Home » Suguri santhadevi » Jeevana Sangeetam


    'భోజనం ఇక్కడే చేసి వెళ్ళవోయ్.'    
    'ఎందుకు లెండి?' వెళ్ళబోయాడు కిషన్.
    'హల్లో, దేశదిమ్మరీ!' అప్పుడే వచ్చిన అన్నయ్యతో స్మితవదనంతో కరచాలనం చేశాడు కిషన్.
    అన్నయ్య కెక్కడ పరిచయమో అనుకొన్నాను.
    'ఏమిటి? ఇంటిమీద మనస్సుపోయిందా, బాబూ?' నాన్నద్వారా కిషన్ వచ్చిన వ్యవహారవిషయం తెలుసుకొని, 'అదేమిట్రా? తిరిగి తిరిగి స్వగ్రామంలో కాలు నిలుస్తున్న దని సంతోషించకుండా సన్యాసావతారమేమిటి? లక్షణమైన ఇల్లు అమ్ముకొని ఆశ్రమనిర్మాణాలేమిటి?' అన్నాడు చనువుగా మందలింపుధోరణిలో.
    కిషన్ మౌనంగా ఊరుకొన్నాడు.
    'పెళ్ళీ పెటాకులూ అనుకొనే దేమైనా ఉందా లేదా?'
    మనం అనుకొనేది ఏముంది? విధివ్రాత ఎలా ఉందో?' నిర్లిప్తంగా నవ్వాడు.
    కిషన్ ఇల్లు అమ్మడం ఖాయమేనని తెలిసి నాన్నతో అన్నాడు అన్నయ్య: 'ఇంటి ముందరి ఇల్లు; పరాయి వారికి పోనివ్వడం దేనికి? చెల్లాయి పెళ్ళి సమస్య ఇప్పుడు ముందుంచుకోలేదు కనక ఆ విషయాలు ఆలోచించడం లేదు కాని అది పెళ్ళి అయి అత్తవారింటికి పోతే విడిచి భరించగలమా? చెల్లాయినీ, బావ గారినీ ఇక్కడే ఉంచుకొని నా ఆస్తి సగం వ్రాసిస్తాను. దాన్ని ఆ ఇంట్లో కాపురం పెట్టిద్దాం. మన కళ్ళముందు ఉంటుంది.'
    నాన్నకు అంతకంటే ఏం కావాలి?
    కిషన్ ఇల్లు ఖరీదు చెయ్యడం, అతడు కోరిన భూమి తిరిగి అతడికి విక్రయించడం జరిగిపోయినాయి.
    తిరిగి సెలవుల్లో వచ్చినప్పుడు అన్నయ్య తీసుకువెళ్ళాడు నన్ను, కిషన్ ఆశ్రమం చూద్దాం రమ్మంటూ.
    ఊరంచున కొన్న పొలంలో కిషన్ ఆశ్రమనిర్మాణ మయింది. చుట్టూ పక్కని తోట; మధ్య చిన్న కుటీరం.
    గోముగా, పచ్చగా పారిన వివిధ జాతుల లతలూ, కన్నుల విందుచేసే వివిధ వర్ణాల జాతి పుష్పాలు, ఇంకా కాపు పట్టని రకరకాల ఫలవృక్షాలూ చూచి పరవశిస్తూ కిషన్ కుటీరం సమీపించాము.
    అంతవరకూ కిషన్ ఒడిలో లాలింపబడుతూన్న పెంపుడు జింక ఒక్క గంతువేసి నా దగ్గిరికి వచ్చింది. దాని సోగ కన్నులు చూస్తూంటే ముచ్చట వేసింది. ఆ మురిపెంతో అది నా పయిట చెరగు నమలడం కూడా గమనించకుండా దాని మెడచుట్టూ బాహువులు చుట్టి మోకాళ్ళ మీద కూర్చున్నాను.
    కిషన్ అది గమనించి 'లేళ్ళను చూస్తే లేమలు ఇట్టే పరవశమవుతారేమో! పారవశ్యంలో పైట నమలడం కూడా కానకుండా ఉన్నారు!' అన్నాడు నవ్వుతూ, నా దెస చూస్తూ.
    చటుక్కున పైట లాక్కొన్నాను దాని నోటినుండి.
