆప్యాయంగా.

    "మరో వారం రోజులు రెస్ట్ తీసుకోకూడదూ ?"
 
    "కుదరదమ్మా."

    నిజం ఆమెకు తెలుసు. కళ్ళల్లో నీళ్ళు తిరగబోతుండగా ప్రయత్నం మీద ఆపుకుంది.
    "ఎకౌంట్స్ రాయడం నాక్కూడా నేర్పించు."

    జానకిరామయ్యగారు నవ్వారు. "అలాగేలేమ్మా" అన్నాడు. ఆయన మెట్లు దిగి రోడ్డు మీదకు వెళ్ళి ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ నడిచి పోతుంటే ప్రజ్ఞ గుమ్మం దగ్గర నిలబడి కన్నార్పకుండా చూస్తోంది.


                                         5


    గోపీకృష్ణ ఆ మేడ కెదురుగా వున్న కిళ్ళీ కొట్టు దగ్గర నిలబడి అరగంట నుంచీ ఎదురు చూస్తున్నాడు. ఉదయం పది కావస్తోంది. వేసవికాలం ప్రవేశించడం వల్ల ఎండలు కొంచెం కొంచెంగా ముదురుతూ తాపాన్ని కలిగిస్తున్నాయి.

    చివరకు ఆ మేడలో నుంచి ఓ పదిహేనేళ్ళమ్మాయి దిగి రోడ్డు మీదకొచ్చింది. చేతిలో ఒకటి రెండు పుస్తకాలున్నాయి. పరికిణీ, ఓణీ వేసుకుంది. రెండు జళ్ళు, మిలమిలలాడే పెద్ద పెద్ద కళ్ళు, తెల్లని వొంటి రంగు, చాలా చలాకీగా వుంది ఆ అమ్మాయి పేరు అస్మిత.

    బయటకు వస్తూనే గోపీకృష్ణ వైపు చూసి ఓ చిరునవ్వు విసిరింది.

    ఓ నిమిషమాగి గోపీకృష్ణ ఆ పిల్ల ననుసరించాడు. కొంత దూరం వెళ్ళాక ఇద్దరూ కలుసుకున్నారు.  

    "ఇవేళింత ఆలస్యమయిందేం ?" అనడిగాడు.

    "అక్కయ్య కూడా నాతో వస్తాను కూచోమంది. తనని తప్పించుకుని రావటానికి చాలా అవస్థ పడాల్సి వచ్చింది" అంటూ నవ్వింది.
   
    "ఎందుకని నీతో రావడం?"

    "ఏమో మరి. నేను నీతో మాట్లాడటమెప్పుడయినా చూసిందేమో."

    "మీ అన్నయ్యకెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరా?"

    "నాకు తెలీదు"

    "నువ్వు తెలిసినా చెప్పవు"

    "ఎందుకని?"

    "గుట్టు ఆడవాళ్ళ సొత్తు కాబట్టి..."

    అస్మిత కిలకిలమని నవ్వింది. "నీకు అమ్మాయిల గురించి చాలా విషయాలు తెలుసునే" అంది.

    ఒక నిమిషమాగి గోపీకృష్ణ "ఈ పూట స్కూలు  మానేసెయ్యి" అన్నాడు. అస్మిత మాంటిస్సోరీలో టెన్త్ క్లాసు చదువుతోంది.

    "అమ్మో" అంది.

    "ఏం?"

    "ఇంట్లో తెలిసిపోతుంది?"

    "ఎలా తెలుస్తుంది?"

    "మా ఇంటికొచ్చే ఫ్రెండ్స్ చాలా మంది వున్నారు. మమ్మీకి చెప్పేస్తారు."

    "చెప్పొద్దని చెప్పొచ్చుగా"

    "అలుసయిపోనూ?" అతనేం జవాబు చెప్పలేదు.

    "ఎందుకు స్కూల్ మానెయ్యమన్నావు?"

    "ఎటయినా వెడదాం?"

    "ఎటయినా అంటే ఎక్కడికి ?"

    "మనమిద్దరం ఏకాంతంగా  మాట్లాడుకోడానికి  బోలెడు చోట్లున్నాయి. రింగ్ రోడ్డు దగ్గరకు వెళ్ళొచ్చు _ కృష్ణా బ్యారేజ్ వైపు వెళ్ళొచ్చు _ నూజివీడు రోడ్డు వైపు వెడితే జనమెవరూ వుండరు"
 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra