"ఇద్దరం కలిసి చేద్దాం." ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు.
"అక్కర్లేదు! నువ్వు దూరంగా వెళ్ళు! నేను చేసుకోగలను"
"లేడీస్ హాస్టల్లో లాగానా?"
"జాబ్ ఏమయింది?" ఇస్త్రీ చేస్తూ అడిగింది.
"మీ బాయ్ ఫ్రెండ్ రికమెండేషన్ కి తిరుగుంటూందా? నీ కోసం ఏమయినా చేస్తాడతను.
"మరి ఎప్పుడు జాయినవటం?"
"వారం తర్వాత...." ఆమె మెడమీద నాలుకతో స్పృశిస్తూ అన్నాడు.
ఇస్త్రీ పెట్టిపక్కకు పడిపోయింది. చక్కిలిగిలికి!
ఉక్రోషంగా చూసిందతనివేపు.
"అయ్ డోంట్ నో హావ్ కంట్రోల్ యూ!"
అతను ఆశ్చర్యంగా చూశాడు.
"అన్నీ అబద్దాలు! నీకు తెలుసు...." కొండచిలువలు నడుముచుట్టూ పాకుతున్నాయ్.
ఆమె ప్రతిఘటన ఆపేసింది.
"ఓ సమస్యవచ్చి పడింది...."
"ఏమిటి?"
"గంగాభవాని ఇల్లు ఖాళీ చేయమంటోంది."
"ఎందుకని?"
"బ్రహ్మచారి శతమర్కటహ అంటోంది. నేను చాలారోజులు మా అక్క దగ్గర వుండిపోతానుకదా?"
సరిగా అప్పుడే గంగాభవాని లోపలికొచ్చింది ఓ ప్లేట్లో ఫలహారాలు తీసుకుని.
తులసి కొండచిలువలను వదలించుకుంది. ఆమె ముఖం వాడి పోయింది.
"మీ సంగతే చెప్తున్నాను....." సర్దుకుంటూ అంది తులసి. "ఇల్లు ఖాళీ చేసేవిషయం!"
"ఇంతకూ ఇల్లు ఎందుకు ఖాళీ చేయాలంటారు? నేను ఆర్డినరి బ్రహ్మచారిని కాదుగదా! స్కిల్డ్ బ్రహ్మచారిని అంచేత మీకెలాంటిలోటూ రాకుండా చూసుకుంటాను." ఆమె ముఖంలో రంగులు మారిపోయాయ్.
"అదేం కుదరదు! ఖాళీ చేయాల్సిందే! నా యింట్లో ఫామిలీ ఉండాలి! సింగల్స్ ఉంటానికి వీల్లేదు."
"ఓస్ ఇంతేకదా! ఈ మాత్రానికి ఓహ్ గొడవ చేస్తారెందుకు? ఫామిలీని తీసుకొస్తాను."
"తులసిరావాలంటే కనీసమా ఏడెనిమిది నెలలు పడుతుంది. ఇంత వరకూ మీరొక్కరే ఉండాలికదా?"
"నేనొక్కడినేవుంటానని ఎవరన్నారు?"
"ఒక్కరే లేకపోతే ఇంకెవరుంటారు?"
"నా ఫామిలీ!"
"ఫామిలీ ఎవరు?"
"నాకూ తెలీదింకా! మీరు ఫామిలీ ఉందాలన్నారుకనుక ఫామిలీయే తీసుకొస్తాను! ఏ అమ్మాయి అయితే మీకెందుకు?"
"ఈ వేషాలు నా దగ్గర కాదు" ప్లేట్స్ తులసి కందిస్తూ అంది.
"ఏమిటి?" అడిగింది తులసి.
"మావారి బర్త్ డే ఇవాళ! ఆయన కిష్టమయిన పాయసం చేస్తూంటాను ప్రతి బర్త్ డేకి."
దిసీజ్ టూ మచ్! నా బర్త్ డే వదిలేసి పైనున్నవాళ్ళ బర్త్ డేలు చేస్తారా? ఎంత ద్రోహం?"