    'కళాకారుడి వనిపించుకొన్నావు!' అన్నయ్య ప్రశంసాపూర్వకంగా కిషన్ భుజం తట్టాడు. 'తోట చూస్తేనే చెప్పవచ్చు. తోటమాలి ఎలాంటివాడో!'    
    'కళాకారులు చేసే ప్రతిపనీ కళాత్మకంగానే ఉంటుంది మరి.' అన్నయ్యకు వంతపాడాను.
    చిరునవ్వు నవ్వాడు కిషన్.
    'ఇది నా చెల్లెలు రూపవతి ఎమ్.ఎ ఫైనల్ లో ఉంది. నీ తోట చూపిద్దామని తీసుకువచ్చాను.
    'రూ-ప-వ-తి!' ఒక్కొక్క అక్షరాన్నే మృదువుగా, నెమ్మదిగా ఉచ్చరిస్తూన్న ఆ కళాకారుడిచూపులు నాలోని కళలేవో వెదుకుతున్నాయి! అతడి చూపులను ఎదుర్కోలేక నేలపై వాలాయి. కాలేజీలో సుందరులైన ఎందరు యువకుల చూపులు వేసు నిర్వికారంగా. నిర్భయంగా ఎదుర్కోలేదు? రెప్పలు వాలిపోవడం. గుండె దడదడ కొట్టుకోవడం వంటి వికారాలు ఎప్పుడూ కలగలేదే' ఏమిటీ హృదయస్పందన? పురుషుని వీక్షణానికి తట్టుకోలేక నేత్రాలు వాలిపోయే ఈ మధురక్షణాలు ఎలాంటివి? అనిర్వచనీయమైన మధురానుభూతీ, అస్పష్టమైన లజ్జాభావమూ హృదయంలో నిండిపోయి కనురెప్పలమీదికి పాకి కూర్చున్నాయి బరువుగా.
    'మీరు వేసిన చిత్రాలు చూపెడతారా, దయచేసి!' బరువుగా కళ్ళెత్తి అతనికేసి చూశాను.
    'చెల్లాయ్! అతడెవరో పరాయివాడన్నట్లు మీరు, అడిగారు. అండి, కొండీ ఉపయోగిస్తున్నావేం? మనకున్న బంధుత్వం మరిచినట్లున్నావ్. చక్కగా బావ అనిపిలూ.' నవ్వుతూ అన్నాడు అన్నయ్య. 'చెల్లాయి సంగీతమంటే చెవి కోసుకుంటుంది. స్వయంగా తను అందులో ప్రవీణురాలు. వీణావాదనం మంచినీళ్ళు తాగినట్లే. చిత్రలేఖనంలో ప్రవేశం లేకపోయినా అభిమానం తక్కువలేదు.' కిషన్ తో అన్నాడు.
    'బొమ్మలు గియ్యడంకూడా నేర్పుతారు బావ గారు!' అన్నయ్య మాటలకు పరాయిభావం తొలిగి పోయి ఏర్పడిన సన్నిహితత్వంతో తేలికపడిన హృదయంతో ఉత్సాహంగా అన్నాను.
    'గారూ-తోకలా తగిలించకపోతే గౌరవం లోపిస్తుందేమో!' స్నిగ్ధహాసం చేశాడు శషన్. 'రండి, పత్రాలు చూద్దురుగాని.'
    కిషన్ దారితియ్యగా కుటీరంలోకి అడుగుపెట్టాము. మూడు భాగాలుగా ఉన్న ఆ కుటీరంలో ఒకటి వంట గదిగా, ఒకటి పడక గదిగా, ఒకటి డ్రాయింగ్ రూమ్ గా ఉపయోగించుకొంటున్నాడు శషన్.
    కుర్చీలు గిర్చీలు లేవు. చిరు చాప పరిచి కూర్చోబెట్టాడు. నేను స్వేచ్చగా కూర్చోగలిగినా అన్నయ్యకు మాత్రం ఇబ్బంది అయింది. సూట్లో అన్నాడాయె!
    అన్నయ్య అవస్థ కనిపెట్టి ఫక్కున నవ్వాడు కిషన్. 'లే, లే. ఈ పెట్టెమీద కూర్చో హాయిగా. తాను చిత్రాలు గీచే స్టాండు ముందు కుర్చీగా ఉపయోగించుకొనే చెక్కపెట్టెమీద కూర్చోబెట్టాడు అన్నయ్యను.
    కిషన్ చేసిన చిత్రాలు వరసగా చూపెట్టాడు. తన చిత్రలేఖవల్ల ప్రారంభదశలో ఉన్నప్పటివి, బహు మతులు అందుకొన్నవి, తనకు విశ్వవిఖ్యాతి తెచ్చి పెట్టినవి-అన్నిటినీ సందర్భాలు వివరిస్తూ చూపెట్టాడు అన్నయ్య అసలే ఆర్భాటం మనిషి చిత్రకళ లోని మంచి చెడ్డలు తనకు తెలియకపోయినా కిషన్ ను ఆకాశానికి ఎత్తివేశాడు, అతడు వేసిన ఒక్కొక్క చిత్రాన్ని చూచి.    
    'ప్రస్తుతం ఎలా చిత్రిస్తున్నారు?' కుతూహలంతో ప్రశ్నించాను.
    'చిత్రం నిన్నే పూర్తయింది. ఇంకా మొదలు పెట్టలేదు.'
    కుటీరంలోనించి బయటికి వచ్చాము.
    ఎక్కడినుండో పావురాలు పల్టీలు కొడుతూ వచ్చి వాలాయి గుంపులు గుంపులుగా. కిషన్ భుజాలమీద కొన్ని, చేతులమీద కొన్ని, నేలమీద కొన్ని వాలాయి.
    పావురాలంటే నాకు ఎక్కడలేని మక్కువ! మనస్సు పొంగిపోయింది. పట్టుకోబోయాను. ఒక్కటీ చిక్కలేదు. కిషన్ చిరునవ్వునవ్వి తన చేతితో నిమురుతున్న పావురాన్ని నా చేతిలో పెట్టాడు, 'జాగ్రత్త! ఎగిరి పోతుంది' అంటూ.
    'పావురాలుకూడా పెంచుతున్నారా? పావురం లెక్కలు ప్రియంగా నిమురుతూ అడిగాను.
    'పనేముంది! ఇదే వీడి సంసారం. ప్రకృతి గృహంలో పశువులూ, పక్షులూ తన సంతానంగా పెంచుతున్నాడు. ఈ అడివిలో వీడికి ఉండే బంధుమితులు ఇవే.' పక పకా నవ్వేశాడు అన్నయ్య.
    కిషన్ కుటీరంలోకి వెళ్ళి పక్షులకు ఆహారం పట్టుకు తెచ్చి చల్లాడు. పావురాలన్నీ నేలమీద వాలాయి. ఏదో సంకేతంతో పిలిచాడు కిషన్; ఎక్కడినుండో గబగబా వచ్చాయి రెండు నెమళ్ళు. వాటికీ గింజలు చల్లాడు.
    'ఇక వెళతాంరా.' అన్నయ్య అన్నాడు.
    'రోజూ సాయంత్రం వేళ షైర్ గా వస్తూందండి అది ఇటు.' ఆహ్వానం అదించాడు కిషన్.
    'షైర్ గా కాదు ఇక్కడ ఉన్నన్నాళ్ళూ చిత్రలేఖనం నేర్చుకొనడానికి వస్తూంటాను మీ దగ్గరికి.'
    నా మాటలకు అన్నయ్య హాస్యంగా అన్నాడు. 'గురు' దక్షిణ ఇప్పుడే ఏర్పాటు చేసుకో తరవాత అన్ని తంటాలు. బంధువులు మరీ నిర్మొహమాటస్థులు!'    
    'ఆయన కోరింది!' అన్నాను ముసిముసిగా నవ్వుతూ.
    'ఇస్తారా?' మందహాసం చేస్తూ అడిగాడు కిషన్!
    'ఊఁ!'
    'రెండు పాటలు పాడి వినిపించండి. చాలు.
    'ఇప్పుడా!' ఆశ్చర్యపోయాను. 'ప్రొద్దు కుంకింది లేపు.