ఆమె రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
రాత్రి ఎనిమిది గంటలకల్లా నాంపల్లి స్టేషన్ చేరుకున్నారువాళ్ళు.
స్లీపర్ కోచ్ లో ఎదురుగ్గా కూర్చునుందోయువతి.
"32.....24.....28" అన్నాడు సురేష్....ఆమె తల పైకెత్తి అనుమానంగా చూసింది. "ఎందాకా వెళ్తున్నారు?" ఆమె నడిగింది తులసి.
"భీమవరం! మీరో?" ఆమె కూడా అడిగింది.
"నర్సాపూర్"
"మీ బెర్తునెంబర్లు ఏమిటి?"
"ఇదిగో! ఈ కిందదొకటి, మిడిల్ బెర్త్ ఒకటి" నెంబర్లు చూస్తూ చెప్పాడు సురేష్.
"నాకు టాప్ బెర్త్ దొరికింది. పైకెక్కటం ఇబ్బందిగా ఉంటుంది. మిడిల్ నాకిచ్చి మీరుటాప్ కెళ్తారా?"
సురేష్ మొఖంలో ఆనందం!
"ఓ! నాకేం అభ్యంతరంలేదు. మా తులసేకొంచెం గొడవ పెడుతూంటుంది, ఇద్దరికీ మధ్యలో ఇంకొకరెందుకని. అయినాగానీ కన్విన్స్ చేయవచ్చు లెండి! దేరీజ్ నో ప్రాబ్లమ్!"
ఆమె ముఖంలో కలవరపాటు కనిపించింది.
తులసి అతని డొక్కలో పొడిచింది మోచేత్తో.
"తీసుకోండి! ఏం ఫర్లేదు" ఆమెతో చెప్పింది.
"థాంక్యూ!"
పుస్తకాలమ్మేవాడు సురేష్ దగ్గరికివచ్చి ఆగాడు.
"సెక్స్ పుస్తకాలు కావాలా సార్! పటాలతోసహా, ఇరవై నాలుగురూపాయలు" రహస్యంగా అన్నాడు.
"ఒక్క నిమిషం మా తులసి నడిగిచెప్తాను."
"తులసీ! సెక్స్ పుస్తకం కావాలా? పటాలుకూడా వున్నాయి" అంటున్నాడు.
తులసికోపంతో చూసింది అతనివేపు.
ఆమె పక్కనున్న యువతి సిగ్గుపడిపోయింది.
"భలేవారే సార్ మీరు.....నా కొంప ముంచేట్లున్నారు" గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు వాడు.
"కూల్ డ్రింక్ కావాలా సార్! ఐస్ కోల్డ్!"
"ఏడ్చినట్లుంది. ఇప్పటికే మా ఆవిడఐస్ లాగా పడి ఉంటోందని నేను నానా ఛావుచస్తుంటే. ఇంకా ఫ్రీజింగ్ పాయింట్ కి పంపిస్తావా ఏమిటి? వేడి కాఫీ ఉంటే చూడు."
"ఇప్పుడే పంపిస్తాను సార్! ఎన్ని కాఫీ కావాలి?"
"మూడు!"
ఆ యువతి అనుమానంగా చూసి ఏదో మాట్లాడబోయింది గానీ అప్పటికే ఆ కుర్రాడెళ్ళిపోయాడు.
అయిదు నిమిషాల్లో మూడు కాఫీలొచ్చేసాయి.
తులసి ఆమెకో కప్పు అందిస్తోంటే వారించబోయిందామె.
"అయ్యో! నాకెందుకండీ!"
సురేష్ చప్పున కల్పించుకున్నాడు.
"ఫర్లేదు తీసుకోండి! కలిసి అంతదూరం ప్రయాణం చేసేప్పుడు అన్నీ షేర్ చేసుకుంటే బావుంటుంది. ఏమంటారు"
ఆమె మాట్లాడకుండా తులసి అందిస్తోన్న కప్పు తీసుకుంది.