    'అహఁ. రేపు ఎప్పుడోపాడితే ఈ రమ్యత ఉండదు. చీకటివెలుగు సంధికాలంలో, వాళ్ళకు చేరబోతున్న పక్షిగణాలు సవ్వడులమధ్య పచ్చనితోటలో రమసౌరభ సమ్మిళితమైన మలయపవనుని గిలిగింతలలో, ఆకాశం అంచులు చేరబోతున్న కొంగలబారులు చూస్తూ జవరాకి శ్రావ్యగీతం వినగల అదృష్టం ఎందరికి? కలిగిన అవకాశాన్ని జారవిడుచుకోమంటారా? పాడాలి. ఇప్పుడే పాడాలి.'
    'భేష్!' గట్టిగా కిషన్ జబ్బచరిచాడు అన్నయ్య. కళాకారుడివనిపించుకొన్నావు! నిజమైన రసజ్ఞత నీలో ఉంది. కళాకారుడి కోరికలూ, అభిరుచులూ అన్నీ కళాత్మకంగానే ఉంటాయి. మేమున్నాము. ఎందుకు? రసహీన హృదయాలు, తిండీ, పడకా రెండు తెలుసు. ప్చ్!'
    ఏదో సినిమాపాట గుర్తు చేస్తున్నాయి కిషన్ మాటలూ, అప్పటి ప్రకృతి సొగసూ,
    'మురళి మాదేను కోనారికూన
    ముదమ చిందేను జగములోన,
    ఆలమందలు ఇల్లు చేరబోయే
    వేగమెచ్చించు కడు శాలమాయె
    హృదయమా, సాగిపొమ్మా
    బావవేగాన సాగిపొమ్మా.......
    సంధ్యాసుందరి దిద్దిన అరుణకాంతులు క్రమ క్రమంగా కోల్పోతూ వెలవెలబోతున్నాయి మేఘశకలాలు. ఆహారార్ధం ఎక్కడెక్కడికో ఎగిరిపోయి తిరిగి తమ నెలవులకు చేరబోతూన్న శక్షు. కలకలారావాలతో అంబరవీధి సందడిగా ఉంది. అరుణమేఘ అంచుల తాకుతూ పయనించిన కొంగలబారుల ఆకాశం అంచుల చేరబోతున్నట్లున్నాయి గృహోన్ముఖంగా సాగిపోతూన్న గోవుల పదఘట్టనలకు చిన్నచిన్న మేఘాలుగా ఏర్పడుతున్నాం ధూళి గోవులను అదిలిస్తూ లలిత లలితంగి పిల్లనగ్రోవి ఊదుతూ గోధూళిలో అస్పష్టంగా అగుపడుతూన్న గోపాలురు. ప్రకృతిలో ఎటు చూచినా హృద్యమైన దృశ్యాలు! లౌకికమైన శాంతిసంతోషాలు ప్రసాదించే సుందరదృశ్యాలు!
    నీదగ్గిర రెండు రొట్టెలుంటే ఒక రొట్టె అమ్మి ఒక తామరపువ్వు కొనుక్కో!' ఎక్కడో చైనీయు సామెతగా చదివినట్టు గుర్తు. మానవులందరికీ అందుబాటుల ఉన్న ఆ ప్రశాంత సుందర దృశ్యానుభవం సుందర పొందుతున్నారు ఈవేళప్పుడు? నిరంతరం జీవితావసరాలకై తాపత్రయమే.
    'హృదయమ సాగిపొమ్మా!
    రావవేగాన సాగిపోమ్మా.'
    ఇది బావతన్మయతలో పాడుతూన్న పాడు కిషన్ ఆ పాటలో గొంతు కలిపి సన్నగా, మధురంగా పాడడం గుర్తించనేలేదు! నా పాట అయిపోయినా అతడింకా ఆ పిల్లని ఇలాపిస్తూ నీ అన్నాడు.
    'మీరు పాడగలరు!'
    'ఏది కొంచెం. సంగీతజ్ఞానమేమీ లేదు. పైగా పాట అంటే చెవికోసుకుంటాను.'
    'నయం! ఇంతవరకు సురక్షితంగానే ఉన్నాయి.' అన్నయ్య అతడి చెవి మెలిపెట్టి కదిలాడు.
    కిషన్ నుండి సెలవు తీసుకొని బయలుదేరాము.

                                  *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra